శివగీత - 49 / The Siva-Gita - 49


🌹.  శివగీత - 49 / The Siva-Gita - 49  🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ఏడవ అధ్యాయము

🌻. విశ్వరూప సందర్శన యోగము - 3 🌻

ఇత్యుక్త్వా - ప్రదదౌత స్మై - దివ్యం చక్షుర్మహేశ్వరః,
అథాద ర్శయదే తస్మై - వక్త్రం పాతాల సన్నిభమ్ 13

విద్యుత్కోటి ప్రతీకాశ - మతిభీ మంభయావహమ్,
తద్ద్రుష్ట్వైవ భయాద్రామో - జానుభ్యా మవనీం గతః 14

ప్రణమ్య దండ వద్భూమౌ - తుష్టావ చ పునః పునః
అథోత్ధాయ మహావీరో - యావదేవ ప్రపశ్యతి 15

వక్త్రం పురభిదస్తావ - దంతర్బ్రహ్మాండ కోటయః
చటకా ఇవ లక్ష్యన్తే - జ్వాలామాలా సమాకులాః 16

మేరుమందర వింధ్యాధ్యా - గిరియ స్సప్తసాగరాః,
దృశ్యంతే చంద్ర సూర్యాద్యాః - పంచభూతాని తే సురాః 17

అరణ్యాని మహానాగా: - భువనాని చతుర్దశ
ప్రతిబ్రహ్మండ మేవంతు - దృష్ట్యా దాశరథాత్మజః 18

సురాసురాణాం సంగ్రామాం - స్తత్ర పూర్వా పరానపి
విష్నోర్ధ శావ తారాంశ్చ - తత్కర్త వ్యాన్య ఫై ద్విజాః 19

పరాభ వాంశ్చ దేవానాం - పురదాహం మహేశితు:
ఉత్పద్యమానా నుత్పన్నాం - త్సర్వాన పి వినశ్యతః 20

దృష్ట్యా రామో భయావిష్ట - ప్రణనామ ముహుర్ముహు:
ఉత్పన్నత త్వ్వజ్ఞానోపి - బభూవ రఘునందనః 21

అథో పనిషదాం సార్ధై - రార్ధై స్తుష్టావ శంకరమ్

సూతుడు పలుకుచున్నాడు:-

ఇట్లు ఆదేశించిన వాడై శ్రీరామునకు దివ్యనేత్రమును అనుగ్రహించెను. తదుపరి రామునకు పాతాల లోకముతో సమానమైన తన నోటిని తెరచి చూపించెను.

కోటి మెరుపులతో సద్రుశమగు, అతీవ భయంకరమైన ఆ నోరును చూడగానే శ్రీరాముడు భయముతో తన మోకాళ్లను నేలపై పెట్టి కూలబడెను. నేలపై సాగిల పడి (సాష్టాంగ) నమస్కారం బొనర్చి పరమ శివుని గురించి మాటిమాటికి స్తుతించెను.

తరువాత నా మహావీరుడు లేచి త్రిపురాంతకుడైన ఈద్శ్వరుని నోరుతెరచి చూచినంతలోనే కోట్లకొలది బ్రహ్మాండ మండలములు అగ్నిజగ్నిజ్వాలలలో తపించుచున్న సెగలవలె అగుపడెను. ఇంకను ఆ నోటిలో మేరు మందర, వింధ్యాది పర్వతములు, సప్తసముద్రములు, దేవతలు, అరణ్యములు, ఆదిశేషుడు, చతుర్దశభువనములు, ప్రతిబ్రహ్మండములోను, దేవదానవ సంగ్రామము, వాటి పూర్వాపరాలు,

శ్రీవిష్ణువు యొక్క దశావతాతములు, వాటికర్తవ్య కార్యక్రమములు, దేవతల యొక్క పరాభవములును, ఈశ్వరుని యొక్క త్రిపుర సంహారము, పుట్టబోయేవాటిని, పుట్టినవాటిని, పుట్టుచున్నవాటిని, వీతిన్నన్నింటిని వినాశమును చూచి శ్రీరాముడు తత్త్వజ్ఞాని అయినప్పటికీ భయాన్వితుడై ముమ్మాటికి ప్రణమిల్లెను.

తరువాత ఉపనిషత్తులకు సారభూతములైన అర్ధముతో శంకరుని గురించి స్తుతించెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 49 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 3 🌻

Suta said:

In this way spoke lord Shiva and blessed Rama with divine eyes. Thereafter lord Shiva showed Rama by opened his mouth which was as wide as Patala loka. Blazing with billions of lightning strikes seeing such a dreadful scene Sri Rama trembling with fear collapsed on the ground on his knees.

He prostrated on the ground and numerous times he prayed to Lord Shiva. Then that mighty armed hero Rama gaining some strength again looked at the cosmic form of the Eswara the destroyer of the three cities. He sighted billions of universes as like as the groundnuts being roasted in blazing fires.

He saw inside the mouth Meru, Mandara Vindhya etc. giant mountains, seven great oceans, Sun, moon and planets, five elements, all deities, all dense forests. He also witnessed the mighty serpent AdiSesha, fourteen worlds, in every universe he witnessed Devasura Sangrama (battles of gods and demons), their cause and effects.

He also witnessed Lord Vishnu's ten primary incarnations and their roles, duties and work. He witnessed God's valor, the event of destruction of the three cities by Shiva.

He saw all the creatures who are yet to be born, which were born in past and which were being born. He further saw the destruction of all these creation. Seeing that horrifying scene, Sri Rama despite being a wise man, trembled with fear and saluted Lord Shiva again and again. Then Rama sang the essence of all Upanishads as a hymn in praise of Lord Shiva.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం ##శివగీత #SivaGita

01 Sep 2020

No comments:

Post a Comment