భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 89


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 89 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 11 🌻

381. మూడవ భూమిక:-

దివ్య ప్రియతుముని గురించి అమరగాయము చేయు గాయకుల దివ్యగానము వినిపించును.

382. దివ్యనాదము అన్ని భుమికలలొ వినిపించుచునన్నను, ప్రత్యేకించి రెండు, మూడు భూమికలు దివ్యపరిమళములను గుబాళించును.

383. సూక్ష్మ చైతన్యముగల మానవాత్మ ఇచట సూక్ష్మలోకము యొక్క అనంత ప్రాణశక్తియందు మరింత స్పృహకలిగి యుండును.

గొప్ప శక్తులను ప్రదర్శించును. అంధులకు దృష్టి నిచ్చును. వికలాంగులకు అవయవముల నొసంగును. కొన్ని సమయములందు చనిపోయిన వారిని బ్రతికించును.

స్థూలదేహ చైతన్యముగల సామాన్యుడు తన స్థూలదేహముతో ఖండాంతరములకు ప్రయాణము చేయగలిగినట్లు, ఇతడు సూక్ష్మప్రపంచము యొక్క, వేర్వేరు భూమికలయొక్క వేర్వేరు లోకములయొక్క అనుభవమును కలిగియుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


02 Nov 2020

No comments:

Post a Comment