🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 38 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ‖ 25 ‖
🌻 66. 'సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవితా' 🌻
సంపత్కరీ అను దేవిచే రూఢమైన గజములతో గూడిన గుంపుచే సేవింపబడినది శ్రీ లలితాదేవి యని యర్థము.
గజముల గుంపులను తన వశమున వుంచుకొను దేవతను సంపత్కరీ అందురు. సంపత్కరీదేవి ఊహకందని వైభవము కలది. ఆమె అనుగ్రహించినచో సృష్టియందలి సమస్త వైచవము జీవునికి దక్కును. ఆమె సృష్టి వైభవమున కధిపతి. ఆమెవద్ద గుంపులు గుంపులుగ ఏనుగుల సమూహములు ఏడు సముద్రములందు గలవు. అనగా ఏడు లోకముల అంతరములందు గలవు. వాటినుండే ఏడు లోకముల వైభవములు ఏర్పడును. వాటి అన్నిటికిని సంపత్కరీ దేవి అధిపతి.
గజములు వైదిక సంకేతములు. తుష్టి, పుష్టి కలిగించు తత్త్వము గలవి గజములు. సిద్ధిని, బుద్ధిని గూడ ప్రసాదింపగలవు. మానవ శరీరము నందు అవి చిత్తవృత్తులుగ పనిచేయును. చిత్తవృత్తుల బలమును గజబలముగ ఋషులు గుర్తించిరి. ఎంతటి బలవంతుడైనను మాయ వలన చిత్తవృత్తులకు లోబడక తప్పదు.
చిత్తవృత్తులు యోగులకు అంతర్ముఖములు, ఇతరులకు బహిర్ముఖములు. అవి బీజప్రాయములై జన్మల తరబడి స్వభావ రూపమున వెంట వచ్చుచుండును. ఇవియే వాసనలు. ఇవి దగ్ధమైననాడే, యోగులకైనను సమాధి స్థితి కలుగును.
“బలాదాకృష్య మోహాయ మహామాయా” అని దుర్గా సప్తశ్లోకి తెలుపుచున్నది. జ్ఞానులైనను, చైతన్యవంతులైనను సంపత్కరి అనుగ్రహ ములేక సృష్టి వైభవమును దాటి తత్త్వమును బడయలేరు. అమ్మ గజసమూహముల బలమట్టిది. ఈ గజ సమూహము లన్నింటిని అధిష్ఠించిన, తన అంశయే సంపత్కరీ. అట్టి సంపత్కరీదేవి గజ సమూహముల నధిష్ఠించి అమ్మ నారాధించుచున్నది.
సంపత్కరీదేవి సృష్టియందు సమస్తము నిచ్చును. జ్ఞానమును కూడ నిచ్చును. కాని పరతత్త్వమును చేరుటకు ముందుగా ఆమె అనుగ్రహించవలెను. పరతత్త్వము లలితాదేవిగను, యిహతత్త్వము సంపత్కరీ దేవిగను, స్వభావములు (చిత్తవృత్తులు) గజ సమూహములుగను తెలియవలెను. వైభవములు కోరువారు సంపత్కరీదేవిని, పరతత్త్వములేక మోక్షము కోరువారు లలితాదేవిని ఉపాసించ తగునని తంత్రార్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 66 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
Sampatkarī-samārūḍha-sindhura-vraja-sevitā सम्पत्करी-समारूढ-सिन्धुर-व्रज-सेविता (66)
She is worshipped by herds of elephants headed by Sampatkarī. Sampatkarī Devi has already been discussed in nāma 9. There is also a mention about Sampatkarī Vidyā, which is considered as very powerful. There is a three syllable bījākśarā hidden in this nāma that is used in sampatkarī vidyā.
Though this bījākśarā is considered very secretive in nature, this has been already discussed in nāma 9. The bījā kroṁ (क्रों) is formed out of three alphabets –ka + ra + ma with a bindu. The alphabet ka stands for joy and fame. The alphabet ra is considered as powerful as it is the bīja of agni, the fire. Any mantra with ra bestows supernatural powers.
The alphabet ma stands for comforts in the present and future births. The repeated chanting of kroṁ will give all-round prosperity and happiness. No mantra will fructify without ātma bīja, which should be initiated by one’s Guru.
The knowledge, the knower and the known together are called a triad. The knowledge of realising that all the three are the same is called sukha-sampatkar. Śiva Sūtra (I.19) says śaktisandhāne śarīropattiḥ.
This means ‘single pointed union (union with intensity and constant awareness) with Śaktī. {śaktisandhānā means that one need not pray to Śiva asking for favours. If one is able to energise his thoughts, what is sought for is achieved. Sandhānā is one of the essential factors of spirituality.
Conglutination of fixedness and intensity of awareness are the primary factors in spiritual progression. Without developing the abilities of sandhānā, it is said that initiation into mantra will not fructify and consequently mantra’s contrivance will never be attained.}
If Lalitai is meditated upon with the bīja kroṁ the meditator will be endowed with everything that is desired. This could also be interpreted as advancement to the higher level of spiritual realization.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 67 / Sri Lalitha Chaitanya Vijnanam - 67 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ‖ 25 ‖
67. 'అశ్వారూఢాధిష్ఠి తాశ్వకోటి కోటిభిరావృతా'
స్వాధీనము చేసుకొనబడిన కోటానుకోట్ల అశ్వములతో శ్రీదేవి
కూడియున్నదని భావము.
ముందు నామమున గజారూఢగా శ్రీదేవి తెలుపబడినది. నామమున అశ్వారూఢగ తెలుపబడినది. ముందు నామమున చిత్తవృత్తులను గజములను స్వాధీనమున నుంచుకొన్న సంపత్కరీ దేవిగ శ్రీదేవి వర్ణింపబడినది. ఇచ్చట ఇంద్రియము లను అశ్వములను తన స్వాధీనమున నుంచుకొని సృష్టిజీవులను నడిపించు చున్నట్లుగ శ్రీదేవి వర్ణింప బడినది. చిత్తవృత్తులు అంతఃకరణము నందుగల చిత్తము యొక్క రీతులు. అవి జన్మాంతర సంస్కారములు. అవి అత్యంత బలమైనవి.
ఇంద్రియములు బహిఃకరణమై చిత్తవృత్తిని ప్రేరణ చేయగ ప్రవర్తించును. చిత్తము వాసనలను వెదకికొనుచుండగ, ఇంద్రియములు వాటికి తోడై, వాసనా స్థానములను సృష్టియందెక్కడ యున్నవో గమనించి చిత్తమున కందించును. చిత్తము ప్రేరణ చెంది యింద్రియముల ద్వారా వాసనలను అనుభూతి చెందును. అనుభూతి చెందిన వాసన బలమై మరల చిత్తమున ప్రేరణ కలిగించును. మరల యింద్రియము లదేపని చేయును.
ఇది యొక విష వలయము. వాసన, చిత్తప్రేరణ, యింద్రియముల
సహాయము, యింద్రియార్థముల గుర్తింపు, యింద్రియములు చిత్తమున కవి తెలుపుట, చిత్తము యింద్రియములతో, యింద్రియార్థములను శరీరము పాధిగ అనుభవించుట, అనుభవమును వాసనగ మరింత స్థిరపరచుట. ఈ విష వలయమునందు జీవుడు చిక్కుకొని వాసన లాధారముగ తీరుబడిలేక జన్మ లెత్తుచుండును.
వాసనలు (శుభ, అశుభ)
1. చిత్తము, ఇంద్రియములు శరీరముతో అనుభవించుట
2. చిత్త ప్రేరణ చిత్తమునకు ఇంద్రియములకు సమాచార మందించుట సూచన .
3. ఇంద్రియములు ఇంద్రియార్థములకై శరీరముతో తిరుగుట. ఉదాహరణకు వాసనలయందు దొంగతన మున్నదను కొనుము. ఆ వాసన చిత్తమును ప్రేరేపింపగ చిత్తమెట్లు దొంగతనము చేయవలెనో ఆలోచించును. ఇంద్రియములు దొంగతనము చేయదగు వస్తువులను, ప్రదేశములను చూపి చిత్తమునకు తెలుపును. చిత్తు యింద్రియములను, శరీరమును ఉపయోగించి నేర్పుతో దొంగతనము చేయును.
ఇట్లు దొంగబుద్ధి, రంకుబుద్ధి, మానవుని యుగముల నుండి బంధించివేసినది. ఇవికాక చిల్లరమల్లరగ మానవుని చిత్తము అతివాగుడు, రుచికై మిక్కుటముగ భుజించుట, విచక్షణ లేకయే చూచుట, వినుట, ముట్టుకొనుట సాగుచునే యుండును. మానవుని బలవంతముగ యింద్రియార్థముల వైపుకు యింద్రియములు లాగును.
విచక్షణ వద్దని తెలుపుచున్ననూ, కూడని పనులు తన నుండి జరుగుచునే యుండును. కోటానుకోట్లుగ యింద్రియార్థములను లక్షల జన్మల నుండి పొందుచున్నను, తృప్తి చెందక, మరల నవే కోరుట యింద్రియము లనెడి అశ్వముల బలము.
గజబలము, అశ్వబలము జీవుని బలవంతముగ సృష్టిలోనికి లాగివేయుట 66, 67 నామములలో గమనించదగును. ఇది అంతయు అమ్మ మాయా స్వరూపము. ఈ వ్యాపార మంతయును అధిష్ఠించి అమ్మ యున్నది. ఆమె అనుగ్రహమే ఈ మాయా బంధనమునకు పరిష్కారము. అందుచేత అశ్వారూఢ అయిన మాతగ, కోటానుకోట్ల అశ్వములచే చుట్టబడిన మాతగ అమ్మ నారాధించుట ఈ శ్లోకమున అందించిన సాధనా స్వరూపము.
అశ్వారూఢయైన శ్రీదేవి అధిరోహించి తిరుగు అశ్వము పేరు 'అపరాజిత'. అది మిక్కిలి వేగముగల గుఱ్ఱము. వాయువు కన్నను వేగము కలది. మనోవేగము దాని వేగమని తెలియవలెను. దాని వెనుక మిగిలిన కోటానుకోట్ల అశ్వములు వాయు వేగమున బయలు దేరును. 'అపరాజిత' యను ఈ అశ్వము పగ్గములు అమ్మ చేతి యందే యున్నవి. చిత్తమును వశము చేసుకొనుటకు అహంకార పూరితుడైన మానవుడు రకరకముల ప్రయత్నములు చేయును. చిత్తవృత్తి నిరోధనమే యోగ విద్య ఆశయమని తెలుపబడినది. అట్టి యోగవిద్య ఫలింపవలె నన్నచో, అమ్మ ఆశీర్వచనము తప్పనిసరి. అమ్మ అనుగ్రహముతో చిత్తవృత్తి నిరోధమే కాక సమాధిస్థితిని కూడ పొందిన యోగు లనేకులు కలరు. ఇది పాశ్చాత్యులకు ఆధునిక యుగమున అవగాహన కాని విషయము. వారి సంప్రదాయమున స్త్రీ విలాసమున కుపాధియే గాని, మోక్షమున కుపాయమని తెలియదు.
చిత్తము యొక్క గజశక్తి సంపత్కరి కాగ దాని కనురూపమగు యింద్రియ శక్తి అశ్వారూఢ అయినది. అశ్వారూఢను గజారూఢను జయించగల శక్తి అమ్మ ఇచ్ఛాశక్తియే. అమ్మ ఇచ్ఛాశక్తియే ఉమగ జనించినది. '
ఉమా కుమారి' ఆమె పూర్తిపేరు. ఇంద్రియ వృత్తులను, చిత్తవృత్తులను జయించి శివుని పొందుటకు ఆమె తపస్సుచేయ సంకల్పింపగ తల్లి భయపడి "వద్దు, వద్దు” అనెను. “నీవాపని చేయ లేవు” అనెను. ఉమాకుమారి లేక పార్వతి తపస్సుచే శివుని చేరినది.
కాన ఆమె భోగ్యురాలు కాదు. కావుననే శివుడామెతో వశించు చున్నప్పటికిని వారి నడుమ భోగము లేదు. కుమార సంభవమునకై దేవతలు వేడినప్పుడు శివుడు అగ్ని స్వరూపమైన తన వీర్యమును అగ్నిదేవునికి అందించెనే కాని పార్వతీదేవి ద్వా రా కాదు.
గణపతి అయినను, కుమారుడైనను అమ్మ సంకల్పము నుండి పుట్టిరేగాని శరీరము నుండి కాదు. అశ్వము (ఇంద్రియములు) ల కధిపతిగ కుమారుడును, గజములకు (చిత్తవృత్తులు) అధిపతిగ గణపతిని, ఇచ్ఛాశక్తి కధిపతిగ పార్వతీదేవిని, ఆత్మజ్ఞానమున కధిపతిగ శివుని తెలియనగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 67 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
Āśvārūḍhā-dhiṣṭhitāśva-koṭikoṭibhi-rāvṛtā आश्वारूढा-धिष्ठिताश्व-कोटिकोटिभि-रावृता (67)
Lalitai is surrounded my many horses headed by Aśvārūḍhā Devi, about whom we have discussed in nāma 8. Aśvārūḍhā Devi is the chief of the horses used in the war. The face of this Devi also looks like a horse.
Aśvārūḍhā’s mantra consists of thirteen bīja-s and considered to be very powerful. Out of the thirteen bījākṣara-s, four are recited in the regular order at the beginning and in the inverted order at the end. This is called mantra sampuṭa. Sampuṭa means caged. Such types of mantra-s fructify quickly.
Senses are compared to horses as they run faster and without control, if let loose. Mind is the jockey of the horse as mind alone can control the senses. Śiva Sūtra (I.12) says, ‘vismayo yogabhūmikāḥ’. The meaning is slightly complicated but one certainly needs to understand this. The literal meaning is ‘the stations and stages of yoga constitute, fascinating wonder’.
Stations mean cakra-s. In these stations consciousness arrives and moves to the next station or higher cakra-s. The consciousness above sahasrārā or the consciousness outside the physical body of the yogi is called turya stage.
In this stage yogi’s senses are totally under the control of his inner self which is also called supreme consciousness. In this stage the yogi realises the bliss. In other words realising our own inner self is the ultimate joy that leads to bliss. Station could also mean a well activated ājña cakra, where one could control his senses. Stages mean the level of consciousness.
The highest stage of consciousness is called turya stage. The will power with which a yogi establishes his commune with Śiva is called Umā or Kumārī. A yogi treats everything as the same. He does not distinguish between external and internal, I and his, good and bad, etc.
This explanation is not out of place here as this nāma talks about controlling senses that wander like horses. There are plenty of spiritual rewards for controlling the senses. Śaktī alone is capable of taking one to Śiva, the Supreme Brahman.
Śaktī is māyā. Unless māyā is dispensed with, the Supreme Self cannot be realised. The will power for establishing commune with Śiva is provided only by Śaktī who is called Umā in Śiva sūtra-s.
Therefore, Lalitai manifested in different forms and names is the cause for sense-impressions and She alone can remove those impressions, to proceed to higher planes of consciousness and to establish commune with Śiva. Once Śiva is realized, one eternally remains in bliss.
Katha Upaniṣhad says senses are horses and the body is the chariot. Objects are the road and Self is the enjoyer (owner of the chariot and horses).
Knowledge is incapable of discriminating between good and bad and when connected with uncontrollable mind, then it is like a charioteer or the driver who has to deal with the uncontrollable horses (mind out of control causing all types of miseries). Such explanations are found in Devi Māhātmya (Durgā saptasatī) and Bhagavad Gīta as well.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
02 Nov 2020
No comments:
Post a Comment