🌹. శివగీత - 41 / 𝙏𝙝𝙚 𝙎𝙞𝙫𝙖-𝙂𝙞𝙩𝙖 - 41 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము
🌻. విభూతి యోగము - 5 🌻
శిరశ్చో త్తరతో యస్య - పాదౌ దక్షిణత స్తథా,
తస్య సర్వోత్తర రాస్సాక్షా - దోంకారో హం త్రిమాత్రకః 31
ఊర్ద్వ మున్నామయే యస్మా- దధ శ్చా పనయా మ్యథ
తస్మా దోంకార ఏవాహ - మేకో నిత్య స్సనాతనః 32
ఋచో యజూంషి సామాని - యో బ్రహ్మ యజ్ఞ కర్మణి
ప్రణామయే బ్రాహ్మణ్యేభ్య - స్తే నాహం ప్రణవో మతః 33
స్నేహొ యథా మాంస ఖండం - వ్యా ప్నోతి వ్యా పయత్యపి,
సర్వ లోకాన హం తద్వ - త్సర్వవ్యాపీ త తో స్మ్యహమ్ 34
బ్రహ్మ హరిశ్చ భగవా - నాద్యంతం నో పలబ్ద వాన్
త తో న్యేచ సూరాయస్మా - దనంతో హమితీ రి తః 35
ఎవడికైతే శిరస్సు ఉత్తరమున (దిక్కున) చరణములు దక్షిణ దిక్కున నుండునో అటువంటి సర్వశ్రేష్టుని, త్రిమాత్మకమగు ఓం( ప్రణవమును) కారమును నేనే, మద్భక్తులుగా నున్నవారి పాపములను బోనాడి పుణ్యలోకములను ప్రాప్తింప చేయుదును.
పాపిష్టులను నరకకూపంబులో పడత్రోయును. కనుక నేనే శాశ్వతుడను. ఓంకార రూపుడను, ఋగ్యజః సామవేదములను నేనే, యజ్ఞకర్మలను ఏ కారణము చేత ద్విజులకు ప్రణామము చేయుంచుచున్నాడనో ఆ కారణము వలన ప్రణవరూపుడను నేనే.
మాంసపిండ మెట్లు సమస్త జీవులయందు వ్యాపించి యున్నదో, అట్లే నేను సమప్రపంచమున పరిపూర్ణుడనై యుండుట వలన సర్వాంతర్యామియును నేనే.
మరియు బ్రహ్మ, విష్ణు - భగవంతుడు మిగత దేవతలందరును నా యాద్యంతములను తెలిసికొనలేక పోవుట వలన నన్నే అనంతుడనియెదరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 41 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 06 :
🌻 Vibhooti Yoga - 5 🌻
The one whose head is towards north and whose feet remains towards south, such a supreme one, and the Pranava of three syllables (A, U, M) is none other than me.
To the devotees I deliver from sins and give them upper regions, and I send the sinners to the hell. Hence I'm the ever lasting one. I'm in the form of Omkara.
I'm the Rik, Yajus, and Sama Vedas as well. Through sacrifice the Brahmanas propitiate through Omkara, and that form of Pranava is me.
The way flesh is an integral part of all creatures, similarly in the entire universe wholly I pervade, hence i'm the indweller of all (Sarvantaryami).
Because Brahma and Vishnu failed to locate my ends, I am called to be infinite (ananta).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
24.Aug.2020
No comments:
Post a Comment