భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 136


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 136 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 15 🌻


551. ఆత్మ, అనుభవ పూర్వకముగా, ఆత్మజ్ఞానమును సంపాదించుటకు గల "ప్రధమ ప్రేరణము"ను ఇచ్చటే సార్థక పరచినది.

552. మానవునకు అజ్ఞానము ఉన్నంత వరకు మాయారూప సమన్వితంబైన బహుత్వమునకు అంత్యము లేదు. అట్లే - దివ్య జ్ఞానము సిద్ధించిన తరువాత, భగవంతుని అఖండ ఏకత్వమునకు కూడా అంత్యము లేదని మానవుడు గ్రహించును.

553. వాస్తవము ఏమనగా:- మానవుడే దేవుడయ్యేను. మానవుడే దేవుడు కాగలడు. తెలిసినను తెలియక పోయినను, మానవుడే భగవంతుడు.

554. సప్తమ భూమికలో, నిజమైన అనుభవముచే భగవంతుని అస్తత్వమును నమ్మెదరు.

555. నిజమునకు, ఆద్యంతములు లేకుండా ఎల్లప్పుడు 'ఆత్మయే భగవంతుడు' అన్నది ఏకైక సత్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jan 2021

No comments:

Post a Comment