శ్రీ మదగ్ని మహాపురాణము - 75


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 75 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అధ మండల విధి - 4 🌻

ఇతరేషాం స్మృతం రూపం హార్దచిన్తామయం సదా |

స్థూలం వై రాజమాఖ్యాతం సూక్ష్మం వై లిఙ్గితం భవేత్‌. 28

చిన్తయా రహితం రూపమైశ్వరం పరికీర్తితమ్‌ | హృత్పుణ్డరీకనిలయం చైతన్యం జ్యోతిరవ్యయమ్‌. 29

బీజం బీజాత్మకం ధ్యాయేత్కదమ్బకుసుమాకృతి | కుమ్భాన్తరగతో దీపో నిరుర్ధప్రసవౌ యథా. 30

సంహతః కేవలస్తిష్ఠేదేవం మన్త్రేశ్వరో హృది | అనేక సుషిరే కుమ్భే తావన్మాత్రా గభస్తయః. 31

ప్రసరన్తి బహిస్తద్వన్నాడీభిర్బీజరశ్మయః | అథావభాసతో దైవీమాత్మకృత్యతనుం స్థితా. 32

హృదయాత్ర్పస్థితా నాడ్యో దర్శనేన్ద్రియగోచరాః | అగ్నీ షోమాత్మ కే తాసాం నాడ్యౌ నాసాగ్ర సంస్థితే. 33

సమ్యగ్గుహ్యేన యోగేన జిత్వా దేహసమీరణమ్‌ | జపధ్యానరతో మన్త్రీ మన్త్రలక్షణమశ్నుతే. 34

దేవాత్మకో భూతమాత్రాన్ముచ్యతే చేన్ద్రియగ్రహాత్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మణ్డలాదివర్ణనం నామ త్రింశోధ్యాయః

ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది.

విరాట్టు యొక్క స్వరూపము స్థూలము. లింగమయస్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయ కమలము నందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతిస్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము.

ఈ విధముగ ధ్యానింపవలెను. కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహతరూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయమునందు ప్రకాశించుచుండును.

అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయబీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మకదేహముతో ప్రకాశించును.

నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియమువరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్రభాగమునందుడును.

మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాదిసిద్ధులను పొందును.

వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయస్వరూపముతో నుండి, భరూతమాత్రలనుండియు, ఇంద్రియము లనెడు గ్రహములనుండి సర్వదా విముక్తుడగును.

అగ్ని మహాపురాణమునందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

24.Aug.2020

No comments:

Post a Comment