శివగీత - 124 / The Siva-Gita - 124
🌹. శివగీత - 124 / The Siva-Gita - 124 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 16
🌻. మొక్షాదికారి నిరూపణము - 5 🌻
మహా పాపై రపి స్పృష్టో -ముచ్యతే నాత్ర సంశయః,
అన్యాని శైవ కర్మాణి - కరోతున కరోతువా 22
శివ నామ జపేద్య స్తు -సర్వదా ముచ్యతే తు సః,
అంతకాలే తు రుద్రాక్షా -న్విభూతిం ధార యేత్తు యః 23
మహా పాపో పపా పౌఘై -రపి స్పృష్టో న రాధమః ,
సర్వదా నొప సర్పంతి -తం జనం యమ కింకరా 24
బిల్వ మూల మృదా యస్తు - శరీర ముపలిం పతి,
అంత కాలేంత కజనై -స్సదూరీ క్రియతే నరః 25
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం షోడశో ధ్యాయః
ఎల్లరు శివ భక్తులను భస్మ రుద్రాక్షలను ధరించుట చేయవలెను. అప్పు డెల్లరు శివ భక్తులను భస్మ రుద్రాక్షలను ధరింప వలెను. శివ భక్తి గోరువానికిది ముఖ్యముగా నున్నది.
భస్మమును ధరించి రుద్రాక్షలను దాల్చినవాడు పాపిష్టుడైనను ముక్తి నొందును ఇతర శివకర్మల చేసినను చేయక పోయినను శివనామము నుచ్చరించిన యెడల తప్పక ముక్తిని పొందును.
మహాపాప సమూహములతో జుట్టబడిన వాడైనను అంత్య కాలములో రుద్రాక్ష, విభూదులను ధరించు వాడి దగ్గరకు యమ కింకరులు రారు. భయపడెదరు.
బిల్వ మూల మృత్తికను (మట్టిని ) శరీరమునకు ధరించు కొనిన వాడికి యమ దూతలు దూరము ననే యుందురు.
ఇది వ్యాసోక్త సంస్కృత పురాణాంతర్గతంబగు శివ గీతలో పది యారవ అధ్యాయము సమాప్తము .
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 124 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 16
🌻 Mokshadhikari Nirupanam - 5 🌻
Shiva devotees should wear holy ash and Rudraksha on their bodies, this is an important feature for the aspirants of gaining Shiva devotion.
A person who applies holy ash on his body, and wears Rudraksha even if he is a great sinner he would attain to salvation.
One who doesn't perform other rituals related to Shiva but only chants Shiva's name continuously, he would attain liberation for sure.
A great sinner who has always been living with sinners and has accumulated nothing but sins, even such a heinous person at his death time if wears Rudraksha and applies holy ash on himself; the attendants of Yama (god of death) can not touch or near him. A person who applies the soil from a Bilva tree on his body, Yama's attendants would always remain away from him.
Here ends the chapter 16 of Shiva Gita from Padma Purana Uttara Khanda
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment