🌹. శివగీత - 109 / The Siva-Gita - 109 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 14
🌻. పంచ కోశో పాసన - 5 🌻
సమస్తేభ్యో రజోం శేభ్యః - పంచ ప్రాణాది వాయవః,
జాయంతే సప్త దశక - మేవం లింగ శరీరకమ్ 21
ఏతల్లింగ శరీరంతు - తప్తాయ పిండ వధ్యతః ,
పరస్పరాధ్యా సయోగా - త్సాక్షి చైతన్య సంయుతమ్ 22
తదానంద మయః కోశో - భోక్త్రుత్వం ప్రతి పద్యతే,
విద్యా కర్మ ఫలాదీనాం - భోక్తే హాముత్ర సస్మృతః 23
యదా ధ్యాసం విహా యైష -స్వస్వ రూపేణ తిష్ఠతి,
అవిద్యా మాత్ర సంయుక్త - స్సాక్ష్యాత్మా జాయతే తదా 24
ద్రష్టాంతః కరణా దీనా - మమ భూతే స్శ్ర్ముతే రపి,
అతోన్తః కరణా ధ్యాసా - దద్యా సిత్వేన చాత్మనః 25
పంచ భూతముల రజోంశముల చేరిక వలన ప్రాణాది పంచ వ్యవహారము కల వాయువులు పుట్టుచున్నవి. జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకము, వాయు పంచకము మనో బుద్ది ద్వయ విశిష్ట సప్త దశాత్మకము లింగ శరీరము.
ఇట్టి లింగ శరీరము కాల్చబడిన ఇనుప గుండు వలెనే పరస్పరారోప యోగము వలన సాక్షి యగు చైతన్యముతో కూడినది యగును. అదియే ఆనంద మయ కోశము . అది సర్వ విషయ భోక్త్రత్వము ను పొందు చున్నది. ఆ యానందమయ కోషమే యచ్చటను పరమునను భోక్తయని చెప్పబడుచున్నది.
సుషుప్తి యందు తాను బింబ రూపమున నెప్పుడుండునో అప్పుడు విద్యా మాత్రముతో కూడి సాక్షి యగు చున్నది ఇంద్రియాను భవములకు, స్మృతికి ని చైతన్య స్వరూపుడు సాక్షీ భూతుడగు చున్నాడు.
అందుచేత అంతఃకరణముతో పర్సరాధ్యా స కలుగుట వలన ఆత్మ యందు భోక్త్రుత్వము మరియు సాక్షిత్వము అధ్యస్తములగును . ద్వివిధములైన ధర్మాలు పరస్పరముగా విరుద్దము లైనను అధ్యాస చేత ఆత్మలో నుత్పన్న మగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 109 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 14
🌻 Panchakoshopasana - 5 🌻
Again from the Rajas quality of the panchabhutas, Prana etc. the five winds got generated, Jnanendriya Panchakam, Karmendriyapanchakam, Vayupanchakam, Manas, Buddhi; these seventeen components are the constituents of Linga Deham (Subtle body). This Linga Deham remains the witnesser of all actions.
This is called as the Anandamayakosam. It is the enjoyer of all activities. This Anandamayakosam is the one which enjoys the fruition here and in higher abodes also.
In the Sushupti state (sleep state), when it remains as the Bimba (reflection), mixed with Avidya (ignorance), it becomes the witness. To the experiences of Indriyas, to the memory, the Atman which is the pure conciousness, becomes the witnesser.
That's why with the antahkaranam happens the conflicting Bhoktrutvam and Sakshitwam happen within it. Even the two conflicting Dharmas which remain contradicting they also take birth in Atman due to Adhyasa.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/
07 Nov 2020
No comments:
Post a Comment