✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 8 🌻
మహాపురుషుడు (వలీ 5 భూమిక) సత్పురుషుడు (పీర్ 6 భూమిక) వాస్తవముగా చమత్కారములు చేయరు. ఒకవేళ చమత్కారములు చేసినట్లు కనిపించినచూ, ఆధ్తాత్మిక, ఆధిభౌతిక ప్రయూజనములను ఆశించువారి ఆలోచనలపై, అనుభూతులపై గల మానసిక ప్రభావముపై ఆధారపడి యుండి అట్లు కాన్పించును.
432. ఆరవ భూమిక :-
(అంతఃకరణము లేక హృదయము) మానసిక చైతన్యము కలవాడై మానవులలో నున్న భగవంతుడు క్రమక్రమంగా అంతకంతకూ అంతర్ముఖుడై మనస్సుకు అధికారి యగును. అప్పుడతను మనస్సుయొక్క మూర్తిమత్వము, మనఃస్వరూపుడు పూర్తిగా మానసిక శరీరమునందు స్పృహ కలవాడై యావత్తు మనోమయ ప్రపంచానుభవములను పొందును.
ఇచ్చట భగవంతుని ఆదిమూలస్థితి ముఖాముఖీ కన్నులారా చూడగల్గును. అనగా భాగద్దర్శనము ప్రాప్తించును (బ్రహ్మ సాక్షాత్కారము) ప్రాప్తించును.
Notes:-సాక్షాత్కారము అక్షము = కన్ను సః+అక్షము = సాక్షాము, కన్నుటూ కూడినట్లు. సాక్షం కరూతీతి సాక్షాత్కారః = కంటికి ప్రత్యక్షమగునది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Nov 2020
No comments:
Post a Comment