భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 197


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 197 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దుర్వాసమహర్షి-కందళి - 1 🌻

జ్ఞానం:


01. దుర్వాసమహర్షి, దూర్వాసమహర్షి అనే పేర్లు వ్యాకరణం ప్రకారం సరి అయిన మాటలు కావు. ఆయన అసలుపేరు వ్యాకరణయుక్తంగా ‘దుర్వాసోమహర్షి’. ఆయన అత్రిమహర్షికి త్రిమూర్తులు ప్రసాదించిన వరం. అతడు రుద్రుడి అంశలో పుట్టినవాడు.

02. త్రిమూర్తులయొక్క అంశతో దుర్వాసుడు తల్లిగర్భంలో పెరుగుతున్న సమయంలో, అత్రిమహర్షిమీద కోపంతో హైహయ వంశంలో పుట్టిన ఒక రాజు అనసూయను అవమానం చేయదలుచుకుని, ఆవిడగర్భంలో శిశువు పెరగకుండా ప్రయోగంచేసాడు.

03. గర్భవతి అయినటువంటి అనసూయ బాధపడింది. ఆమె గర్భంలో పెరిగే శిశువు – ఆ రాజును భస్మంచేయదలచి, రుద్రుడి అంశలో ఉన్నవాడు కాబట్టి, రుద్రత్వంతో క్రోధమూర్తిగా మారింది. ఈ లక్షణంలేకుండా మామూలుగా పెరిగి పెద్దవాడైతే అతడు సాత్వికుడై ఉండేవాడు. తమోగుణంలోని కోపస్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆ శిశువులో ప్రవేశించింది.

04. పెద్దవాళ్ళెవరైనా మౌనంగా ఉంటే, వాళ్ళను విస్మరించి వాళ్ళకు నమస్కారమైనా చేయక, వాళ్ళ ఎదురుగా నవ్వుకుంటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకోవటం దోషం. భరించటానికి రెండే ఉండాలి. అహంకారం ఏమీ లేకుండా చచ్చినట్లు పడి ఉండడం తెలియాలి గయ్యాళిభార్యతో! లేకపోతే, ఆ గయ్యాళితనమనే రోగం తగ్గించగలిగిన సమర్థుడై ఉండాలి. రెండూ లేకపోతే వదిలిపెట్టాలి. అంతేకదా! ఎంత గయ్యళి అయినా లొంగదీసుకునేటటువంటి భర్తలున్నారు. పరమసాత్వికులున్నారు కొందరు.తిట్టినా కొట్టినా పడిఉండేవాళ్ళు కొందరున్నారు. అప్పుడు కాపురం బాగుంటుంది. ఆవిడకు బాగుంటుంది ఆ కాపురం.

05. దుర్వాసుడు తన భార్యమీద ప్రేమ ఉందని లోకానికి చాటిచెప్పటానికి ఈ భూమిపై శాశ్వతంగా ఆవిడపేరుమీదుగా ఒక వృక్షజాతిని సృష్టిస్తాను అని కదళీవృక్షజాతిని ఆయన సృష్టించాడు. కదళీవనం అంటే అరటితోట. ఆవిడ పేరు శాశ్వతంగా ఉండేటట్ట్లుగా, కదళి-అంటే అరటిచెట్టును సృష్టించాడు. ఆమే మీద తనకు క్రోధంలేదు, తాను ఆవిడను చంపలేదు అని అరటిపండుద్వారా చెపుతున్నాడాయన.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Jan 2021

No comments:

Post a Comment