శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 100 / Sri Gajanan Maharaj Life History - 100


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 100 / Sri Gajanan Maharaj Life History - 100 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 19వ అధ్యాయము - 8
🌻

మారుతి విషయం అర్ధంచేసుకుని, ఆయన పాదాలు ముట్టుకుని, మీరే మాఏకైక రక్షకులు. పిల్లల బాధ్యతలన్నీ తల్లిమీద ఉంటాయి. ఆవిధంగా మీరు మాతల్లి వంటివారు. మాకు ఉన్నది అంతా మీకు సంబంధించినదే, మరియు ప్రతీదీ మీచేతులలో ఉంది. ఆ ధాన్యంగుట్ట మీది, పేరుకి తిమాజీ నౌకరు, కానీ మీరు యావత్ ప్రపంచాన్ని ఇక్కడ కూర్చుని రక్షిస్తారు. పిల్లలు కలగచేసే అన్ని ఇబ్బందులనీ తల్లి సహిస్తుంది.

నేను మీ పిల్లవాడిని కాబట్టి మీరు పరుగున మోరగాం వెళ్ళి నష్టపోకుండా నన్ను కాపాడారు. దయచేసి ఎల్లప్పుడూ ఇటువంటి కృప నాయందు ఉండనివ్వండి. నేను ఇప్పుడు వెళ్ళి తిమాజీనీ పనిలోనించి తీసివేస్తాను అని అన్నాడు. లేదు లేదు తియాజీని పనిలోనుండి తియ్యకు, అతను చాలా నమ్మకస్తుడని నాకు తెలుసు. గాడిదలు ధాన్యంతినడం చూసి అతనుచాలా పశ్చాత్తాప పడ్డాడు.

అతను నీదగ్గరకు వచ్చి ఈనష్టం గురించి చెప్పలేదూ ? అంతేకాక పొలానికి వచ్చి, నష్టం ఎంతఅయిందో అంచనాకూడా వేయమని నిన్ను అర్ధించాడు, కానీ నువ్వు షేగాం వెళుతున్నానని, తిరిగి వచ్చాక పొలానికి వస్తానని అన్నావు అని శ్రీమహారాజు అన్నారు. శ్రీమహారాజు యొక్క ఈవిధమయిన అపరితమైన కృపకు మారుతి అమిత ఆనందంపొందాడు.

ఆయనకు గాడిదలు పొలంలో చొరబడ్డట్టు ఎవరూ చెప్పలేదు, కానీ ఆయన స్వయంశక్తివల్ల తెలుసుకున్నారు. శక సం. 1816లో బాలాపూరులో జరిగిన మరోకధ ఇప్పుడు వినండి. ఒకరోజు శ్రీమహారాజు శుఖలాల్ బన్శీలాల్ ఇంటి వరండాలో ఆనందంగా కూర్చుని ఉన్నారు. ఏవిధమయిన బట్టలు లేకుండా పూర్తిగా నగ్నంగా ఉన్నారు. ఆవీధిన వెళుతున్నవారు శ్రీమహారాజును ప్రార్ధిస్తూ వెళుతున్నారు.

అది బజారులో ముఖ్యమయిన రహదారి కావడంతో ఒక పొలీసు గుమాస్తా అటు వెళ్ళడం తటస్థించింది. అతని పేరు నారాయణ అశ్రాజి. అతను మహారాజును చూసి, వివేకం కోల్పోయి, ఈ దిగంబరుడు యోగి కాదు, కపట సన్యాసి, కావాలని అక్కడ కూర్చున్నాడు కావున విస్మరించరాదు అని అన్నాడు. అలా అంటూ ముందు శ్రీమహారాజును తిట్టడం మొదలు పెట్టాడు, దానితో తృప్తి పడక ఆయనని బెత్తంతో కొట్టాడు. ఆబెత్తం దెబ్బల గుర్తులు శ్రీమహారాజు శరీరంమీద వచ్చాయి. అయినా సరే అతను కొట్టడం కొనసాగించాడు.

ఇదిచూసి, శ్రీహుండివాలా అనేఅతను ముందుకు వచ్చి కారణంలేకుండా ఈవిధంగా ఒక సన్యాసిని కొట్టడం మంచిదికాదు. భగవంతుడు యోగుల రక్షకుడు, ఆయన శరీరంమీద ఈ బెత్తం గుర్తులు చూసి నీచెయ్యి వెనక్కి తీసుకో. ఈవిధమయిన పనివల్ల నీవే నీ అంతిమ స్థితిని దగ్గరకు తెచ్చుకుంటున్నావు.

అనారోగ్యంగా ఉన్న మనిషి ఆరోగ్యం కొరకు ఉన్న నిబంధనలు ఉల్లంఘిస్తే మృత్యువును ఆహ్వానించినట్టే. ఈ రోజు నువ్వు పుణ్యాత్ముడిని కొట్టడం ద్వారా అదేపని చేసావు, ఇంకా సమయం మించిపోలేదు, శ్రీమహారాజును క్షమించమని అడుగు అని అన్నాడు.

క్షమాయాచన చేయడానికి నాకు కారణం కనపడటంలేదు. ఒక కాకి శాపం జంతువులను చంపలేదు అని నాకు తెలుసు. ఈముఖ్యమయిన రహదారి మీద కూర్చుని, ఈ దిగంబరుడు అసభ్యకరమైన మాటలు మాట్లాడు తున్నాడు, అటువంటి మనిషిని కొట్టినందుకు భగవంతుడు నన్ను తప్పుపడితే ఇది అవినీతికి పరాకాష్ఠత వంటిది అవుతుంది అని హవల్దారు అన్నాడు. అతని భవిష్యవాని నిజం అని నిరూపించబడింది. హవల్దారు అతని బంధువులు యోగిని కొట్టిన ఫలితంగా 15 రోజులలో మరణించారు. కాబట్టి విషయంనిజంగా తెలిసేవరకూ, యోగులతో ప్రవర్తించడంలో జాగ్రత్తగా ఉండాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 100 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 19 - part 8
🌻

Maruti understood, and touching Gajanan Maharaj’s feet said, You are our sole supporter. All responsibility of a child is on the mother, and You are our mother. Whatever we possess belongs to You, and everything is in Your hands.

That heap of grains was Yours. Timaji is a servant for name’s sake. You protect the whole universe from this place. A mother tolerates all the whims and fancies of her children. You, being my mother had to rush to Morgaon and save me from the incurring loss. Kindly let me receive such grace from You perpetually. Now I will go and relieve Timaji from the service.

Upon hearing this, Shri Gajanan Maharaj said, No, No, don't remove Timaji from the service. I know that he is really honest and felt sorry to see the donkeys eating your grains. Had he not come to you in the morning to report the loss? He even requested you to visit the field and assess the loss, but you said that you were going to Shegaon and would visit the field on return from there.

Maruti was overwhelmed by the unlimited benevolence of Shri Gajanan Maharaj . Nobody had told Him about the donkeys entering his field, but knew it by His omnipotence. Now listen to another story. In Shaka 1816 it happened at Balapur. Once, Shri Gajanan Maharaj was happily sitting in the Veranda of Sukhlal Bansilal's house. He was completely naked, without any clothes on the body.

People passing thereby were paying their respects to Shri Gajanan Maharaj . It was the main road in the market area relatives died within a fortnight as a result of beating a saint. Therefore everybody should be cautious in his behaviour towards the saints till the reality is known.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/


07 Nov 2020

No comments:

Post a Comment