🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 94 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 16 🌻
396. అణుశక్తి సూక్ష్మ ప్రపంచమందలి అనంత ప్రాణము యొక్క భౌతిక లక్షణములలో ఒక లక్షణము.
351. స్థూల - సూక్ష్మ- కారణ దేహములు
మిథ్యా జగత్తులో తమ శక్తులను ఎట్లు అనంతముగా నిరూపించుకున్నవి?
A. భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞుని యొక్క కల్పిత మనసస్సు మరుగుపడిన విషయములను నూతన విషయములను కనుగొనుటలో అంత్యమెరుగకున్నది.
B. సృష్టియందే పుట్టిన, అణుశక్తి పరిణామమంది, పరాకాష్ట స్థితి చెంది దాని భయంకర శక్తి చేత తన సృష్టి నాశనము చేయుటకు సిద్ధపడుచున్నది.
C. సృష్టిలో కేవలము సౌఖ్యమునే అన్వేషించు స్థూల దేహము, అంతకంతకు అధిక సౌఖ్యమును కోరుచు మిథ్యా జీవితమునకు ఆకరమైన సౌఖ్య మగుచున్నది.
398. ఇట్టి నిరూపణమునకు కారణమేమి?
భగవంతుని మూలమగు అనంత స్వభావత్రయమైన అనంత జ్ఞాన-శక్తి-ఆనందములనుండి పుట్టి, మాయలో అనంతముగా వ్యాపించిన కారణముచేత, అవి తమ తమ శక్తులను అంత అద్భుతముగా నిరూపించుచున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/
07 Nov 2020
No comments:
Post a Comment