గీతోపనిషత్తు - 79


🌹. గీతోపనిషత్తు - 79 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 17. నిత్య తృప్తి - తృప్తి యున్నచోట ఎవరిని, దేనిని ఆశించుట యుండదు. కర్తవ్యము మేర జీవించుట యుండును. ఆశ్రయించుట యుండును. కేవలము తృప్తితో నిర్వర్తించు కర్తవ్యమే తృప్తి నిచ్చును. ఇందు మూడంశములు ముఖ్యము. 1. నిత్యతృప్తి, 2. నిరాశ్రయత, 3. కర్మఫల సంగత్యాగము. 🍀

📚. 4. జ్ఞానయోగము - 20
📚

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృవ్ర నిరాశ్రయః |

కర్మణ్యభిప్రవృత్తో నైవ కించి త్కరోతి సః || 20

కర్మలయందు ప్రవర్తించుచు, అవి చేయని వానివలె నుండు రహస్యము దైవ మీ శ్లోకమున బోధించు చున్నాడు. కోరిక కర్మఫలాసక్తిని కలిగించును. దానివలన మరల సంకల్పములు పుట్టును. ఈ చక్రమునుండి బయట పడుటకు ముందు శ్లోకమున కర్తవ్యకర్మ ఎట్లు నిర్వర్తించుకొనవలెనో చెప్ప బడినది.

ఈ శ్లోకమున తృప్తియను మరియొక గుణమును ఉపాసించ వలసినదిగా దైవము తెలుపుచున్నాడు.

తృప్తి యున్నచోట ఎవరిని, దేనిని ఆశించుట యుండదు. కర్తవ్యము మేర జీవించుట యుండును. దేనిని ఆశించనపుడు, ఎవరినీ ఆశ్రయింప పనిలేదు. తృప్తి కారణముగా ఆశించుట యుండదు. దాని కారణముగా ఆశ్రయించుట యుండును. కేవలము తృప్తితో నిర్వర్తించు కర్తవ్యమే తృప్తి నిచ్చును.

ఇట్టివాడు చేయు పనివలన కలుగు ఫలములయందు కూడ సంగము విడచినచో చేయకముందెట్లుండెనో, చేయుచున్నప్పుడు కూడ అట్లే యుండును. అట్టి వానిని కర్మఫలములు అంటవు. ఆగామి కర్మలు పుట్టవు. సంచిత, ప్రారబ్దములు క్రమముగా నశించును. ఇందు మూడంశములు ముఖ్యము.

1. నిత్యతృప్తి, 2. నిరాశ్రయత, 3. కర్మఫల సంగత్యాగము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


19 Nov 2020

No comments:

Post a Comment