శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 84 / Sri Gajanan Maharaj Life History - 84



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 84 / Sri Gajanan Maharaj Life History - 84 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 17వ అధ్యాయము - 3 🌻

ఇతను శ్రీమహారాజు పొందిన విముక్తిని, అతీతమైన మానసిక స్థితిని గ్రహించి, ఈయోగిమీద ఏవిధమయిన ఆరోపణ చెయ్యరాదని శ్రీజాఠరు అనుకున్నారు. నిప్పును దాని వేడితీవ్రతనుండి వేరుచేయలేము, కావున దానిని ఒక సురక్షితమైన పాత్రలో ఉంచాలి. లేకపోతే అది ఇంటినే పూర్తిగా కాల్చివేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనిప్పును అదిచేసిన పనికి ధోషించలేము.

అలానే శ్రీమహారాజు నగ్నత్వంకూడా ఆనిప్పు లాంటిది మరియు ఆయన శిష్యులే ఆయనని ఈపరిస్థితిలో ఉంచడానికీ, ఆయనను బట్టలు అనే పాత్రలో ఉంచలేక పోవడానికి కారకులు. ఈవిధంగా ఆలోచించి... శ్రీగాజానన్ మహారాజు ఒక విముక్తాత్మ. ఆయన సరిఅయిన సంరక్షణ భారం భాస్కరుది. అతను దానిని నిర్లక్ష్యంచేసాడు, కావున నేను భాస్కరును రూ. 5/ జరిమానా కట్టవలసిందిగా ఆదేశిస్తున్నాను అని శ్రీజాఠరు ఆదేశాలు జారీచేసారు.

ఈ ఆదేశం విన్న శ్రీమహారాజు, భాస్కరును భవిష్యత్తులో తన ఇష్టానికి విరుద్ధంగా ఏపనీ చెయ్యవద్దని అడిగారు. భాస్కరు మౌనంగా ఉండిపోయాడు. కానీ మిగిలిన భక్తులు అందరూ శ్రీమహారాజుకు అటుమీదట రైలుప్రయాణం చేయించడం మానేసేందుకు నిశ్చయించి, ఎడ్లబండి ఆయన ప్రయాణానికి వినియోగించారు.

ఒకసారి శ్రీమహారాజు అకోలా వచ్చి బాపురావు ఇంటిలో బసచేసారు. ఆకాలంలో మెహతబ్షా అనే ఒక ముస్లిం సాధువు మురిజాపూరు దగ్గర కురుంలో నివసించేవాడు. అతను బాపురావుతో శ్రీగజానన్ మహారాజు ఎప్పుడు వస్తే అప్పుడు తనకు తెలియచేయ వలసిందిగా అన్నాడు. ఆప్రకారంగా బాపురావు ఒక మనిషిని మెహతబ్షాకు శ్రీగజానన్ మహారాజు రాకగురించి తెలియపరచడానికి పంపాడు.

కాని మెహతబ్షా అప్పటికే అకోలాకి బయలుదేరాడు, బాపూరావు పంపిన ఈమనిషి ఆయన్ని దారిలో కలిసాడు. అతనిని చూసి... కురుం వెళ్ళకు, వచ్చి మాబండిలో కూర్చో, నేనే మెహతబ్షాను అని అతను అన్నాడు. ఒకయోగి కదలికలు రెండవ యోగికి ఎలా తెలుస్తాయో చూడండి ? వీళ్ళు నిజంగా ప్రతిచోటా ఉంటారు. మెహతబ్షాతో పాటు 3/4 గురు ముస్లిం భక్తులుకూడా ఉన్నారు. వీళ్ళంతా బాపూరావు ఇంటిలో బసచేసారు. మరుసటిరోజు ఉదయం శ్రీగజానన్ మహారాజు శ్రీమెహతబ్షా ఉన్న గదికి వచ్చి అతని జుత్తుపట్టుకొని, మెహతబ్షాను నమ్మకంగా కొడతారు.

ఈ విధంగా చేయడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, ముస్లిం సమాజంలో పుట్టుక వ్యర్ధంచేస్తున్నావు, ఎందుకంటే ఈ సమాజానికి ప్రత్యేకత అయిన మొరటుతనం ఇంకా అతనిలో ఉండి, అది అతనికి ఆత్మజ్ఞానం పొందడంలో ప్రతిబంధకం కావచ్చు అని తెలియ పరచడానికి. చెడు అనే చీకటికి దూరంగా ఉంటూ మెహతబ్ షా తన పేరు సార్థకం చేసుకోవాలని శ్రీమహారాజు వాంఛించారు. ఈవిధంగా కొట్టడంద్వారా, చెడునుండి ఇంకావిముక్తి కాలేదని, మెహతబ్షాకు శ్రీమహారాజు సంకేతం ఇచ్చారు.

యోగులు ఒకరి మనసు ఒకరు అర్ధంచేసుకుంటారు. కావున సంకేతం దొరికినందుకు శ్రీమెహతబ్షా సంతోషించాడు. శ్రీమహారాజు మెహతబ్షాను కొడుతున్నప్పుడు, అతనితో పాటువచ్చిన ముస్లింభక్తులు ఉద్భిక్తులు అయ్యారు, కానీ శ్రీమెహతబ్షా వాళ్ళని శాంతిగా ఉండమనీ, తమ మంచికోసం కురుం వెనక్కి వెళ్ళమని అన్నాడు.

ఒక్క షేక్కడు తప్ప మిగిలినవాళ్ళు కురుం వెళ్ళారు. అదే సమయంలో షేర్ బచులాల్ వచ్చి శ్రీగజానన్ మహారాజును మరుసటిరోజు తన ఇంటిదగ్గర భోజనానికి ఆహ్వనించాడు. శ్రీమహారాజును మరుసటిరోజు టాంగాలో భోజనం కోసం బచులాల్ ఇంటికి తీసుకు వచ్చాడు. అక్కడికి చేరిన తరువాత ఆయన క్రిందికి దిగకుండా టాంగాను వెనక్కి తీసుకువెళ్ళమన్నారు.

ఈయన ఈ ప్రవర్తనకి అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ముందురోజు ఆయన ఈ ఆహ్వనాన్ని ఒప్పుకున్నారు. బహుశా శ్రీమెహతబ్షాను ఆహ్వనించక పోవడమే దీనికి కారణం అయి ఉండవచ్చు అని, వాళ్ళలో ఒక తెలివయిన వ్యక్తి అన్నాడు. కావున వాళ్ళువెళ్ళి మెహతబ్షాను ఆహ్వనించారు. అప్పుడు ఇద్దరూ ఒకే టాంగాలో బచులాల్ ఇంటికి వచ్చారు. శ్రీమెహతబ్షా బసచేసేందుకు దగ్గరలోని ఒకగృహంలోను, శ్రీమహారాజుకు శ్రీరామ మందిరంలోనూ ఏర్పాటుచేసారు.

కానీ చివరికి శ్రీమహారాజుకూడా ఆగృహానికే వెళ్ళారు. అందరూ భోజనాలు చేసారు, అప్పుడు శ్రీమెహతబ్షా తన శిష్యులతో తనకు పంజాబ్ వెళ్ళేందుకు టిక్కెట్టు తెమ్మని చెప్పారు. సగం కట్టడం అయిన మసీదు కట్టడం పూర్తి అయిన తరువాతనే శ్రీమెహతబ్షాను కురుం వదలవలసిందిగా షేక్కడు అర్ధించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 85 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 17 - part 3 🌻

He saw Maharaj’s blissful mental attitude and realized the state of liberation attained by Shri Gajanan Maharaj and as such, Shri Jathar thought, that This saint cannot be charged of any offence.

Fire cannot be void of its fiery element, so it has got to be kept in a safe bowl. Otherwise it can burn the entire house. In such case the fire cannot be blamed for what it does.

Likewise the nakedness of Shri Gajanan Maharaj is similar to the fire and His disciples are guilty for keeping him in that state, guilty of not keeping Him in a bowl of clothes.

Thinking so Shri Jathar ordered as follows:Shri Gajanan Maharaj is basically a liberated soul and his proper upkeep is the responsibility of Bhaskar, who has neglected it.

So I order Bhaskar to pay a fine of five rupees. Shri Gajanan Maharaj , hearing the order, asked Bhaskar to desist from doing anything against His will in the future.

Bhaskar kept quiet, but all the devotees decided to avoid train journey for Shri Gajanan Maharaj thereafter, and accordingly a bullock car was used for His travel.

Once Shri Gajanan Maharaj came to Akola and stayed at the house of Bapurao. At the time there lived a Muslim saint named Mehtabshah at Kurum, a town near Murtizapur. He had told Bapurao to inform him when Shri Gajanan Maharaj came to Akola.

Accordingly Bapurao sent a man to Kurum to inform Mehtabshah about this arrival of Shri Gajanan Maharaj, but it so happened that Shri Mehtabshah had already started for Akola and this messenger, sent by Bapurao, met Him on the way.

Upon seeing that man Mehtabshah said, Don't go to Kurum, come and sit in our cart. I am Mehtabshah. Look, how one saint knows the movements of other saint! They are really omnipotent.

Mehtabshah was accompanied by 3-4 Muslim devotees and all of them stayed at Bapurao's house.

The next morning Shri Gajanan Maharaj came to the room where Shri Mehetabshah was staying and catching a hold of his hair, gave Mehtabshah a good beating.

His intention in doing so was to convey to Mehtabshah that His birth in a Muslim community was being wasted as the roughness, peculiar to that community, still existed in Him and the same could come in His way of self-realization.

Shri Gajanan Maharaj wanted Mehatbshah to justify His name by keeping away the darkness of malice. In beating him Shri Gajanan Maharaj hinted that Mehtabshab was not free from that malice.

Saints understand each others mind. So, Shri Mehatabshah was happy to get the hint. When Shri Gajanan Maharaj was beating Mehatabshah, the Muslim devotees who accompanied Mehtabshah were agitated, but Shri Mehatabshah asked them to keep quiet and go back to Kurum in their own interest.

Except Skh.Kadu all others left for Kurum. At that time Seth Bachchula came and invited Shri Gajanan Maharaj for meals at his place the next day. The next day, Shri Gajanan Maharaj was taken in a Tanga to Bachulal's house for meals. But on reaching there he did not get down and asked the Tanga to be taken back.

All were surprised at His action, especially because he had accepted the invitation previous day. One intelligent man amongst them suggested that it might be, because Shri Mehtabshah was not invited along with Shri Gajanan Maharaj . So they went and invited Mehatabshah. Then, the both of them came in the same Tanga to Bachuchulal's house.

Shri Mehatabshaha's stay was arranged at the nearby theatre and Shri Gajanan Maharaj ’s in the Shri Ram Temple, but subsequently Shri Gajanan Maharaj also went to the theatre.

All took their meals and then Shri Mahatabashah told his disciples to get him a train ticket for Punjab. Skh. Kadu requested Shri Mehatabshah to leave Kurum, only after completing the construction of the mosque, which was half built.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


21 Oct 2020

No comments:

Post a Comment