భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 108


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 108 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 13 🌻


453. ఆరవభూమికలో ప్రత్యక్షదర్శన అనుభవముచే భగవంతుని అస్తిత్వమును విశ్వసింతురు.

454. ప్రతి భూమిక యందును మరులుగొల్పు ఆకర్షణలుండును. వాటికిలోనై, వాటిలో లీనమైన వానిని "తన్మయుడు "లేక"తల్లీనుడు" అందురు. ఇట్టివానిని"మస్త్" అని కూడా అందురు.

455. భూమికలలో ఉన్న ఆకర్షణలకు, వ్యామోహములకు లొంగిపోక, వాటిలో నిమగ్నుడు కాక , సరాసరి చివరకు తన స్థితిని కాపాడుకొను వానిని "మహర్షి లేదా సలీక్" అందురు.

456. భూమికలలో నున్న "ఋషి" సాధారణ మానవుని వలెనే కన్పట్టును వాని వలనే ప్రవర్తించును.

457.అట్లుకాక, కొంతమంది పై ఉభయస్థితులను కలిగియుందురు. అట్టివారిని-- మజ్ జూబ్ స్థితి ప్రబలముగా నున్నచో "మజ్ జూబ్ -- సలీక్" లేదా రాజర్షి అనియు,‌ సలీక్ స్థితి ప్రబలముగా నున్నచో "సలీక్--మజ్ జూబ్" లేదా మహర్షి అనియు అందురు.

458. భూమికలలో నున్న మజ్ జూబ్ ను"మస్త్" లేదా ఋుషి లేదా తన్మయుడు అందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2020

No comments:

Post a Comment