✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
చివరి భాగము
🌻. ధ్యాన ప్రక్రియ 🌻
💠. 1. ప్రశాంతంగా కూర్చుని దీర్ఘ శ్వాసను తీసుకుందాం. గుండె సెంటర్ పాయింట్ దగ్గర దృష్టిని నిలిపి దీర్ఘంగా శ్వాసిస్తూ అలా నిలిచి ఉందాం.
అప్పుడు మీ యొక్క చక్రాస్ అన్నీ ఓపెన్ అవుతాయి. భూమి స్టార్ చక్రాతోనూ, ఆత్మ స్టార్ చక్రాలతోను కనెక్షన్ ఏర్పడాలని కోరుకుందాం.
శరీరంలోని అన్ని చక్రాలు ఏకస్థితిలోకి రావాలని కోరుకుందాం. కాస్మోస్ లో ఉన్న కాస్మిక్ హార్ట్ చక్రాతోనూ, భూమి యొక్క కేంద్ర క్రిస్టల్ తోనూ అనుసంధానం అవ్వాలని కోరుకుందాం.
💠. 2. "నా యొక్క సహస్రార చక్రం ఓపెన్ చేసి విశ్వశక్తి అయిన సోలార్ రేడియేషన్ నా లోపలికి రావాలని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క శక్తి తరంగాలు నా యొక్క శరీరమంతా వ్యాపించి నా దేహాన్ని కాంతి దేహంగా మార్చాలి."
💠. 3. "నా యొక్క సోల్ చక్రా ఓపెన్ అయి మరింతగా విశ్వకాంతి నా శరీరంలో ప్రవేశించాలి. నా యొక్క ఏడు శరీరాలలోకి కాంతి విస్తరించి ఆ 7 శరీరాలు అన్నీ కాంతిగా మారిపోవాలి.
నా శరీరాల నుండి కాంతి విశ్వమంతా వ్యాపించాలి. ఆ కాంతి విశ్వశక్తితో కలిపి తిరిగి నా యొక్క భౌతిక దేహం లోని అన్ని అవయవాలలో నిండిపోవాలి.
నా శరీరం లోపల ఉన్న DNA లో ఉన్న జీన్స్ అన్నీ కూడా అత్యంత ప్రభావవంతంగా తమ యొక్క జ్ఞానాన్ని తిరిగి పొందాలి. నా 12 ప్రోగులు యాక్టివేషన్ లోకి రావాలి. 12 ప్రోగులలో ఉన్న 12 అగ్ని అక్షరాలు పూర్తి స్థాయిలో యాక్టివేషన్ లోకి తీసుకురాబడాలి.
నా యొక్క 49 చక్రాలు కూడా సంపూర్ణంగా యాక్టివేషన్ లోకి వస్తున్నాయి. నా యొక్క పీనియల్ గ్రంథి పిట్యూటరీ గ్రంథి హైపోథాలమస్ గ్రంధి సంపూర్ణంగా యాక్టివేషన్ లోకి వస్తూ తమ యొక్క స్థితులను విశ్వశాంతితో మార్చుకుంటూ నన్ను విశ్వమానవుడిగా అహం బ్రహ్మాస్మి స్థితిలో నిరంతరం వెలుగొందుతూ సకల జీవరాశినీ జాగృతి పరుస్తూ మిగిలిన అన్ని లోకాలకూ ఆదర్శప్రాయునిగా ఉంటూ శక్తిమానవుడిగా దైవమానవుడిగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఇలాగే జరగాలి. తథాస్తు!
ఇందుకు సహకరించిన నా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కి, ఆస్ట్రల్ మాస్టర్స్ కి ధన్యవాదాలు
తెలియజేసుకుంటున్నాను.
సమాప్తం...
🌹 🌹 🌹 🌹 🌹
అద్భుత సృష్టి పుస్తకం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:
- 9396267139
- 9652938737
- 7730012579
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
21 Oct 2020
No comments:
Post a Comment