శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 76, 77 / Sri Lalitha Chaitanya Vijnanam - 76, 77

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 42 / Sri Lalitha Sahasra Nama Stotram - 42



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 76, 77 / Sri Lalitha Chaitanya Vijnanam - 76, 77 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :


విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ‖ 30 ‖



🌻 76. 'విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా' 🌻

విశుక్రుడను రాక్షసుని ప్రాణములను హరించిన వారాహీ దేవి యొక్క పరాక్రమమునకు సంతసించిన దేవి అని అర్థము.

విశుక్రుడు కూడ భండాసురుని సోదరుడు. ఇతడు భండాసురుని కుడిభుజ శిరస్సునుండి పుట్టెను. ఇతడు దైత్యసేనకు రక్షకుడు. రాక్షస గురువైన శుక్రాచార్యునితో సమానుడు. ముందు నామమున తెలిపిన ద్వంద్వములలో ఇతడు రెండవవాడు. మంచిని, సుఖమును, లాభమును, ధనమును, ఇత్యాది విషయములందాసక్తి, దానికి వ్యతిరేకమగు గుణములందు విపరీతమగు ద్వేషము కలవాడు.

ధర్మపరులుగ నుండవచ్చును. అంత మాత్రమున అధర్మ పరులను ద్వేషింప నవసరములేదు. ధనముండ వచ్చును. అంత మాత్రమున దరిద్రులను ద్వేషింపపనిలేదు. క్రమశిక్షణ ఉండవచ్చును. కాని అది లేనివారిని హీనముగ చూచుట తగదు.

పుణ్యకార్యములు చేయవచ్చును. అంత మాత్రమున పాపులను చూచి అసహ్యించుకొనుట తగదు. జ్ఞానముండ వచ్చును. అంత మాత్రమున అజ్ఞానులను నీచముగ చూడవలసిన పనిలేదు. ఆస్తికులుగ నుండవచ్చును. అంతమాత్రమున, నాస్తికుల ద్వేషింప బనిలేదు. ఇట్లు జీవించు వారు మంచి చెడుల పోరాటమున శాశ్వతముగ బంధింప బడుదురు. దేవదానవుల యుద్ధము ద్వంద్వములకు లోబడిన యుద్ధమే. అందరును అమ్మబిడ్డలే. అమ్మకందరును ప్రియులే.

సన్మార్గముల యందున్న వారియందు, దుర్మార్గమున నున్న వారియందు ఒకే అంతర్యామి తత్త్వమున్నది. ఈశ్వరుడు, మంచిచెడులతో సంబంధము లేక అందరి హృదయము లందున్నాడు. యోగులొక్కరే దీనిని గమనించి అందరిని ప్రేమింతురు. అందరియందు సమభావము కలిగి యుందురు. నారదుడు, సనక సనందనాదు లట్టివారు.

సద్గురు పరంపర కూడ యట్టిదే. వారు అజ్ఞానులు జ్ఞానులు కావలెనని, జ్ఞానులు ముముక్షువులు కావలెనని కోరుదురు. తమకు నచ్చనివారు నశించవలెనన్న భావము వారి కుండదు. అందరును బాగుండవలెనని యుండును. అది యోగుల ప్రత్యేకత. సద్గురువుల ప్రత్యేకత. వారు దైవమునకు (దేవికి) ప్రతీకలు.వారు సృష్టిలోని అన్ని లోకములందు జీవుల ఉద్ధారణమునకై ప్రయత్నింతురు.

విశుక్రుడు ధర్మమున యుండి అధర్మమును ద్వేషించువాడు. అందువలన అతడు కుడిభుజమున యున్న శిరస్సునుండి పుట్టినవాడని తెలుపబడినది. విషంగుడు ఎడమ భుజపు శిరస్సునుండి పుట్టినవాడు. అతడు అధర్మమున నుండి ధర్మమును ద్వేషించినవాడు. వీరిరువురును ద్వంద్వములందు చిక్కినవారే. బంగారు పంజరమున చిక్కినను తప్పు పట్టిన ఇనుప పంజరమున చిక్కినను, రెండునూ పంజరములే కదా!

పక్షి కది బంధనమే కదా! ఈ రహస్యము తెలియనివారే ఆస్తికులు కూడ. ఆస్తికులు దుష్టులను ద్వేషించుట తగని పని. కావున విశుక్రునికి కూడ బంధమోచన ఆవశ్యకత యున్నది. ఇతడిని వధించినది వారాహీ దేవి. వారాహీ దేవి, కిరిచక్రమును అదిష్ఠించి యుండునని ముందు తెలుపబడినది. ఈమె హస్తమున దండము వుండుటచే 'దండిని' అనియు, 'దండనాథా' అనియు తెలియ బడుచున్నది. ఈమె రథమున కొక ప్రత్యేకత కలదు.

ఈ రథ మెక్కిన వానిని యముడు కూడ స్పృశించలేడు. అనగా జీవుడు జనన మరణములను ద్వంద్వములను దాటించు రథమే కిరిచక్రమని తెలియవలెను. ఇట్లు వరాహమువలె జీవుల నుద్ధరించు దేవిని 'వారాహీ' యందురు. ఆమెచే విశుక్రుడు వధింపబడుట శుభదాయకము.

భండాసురు డహంకార ప్రజ్ఞకాగ, అతని ఎడమ భుజమగు విషంగుడు అహంకారుని అధర్మ ప్రవర్తనము. విషంగుడు అహంకారుని ధర్మ ప్రవర్తనము.

గేయచక్రము నెక్కిన శ్యామల విషంగుని వధించుట అజ్ఞానము నుండి జ్ఞానమున కుద్ధరించుట. కాళిదాసుని అట్లే యుద్ధరించెను. కిరిచక్ర మెక్కిన వారాహి ధర్మాధర్మముల కతీతమగు శాశ్వత సత్యమందు జీవుని చేర్చును. ధర్మపరులైనను అహంకారము దాటిన వారు కారు కదా! మంచి వారి యందు కూడ అహంకార మున్నది.

అహంకారము ఉన్నంత కాలము ద్వంద్వము లున్నవి. అవి మెడకు రెండు భుజముల వంటివి. రెండింటి నుంచి జీవుని ఉద్ధరించుచున్న శ్యామల, వారాహి శక్తుల నైపుణ్యమునకు అమ్మ ఆనందించు చున్నదని అర్థము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 76 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Viśukra- prāṇaharaṇa- Vārāhī- vīrya-nanditā विशुक्र-प्राणहरण-वाराही-वीर्य-नन्दिता (76) 🌻

Viśukra is the brother of Bhandāsurā (refer the previous nāma). Vārāhī Devi slayed Viśukra and Lalitai was happy with the bravery of Vārāhī Devi.

Nāma-s 74, 75 and 76 talk about Bālā, Mantrinī and Vārāhī Devis. Stain or impurities in Sanskrit is known as mala.

The three Devi-s destroy the mental impurities that accrue through our sensory organs. These impurities or stains are called mala, the worst of which is ego. In the case of Bālā it can be interpreted as balā or strength.

One needs to have sufficient physical strength to receive the divine power, which is infused through our crown cakra and back head cakra. Mantrinī possibly could mean the potency of Devi’s mantras like Pañcadaśī or ṣodaśī.

According to several ancient texts, each mantra is be recited up to a particular number of times, followed by other rituals called puraścaraṇa.

Vārāhī is supposed to be the most powerful of the three Devi-s. She cannot tolerate any indiscipline. Possibly, Vārāhī could mean certain austerities to be followed in the worship of Devi.

The three qualities viz. the physical strength, control of the mind (controlling the mind happens through the recitation of mantra) and observing certain austerities (sensory organs) make a man realize the Supreme Self within.

When such a stage is reached, the devotee uses his body merely as a sheath to get final liberation and merge with Her.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 77 / Sri Lalitha Chaitanya Vijnanam - 77 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :


విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ‖ 30 ‖



🌻 77. 'కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా' 🌻

కామేశ్వరుని ముఖమును చూచుట తోడనే శ్రీ మహా గణపతిని

పుట్టించినదానా! అని అర్థము.

సృష్టి నిర్మాణమున కలుగుచున్న విఘ్నములకు దేవతలు చాలా బాధ పడుచుండగ, అసుర శక్తులచే బంధింపబడుతుండగ, వారి అవస్థను చూచి శ్రీ లలితాదేవి కామేశ్వరుని ముఖమువైపు కడకంటి చూపుతో చూచినదట. దంతపంక్తి కొంత కనపడునట్లు కొంత చిరునవ్వు నవ్వినదట. ఆ చిరునవ్వు నుండి మహాకాంతులు పుట్టినవట.

శివుని కనుచూపు తన కనుచూపుతో కలియుటచే ఆమెకి కలిగిన చిరునవ్వు కాంతుల నుండి ఏనుగు రూపముగల ఒక దేవత ఉద్భవించెనట. అతడే మహాగణపతి. ఈ మహాగణపతి అటుపైన పార్వతీదేవి సృష్టించిన వినాయకుడు ఒకరు కారని తెలియవలెను.

వినాయకుడు పార్వతీదేవిచే సృష్టి చేయబడి శక్తి స్వరూపుడై శివునెదిరించి, శివుని అనుగ్రహము ద్వారా గజాననుడైనవాడు. మహాగణపతి, పరమశివుని ప్రేమతో కూడిన వెన్నెలలచే అమ్మవారి కనుల చేరి అటుపైన అమ్మవారి నవ్వునుండి వ్యక్తమైనవాడు.

ఇతడు సకల మంత్రస్వరూపుడు 28 అక్షరములు గల మంత్ర స్వరూపుడై భాసించువాడు నలుగుపిండి నుండి పుట్టిన వినాయకుడు ఇతని అంశ. శ్రీ లలిత పరాప్రకృతి, శివుడు పరమాత్మకాగ వారి నుండి పుట్టినవాడు మహాగణపతి. త్రిశక్తులలో ఒకరైన పార్వతికి, త్రిమూర్తులలో ఒకరైన శివునికి జన్మించినవాడు వినాయకుడు. పార్వతీదేవి శ్రీ లలిత అంశ. శివుడు త్రిమూర్తులలో ఒకడు అనగా కామేశ్వరుని అంశ. అట్లే వినాయకుడు కూడ గణపతి అంశ.

దేవతలు త్రిగుణముల నుండి పుట్టినవారు. అందువలన వారికి అహంకారము తప్పదు. అహంకారముతో, అభిమానముతో దేవతలు సృష్టి చేయుచుండగ విఘ్నములు తప్పవు. అహంకార మున్నచోట అజ్ఞానము కూడ ఉండును. అజ్ఞానమే విఘ్నములకు కారణము అహంకారము పుట్టినప్పుడే అసురత్వము కూడ జీవులలో పుట్టును. నిరహంకారికి అజ్ఞాన ముండుట కవకాశ ముండదు. కావున విఘ్నము లుండవు.

మహాగణపతి నిరహంకారియగు దేవత, అందువలన అతనికి విఘ్నములు లేవు. అతని నారాధించుట వలన ఆరాధకునిలో అహంకారము నశించుట ఫలము. నిరంహకారి అగుటచే విఘ్నము లుండవు. అట్టి మహాగణపతికి మాతృమూర్తి శ్రీ లలిత.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 77 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Kāmeśvara- mukhāloka- kalpita-śrīgaṇeśvarā कामेश्वर-मुखालोक-कल्पित-श्रीगणेश्वरा (77) 🌻

Gaṇeśhā was born out of a mere glance of Lalitai at Kāmeśvara. Gaṇeśhā is the first son of Śiva and Pārvathī. Bhandāsura during the war was witnessing the destruction of his army. In order to avoid further causalities to his army he ordered a yantra by name jaya vignaṁ to be kept in the midst of the army of Lalitai.

Yantra-s are powerful, only if impregnated with potency of mantra-s. When this yantra was kept, the army of Lalitai started losing their self-confidence. Mantrinī Devi, who is an authority of mantra-s, noticed this and reported to Lalitai.

This yantra can be removed by the one who has won over puryaṣṭaka which consists of the following eight- 1) five organs of action (karmendriya-s), 2) five organs of senses (jñānaendriya-s), 3) antaḥkaraṇa (four in numbers - manas, buddhi, cittam and ahaṃkāra or ego), 4) five prāṇa-s (prāṇa, apāṇa, etc), 5) five elements (ākāś, air, etc) 6) desire, 7) ignorance and 8) karma.

The total components of puryaṣṭaka are twenty seven and with this the attributes of Śiva is added, takes the total to twenty eight. The mūla mantra of Mahā Gaṇapati is twenty eight.

When all the twenty seven components of puryaṣṭaka are destroyed, it leads to attributes of Śiva. The attributes of Śiva (saguṇa Brahman) leads to pure Śiva or nirguṇa Brahman (Śiva without attributes). The bliss of realization is attained followed by emancipation.

Śiva Sūtra (III.42) says “bhūtakañcukī tadā vimukto bhūaḥ patisamaḥ paraḥ” which is translated as “for him (means a yogi), the five elements are only coverings. At that very moment, he is absolutely liberated. Supreme and just like Śiva.”

This nāma talks about the stages that to lead to emancipation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/


07 Nov 2020

No comments:

Post a Comment