శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 95 / Sri Gajanan Maharaj Life History - 95


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 95 / Sri Gajanan Maharaj Life History - 95 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 19వ అధ్యాయము - 3 🌻

భోజనం అయిన తరువాత, శ్రీమహారాజు వెనుతిరగడానికి తయారు అవుతుండగా, అనేక మంది ఆయన దర్శనానికి వచ్చారు. గోపాల్ బుటే భార్య అయిన సౌభాగ్యవతి. జనక్ బాయి చాలా పవిత్రమైన స్త్రీ . అతని ఇంటి లక్ష్మి. ఆమె శ్రీమహారాజు పాదాలనుచూస్తూ, తనకోరిక పూర్తికాలేదు అంది.

శ్రీమహారాజు అర్ధంచేసుకుని, ఆమె నుదిటిమీద కుంకుమ అద్ది, నీకు మరొక కొడుకు పుడతాడు, అతను అత్యంత ప్రయోజకుడుగా నిరూపించుకుంటాడు. చివరికి నువ్వు ఈజన్మలోనే నీభర్త సన్నిధిలో మోక్షం పొందుతావు అని అన్నారు. ఆవిధంగా ఆమెను ఆశీర్వదిస్తూ, శ్రీమహారాజు సితాబుల్ది వదలి రఘుజీరాజ్ భవనానికి వెళ్ళారు.

రఘుజి చాలా ఉదారుడు, సజ్జనుడు, పవిత్రమయిన వాడు మరియు శ్రీరాముని భక్తుడు. ఈ అనిశ్చితమైన ప్రపంచకంలో తన రాజ్యం అయితే అతను పోగొట్టుకున్నాడు కానీ శ్రీమహారాజు రూపంలో దైవలోకం వంటి రాజ్యం సంపాదించాడు. అతను అత్యంత భక్తితో శ్రీమహారాజును పూజించాడు, తరువాత శ్రీమహారాజు రామటెక్ వెళ్ళి శ్రీరాముని దర్శనం చేసుకుని హరిపాటిల్తో కలసి షేగాం తిరిగి వచ్చారు.

ధర్ కళ్యాణ్ కు చెందిన గొప్ప యోగి శ్రీరంగనాధ్ ఒకసారి శ్రీమహారాజును కలిసేందుకు షేగాం వచ్చారు, వాళ్ళు ఇద్దరూ ఆధ్యాత్మ మీద తమతమ అభిప్రాయాలను ఒకరికొకరు మిగిలిన వాళ్ళు అర్ధం చేసుకోలేని విధంగా తెలుపుకున్నారు. మార్గాంలో పుట్టి కృష్ణానది ఒడ్డున నివసిస్తూ కర్మమార్గం అనుసరించేవారు శ్రీవాసుదేవానంద సరస్వతి.

ఈయన ఒకసారి షేగాం రావలసి ఉండగా ఓబాలా నాసోదరుడు ఒకరు రేపు నన్ను కలిసేందుకు వస్తున్నాడు. ఆయన సరిగా గౌరవించబడేట్టు చూడు. అతనుచాలా నిష్టాపరుడు, కాబట్టి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచి, ఒక్క గుడ్డముక్కకూడా ఎక్కడా లేకుండా ఉండేట్టుచూడు. అలాంటిది ఏదయినా అతనుచూస్తే చాలా చిరాకుపడి, జమదగ్నిలా కోపగించుకుంటాడు. ఆ కరపొడ బ్రాహ్మణుడు ఎప్పుడూ శుభ్రంగా ఉండే గొప్పవిద్వానుడు. ఎట్టి పరిస్థితులలోనూ క్రమంగా దైవకృత్యాలు చెయ్యడం విషయంలో రాజీపడడు అని శ్రీమహారాజు బాలాభవోతో అన్నారు. ఈవిధంగా శ్రీమహారాజు, బాలాభవ్తో ఆయన వచ్చే ముందురోజు అన్నారు.

మరుసటిరోజు ఉదయం స్వామీజీ షేగాం వచ్చారు. వాళ్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇద్దరూ అమిత ఆనందం పొందినట్టుగా కనిపించారు. ఒకళ్ళు తియ్యటి మల్లె వాసన అయితే, ఇంకొకళ్ళు గులాబీ, ఒకళ్ళు గంగ, ఇంకొకరు గోదావరి, ఒకళ్ళు పశుపతి స్వరూపం మరియొకరు శైషశయ్యపైన శయనించిన నారాయణుడు.

స్వామీజీ మఠానికి వచ్చినప్పుడు, శ్రీగజానన్ మహారాజు తన మంచంమీద కూర్చుని వేళ్ళతో వాయిస్తున్నారు. స్వామీజీ చేరగానే ఆవాయించడం మాని, వాళ్ళ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి, స్వామీజీ వెళ్ళడానికి అనుమతి అడిగారు, శ్రీమహారాజు చాలామంచిది అని అంగీకరిస్తున్నట్టు తలఊపారు. స్వామీజీ వెళ్ళిపోయారు. కానీ బాలాభన్ కలవరపడి, తనసందేహం తొలగించవలసిందిగా శ్రీమహారాజును అర్ధించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 95 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 19 - part 3 🌻

After the meals, while preparations were being made for the departure of Shri Gajanan Maharaj , a lot of people came to take His Darshan. Janakabai, wife of Gopal Buty was a very pious lady and the Lakshmi of Buty’s house.

She fell at the feet of Shri Gajanan Maharaj and said that her wish had not been fulfilled. Shri Gajanan Maharaj understood and applying Kunku on her forehead said, You will get one more son who will prove to be the most virtuous, and in the end you will attain Moksha in the life time of your husband. Then Shri Gajanan Maharaj left Sitaburdi and went to the palace of Raghuji Raje.

Raghuji was a liberal, noble and pious person and a devotee of Shri Ram. He lost his kingdom in this transient material world, but in Shri Gajanan Maharaj , got the kingdom of eternal nature. He most devotedly worshipped Shri Gajanan Maharaj , who then went to Ramtek and after taking the Darshan of Shri Ram returned to Shegaon along with Hari Patil.

Once Shri Ranganath, the great saint of Dhar Kalyan, came to meet Shri Gajanan Maharaj at Shegaon. They exchanged their views on Adhyatma in their own way, beyond the understanding of others. Shri Vasudevanand Saraswati, born at Mundgaon, and living on the bank of Krishna, was a believer in the ritualistic worship (Karma Marga).

When he was to come to Shegaon, Shri Gajanan Maharaj said to Balabhau, O Bala, one of my brothers is coming tomorrow to meet me. See that he is properly respected. He is most orthodox, so keep the surrounding clean and see that there should not be even a piece of cloth lying anywhere. If he sees any dirt, he will be annoyed, and angry like Jamdagni. These Karhade Brahmin, always clean, are amongst the most learned people and will never compromise on the discipline of religious rites.

This is what Shri Gajanan Maharaj said to Balabhau a day prior to Shri Vasudevanand Saraswati’s visit to Shegaon. The next morning the Swamiji arrived at Shegaon. Shri Gajanan Maharaj and Swamiji looked at each other and smiled. Both appeared immensely happy.

One was a believer in Karma, while other the king of Yoga; One was the sweet fragrance of Mogra and the other that of Rose; One was the Ganga and other the other Godavari; One was the incarnation of Pashupati and the other Narayan resting on the bed of Cobra (Shesha). When Swamiji came to the Math, Shri Gajanan Maharaj was sitting on his cot and clapping his fingers. When Shri Swamiji arrived, the clapping stopped, the eyes met each other, and Swamiji sought permission, to go.

Shri Gajanan Maharaj said Very good and bent His head in consent. The Swamiji went away. Looking at this Balabhau got confused and requested Shri Gajanan Maharaj to remove his doubts. Bala said, “Both of You have got different spiritual ways, then how do You call him Your brother? Please enlighten me.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


02 Nov 2020

No comments:

Post a Comment