🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 155 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 29 🌻
207. ఇంద్రియములను గురించిన సుఖం ఒకటి ఉంది. ఇక్కడ వేడిగా ఉంటే నీడ దగ్గరికి వెళతాము. చెట్టుకిందకి వెళ్ళి నిలబడతాం చల్లగాఉందని! మనకు తెలియకుండానే వెళతాం. జ్ఞాని కావచ్చు, విరాగి కావచ్చు, కాళ్ళు కాలితే ఎండలో కూర్చుంటాడా? నీడ దగ్గరికే వెళతాడు కదా ఆ సమయంలో అతడు, తనదేహభావన, దేహాభిమానము జ్ఞాపకం తెచ్చుకుని దానిని జయించే ప్రయత్నం చేయాలని అతడికి ఉద్బోధ చెయ్యాలి. దేహం మీద అంత ప్రేమ ఏమిటి? అని ప్రశ్నించి, అతడియొక్క దొషాన్ని క్షాళనచెయ్యటమే గురువు యొక్క కర్తవ్యం.
208. శుకుడికి మోక్ష మార్గం ఉపదేశించనక్కరలేదు. “మోక్షం కోరే వాడికి ఎలా ఉపబోధించాలి”, మరియు “ఆత్మయొక్క మహత్తు జీవాహంకారానికి, అంటే జీవుడికి తెలియాలి కదా! అది ఎలా తెలుసుకోవాలి అని నన్ను అడుగుతారు ఏం చెప్పమంటావు” అని నారదుని అడిగాడు.
209. దానికి బదులుగా నారదుడు, “అహింస, ఇంద్రియాలను జయించటం, నైరాశ్యము – అంటే దేనియందూ ఆశ లేకపోవటం అనే లక్షణాలు పొందాలి” అని చెప్పాడు.
210. నైరాశ్యము - ఆశ లేక పోవటం - అంటే, అది ఇతరుల విషయంలో కూడా అని అర్థం. ఎందుచేతనంటే, నన్ను గురుంచి నాకు ఆశ లేక పోవటం మాత్రమే అని కాదు. ఎవరన్న వచ్చి ఆశీర్వచనం అడిగితే, జ్ఞాని ఆశీర్వచనం ఇస్తాడే కాని మమకారం పెట్టుకోడు. ఈశ్వరుణ్ణి తలచుకుని ఆశీరవదించటమే తన కర్తవ్యం తప్ప, ఆ తరువాత వాళ్ళకోసం, మమకారంతో – ‘నా మాట ఊరికే పోకూడదు’ అని తపనపడటం కాదు.
211. నైరాశ్యమే, అంటే మమకారం లేకుండా ఉండటమే, తనకర్తవ్యం. ‘అచపలత్వం’ అన్నాడు దానిని నారదుడు. చపలత్వం అంటే, ముందర కోరిక లేకపోయినా, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది ఎలా ఉంటుందో దాని రుచి ఎలా ఉంటుందో ఒకమాటు చూద్దామనేటువంటిది;
212. తాత్కాలికమైన, అంటే లోతైన మనసు లోపలినుంచి చిత్తములోంచి కాక, ఏదో మనసుపైనుంచి పుట్టే చిన్న కోరిక. ఆ చిన్నకోరికతో కూడా చాలా పెద్దదెబ్బ తిన్నవాళ్ళ చరిత్రను పురాణం చెపుతూనే ఉంది.
213. అనవసరపు పనిని చపలత్వం అంటారు. చిత్తం స్వస్థతలేక ఎందులోనో ప్రవేశించి ఏదోపని చేయటమనేది చాపల్యం. ఇది మోక్షార్థికి దోషమని చెప్పాడు నారదుడు. ఈ దోషాలు వర్జించి అంతర్ముఖుడైన మనుష్యుడు, కొంతకాలం మౌనియై, తతస్థుడై ఈశ్వరుడియొక్క అనుగ్రహంకోసమని వేచి ఉంటాడు.
214. ఆత్మ తనను తాను ఎఱుకపరుచుకుని తన తేజస్సుతో తనను తానే దర్శనమాయ్యే వరకు అంతర్ముఖుడై వేచి ఉండటమే తపస్సు. నిష్క్రియుడై ఉండాలే తప్ప ఏ క్రియా తాను చేయకూడదు. సర్వారంభ పరిత్యాగియై, జ్ఞానికి భగకరమైన పని చెయ్యకుండా ఉండాలే తప్ప, జ్ఞానం కొరకు అంటూ ప్రత్యేకంగా చేసే పని లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/
07 Nov 2020
No comments:
Post a Comment