🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 26 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
19. నఖదీదితి సంచ్చన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ
🌻 44. నఖదీదితి సంచ్చన్న నమజ్జన తమోగుణా 🌻
అమ్మవారి కాలిగోళ్ళ కాంతులు అత్యంత కాంతిమంతములై,
ఆమె పాదములకు నమస్కరించువారి తమోగుణమును అనగా అజ్ఞానమును పటాపంచలు చేయుచున్నవని అర్థము.
అమ్మవారి పాదపూజా మహిమ ఇంతింతని చెప్పనలవి కాదు.
ఆమె పాద ధ్యానము చేతనే అజ్ఞానము నాశన మగునని నారదాది
మహరులు కీర్తించిరి.
అమ్మవారి పాదములకు శిరస్సువంచి నమస్కరించు వారి హృదయముల లోనికి ఆమె పాదకాంతులు ప్రసరించి, హృదయ కల్మషములను తొలగించి, జ్ఞానము ఆవిష్కరింపజేయునని పురాణములు కొనియాడుచున్నవి.
చల్లని తెల్లని యగు గోళ్ళకాంతులు ఎల్లప్పుడును ప్రసరించుచునే యుండుటచే ఆమె పాదములు వ్యభిచరించునవిగ నారదమహర్షి హిమవంతునితో చమత్కరించెను. నఖములు అనగా కాలిగోళ్ళు. అవి ఎంత ప్రకాశవంతమైనవో, అజ్ఞాన మను చీకట్లు ఎట్లు పారద్రోలగలవో ఈ నామము తెలుపుచున్నది.
జ్యోతిష శాస్త్రమున శిరమున కెంత ప్రాధాన్యము కలదో, పాదములకు కూడ అంత ప్రాధాన్యత గలదు.
శిరములు, అందలి తలపులు పవిత్రముగ నుంచుకొనువారు పాద నఖముల వరకు గూడ పవిత్రతను చేకూర్చు కొనవలెనని అమ్మవారి కాలి నఖములు తెలుపుచున్నవి.
పరమగురువుల పాదనఖములు ఇట్లే యుండునని దర్శించినవారు తెలుపుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 44 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 44. Nakhadīdhiti- saṃchanna- namajjana-tamoguṇā नखदीधिति-संछन्न-नमज्जन-तमोगुणा (44) 🌻
The rays of Her nails remove the ignorance of those who bow before Her. When Deva-s and asura-s (demons) pay their reverence to Her by bowing, the rays of the gems emanating from their crowns are in no comparison to the rays emanating from the nails of Her feet. The rays that come out of Her nails destroy the tamo guṇa (inertia) and ignorance of those who worship Her.
It is also said that She does not bless with Her hands, but with Her feet. She does not have abhaya and varada hands. Normally one can notice that most of the Gods have four hands, out of which one is meant for blessings and another for giving boons.
Lalitai does not have these two hands as She has four powerful goddesses (nāma-s 8, 9, 10 and 11) in Her four hands. The two acts of blessings and granting boons are done by Her lotus feet.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 45 / Sri Lalitha Chaitanya Vijnanam - 45 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
19. నఖదీదితి సంచ్చన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ
🌻 45. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ 🌻
శ్రీదేవి పాదముల జంట సౌష్టవ పూరితములై, మిక్కిలి లలితములై
పద్మములతో కూడిన సరస్సులను కూడ తిరస్కరించు చున్నవని అర్థము.
పద్మాలయము మనగా కమలముల సరస్సు. కమలములు
కాంతితో విచ్చుకున్న గ్రహగోళాదులకు సంకేతములు. అట్టి గ్రహతారకాదులు నీలాకాశమను సరస్సునందు విచ్చుకొని వైభవోపేతముగ కన్పట్టును. పద్మాలయ మనగా సృష్టిగోళమని అర్థము. కమలముల సరస్సు అని అర్థము.
అట్టి సమస్త సృష్టి సరస్సు కాంతిని కూడ అధిగమించు కాంతి అమ్మవారి పాద ద్వయములకున్నదని వర్ణన. మరియు పద్మములు సౌందర్యమునకు, సౌకుమార్యమునకు, ప్రసన్నతకు, స్వచ్ఛతకు చిహ్నములు. అట్టి పద్మములకన్న మిన్నగ పై లక్షణములు అమ్మవారి పాదద్వయమందు గోచరించును. అందులకే ఆమెను 'లలిత' అని సంబోధింతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 45 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 45. Pada- dvaya- prabhā- jāla- parākṛta-saroruhā पद-द्वय-प्रभा-जाल-पराकृत-सरोरुहा (45) 🌻
The beauty of Her feet is much more than a lotus. Generally lotus flower is compared to the eyes and feet of gods and goddesses. In Saundarya Laharī (verse 2) says “Gathering tiniest speck of dust from your lotus feet, Brahma creates the worlds, Viṣṇu sustains them and Śiva pulverising them into ashes besmears His body with them.”
There are opinions that She has four feet. They are known as śukla, rakta, miśra and nirvāna. The first two rest in ājña cakra, the third on the heart cakra and the fourth on the sahasrāra. Each of these feet is ruled by Brahma, Viṣṇu, Rudra and Sadāśiva. They stand for creation, sustenance, dissolution and the last one for liberation (or recreation).
In Hindu mythology, every act of Nature is represented by a god or goddess. For example, water is represented by lord Varuṇa, fire is represented by Agni, wealth by Kubera, death by Yama etc. It is nothing but worshiping the Nature and the cosmos. Since there are so many forces and energies in the universe, each of them is represented by a god.
Saundarya Laharī (verse 3) says, “The particles of dust at your feet serve to remove the inner darkness of the ignorant.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam
21 Oct 2020
No comments:
Post a Comment