గీతోపనిషత్తు - 84


🌹. గీతోపనిషత్తు - 84 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 22. దైవ యజ్ఞము - సర్వము దైవమే యని యజ్ఞార్థముగ జీవించుట యొక పద్ధతి. ఆచరణమంతయు దైవారాధనమే అని భావన చేయుచు, అన్నిటి యందు దైవమునే దర్శించుచు జీవించుట యిందలి ప్రధాన సూత్రము.🍀

📚. 4. జ్ఞానయోగము - 25 📚

దైవ మేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నా వపరే యజ్ఞం యథే నైవోపజుహ్వతి || 25


సర్వము దైవమే యని యజ్ఞార్థముగ జీవించుట యొక పద్ధతి. ఆచరణమంతయు దైవారాధనమే అని భావన చేయుచు, అన్నిటి యందు దైవమునే దర్శించుచు జీవించుట యిందలి ప్రధాన సూత్రము. మరికొందరు జీవుల ఆరాధన, దైవము యొక్క ఆరాధనయని, జీవులనే దైవమూర్తులుగా భావించి, వారి కొనరించు సేవ, ఆరాధనగా జీవింతురు. ఇదియును జ్ఞాన యజ్ఞమే.

మొదటిది దైవయజ్ఞము. రెండవది జీవయజ్ఞము. ముందు శ్లోకములలో తెలిపిన 12 సూత్రముల ఆధారముగా నిర్వర్తించు సమస్త కర్మము యజ్ఞమే.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2020

No comments:

Post a Comment