ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 111, 112 / Sri Lalitha Chaitanya Vijnanam - 111, 112 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖
🌻 111. 'బిసతంతు తనీయసీ' 🌻
తామరతూడులోని దారమువలె మిక్కిలిగా కృశించిన రూపము కలది, అనగా సూక్ష్మమైనది అని అర్థము.
కుండలినీ చైతన్యము సర్పాకారముగ వర్ణింపబడినను, అతి సూక్ష్మమైన దారమువలె దర్శనమిచ్చును. చుట్టలుగా మూలాధారమున ఉండుటచే సర్పాకారమనిరి. నిజమునకు అది సూక్ష్మమగు చైతన్యము.
తేజస్సు, ఆ తేజస్సు సుషుమ్న మార్గమున అతి సూక్ష్మమై సాగును. ప్రాణాయామ సాధనమున వాయువు సహకారముతో ఈ చైతన్యము స్వాధిష్ఠానమందు అగ్నివలె ప్రజ్వలించును. అటుపైన గల ప్రజా చక్రములను ఛేదించు కొనుచూ సహస్రారము చేరును. ఈ మొత్తము మార్గమును సుషుమ్న నాడిగ తెలుపుదురు. అందు ఊర్ధ్వముఖము చెందు ప్రజ్ఞ తేజోరూపమైన సర్పముగా వర్ణింతురు.
తామరతూడులో కొన్ని వందల దారములున్నవి. అందలి దారము నొకదానిని పరిశీలించినచో, పాఠకునకు కుండలినీ చైతన్యపు సూక్ష్మత్వము కొంత అవగాహన కాగలదు. అరుణోపనిషత్తు ఈ విధముగా బోధించుచుండును. “ఓ భారతీయుడా! అగ్నిని ఆశ్రయింపుము. సోమస్థితి చేరి తృప్తి పొందుము.
సోముడనగా అమృతత్వమునకు చెందిన ప్రజ్ఞ. ఉమతో కూడిన ఈశ్వరుడు. ఇచట ఉమ ఈశ్వరుని చేరుట సిద్ధి. ఆమె సహస్రారమున ఈశ్వరునితో చేరిన కుండలినీ చైతన్యము. మూలాధారమున ఆమె పుట్టిన బాలికవలె బుసకొట్టుచూ ఈశ్వరుని చేరుటకు ఏడ్చుచుండును. ఇట్టి ఆరాటమును చూపు కుండలినీ శక్తిని 'కుమారి' అందురు. 'కు' అనగా భూతత్త్వము. 'ప్రియతే' అనగా లీనము చేయునది.
భూతత్త్వము లీనము చేయుచున్నది గాన 'కుమారి' అని చెప్పబడు ఇది జిజ్ఞాసగల జీవుని రోదనావస్థగా తెలియవలెను. మూలాధారమందలి కుండము నుండి లేచునపుడు, ఆమె చేయు రోదన ధ్వనియే 'కుమారి'. ఈ కుమారి మంద్ర స్వరముతో నుండును. రోదనమునకు మునుపు ఈమె బాల. రోదనధ్వనిలో కుమారి. అటుపైన స్వాధిష్ఠానమున అగ్నివలె ప్రజ్వలించునపుడు 'యోషిత', అనగా యవ్వనవతి. అనాహతమును దాటినపుడు 'తరుణి'. అటుపై ఈశ్వరుని చేరి తృప్తి చెంది ' కామేశ్వరి' అగు చున్నది. ఆమెయే
రాజరాజేశ్వరి. ఈ మొత్తము మార్గమంతయు సుషుమ్న మార్గము. అదియే 'బిసతంతు'. అందు సూక్ష్మరూపమున నివాసము చేయునది ప్రజ్ఞ లేక శ్రీదేవి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 111 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Bisatantu-tanīyasī बिसतन्तु-तनीयसी (111) 🌻
She is like the minute fibre of a lotus stalk. This is the last of the nāma-s that describe Her subtlest form. She is like a young girl in the lower cakra-s as She makes sound in the mūlādhārā cakra, gets dressed like a bride in the navel cakra and proceeds to meet her spouse Śiva in sahasrāra. There are many references for this description. These descriptions ultimately point to the path of Kuṇḍalinī, the inner canal of the spinal cord which is extremely subtle and almost invisible. When Kuṇḍalinī ascends through this middle canal without any blocks or deviations, it shines like a lightning. Since it has such immense potency, it confers on the sādhaka certain siddhi-s before it reaches the crown cakra. If the sādhaka misuses such powers, he will not be able to realize the Brahman and also gets punished. Though She has the burning desire to conjoin Her spouse, She certainly knows how Her power has been utilized by the sādhaka during Her sojourn in various cakra-s of the sādhaka. She never forgets the duties allotted to Her by Śiva.
Possibly, the Vāc Devi-s used two nāma-s to emphasise both Her minute (this nāma), and mahat or supreme (nāma 109) forms, as otherwise there is no necessity for them to talk about anything else after describing Her subtlest Kuṇḍalinī form (nāma 110).
Nārāyaṇa sūkta describes Kuṇḍalinī thus: “The place for His meditation is the ether in the heart, the heart which is comparable to an inverted lotus bud. It should be known that the heart which is located just at the distance of a finger span below the Adam’s apple and above the navel is the great abode of the universe. Like the bud of a lotus, suspends in an inverted position, the heart surrounded by arteries. In it or near it there is a narrow space (suṣumna). In it everything is supported. In the middle of that remains the non-decaying, all knowing, multi faced, great fire, which has flames on every side, which enjoys the food presented before it, which remains assimilating food consumed and which warms its own body from the insole to the crown. In the centre of that fire, which permeates the whole body, there abides a tongue of fire, of the colour of shining gold, which is the topmost among the subtle, which is dazzling like the flash of lightning that appears in the middle of a rain-bearing cloud, which is as slender as the awn of paddy grain and which serves as a comparison to illustrate subtlety.”
Possibly this nāma could also mean the citrini nādi, which is the central canal of the spinal cord through which Kuṇḍalinī ascends and descends.
With this nāma the description of Her Kuṇḍalinī form ends and from the next nāma, the description of Her blessings begin.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 112 / Sri Lalitha Chaitanya Vijnanam - 112 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖
🌻112. 'భవానీ' 🌻
భవమనగా జీవరూపమైన నీరు. శివుని భవుడని పిలుతురు.
అనగా జీవరూపమైన నీటికి ఆధారమైన వాడు. ఈ నీటిని నారములని కూడా పిలుతురు. నారాయణుడన్నను, భవుడన్ననను ఒక్కటియే. అది అనంతమగు చైతన్యము. అందుండి ప్రత్యేక సంకల్పమున ప్రత్యేకమగు జీవులుగ సృష్టి దిగి వచ్చుచున్నది. భవ అవయతి భవాని' అని తెలుపుదురు.
అనగా తన ఆజ్ఞచేత అనంతమగు నీటి నుండి బిందు రూపమగు జీవులను జీవింపజేయునది అని అర్థము. నారమునుండే నరులు ఏర్పడుచున్నారు. నారము లనగా నశింపనివి. నరులనగా కూడా నశింపనివారు అని అర్థము. వారే జీవులు. అనంతమగు సముద్రమునుండి అసంఖ్యాకములగు బిందువులు ఎట్లేర్పడేనో, అట్లే అనంతమగు ఆకాశ జలమునుండి జీవకోట్ల నేర్పరుచుట శ్రీదేవి కార్యము. ఆమె ఇచ్ఛచేతనే సమస్తమూ నిర్వహింపబడుచున్నది.
అందుచేత ఆమె భవాని అగుచున్నది. ఆమె ఏర్పరచిన సమస్తము నందు స్థితి భేదము లేక వసించువాడు భవుడు. అతడు భవుడు; ఆమె భవాని.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 112 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Bhavānī भवानी (112) 🌻
Beginning from this nāma till nāma 131 the significant aspect of blessing Her devotees is described.
Bhava means Śiva, particularly his form of Mahādeva and ana means infusing life. She, the wife of Śiva gives life to all or as Śrī Mātā, She gives life. Since She gave back life to Manmatha (Manmatha is also known as Bhava) she is addressed as Bhavānī. Śiva is known as Bhava because the universe was created from Him (bhava means produced from) and being sustained by Him. Though grammatically, Bhava and Bhavānī may differ, but the actions of both Bhava and Bhavānī remain the same. .
The famous verse of Saundarya Laharī (verse 22) says “Bhavānī tvaṃ” meaning You are Bhavānī. The verse further says, “When one is desirous of paying to You as Oh! Bhavā’s consort! May You cast Your gracious glance on me, Your servant utters the name of Bhavā’s consort (meaning Bhavānī). You, at that very moment grant him the state of absorption into You.”
{Further reading on absorption: Absorption means the metnal state that is completely filled with God consciousness. Individual consciousness submerged in God consciousness is absorption. The word Bhavānī is used in the above verse is intended by the devotee as an address to Lalitāmbikā in the vocative case.
But, as a verb in the first person of the imperative mood, it would mean ‘let me become’. As soon as the first two words Bhavānī tvaṃ are uttered, She rushes to grant him absorption in Her own Self. She becomes so elated and happy of being addressed as Bhavā’s consort, She does not even wait for the verse to be completed.
She acts immediately on listening to those two words Bhavānī tvaṃ, interpreting them as ‘Let me become Thyself’. This translates into mahā vākyā “Tat Tvam Asi”. This process is called sāyujya that gives immediate liberation. This way of contemplating Her is more efficacious than japa and homa. Liberation is of four types: Sālokya, co-existence with the Lord in His world. Sārūpya, attaining the same form as that of the Lord. Sāmīpya, proximity as that of the Lord. Sāyujya, absorption into the Lord Himself. The first one progressively leads to the last one. But the thought process of identifying the self with the Lord (sāyujya) leads to fast track emancipation.}
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
26 Nov 2020
No comments:
Post a Comment