శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 43 / Sri Lalitha Chaitanya Vijnanam - 43

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 25 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 43 / Sri Lalitha Chaitanya Vijnanam - 43 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

18. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక

గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత


🌻 43. 'కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత' 🌻

అమ్మవారి పాదముల పై భాగము (చీలమండల నుండి వ్రేళ్ళ

వరకు) తాబేటి వీపుతో పోల్చబడినవి. సాముద్రిక శాస్త్రమును బట్టి

కూడ తాబేలు వీపువలె ఎత్తుగ, ఉబ్బుగ ఉన్న పాదపు పైభాగము శుభకర మని తెలుపబడినది. అట్టివారికి జయము సహజముగ కలుగుచున్నది.

అపజయము దూరముగ నుండును. వారి అడుగులకు అడ్డులేదు. వారు నడిచిన చోటెల్ల జయముండును. అమ్మవారి పాదముల పైభాగము తాబేలు డిప్పలవలె చతుర్దశ భువనములకు ఆధారము. పదునాలుగు లోకములకు రక్షణ ప్రదము. ఆమె పాదముల నాశ్రయించి పూజించువారికి సర్వజయములు కలుగును.

పదునాలుగు లోకములలో ఆమె కెదురు లేదు. ఆమె నాశ్రయించిన

వారికి కూడ అట్టి “జయిష్టు” తత్త్వము లభించును. కూర్మపృష్ఠములను (పై తెలిపిన పాద భాగములను) పూజించువారికి సాధు స్వభావము కలిగి, రజస్తమస్సులు తొలగి సమస్తమును జయించు స్థితి అప్రయత్నముగ లభించును. అట్టి ప్రశస్తమైన పాదములు గలది శ్రీదేవి.

పూజ యంతయు పాదములకే జరుపుటలో గల విశేషార్థము ఇందు సూచింపబడినది. దైవపూజ అంతయు పాదములకే జరుగవలెను. గురుపూజకూడ పాదములకే జరుగవలెను. ఇది గమనించదగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 43 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 43. Kūrma- pṛṣṭha- jayiṣṇu- prapadānvitā कूर्म-पृष्ठ-जयिष्णु-प्रपदान्विता (43) 🌻

The arch of her feet is more beautiful and curvier than tortoise’s shell. But Śaṇkarā expresses his anger for comparing Her feet to that of tortoise shell, which is hard.

Saundarya Laharī (verse 88) says “The toes of your feet is the one that sustains this universe (he is not even comparing the entire feet, he says only about the toes).

Lord Śiva knows the softness of your feet that is why He held your feet with great care during your marriage ceremony.

How dare they (possibly Vāc Devi-s) compare such soft feet to that of tortoise shell?” This also confirms that Sahasranāma is much older than Saundarya Laharī.

Nāma-s 41, 42, and 43 are as per the features described in sāmudrikā lakśanā (study of body parts).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


20 Oct 2020

No comments:

Post a Comment