శ్రీ శివ మహా పురాణము - 212

🌹 .  శ్రీ శివ మహా పురాణము - 212  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

47. అధ్యాయము - 2

🌻. కామప్రాదుర్భావము - 1 🌻

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య నైమిషారణ్య వాసినః | పప్రచ్ఛ చ మునిశ్రేష్ఠః కథాం పాపప్రణాశినీమ్‌ || 1

సూతుడిట్లు పలికెను -

ఓ నైమిషారణ్య నివాసులారా! బ్రహ్మ యొక్క ఈ మాటలను విని మునిశ్రేష్ఠుడగు నారదుడు పాపములను పోగొట్టే కథను గురించి ప్రశ్నించెను (1).

నారద ఉవాచ |

విధే విధే మాహాభాగ కథాం శంభోశ్శుభావహామ్‌ | శృణ్వన్‌ భవన్ముఖాంభోజాన్న తృప్తోsస్మి మహాప్రభో || 2

అతః కథయ తత్సరం శివస్య చరితం శుభమ్‌ | సతీకీర్త్యన్వితం దివ్యం శ్రోతుమిచ్ఛామి విశ్వకృత్‌ || 3

సతీ హి కథముత్పన్నా దక్షదారేషు శోభనా | కథం హ రో మనశ్చక్రే దారాహరణ కర్మణి || 4

కథం వా దక్ష కోపేన త్యక్త దేహా సతీ పురా | హిమవత్తనయా జాతా భూయో వాకాశమాగతా || 5

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! మహాత్మా!మహాప్రభో! నీ ముఖపద్మము నుండి మంగళకరమగు శుంభుగాథను ఎంత విన్ననూ, నాకు, తృప్తి కలుగుటలేదు (2).

ఓ సృష్టికర్తా! నీవు శివుని శుభచరితమును సంపూర్ణముగా చెప్పుము. సతీ దేవి యొక్క యశస్సుతో గూడిన ఆ దివ్యగాథను నేను వినగోరుచున్నాను (3).

మంగళ స్వరూపురాలగు సతి దక్షపత్నియందు ఎట్లు జన్మించెను? శివుడు వివాహమాడవలెనని తలంచుటకు కారణమేమి? (4)

సతీదేవి పూర్వము దక్షుని యందు కోపముతో దేహమును వీడి, హిమవంతుని కుమార్తెయై జన్మించిన వృత్తాంతమెట్టిది? ఆమె తిరిగి శివుని భర్తగా పొందిన వృత్తాంతమెట్టిది? (5).

పార్వత్యాశ్చ తపోsత్యుగ్రం వివాహశ్చ కథం త్వభూత్‌ | కథ మర్ధ శరీరస్థా బభూవ స్మరనాశినః || 6

ఏతత్సర్వం సమాచక్ష్వ విస్తరేణ మహామతే | నాన్యోస్తి సంశయచ్ఛేత్తా త్వత్సమో న భవిష్యతి || 7

పార్వతి యొక్క అత్యుగ్రమగు తపస్సు, వివాహము ఎట్లు సంపన్నమైనవి? మన్మథుని భస్మము చేసిన శివునకు ఆమె అర్థాంగి ఎట్లు కాగలిగెను? (6).

ఓ మహాబుద్ధిశాలీ! ఈ సర్వమును విస్తరముగా చెప్పుము. నీతో సమానముగా సంశయములను పోగొట్టగలవాడు లేడు, ఉండబోడు (7).

బ్రహ్మో వాచ |

శృణు త్వం చ మునే సర్వం సతీ శివయశశ్శుభమ్‌ | పావనం పరమం దివ్యం గహ్యాద్గుహతమం పరమ్‌ || 8

ఏతచ్ఛంభుః పురోవాచ భక్త వర్యాయ విష్ణవే | పృష్టస్తేన మహాభక్త్యా పరోపకృతయే మునే || 9

తతస్సోsపి మయా పృష్టో విష్ణుశ్శై వవర స్సుధీః | ప్రీత్యా మహ్యం సమాచఖ్యౌ విస్తరాన్ము నిసత్తమ || 10

అహం తత్కథయిష్యామి కథామేతాం పురాతనీమ్‌ | శివాశివయశోయుక్తాం సర్వకామఫలప్రదామ్‌ || 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శుభకరము, పవిత్రము జేయునది, గొప్పది, దివ్యము, రహస్యములలో కెల్లా రహస్యమునగు సతీశివుల కీర్తిని నీవు పూర్ణముగా వినుము (8).

ఓ మహర్షీ! శివభక్తులలో శ్రేష్ఠుడగు విష్ణువు లోకోపకారము కొరకై గొప్ప భక్తితో పూర్వము ఇటులనే ప్రశ్నించగా శంభుడు చెప్పియున్నాడు (9).

శివభక్తులలో శ్రేష్ఠుడు, జ్ఞానియగు విష్ణువును నేను ప్రశ్నించగా, ఆయన ప్రీతితో నాకు విస్తరముగా చెప్పెను. ఓ మహర్షీ! (10)

శివశివులకీర్తితో గూడినది, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునదియగు ఈ పురాతన గాథను నేను చెప్పగలను (11).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

01 Sep 2020

No comments:

Post a Comment