నారద భక్తి సూత్రాలు - 75


🌹. నారద భక్తి సూత్రాలు - 75 🌹 

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. చలాచలభోధ

తృతీయాధ్యాయము - సూత్రము - 44

🌻 44. _ కామక్రోధమోహ స్మృతిభ్రంశ బుద్దినాశ కారణత్వాత్‌ ॥ 🌻

దుస్సాంగత్యమంటే, దుష్టులతో సాంగత్యం, నాస్తికులతో సాంగత్యం. కామక్రోధ మోహాలతో సంగత్వం కూడా దుస్పాంగత్యమె. ఇది బుద్ధిలో వివేకం లేకుండా చేస్తుంది.

అందువలన మోక్ష లక్ష్యంగా సాధన చెస్తే శ్రద్ధ కలుగుతుంది గాని, కాలక్షేపంగా చేస్తె పరిస్థితులకు తలొగ్గి మరల కామక్రోధాదుల వలలో పడతాడు.

మనస్సును శుభవాసనలను కలిగించే సాధనలందుంచక ఖాళీగా ఉంచితే పూర్వ అశుభవాసనలు లొంగదీసుకుంటాయి. కనుక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం ఆ సత్సంగాన్ని కొనసాగించాలి. విరామ మివ్వకూడదు.

కాయిక, వాచిక భక్తిని నిరతరం చేస్తూ ఉండాలి. మానసిక భక్తి కుదిరితే, భక్తుడు దుస్సాంగత్యం జోలికి వెళ్ళడు. గౌణభక్తి సాధకుడు పతనమయ్యె ప్రమాదమున్నది.

అతడు విరామమిస్తే దుస్పాంగత్య ప్రమాదంలో పడతాడు. అనగా ప్రలోభాలకు, వ్యసనాలకు బానిసవుతాడు. భక్తుడు కర్తవ్య పాలన అనే ముసుగులో అహంకార మమకారాలను తృప్తి పరుస్తూనే ఉంటాడు. నేను, నాది అనేవి అడ్డు తొలగాల్సింది పోయి, మరింత గట్టిగా అడ్డు పడుతుంటాయి.

అప్పుడతడు పేరుకే భక్తుడు గాని, నిజానికి అతడిలో భక్తి హరించిపోతూ ఉంటుంది. అతడి భక్తి కాపట్యం క్రిందకి వస్తుంది. కనుక భక్తుడు దుస్పాంగత్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ #సద్గురువిజ్ఞానస్వరూప్

24.Aug.2020

No comments:

Post a Comment