శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 166 / Sri Lalitha Chaitanya Vijnanam - 166


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 166 / Sri Lalitha Chaitanya Vijnanam - 166 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖



🌻166. 'నిష్పాపా' 🌻

పాపము లేనిది శ్రీమాత అని అర్థము.

సృష్టియొక అగ్నికార్య మగుటచే, తత్కారణముగ కొంత మసిబారుట జరుగుచున్నది. మలినము లేర్పడుచుండును. ఈ మలినములనే పాపములు అందురు. వీనినెప్పటికప్పుడు తొలగించు

చుండవలెను. లేనిచో అది జ్ఞానమును కప్పి, జీవుని దుఃఖమున ప్రడదోయును. బ్రహ్మకైనను ఇట్టి అజ్ఞానమావరించుటకు అవకాశమున్నది. జీవునికి అహంకారము కారణముగ అభిమానము కలుగును. ఇది మొదటి మాయావరణము. దానివలన మోహము పుట్టును.

మోహము కారణముగ కోరిక జనించును. మోహము తీరనపుడు, ప్రయత్నము కోపముగ మారును. కోపము తీవ్రమైనపుడు అంధకార మిశ్రము అను ముదురు కటి ఏర్పడి ఏమియు తెలియని స్థితి ఏర్పడును. దానివలన మనసుకు చాంచల్యము కలిగి, భ్రమ పుట్టి, అది చిత్త విభ్రమమై లేనిది ఉన్నట్లు గోచరింపజేయును. ఇట్లు ఐదు స్థితులలో, సహజముగ జ్ఞానస్వరూపుడైన జీవుడు అజ్ఞానవశుడై పడియుండును.

చతుర్ముఖ బ్రహ్మకూడ తాను సృష్టిచేయవలెను అని భావించుట వలన, అహంకారమునకు అభిమాన మేర్పడి, మోహము, కోపము, అంధతా మిశ్రము, చిత్తభ్రమ కలిగినవి. ఏ జీవికైనను ఇంతే. తాను చేయుచున్నాడని భావించినపుడు, బంధింపబడుట తప్పదు.

చేయుటకు సంకల్పము దైవమునదని, దాని ననుసరించుచు నిర్వర్తించుట తాను చేయవలసిన పని అని తెలియవలెను. చతుర్ముఖ బ్రహ్మ ఏమి చేయవలెనో తెలియక ఉన్నప్పుడు, అంతర్వాణి తపస్సు చేయుమని నిర్దేశించెను.

తపస్సు చేయగా, పరతత్త్వానుభూతి కలిగెను. అటుపైన సృష్టి చేయమని అంతర్వాణి పలికినది. తపస్సు చేయుట, సృష్టి చేయుట తనకందింపబడిన సంకల్పములే కానీ, తనవి కావు. తాను

సృష్టి చేయుదుననుకొనుట ఏమి? అదియే అహంకారము వలన కలుగు అభిమానము. అజ్ఞానమున కదియే నాంది.

జీవులు కూడ తామే సంకల్పించుచున్నామని, నిర్వర్తించుచున్నా

మని భావించుటవలన ఇట్టి అవిద్యయను పాపమునందు పడుచున్నారు. శ్రీమాత సంకల్పములకు పుట్టినిల్లు, ఆమె పరమాత్ముని సంకల్పము. ఆమె సంకల్పించిన పిమ్మటే సృష్టి ఆరంభమగును.

స్థితి లయములు కూడ ఆమె సంకల్పమే. ఆమె సంకల్పమేమో తెలిసి అనుసరించుటకే సమస్త ఆరాధనములు. ఆమె జ్ఞానమునకు, అజ్ఞానమునకు కూడ అధిష్టాన దైవము. పాప పుణ్యములకు కూడ ఆమెయే పుట్టినిల్లు. ఆమె నుండి పుట్టినవి ఆమెపై ఆధిపత్యము

వహించలేవు. అందువలన ఆమె పాపపుణ్యములకు కూడ అతీతమై యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 166 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Niṣpāpā निष्पापा (166) 🌻

She is without sins. Pāpa means sin. Sins arise out of desires. It has already been discussed that She is without desires (156 Nīrāgā). Kṛṣṇa says, (Bhagavad Gīta IV.14) “There is no work that affects me, nor do I aspire for the fruits of action.”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jan 2021

No comments:

Post a Comment