🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జాబాలిమహర్షి - 4 🌻
20. గోసేవ వలన ఎంత పాపం చేసిన వాడికయినా, ఎంత పుణ్యం లేని వాడికయినా కూడా సత్సంతానం కలుగుతుంది. ఎందుకంటే గోవు శరీరంలో దేవతలుంటారు. ప్రతిదినము గోవుకు గడ్డిపెట్టి దానికి సేవ చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. సంతానాన్ని ఇస్తారు.
21. “ఋతుమతి అయిన కుమార్తె అవివాహితగా ఉండటము, పశువుల కొట్టంలో ఆవు ఆకలితో ఉండటము, నిర్మాల్యం తీయనటువంటి దేవతార్చ్నము – ఈ మూడు కార్యాలూ పుణ్యమ్నశించడానికి హేతువులు. కాబట్టి శుభ్రం చేసి దేవతార్చన చేయాలి.
22. గోవుల ఆకలి తీర్చటము, దేవతార్చన చేయటము ఒకటే నన్నమాట. గడ్డితినే ఆవుకు అడ్డంవచ్చి ఈ గడ్డి నాది అని దెబ్బలాడతాడు ఒకడు. తన పెరట్లో గడ్డి తింటుంటే ఆవును కొట్టాడంటే, ఆ గడ్డి తనదేనని అన్నట్లే కదా! అంటే అది తాను తినాలి వెంటనే! ఎంత తప్పు అది! కాబట్టి అది మహా పాపం అని చెప్పాడాయన. “గడ్డితినే ఆవును అడ్డగించినవాడు పితృదేవతలను బాధించినట్లే. ఆవును కాళ్ళతో తన్నరాదు. ఆటివాడు యమలోకానికి వెళతాడు” అని చెప్పాడు జాబాలిమహర్షి.
23. భారతదేశంలో ధర్మం పూర్తిగా నాశనం అయిపోయిపోతోంది. గోవధ, పశువధ, భయంకరమయిన జీవహింస జరుగుతున్నటువంటి నేటి భారతదేసంలో భారతీయులు ఇంకా కొంతైనా సుఖంగా ఉన్నారంటే, మహర్షులు ఎప్పుడో చేసినటువంటి పుణ్యమే కారణం తప్ప మరేమీకాదు. లేకపోతే ఈ పాపానికి అన్నవస్త్రాదులకు కూడా మనం అర్హులం కాదు.
24. ఈ దేశంలో ఇప్పుడు మనను నరకానికి పంపగలిగినంతటి మహాశక్తివంతమయిన పాపం జరుగుతున్నది. కాని ఇంత క్షేమంగా ఉండటానికిమాత్రం మహర్షుల ఆశీర్వచనము, దయ మాత్రమే కారణము. మన తండ్రుల దయ మనమీద ఉందికాబట్టే బాహా ఉన్నాం ఇంకా! భారతదేశంలో నేడు జరుగుతున్న హింస అపారంగా ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Nov 2020
No comments:
Post a Comment