సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 23


🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 23 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. అభంగ్ - 23 🍀


సాత్ పాచ్ తీన్ దశకాంచా మేళా!
ఏక తల్వీ కళా దావీ హరి!
తైసే నక్టేనామ్ సర్వత్ర వరిఫ్ట్!
యేథే కా హీ కష్ట న లగతీ!!

అజపా జపణే ఉలట్ ప్రాణాచా!
తెథేహి మనాచా నిర్థారు అసే!!

జ్ఞానదేవా జిణే నామే వీణ్ వ్యర్డ్!
రామకృద్దీ పంథ్ క్రమీయేలా!!

భావము:

ఏడు, ఐదు, మూడు మరియు పది, ఈ తత్త్వాల కలయిక అంతా మిథ్యాభాసము. దీనినంత ఒక్కటే తత్త్వములో శ్రీహరి చూపినారు.

నామము అన్ని మార్గములలో వరిష్టమైనది. నామ మార్గము స్వీకరించుటకు ఎలాంటి కష్టము కూడ కాదు. అజపాజపము వాణి విషయము కాదు. కావున లోనికి బయటకు ప్రవహిస్తున్న ఉఛ్ఛ్వాస నిశ్వాసలపై మనసు నిర్ధారము చేయుము.

.

నామము లేనిది అంతా వ్యర్థము కావున నేను రామకృష్ణుల పంతము పట్టినానని జ్ఞానదేవులు తెలిపినారు.


🌻. నామ సుధ -23 🌻

ఏడు, ఐదు, మూడు దశక సమూహము

ఇరువది ఐదుల కూడిక దేహము

ఈ కళలన్నీయు మిథ్యాభాసము

శ్రీహరి చూపెను ఒక్కటే తత్త్వము

ఆ విధముగ లేదు నామము

అన్ని మార్గములలో ఇదే వరిష్ఠము

“ఇష్టము ఉన్న కాదు కష్టము”

ఈ విధానము సులభతరము

అజపాజపము ప్రాణ ప్రవాహము

కాదుర సుమతీ వాణి విషయము

ప్రవహిస్తున్న ఉఛ్వాస నిశ్వాసము

అక్కడ మనసు నిర్ధారము చేయుము

జ్ఞానదేవుల పలుకులు వినుము

నామము మరిచిన బ్రతుకు వ్యర్థము

రామకృష్ణుల నడత భవ్యము

చెప్పినడిచిరి లోక ప్రసిద్ధము


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


01 Jan 2021




No comments:

Post a Comment