శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 96, 97 / Sri Lalitha Chaitanya Vijnanam - 96, 97

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 53 / Sri Lalitha Sahasra Nama Stotram - 53 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 96, 97 / Sri Lalitha Chaitanya Vijnanam - 96, 97 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |

అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖


🌻 96. 'అకులా' 🌻

సుషుమ్న నాళమునకు పైన వికసించి విరాజిల్లుచున్న సహస్రార పద్మము నందు జ్ఞానరూపిణియై వసించియుండు దేవి అని అర్థము.

సహస్రార పద్మము 'అకుళమని చెప్పబడుచున్నది. కుళము పద్మము యొక్క నాళముగా తెలియవలెను. సుషుమ్న నాళము క్రిందనున్న సహస్రదళ పద్మము కుళస్థానము. దానిని రత్న సహస్రదళ పద్మమని అందురు. దానియందు వసించునది కుళదేవి. దాని దళములందు కుళ శక్తులుండును. అచట నుండి సహస్రారము చేరిన (సుషుమ్న నాళము ద్వారా) సహస్రమణి, రత్నకాంతులతో తేజరిల్లు జ్ఞాన స్వరూపిణిని అకుళాదేవి అందురు.

మొత్తము మార్గము కుళాకుళము. అనగా శివశక్తి వ్యక్తమగునప్పుడు కుళనాళమున ప్రవేసించును. సప్తలోకములను సృష్టించును. మరల అవ్యక్తరూపిణియై అకుళాదేవిగ శివునితో కలిసియుండును. అకుళస్థితి అవ్యక్త స్థితి కావున దేహముండదు. రూప ముండదు. లక్షణము లుండవు. కేవలము తత్త్వముగనే యుండును. ఇది సమాధి స్థితి. ఈ స్థితిని శ్రీ విద్యోపాసన ద్వారా చేరుట లక్ష్యము. అకుళయే లక్ష్యము.

కుళము మార్గము. గనుక సమయాంతస్థా అని దేవి కొలువ బడుచున్నది. శివశక్తుల సామ్యము, ప్రకృతి పురుషుల సామ్యము మార్గమున సర్వత్ర పొందుచు నుండవలెను. వారి మధ్య అధిక్యత లేదు. సాధకులు కూడ ప్రకృతి పురుషుల సామ్యమునే భావింపవలెను కాని, ప్రకృతిని గర్వించుట చేయరాదు.

శివశక్తుల ఆరాధనము సమముగ సాగుటయే సమయమార్గము. వారి సామ్యముననే జీవుడు పురోగతి చెందగలడు. ఏ ఆరాధనమున నైనను ఇరువురిని సమముగ పూజింపవలెను.

పూజాదుల యందేగాక సృష్టియందు కూడ ప్రకృతి పురుషులను సమానముగ దర్శించుటకు ప్రయత్నింప వలెను. రూపమున, నామమున, క్రియల యందు, శివశక్తుల ప్రమేయమును గమనించుట సమయ పథము. రాజయోగము సమయ మార్గమున రాజు వంటిది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 96 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Akulā अकुला (96) 🌻

She does not have genealogy, hence akula. She was created by Śiva and hence no parentage. Akula also means beyond kula, the six cakra-s. Akula is beyond the six cakra-s, which means, beyond sahasrāra.

Sahasrāra is not considered as a cakra. It is said that suṣumna has two lotuses at both the ends, one at top in the crown which has thousand petals and is called akula sahasrāra. Since She resides here, She is called akula.

The other one is at the bottom and has two petals and this is called kula sahasrāra. Kula sahasrāra does not mean the mūlādhāra cakra that has four petals.

From nāma 90 to 96 it can be observed that how a single word kula has been used in seven contexts. The beauty of this is, nāma 90 starts by saying that She likes the taste of the ambrosia and nāma 96 ends by saying that she is beyond kula.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 97 / Sri Lalitha Chaitanya Vijnanam - 97 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము "

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |

అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖


🌻 97. 'సమయాంతస్థా' 🌻

సమయ మార్గములో అంతరంగమందు పూజింపబడు దేవియని అర్థము.

సమయమార్గ మనగా హృదయకాశ మనియు, కౌళమార్గ మనగా బాహ్యాకాశ మనియు కొందరి మతము. అట్లే కౌళమార్గము అవైదికమనియు, సమయమార్గము వైదిక మనియు కూడ భావము. తంత్రాది మార్గములకన్న సామ్యమార్గము ఉచితమని ఋషుల సిద్ధాంతము. సర్వ విషయములందు సామ్యమును పొందునది సమయము. సమయ మార్గమున ప్రకృతి పురుషుల సామ్యము ననుసరింతురు.

యోగులందరును ఈ మార్గముననే నడతురు. సనక సనందనాది కుమారులు, వశిష్టాది ఋషులు, శుకాదియోగులు యోగ మార్గమును ప్రకృతి పురుష సామ్యమార్గముగ బోధించినారు. సమయ మార్గము సాత్త్విక మార్గము. తంత్రమార్గమున రజస్సు, తమస్సు జీవుని వశము చేసుకొను అవకాశమున్నది. ఆ మార్గమున అపాయములు మెండు.

హృదయమందు దైవమును సంకేతపరముగ భావించి ఊహించుట లేక శ్రీచక్రము హృదయాకాశమున నూహించి పూజించుట సమయ మార్గము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 97 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Samayāntasthā समयान्तस्था (97) 🌻

She is centre of samayā doctrine. Samayā means internal or mental worship, while kula means external worship. Mental worship is more powerful than external rituals.

The internal worship has been emphasized by five great sages - Vāsiṣṭhta, Śuka, Sanaka, Sanāndana and Sanathkumāra. They have prescribed procedures for internal worship and their writings are called tantra-pañcaka meaning five tantra-s. This nāma underlines the equality between Śiva and Śaktī. This equality is classified under five heads. Śiva is called Samayaḥ and Śaktī is called Samayā as per Sanskrit grammar. The five fold equalities are:

1. In terms of equality of place of worship such as worshipping both of them in Śrī Cakra or in Liṅga form. In the bindu, the centre point of Śrī Cakra, both of them are worshipped. In psychic cakra-s of kuṇḍalinī also, they are worshiped – Śaktī uniting with Śiva at sahasrāra. Śrī Cakra worship is mostly external and kuṇḍalinī worship is always internal.

2. In terms of functions such as creation, sustenance and dissolution. Since there is equality between the two, their functions remain the same. They are called father and mother of the universe. They cannot be separated under any circumstances.

3. In terms of actions such as dancing. The significance of dancing by them will be dealt with in later nāma-s. When a woman dances, it is called nāṭyā and when a man dances it is called tāṇḍavā. Śiva tāṇḍavā is well known.

4. In terms of names such as Bhairava and Bhairavī; Parameśvara and Parameśvarī; Rājarājeśvara and Rājarājeśvarī; Śiva and Śiva (Lalitai is called as Śivā in nāma 53); Kāmeśvara and Kāmeśvarī etc. (When one says Śiva Śivā it does not mean Śiva alone. The second Śiva is pronounced as Śivā with an extra a (a + a = ā). Śiva the Supreme means fortunate, happiness, welfare, liberation, final emancipation, auspicious. Śivā means the energy of Śiva personified as His consort. Therefore when one says Śiva Śivā it means both Śiva and Śaktī. She alone holds independent Power of Autonomy (svātanraya śakti) and He has given a Power of Attorney to Śaktī permitting His Power of Autonomy to be used by Her.

5. In terms of forms such as their complexion, their weaponries, etc. In terms of complexion both appear as red. Lalitai is red in complexion. Śiva is pure white like a spatika (crystal).

The specialty of spatika is that it gets reflected with the colour of the properties nearby. When Lalitai sits by the side of Śiva or on the lap of Śiva, His translucent crystal complexion also appears as red. The gods and goddesses who witness this glorious scene compare this to the rising sun.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


19 Nov 2020

No comments:

Post a Comment