1-January-2021 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 596 / Bhagavad-Gita - 596🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 202, 203 / Vishnu Sahasranama Contemplation - 202, 203🌹
3) 🌹 Daily Wisdom - 15🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 149🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 23 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 170 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 94🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 166 / Sri Lalita Chaitanya Vijnanam - 166🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 507 / Bhagavad-Gita - 507🌹

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 112🌹 
11) 🌹. శివ మహా పురాణము - 312🌹 
12) 🌹 Light On The Path - 65🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 197 🌹 
14) 🌹 Seeds Of Consciousness - 261🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 136🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasranama - 100🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 596 / Bhagavad-Gita - 596 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 13 🌴*

13. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే |
సాంఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ మహాబాహుడవైన అర్జునా! వేదాంతము ననుసరించి కర్మలు సిద్ధించుటకు ఐదు కారణములు గలవు. వాని నిపుడు నా నుండి ఆలకింపుము. 

🌷. భాష్యము :
ప్రతికర్మకు కూడా ఫలము నిశ్చయమైనప్పుడు కృష్ణభక్తిరసభావితుడు తను చేయు కర్మల ఫలితములచే సుఖదుఃఖములను అనుభవింపడనుట ఎట్లు సంభవమనెడి ప్రశ్న ఉదయించును. 

కాని అది ఎట్లు సాధ్యమో తెలియజేయుటకు శ్రీకృష్ణభగవానుడు వేదాంత తత్త్వమును ఉదహరించుచున్నాడు. ప్రతికార్యమునకు ఐదు కారణములు గలవనియు మరియు కార్యముల సిద్ధికి ఈ ఐదు కారణములను గమనింపవలెననియు శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు. 

సాంఖ్యమనగా జ్ఞానకాండమని భావము. అలాగుననే వేదాంతము ప్రసిద్ధులైన ఆచార్యులచే ఆమోదింపబడిన జ్ఞానము యొక్క చరమస్వరూపము. శ్రీశంకరాచార్యులు కూడా ఆ వేదాంతసూత్రములను యథాతథముగా స్వీకరించిరి. కనుక ప్రామాణమును సర్వదా గ్రహించవలెను.

చరమనిగ్రహము పరమాత్ముని యందే కలదు. ఇదే విషయము “సర్వస్య చాహం హృది సన్నివిష్ట:” అని ఇంతకు పూర్వమే భగవద్గీత యందు తెలుపబడినది. అనగా పరమాత్ముడు ప్రతియొక్కరిని వారి పూర్వకర్మలను గుర్తు చేయుచు వివిధకర్మల యందు నియుక్తుని చేయుచున్నాడు. అంతరము నుండి కలుగు అతని నిర్దేశమునందు ఒనర్చబడు కృష్ణభక్తిభావనాకర్మలు ఈ జన్మయందు కాని, మరుజన్మ యందు కాని ఎటువంటి ప్రతిచర్యను కలుగజేయవు.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 596 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 13 🌴*

13. pañcaitāni mahā-bāho kāraṇāni nibodha me
sāṅkhye kṛtānte proktāni siddhaye sarva-karmaṇām

🌷 Translation : 
O mighty-armed Arjuna, according to the Vedānta there are five causes for the accomplishment of all action. Now learn of these from Me.

🌹 Purport :
A question may be raised that since any activity performed must have some reaction, how is it that the person in Kṛṣṇa consciousness does not suffer or enjoy the reactions of work? The Lord is citing Vedānta philosophy to show how this is possible. 

He says that there are five causes for all activities, and for success in all activity one should consider these five causes. Sāṅkhya means the stock of knowledge, and Vedānta is the final stock of knowledge accepted by all leading ācāryas. Even Śaṅkara accepts Vedānta-sūtra as such. Therefore such authority should be consulted.

The ultimate control is invested in the Supersoul. As it is stated in the Bhagavad-gītā, sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ. He is engaging everyone in certain activities by reminding him of his past actions. And Kṛṣṇa conscious acts done under His direction from within yield no reaction, either in this life or in the life after death.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 202, 203 / Vishnu Sahasranama Contemplation - 202, 203 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻202. సంధిమాన్, सन्धिमान्, Sandhimān🌻*

*ఓం సంధిమతే నమః | ॐ सन्धिमते नमः | OM Sandhimate namaḥ*

ఫలభోక్తా స ఏవేతి సంధిమానుచ్యతే హరిః సంధాతగా భిన్న భిన్న కర్మలలో నిస్సంగ జీవాత్మలను సంధించు విష్ణువు, ఆ కర్మల వలన ఏర్పడిన భిన్న భిన్న శరీరముల ద్వారమున కర్మ ఫలములను అనుభవించుచు సన్ధిమాన్ అని పిలువబడుచున్నాడు. జీవుడుగా కర్మఫల భోక్తయు తానే కావున కర్మఫలములతో సంధి లేదా కలయిక విష్ణునకు కలదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 202🌹*
📚. Prasad Bharadwaj 

*🌻202. Sandhimān🌻*

*OM Sandhimate namaḥ*

Phalabhoktā sa eveti saṃdhimānucyate hariḥ / फलभोक्ता स एवेति संधिमानुच्यते हरिः As the One who unites Jīvas with the fruits of their actions He is known as Saṃdhātā and He himself as the enjoyer of the fruits of actions, He is Sandhimān.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 203 / Vishnu Sahasranama Contemplation - 203 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻203. స్థిరః, स्थिरः, Sthiraḥ🌻*

*ఓం స్థిరాయ నమః | ॐ स्थिराय नमः | OM Sthirāya namaḥ*

సదా ఏక రూపః విష్ణువు ఎల్లపుడును ఒకే రూపముతో నుండువాడు గనుక, స్థిరుడు.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ.హరికి నర్థముఁ బ్రాణ మర్పితంబుగ నుండు వాని కైవల్య మెవ్వనికి లేదువనజలోచను భక్తచరుల సేవించిన వాని కైవల్య మెవ్వనికి లేదువైకుంఠ నిర్మల వ్రతపరుం డై నట్టి, వాని కైవల్య మెవ్వనికి లేదుసరసిజోదరు కథా శ్రవణ లోలుండైన వాని కైవల్య మెవ్వనికి లేదుతే.లేదు తపముల బ్రహ్మచర్యాది నిరతి, శమ దమాదుల సత్యశౌచముల దానధర్మసుఖముల సుస్థిర స్థానమైన, వైష్ణవజ్ఞాన జనిత నిర్వాణపదము. (55)

ఎవరైతే శ్రీహరికి తమ అర్థమూ, ప్రాణమూ సమర్పిస్తారో, ఎవరైతే పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో, ఎవరైతే నారాయణ వ్రత పరాయణులో, ఎవరైతే మాధవ కథలను ఆసక్తితో వింటారో అటువంటివారికి లభించే మోక్షం మరెవ్వరికీ లభించదు. విష్ణుభక్తివల్ల సంప్రాప్తించే సుస్థిరమైన కైవల్యపదం తపస్సుల వల్లకానీ, బ్రహ్మచర్యాది నియమాలవల్లకానీ, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం వల్లకానీ, సత్యపరిపాలనం వల్లకానీ, శుచిత్వం వల్లకానీ, దానధర్మాలవల్లకానీ, యజ్ఞాలు చేయడం వల్లకానీ ప్రాప్తించదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 203🌹*
📚. Prasad Bharadwaj 

*🌻203. Sthiraḥ🌻*

*OM Sthirāya namaḥ*

Sadā eka rūpaḥ / सदा एक रूपः One who is always of the same nature. Being always of the same form, He is Sthiraḥ or constant.


🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 15 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 15. To Assert Diversity is to Deny Absoluteness 🌻*

To assert diversity is to deny absoluteness. It does not, however, mean that the Absolute excludes the diverse finitudes, but the finite is eternally dissolved in or is identical with the Absolute, and therefore, it does not claim for itself an individual reality. It is argued that to ignore differences is to reduce the Absolute to a non-entity. 

The Absolute does not depend upon the reality of egoistic differences. By cancelling the relative we may not affect the Absolute, but we, so long as we are unconscious of the fundamental Being, improve thereby our present state of consciousness. 

Individuality is in every speck of space and these egos must be so very undivided that diversity becomes an impossible conception and homogeneity persists in every form of true reasoning in our effort to come to a conclusion in regard to the nature of the Absolute. We may blindly assert difference, but it is not possible to establish it through any acceptable reasoning. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 149 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 79 🌻*

       కారణం ఏమిటటా ?- దానికి రెండు లక్షణములు ఉన్నాయి. రూపరహితమైనటువంటిది, గుణ రహితమైనటువంటిది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి శబ్దము సమర్ధము కాదు. ఆకాశభూతకమైన శబ్దము పంచభూతాత్మకమైన పంచీకరించబడినటువంటి దానిని బోధించగలుగుతుందే కాని, అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును, అపంచీకృత భాగమైనటువంటి పరబ్రహ్మమును దానికి విలక్షణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి వీలుకాదు.

        కాబట్టి “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే” అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే , నీవు తప్పక మౌనవ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. అటువంటి నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్యగర్భ, విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూఉన్నారు.

        నచికేతా! ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడ సమర్ధులుకారో అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో, అచటను అదియే కలదు. అచట ఏది కలదో ఇచటను అదియే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు.

        జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడ ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము. అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షియని, కర్మసాక్షియని, కర్తవ్యసాక్షియని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలవబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయం హిరణ్మయకోశ స్థానము కూడ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మము, అలా తెలుసుకోవాలి.

        అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానం లో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, మరల సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో ఎలా అయితే మరల పునఃసృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమవిధానం ఎలా ఉన్నదో, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడ భూమి మీద జరిగేటటువంటి సృష్టికూడ అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో, ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడ అదే తీరుగా ఉన్నది.

        కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడ అదే కలదు. ఇక్కడ ఏది కలదో అక్కడ కూడ అదే ఉంది. అనగా ఆత్మనిష్టులు, బ్రహ్మనిష్టులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత, అక్కడా, ఇక్కడా ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది. ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత, కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనే నిర్ణయాన్ని పొందుతూఉంటారు.

        దైవం బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా! కాబట్టి భౌతికంగా, స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన, అతి సూక్ష్మమైన, సూక్ష్మతరమైన, సూక్ష్మతమమై, ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద, రూప, గుణ రహితమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటటువంటి పద్ధతిలో ‘నాహం’ గా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి.

        అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లైతే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడువాలి. కాబట్టి పంచ భ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి “జీవేశ్వరో భిన్నః”- జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నారు.- విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 23 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 23 🍀*

సాత్ పాచ్ తీన్ దశకాంచా మేళా!
ఏక తల్వీ కళా దావీ హరి!
తైసే నక్టేనామ్ సర్వత్ర వరిఫ్ట్!
యేథే కా హీ కష్ట న లగతీ!!
అజపా జపణే ఉలట్ ప్రాణాచా!
తెథేహి మనాచా నిర్థారు అసే!!
జ్ఞానదేవా జిణే నామే వీణ్ వ్యర్డ్!
రామకృద్దీ పంథ్ క్రమీయేలా!!

భావము:
ఏడు, ఐదు, మూడు మరియు పది, ఈ తత్త్వాల కలయిక అంతా మిథ్యాభాసము. దీనినంత ఒక్కటే తత్త్వములో శ్రీహరి చూపినారు. 

నామము అన్ని మార్గములలో వరిష్టమైనది. నామ మార్గము స్వీకరించుటకు ఎలాంటి కష్టము కూడ కాదు. అజపాజపము వాణి విషయము కాదు. కావున లోనికి బయటకు ప్రవహిస్తున్న ఉఛ్ఛ్వాస నిశ్వాసలపై మనసు నిర్ధారము చేయుము.
.
నామము లేనిది అంతా వ్యర్థము కావున నేను రామకృష్ణుల పంతము పట్టినానని జ్ఞానదేవులు తెలిపినారు.

*🌻. నామ సుధ -23 🌻*

ఏడు, ఐదు, మూడు దశక సమూహము
ఇరువది ఐదుల కూడిక దేహము
ఈ కళలన్నీయు మిథ్యాభాసము
శ్రీహరి చూపెను ఒక్కటే తత్త్వము
ఆ విధముగ లేదు నామము
అన్ని మార్గములలో ఇదే వరిష్ఠము
“ఇష్టము ఉన్న కాదు కష్టము”
ఈ విధానము సులభతరము
అజపాజపము ప్రాణ ప్రవాహము
కాదుర సుమతీ వాణి విషయము
ప్రవహిస్తున్న ఉఛ్వాస నిశ్వాసము
అక్కడ మనసు నిర్ధారము చేయుము
జ్ఞానదేవుల పలుకులు వినుము
నామము మరిచిన బ్రతుకు వ్యర్థము
రామకృష్ణుల నడత భవ్యము
చెప్పినడిచిరి లోక ప్రసిద్ధము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹 Guru Geeta - Datta Vaakya - 170 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
162

If you listen to the Guru Ashtakam that you just heard, over and over again, if you learn it by-heart, if you keep chanting this mantra all the time, you will attain the good fortune of having read the Guru Gita, you will attain the good fortune of having followed the Guru’s instructions, you will attain the good fortune of having understood the Guru Principle. 

Whether you are a great scholar or a lay person, whether you are a Yogi, whether you are diseased or wealthy, regardless of who you are and what state you are in – God gave everyone a different state – you will benefit from it. 

Whether you are a Karma (action) Yogi or a Jnana (knowledge) Yogi or a Tyaga (sacrifice) Yogi, it’s a state you acquired due to your past karma. It’s a certificate you received. It is inevitable that you go through the experience.

However, everyone needs to practice good habits. In some instances we can, but in some others we are unable to. For instance, sometimes, it may be hard to study the big Guru Gita. 

That is why, they made a scripture like Ramayana easy for us with the 100 verse Shata Shloki Ramayana because we may not have the opportunity to study and learn by-heart the 24000 verses in the Ramayana. But, for those who want more stories than what is in the 100 verses, it’s enough to read Sundarakanda (one of the 7 sections in Ramayana). 

If you study it everyday, that’s good. Even if you chant the Eka-Shloki (single verse) Ramayana every day, that’s good. If you don’t have the opportunity to do that, it is enough if you chant “Rama”, “Sita”, “Rama”. Like that, they have made everything easy and more accessible for us.
Similarly,

Final verse in Guru Ashtakam: 
Gurorashtakam yah pathet punya dehi Yatir bhupatir brahmachari ca gehi | Labhed vancitaartham padam brahma sanjam Guro ruktavakye mano yasya lagnam ||

Just as we discussed so far, whether he is a Yati or a king, whether he is a Brahmacari (celibate) or a householder, whoever he is, if he studies the Guru Ashtakam, he will be purified, his mind will be absorbed in the Guru’s instructions, all his wishes will be fulfilled and he will attain Supreme bliss.

It does not matter who you are, if you have the desire to study the big Guru Gita, but do not have the opportunity to, you can study the Guru Ashtakam any number of times, at all times and in all states. 

You attain great fortune if you study the Guru Ashtakam or learn it by heart of even listen to the recording. One attains supreme bliss (Brahmanandam) and all his wishes will be fulfilled. “Brahmam” refers to bliss that is unparalleled. 

It’s not the ordinary, mundane kind of joy. People that attain this supreme bliss are merging into the supreme reality. They are merging with eternal bliss. The greatness of Guru Ashtakam is such.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 94 / Sri Lalitha Sahasra Nama Stotram - 94 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 166 / Sri Lalitha Chaitanya Vijnanam - 166 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |*
*నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖*

*🌻166. 'నిష్పాపా' 🌻*

పాపము లేనిది శ్రీమాత అని అర్థము.

సృష్టియొక అగ్నికార్య మగుటచే, తత్కారణముగ కొంత మసిబారుట జరుగుచున్నది. మలినము లేర్పడుచుండును. ఈ మలినములనే పాపములు అందురు. వీనినెప్పటికప్పుడు తొలగించు
చుండవలెను. లేనిచో అది జ్ఞానమును కప్పి, జీవుని దుఃఖమున ప్రడదోయును. బ్రహ్మకైనను ఇట్టి అజ్ఞానమావరించుటకు అవకాశమున్నది. జీవునికి అహంకారము కారణముగ అభిమానము కలుగును. ఇది మొదటి మాయావరణము. దానివలన మోహము పుట్టును. 

మోహము కారణముగ కోరిక జనించును. మోహము తీరనపుడు, ప్రయత్నము కోపముగ మారును. కోపము తీవ్రమైనపుడు అంధకార మిశ్రము అను ముదురు కటి ఏర్పడి ఏమియు తెలియని స్థితి ఏర్పడును. దానివలన మనసుకు చాంచల్యము కలిగి, భ్రమ పుట్టి, అది చిత్త విభ్రమమై లేనిది ఉన్నట్లు గోచరింపజేయును. ఇట్లు ఐదు స్థితులలో, సహజముగ జ్ఞానస్వరూపుడైన జీవుడు అజ్ఞానవశుడై పడియుండును.

చతుర్ముఖ బ్రహ్మకూడ తాను సృష్టిచేయవలెను అని భావించుట వలన, అహంకారమునకు అభిమాన మేర్పడి, మోహము, కోపము, అంధతా మిశ్రము, చిత్తభ్రమ కలిగినవి. ఏ జీవికైనను ఇంతే. తాను చేయుచున్నాడని భావించినపుడు, బంధింపబడుట తప్పదు. 

చేయుటకు సంకల్పము దైవమునదని, దాని ననుసరించుచు నిర్వర్తించుట తాను చేయవలసిన పని అని తెలియవలెను. చతుర్ముఖ బ్రహ్మ ఏమి చేయవలెనో తెలియక ఉన్నప్పుడు, అంతర్వాణి తపస్సు చేయుమని నిర్దేశించెను. 

తపస్సు చేయగా, పరతత్త్వానుభూతి కలిగెను. అటుపైన సృష్టి చేయమని అంతర్వాణి పలికినది. తపస్సు చేయుట, సృష్టి చేయుట తనకందింపబడిన సంకల్పములే కానీ, తనవి కావు. తాను
సృష్టి చేయుదుననుకొనుట ఏమి? అదియే అహంకారము వలన కలుగు అభిమానము. అజ్ఞానమున కదియే నాంది. 

జీవులు కూడ తామే సంకల్పించుచున్నామని, నిర్వర్తించుచున్నా
మని భావించుటవలన ఇట్టి అవిద్యయను పాపమునందు పడుచున్నారు. శ్రీమాత సంకల్పములకు పుట్టినిల్లు, ఆమె పరమాత్ముని సంకల్పము. ఆమె సంకల్పించిన పిమ్మటే సృష్టి ఆరంభమగును. 

స్థితి లయములు కూడ ఆమె సంకల్పమే. ఆమె సంకల్పమేమో తెలిసి అనుసరించుటకే సమస్త ఆరాధనములు. ఆమె జ్ఞానమునకు, అజ్ఞానమునకు కూడ అధిష్టాన దైవము. పాప పుణ్యములకు కూడ ఆమెయే పుట్టినిల్లు. ఆమె నుండి పుట్టినవి ఆమెపై ఆధిపత్యము
వహించలేవు. అందువలన ఆమె పాపపుణ్యములకు కూడ అతీతమై యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 166 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Niṣpāpā निष्पापा (166) 🌻*

She is without sins. Pāpa means sin. Sins arise out of desires. It has already been discussed that She is without desires (156 Nīrāgā). Kṛṣṇa says, (Bhagavad Gīta IV.14) “There is no work that affects me, nor do I aspire for the fruits of action.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 507 / Bhagavad-Gita - 507 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 17 🌴*

17. సత్త్వాత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమొహౌ తమసో భవతో(జ్ఞానమేవ చ ||

🌷. తాత్పర్యం : 
సత్త్వగుణము నుండి వాస్తవజ్ఞానము వృద్దినొందును. రజోగుణము నుండి లోభము వృద్ధినొందగా, తమోగుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వృద్దినొందుచున్నవి.

🌷. భాష్యము :
ప్రస్తుత నాగరికత జీవుల నిజస్వభావమునకు అనుకూలమైనది కానందున కృష్ణభక్తిభావనము ఉపదేశించబడుచున్నది. కృష్ణభక్తిభావన ద్వారా సమాజమునందు సత్త్వగుణము వృద్దినొందును. ఆ విధముగా సత్త్వగుణము వృద్ధియైనప్పుడు జనులు యథార్థదృష్టిని పొంది విషయములను యథాతథముగా గాంచగలుగుదురు. తమోగుణము నందు జనులు పశుప్రాయులై దేనిని కూడా స్పష్టముగా అవగాహన చేసికొనలేరు. 

ఉదాహరణమునకు ఒక జంతువును వధించుట ద్వారా అదే జంతువుతో తరువాతి జన్మలో వధింపబడవలసి వచ్చునని తమోగుణము నందు జనులు ఎరుగజాలరు. వాస్తవజ్ఞానమునకు సంబంధించిన విద్య జనుల వద్ద లేనందునే వారట్లు బాధ్యతా రహితులగుచున్నారు. 

ఇట్టి బాధ్యతా రాహిత్యమును నివారించుటకు జనులందరికినీ సత్త్వగుణవృద్దికై విద్య తప్పనిసరియై యున్నది. సత్త్వగుణము నందు వాస్తవముగా విద్యావంతులైనప్పుడు వారు స్థిరబుద్ధిగలవారై యథార్థజ్ఞానమును సంపాదింతురు. అపుడు వారు ఆనందభాగులు మరియు జీవితమున సఫలురు కాగలరు.

 జగమంతయు ఆ రీతి సుఖభాగులు మరియు జయశీలూరు కాకున్నను, ప్రజలలో కొద్దిశాతమైనను కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొని సత్త్వగుణములో నిలిచినచో ప్రపంచమునందు శాంతి మరియు అభ్యుదయములకు అవకాశమేర్పడును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 507 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 17 🌴*

17. sattvāt sañjāyate jñānaṁ
rajaso lobha eva ca
pramāda-mohau tamaso
bhavato ’jñānam eva ca

🌷 Translation : 
From the mode of goodness, real knowledge develops; from the mode of passion, greed develops; and from the mode of ignorance develop foolishness, madness and illusion.

🌹 Purport :
Since the present civilization is not very congenial to the living entities, Kṛṣṇa consciousness is recommended. Through Kṛṣṇa consciousness, society will develop the mode of goodness. When the mode of goodness is developed, people will see things as they are. In the mode of ignorance, people are just like animals and cannot see things clearly.

 In the mode of ignorance, for example, they do not see that by killing one animal they are taking the chance of being killed by the same animal in the next life. Because people have no education in actual knowledge, they become irresponsible. 

To stop this irresponsibility, education for developing the mode of goodness of the people in general must be there. When they are actually educated in the mode of goodness, they will become sober, in full knowledge of things as they are. 

Then people will be happy and prosperous. Even if the majority of the people aren’t happy and prosperous, if a certain percentage of the population develops Kṛṣṇa consciousness and becomes situated in the mode of goodness, then there is the possibility for peace and prosperity all over the world. Otherwise, if the world is devoted to the modes of passion and ignorance, there can be no peace or prosperity. In the mode of passion, people become greedy, and their hankering for sense enjoyment has no limit. 

One can see that even if one has enough money and adequate arrangements for sense gratification, there is neither happiness nor peace of mind. That is not possible, because one is situated in the mode of passion. If one wants happiness at all, his money will not help him; he has to elevate himself to the mode of goodness by practicing Kṛṣṇa consciousness.

 When one is engaged in the mode of passion, not only is he mentally unhappy, but his profession and occupation are also very troublesome. He has to devise so many plans and schemes to acquire enough money to maintain his status quo. 

This is all miserable. In the mode of ignorance, people become mad. Being distressed by their circumstances, they take shelter of intoxication, and thus they sink further into ignorance. Their future in life is very dark.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -112 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚*

*🍀. ముందు మాట - నిజమునకు సృష్టియందు జరుగుచున్న కార్యము చాల హెచ్చు. చేయుచున్న కార్యములు అతి స్వల్పము. చేయుట నుండి సృష్టి యందు జరుగుచున్న కార్యములోనికి ప్రవేశించుటయే నిష్కామ కర్మయోగము నుండి కర్మసన్న్యాస యోగములోనికి ప్రవేశించుట. కర్మ సన్న్యాస యోగమున స్థిరపడిన జీవునికి కర్మ చేయుచున్నానను భావన యుండదు. కర్మ జరుగుచున్నదన్న భావనయే యుండును. ముందు తెలుపబడిన మూడు అధ్యాయముల నిష్కామకర్మ నిర్వహణ సూత్రములకు యీ అధ్యాయమున ఒక పరిపూర్తి ఏర్పడును. మనసు కర్మలయందు లగ్నము కాక, దైవము నందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట కర్మసన్న్యాసయోగ రహస్యము. 🍀*

కర్మఫల సన్న్యాసమే కర్మసన్న్యాసముగ ఈ అధ్యాయమున పేర్కొనబడును. కర్మఫల సన్న్యాసము అనుభవమైన వారికి కర్మ చేయుట అను భావన నశించి, కర్మ జరుగుట అను అనుభూతి దైనందినముగ కలుగుచునుండును. కర్మ సన్న్యాస మనగ తమనుండి యితరుల నుండి జరుగుచున్న కర్మను సాక్షీభూతుడై గమనించుట.

నదీ ప్రవాహమును నదియొడ్డున నుండి గమనించినట్లు, జరుగుచున్న కర్మను గమనించు స్థితి అభ్యాసవ శమున నిష్కామ కర్మ యోగులకు కలుగును. వారికి కర్మ జరుగుచుండుట ఎక్కువగ గోచరించును. చేయుచుండుట అందులో భాగమని తెలిసి యుండును. పడవ ఒకటి ప్రవాహమున ప్రయాణము చేయుచుండగ, పడవ నడచుచున్నదని గ్రహించుట ఒక పద్ధతి. 

ప్రవాహమే పడవను నడిపించుచున్నదని తెలియుట మరియొక పద్ధతి. పడవ లోని ప్రయాణికుడు తాను ప్రయాణము చేయుచున్నాడని భావించుట మరియొక పద్ధతి. పడవకు ప్రయాణికునికి ప్రవాహమే ఆధారము కదా! ప్రవాహమే లేనపుడు పడవకు, ప్రయాణికునికి ప్రయాణమే లేదు. 

నిజమునకు సృష్టియందు జరుగుచున్న కార్యము చాల హెచ్చు. చేయుచున్న కార్యములు అతి స్వల్పము. చేయుట నుండి సృష్టి యందు జరుగుచున్న కార్యములోనికి ప్రవేశించుటయే నిష్కామ కర్మయోగము నుండి కర్మసన్న్యాస యోగములోనికి ప్రవేశించుట. 

క్రొత్తగ వాహనము నడుపుట నేర్చినవాడు తానే వాహనమును నడుపుచున్నానని భావించును. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు హెచ్చరికగ వాహనము నడుపుట యందు లగ్నమై యుండును. క్రమముగ నిపుణతరాగ ఆడుచు, పాడుచు, సంభాషణములు చేయుచు, గంభీరమైన విషయములను మాట్లాడుచు వాహనము నడుపుచుండును. 

ఇచట గమనించవలసిన విషయమొకటున్నది. బాహ్యేంద్రియములు వాహనమును యాంత్రికముగ నడుపుచుండగ, అంతఃకరణములతో జీవుడు ప్రసంగించుట, ఆడుట, పాడుట చేయుచుండును. 

అతనికి వాహనము నడపు చున్నానను భావన కూడ అంతంత మాత్రముగనే యుండును. ఛలోక్తులతో ఆసక్తికర ప్రసంగములతో, పాటలతో సమయము గడచుచుండగ, ప్రయాణము పూర్తియగును. తాను వాహనము నడపిన భావమే యుండదు. 

అట్లే కర్మ సన్న్యాస యోగమున స్థిరపడిన జీవునికి కర్మ చేయుచున్నానను భావన యుండదు. కర్మ జరుగుచున్నదన్న భావనయే యుండును. ముందు తెలుపబడిన మూడు అధ్యాయముల నిష్కామకర్మ నిర్వహణ సూత్రములకు యీ అధ్యాయమున ఒక పరిపూర్తి ఏర్పడును.

మనసు కర్మలయందు లగ్నము కాక, దైవము నందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట కర్మసన్న్యాసయోగ రహస్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 312 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
77. అధ్యాయము - 32

*🌻. వీరభద్రుడు - 2 🌻*

జగత్సంహారమును చేయు ఆ రుద్రుడు అపుడు ఒక జటను ఊడబెరికి పర్వతముపై కోపముతో విసిరి కొట్టెను (20). ఓ మహర్షీ! ఆ ప్రభువు యొక్క జట విసిరి కొట్టుటచే రెండు ముక్కలై, మహాప్రలయమునందు వలె భయంకరమగు గొప్ప ధ్వని కలిగెను (21). 

ఓ దేవర్షీ! ఆ జటయొక్క పూర్వభాగమునుండి మహాబలుడు, అతి భయంకరుడు, గణములకు నాయకుడు అగు వీర భద్రుడు జన్మించెను (22). ప్రలయకాలాగ్ని వలె ప్రకాశించువాడు, మిక్కిలి ఎత్తైన వాడు, వేయి భుజములు గలవాడు అగు ఆ వీరభద్రుడు భూమిని అంతనూ పూర్తిగా చుట్టివేసి ఆపైన పది అంగుళముల వరకు వ్యాపించి యుండెను (23).

అచట సర్వేశ్వరుడగు మహారుద్రుని కోపముతో గూడిన నిట్టూర్పుల నుండి వంద జ్వరములు, పదమూడు సన్నిపాత రోగములు పుట్టినవి (24). శివుని జటయొక్క రెండవభాగమునుండి మిక్కిలి భయంకరురాలగు మహాకాళి జన్మించెను. వత్సా! ఆమెను కోట్లాది భూతములు చుట్టువారి యుండెను (25). 

విగ్రహమును ధరించిన క్రూరములగు ఆ జ్వరములన్నియు సర్వలోకభయమును గొల్పుచూ, తమ తేజస్సుచే ప్రకాశించుచూ, సర్వమును దహించునా యన్నట్లుండెను (26). అపుడు వీరుడు, చక్కగా మాటలాడే నేర్పు గలవాడునగు వీరభద్రుడు దోసిలియొగ్గి పరమేశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను (27).

వీరభద్రుడిట్లు పలికెను -

మహారుద్రా !నీవు అతి భయంకరుడవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని నీ నేత్రములు. ఓ ప్రభో! నేను చేయదగిన పని యేమి ?వెంటనే ఆజ్ఞాపింపుము (28). హే ఈశానా !అర్ధ క్షణములో సముద్రములను ఎండింపజేయవలెనా? ఓ ఈశ్వరా! ఆర్థ క్షణములో పర్వతములను నుగ్గు చేయవలెను? (29) హే హరా! క్షణకాలములో బ్రహ్మాండమును భస్మము చేయవలెనా యేమి? క్షణకాలములో దేవతలను గాని, మునిశ్రేష్ఠులను గాని భస్మము చేయవలెనా? (30) 

హే శంకరా! సర్వలోకములలో వాయు సంచారము లేకుండగా చేయవలెనా? ఈశానా! సర్వప్రాణులను సంహరించవలెనా యేమి? (31) ఓ మహేశ్వరా! నీ అనుగ్రహముచే నేను చేయలేని పని ఎచ్చటనైననూ లేదు. పరాక్రమములో నాతో సమానమైన వాడు పుట్టలేదు, పుట్టబోడు (32).

ఓ ప్రభూ! నీవు నన్ను ఎచటికైననూ ఏ కార్యమునైననూ ఉద్దేశించి పంపవచ్చును. నేను నీ అనుగ్రహముచే ఆ కార్యమును సత్వరమే నిశ్చయముగా సాధించగలను (33). మంగళకరుడగు నీ శాసనముచే అల్పులు కూడ సంసారసముద్రమును తరించెదరు. హే హరా! నేను మహావిపత్తు అనే సముద్రమును తరింప సమర్థుడను కాకపోదునా ?(34) 

ఓ శంకరా !నీచే నియోగింపబడిన గడ్డి పోచయైననూ సునాయాసముగా గొప్ప కార్యమును క్షణములో చేయగల్గుననుటలో సందేహము లేదు (35). హే శంభో! కార్యము నీ సంకల్పరూపమగు లీలచేతనే సిద్ధించును. అయిననూ, ఆ కార్యము కొరకై నన్ను పంపుడు. ఇది మీకు నాపై గల అనుగ్రహమే (36).

హే శంభో! నాకు ఇటువంటి శక్తి నీ అనుగ్రహమువలననే కలిగినది. హేశంకరా! నీ అనుగ్రహము లేనిదే ఎవ్వనికైననూ శక్తి ఉండదు (37). ఎవడైననూ నీ ఆజ్ఞ లేనిదే గడ్డిపోచవంటి వస్తువులనైననూ కదల్చ సమర్థుడు కాడనుటలో సందేహము లేదు. ఇది సత్యము (38). 

హే శంభో! మహేశ్వరా! దేవాదులందరూ కూడ నీ ఆజ్ఞకు బద్ధులగుదురు. సర్వప్రాణులను నియంత్రించునది నీవే. అటులనే, నీవు నన్ను కూడ నియోగించుము (39). ఓ మహాదేవా !నీకు నేను అనేక నమస్కారముల నాచరించుచున్నాను. హే హరా !నీవు నీకు అభీష్టమగు కార్యమును చక్కబెట్టుట కొరకై నన్ను ఇప్పుడు వెంటనే పంపించుము (40).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 65 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 5 - THE 5th RULE
*🌻 5. Kill out all sense of separateness - 10 🌻*

267. We all have to stand alone and isolated because each of us must learn to depend upon himself and to realize that he is God, that the divine spark in him is in truth part of the All. Until we can do that we are not entirely reliable for the higher phases of the Master’s work. 

In the meantime, for all our ordinary work in life, whether physical, astral or mental, the knowledge that the Master envelops us and is close behind us all the time is a very great strength and comfort. We do our regular work each night on the astral or mental plane, as the case may be, and in doing it we know always that the power of the Master protects us.

 If at any moment we encounter something enormously stronger than ourselves which threatens to overwhelm us, just as on the physical plane a great storm or earthquake might do, we always know that we can draw indefinitely, infinitely, on His power. Even that the disciple must learn to do without, when the time comes, but only in order that he may become as strong a centre as the Master Himself.

268. Do not fancy you can stand aside from the bad man or the foolish man. They are yourself, though in a less degree than your friend or your Master. But if you allow the idea of separateness from any evil thing or person to grow up within you, by so doing you create karma, which will bind you to that thing or person till your soul recognizes that it cannot be isolated.

269. C.W.L. – This is the first part of a long note by the Master Hilarion. Of course we all bold in theory that humanity is a mighty brotherhood and is really a unity. The Master here admits that there are degrees in this unity, and that there are therefore degrees of separateness, that we are to some extent more separated from the bad and the foolish than we are from our friend or our Master. 

The idea of the brotherhood of man is often twisted to imply the equality of man, which it really cannot mean. In any family of many brothers there must be considerable differences of age among them, and there must similarly be differences of soul age among these members of the greater human brotherhood. 

Again, just as in the physical family it is the business of the elder to help and train the younger, so in the family of humanity must the elder protect the younger and help them in any way they can. Brotherhood implies variety; it requires this difference of age, and also that many people shall be doing different kinds of work.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 197 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. దుర్వాసమహర్షి-కందళి - 1 🌻*

జ్ఞానం:
01. దుర్వాసమహర్షి, దూర్వాసమహర్షి అనే పేర్లు వ్యాకరణం ప్రకారం సరి అయిన మాటలు కావు. ఆయన అసలుపేరు వ్యాకరణయుక్తంగా ‘దుర్వాసోమహర్షి’. ఆయన అత్రిమహర్షికి త్రిమూర్తులు ప్రసాదించిన వరం. అతడు రుద్రుడి అంశలో పుట్టినవాడు. 

02. త్రిమూర్తులయొక్క అంశతో దుర్వాసుడు తల్లిగర్భంలో పెరుగుతున్న సమయంలో, అత్రిమహర్షిమీద కోపంతో హైహయ వంశంలో పుట్టిన ఒక రాజు అనసూయను అవమానం చేయదలుచుకుని, ఆవిడగర్భంలో శిశువు పెరగకుండా ప్రయోగంచేసాడు. 

03. గర్భవతి అయినటువంటి అనసూయ బాధపడింది. ఆమె గర్భంలో పెరిగే శిశువు – ఆ రాజును భస్మంచేయదలచి, రుద్రుడి అంశలో ఉన్నవాడు కాబట్టి, రుద్రత్వంతో క్రోధమూర్తిగా మారింది. ఈ లక్షణంలేకుండా మామూలుగా పెరిగి పెద్దవాడైతే అతడు సాత్వికుడై ఉండేవాడు. తమోగుణంలోని కోపస్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆ శిశువులో ప్రవేశించింది.

04. పెద్దవాళ్ళెవరైనా మౌనంగా ఉంటే, వాళ్ళను విస్మరించి వాళ్ళకు నమస్కారమైనా చేయక, వాళ్ళ ఎదురుగా నవ్వుకుంటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకోవటం దోషం. భరించటానికి రెండే ఉండాలి. అహంకారం ఏమీ లేకుండా చచ్చినట్లు పడి ఉండడం తెలియాలి గయ్యాళిభార్యతో! లేకపోతే, ఆ గయ్యాళితనమనే రోగం తగ్గించగలిగిన సమర్థుడై ఉండాలి. రెండూ లేకపోతే వదిలిపెట్టాలి. అంతేకదా! ఎంత గయ్యళి అయినా లొంగదీసుకునేటటువంటి భర్తలున్నారు. పరమసాత్వికులున్నారు కొందరు.తిట్టినా కొట్టినా పడిఉండేవాళ్ళు కొందరున్నారు. అప్పుడు కాపురం బాగుంటుంది. ఆవిడకు బాగుంటుంది ఆ కాపురం.
    
05. దుర్వాసుడు తన భార్యమీద ప్రేమ ఉందని లోకానికి చాటిచెప్పటానికి ఈ భూమిపై శాశ్వతంగా ఆవిడపేరుమీదుగా ఒక వృక్షజాతిని సృష్టిస్తాను అని కదళీవృక్షజాతిని ఆయన సృష్టించాడు. కదళీవనం అంటే అరటితోట. ఆవిడ పేరు శాశ్వతంగా ఉండేటట్ట్లుగా, కదళి-అంటే అరటిచెట్టును సృష్టించాడు. ఆమే మీద తనకు క్రోధంలేదు, తాను ఆవిడను చంపలేదు అని అరటిపండుద్వారా చెపుతున్నాడాయన.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 261 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 110. What I say is simple, when the 'I am' arises, everything appears, when 'I am' subsides everything disappears.. 🌻*

The real Guru's words are always simple, for he is no longer an individual. He expects nothing from you except the development of a firm conviction in the simple teaching that he imparts. It is indeed through his grace that he has handed over something so profound to you in such a simple manner. 

Everything has been centered around the 'I am': the 'I am' arising, everything appears, the 'I am' subsiding, everything disappears. Just understand the 'I am', abide in it and be free from it and your job is done.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 136 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 15 🌻*

551. ఆత్మ, అనుభవ పూర్వకముగా, ఆత్మజ్ఞానమును సంపాదించుటకు గల "ప్రధమ ప్రేరణము"ను ఇచ్చటే సార్థక పరచినది.

552. మానవునకు అజ్ఞానము ఉన్నంత వరకు మాయారూప సమన్వితంబైన బహుత్వమునకు అంత్యము లేదు. అట్లే - దివ్య జ్ఞానము సిద్ధించిన తరువాత, భగవంతుని అఖండ ఏకత్వమునకు కూడా అంత్యము లేదని మానవుడు గ్రహించును.

553. వాస్తవము ఏమనగా:- మానవుడే దేవుడయ్యేను. మానవుడే దేవుడు కాగలడు. తెలిసినను తెలియక పోయినను, మానవుడే భగవంతుడు.

554. సప్తమ భూమికలో, నిజమైన అనుభవముచే భగవంతుని అస్తత్వమును నమ్మెదరు.

555. నిజమునకు, ఆద్యంతములు లేకుండా ఎల్లప్పుడు 'ఆత్మయే భగవంతుడు' అన్నది ఏకైక సత్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasra Namavali - 100 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*
 
*🍀 100. అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|*
*చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ‖ 100 ‖ 🍀*
 
🍀 932) అనంతరూపః - అనంతమైన రూపములు గలవాడు.

🍀 933) అనంత శ్రీః - అంతంలేని శక్తివంతుడైనవాడు.

🍀 934) జితమన్యుః - క్రోధము లేనివాడు.

🍀 935) భయాపహః - భయమును పోగొట్టువాడు.

🍀 936) చతురశ్రః - కర్మఫలములను న్యాయముగా పంచువాడు.

🍀 937) గభీరాత్మా - గ్రహింప శక్యంగాని స్వరూపము గలవాడు.

🍀 938) విదిశః - అర్హులైనవారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.

🍀 939) వ్యాధిశః - బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.

🍀 940) దిశః - వేదముద్వారా జీవులకు కర్మఫలములను తెలియజేయువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 100 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for PoorvaBhadra 4th Padam* 

*🌻 100. anantarūpō nanta śrī: jitamanyu rbhayāpahaḥ |*
*caturaśrō gabhīrātmā vidiśō vyādiśō diśaḥ || 100 || 🌻*

🌻 932. Ananta-rūpaḥ: 
One who has innumerable forms, as He dwells in this all-comprehending universe.

🌻 933. Anantaśrīḥ: 
One whose Shri (glory) is infinite.

🌻 934. Jita-manyuḥ: 
One who has overcome anger.

🌻 935. Bhayāpahaḥ: 
One who destroys the fears of beings from Samsara.

🌻 936. Caturaśraḥ: 
One who is just, because He bestows on Jivas the fruits of their Karma.

🌻 937. Gabhirātmā: 
One whose nature is unfathomable.

🌻 938. Vidiśaḥ: 
One who distributes various furits of actions to persons differing in their forms according to competency.

🌻 939. Vyādiśaḥ: 
One who gives to Indra and other deities directions according to their varied functions.

🌻 940. Diśaḥ: 
One who in the form of the Vedas bestows the fruits of their ritualistic actions on different beings.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment