1-September-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 476 / Bhagavad-Gita - 476🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 264🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 144🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 166🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 80 / Sri Lalita Sahasranamavali - Meaning - 80🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 83🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 53🌹
8) 🌹. శివగీత - 48 / The Shiva-Gita - 49🌹
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 31🌹
10) 🌹. సౌందర్య లహరి - 91 / Soundarya Lahari - 91🌹

11) 🌹. శ్రీమద్భగవద్గీత - 391 / Bhagavad-Gita - 391🌹

12) 🌹. శివ మహా పురాణము - 212🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 88 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 83 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 99 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 30🌹
17) శ్రీ విష్ణు సహస్ర నామములు - 1 / Sri Vishnu Sahasranama - 1 🌹 
18) 🌹. అద్భుత సృష్టి - 20 🌹
19) 🌹 Seeds Of Consciousness - 163🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 42🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 19 📚
22)


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 476 / Bhagavad-Gita - 476 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 21 🌴*

21. కార్యకారణకర్తృత్వే హేతు: ప్రకృతిరుచ్యతే |
పురుష: సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ||

🌷. తాత్పర్యం : 
భౌతిక కార్య, కారణములన్నింటికిని ప్రక్తుతియే హేతువనియు, జగమునందలి పలు సుఖదుఃఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది.

🌷. భాష్యము :
జీవుల వివిదేంద్రియముల వ్యక్తీకరణకు భౌతికప్రకృతియే హేతువు. ఎనుబదినాలుగులక్షల జీవారాసులన్నియును ప్రకృతి నుండియే ఉద్భవించినవి.

 అవియన్నియును వాస్తవమునకు భిన్నదేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియకోరికల వలన కలుగుచున్నవి. అట్టి వివిధదేహములందు అతడు ప్రవేశింపజేయబడినంత వివిధములైన సుఖదుఃఖముల ననుభవించుచుండును. 

అతడు అనుభవించు ఆ సుఖదుఃఖములు అతని దేహము వలననే సంప్రాప్తించి యుండును గాని తన వలనకాదు. అనగా నిజస్థితిలో జీవుడు ఆనందమయుడని పలుకుటలో ఎట్టి సందేహమును లేదు. కనుక అట్టి నిజస్థితియే అతని యథార్థస్థితి. 

కాని ప్రకృతిపై అధికారము చెలాయించవలెనను కోరికను కలిగియుండుటచే అతడు ఈ భౌతికజగమునకు చేరియున్నాడు. అట్టి భావనలు ఆధ్యాత్మికజగత్తు నందుండవు. అది సదా అట్టి వానినుండి దూరమై, పవిత్రమై యుండును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 476 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 21 🌴*

21. kārya-kāraṇa-kartṛtve
hetuḥ prakṛtir ucyate
puruṣaḥ sukha-duḥkhānāṁ
bhoktṛtve hetur ucyate

🌷 Translation : 
Nature is said to be the cause of all material causes and effects, whereas the living entity is the cause of the various sufferings and enjoyments in this world.

🌹 Purport :
The different manifestations of body and senses among the living entities are due to material nature. 

There are 8,400,000 different species of life, and these varieties are creations of the material nature. They arise from the different sensual pleasures of the living entity, who thus desires to live in this body or that. 

When he is put into different bodies, he enjoys different kinds of happiness and distress. His material happiness and distress are due to his body, and not to himself as he is.

 In his original state there is no doubt of enjoyment; therefore that is his real state. Because of the desire to lord it over material nature, he is in the material world. In the spiritual world there is no such thing. 

The spiritual world is pure, but in the material world everyone is struggling hard to acquire different kinds of pleasures for the body. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 264 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 31
*🌻 The greatness of reading Charithamrutham 🌻*

Shankar Bhatt! After reading the ‘Sripada Srivallabha Charithamrutham’, which you write, if one does ‘Anagha Ashtami Vratham’ on Ashtami day in the first or second half of the month and give food to 11 people or utilize the equivalent money for feeding one gets immediate results.

Do not think Sri Charithamrutham book as mere book only. It is a great flow of Chaitanyam full of life. The power in those letters will flow into my chaitanyam while you are reading it.  

As you get union of thought with me without your knowledge, all your righteous desires will be fulfilled by My grace. Even if you keep this treatise in your puja mandir, it will create auspicious vibrations. The dark powers and the powers causing ill fate will be driven away. 

The fruit of merit of those who blame or criticize Sripada Srivallabha Charithamrutham, knowingly or unknowingly, will be taken away part by part, by ‘Dharma Devathas’ and will be distributed to eligible poor people. In this way, they keep becoming poor and the poor keep becoming rich. 

 It is being said under oath as true in each letter. It is standard by itself. People who blame and criticize this will lose their heaps of merit in instalments and ultimately become poor.  

To remove the pain of poverty one should read this book with devotion and concentration. 

End of Chapter 31

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 143 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సప్తర్షి మండలము - కాలగణనము 🌻*

ధ్రువము చుట్టును నక్షత్ర మండలము మొలత్రాడుగా భూమధ్యరేఖ వెంట తిరిగివచ్చుటకు ఇరువదియారువేల (26,000) సంవత్సరములు పట్టును.  

సప్తర్షులు నక్షత్ర మండలమున కెదురుగా ఒకమారు తిరిగి వచ్చినట్లు కనిపించుటకు ఇరువదియారు వందల (2,600) సంవత్సరములు పట్టును. 

ఇందు శతాబ్దుల , సహస్రాబ్దుల కొలతలు కొలుచుటకు వీలగును కనుక యుగములలో జరిగిన కథలను కొలుచుట కిదియే ఆధారము. 

ఉదాహరణకు : " ఆసన్ మఖాసు , మునయః యుధిష్ఠిరే, శాసతి పృథివీం " అని వరాహమిహిరా చార్యులు చెప్పిరి. మఖా నక్షత్రమున సప్తర్షులుండగా యుధిష్ఠిరుడు భూమిని పాలించెనని యర్థము. దీనిని బట్టి "షట్ ద్విక పంచద్వియుతః , శకకాలస్తస్య రాజ్ఞస్య " అని వరాహమిహిరుడు యుధిష్ఠిరుని కాలమును సాధించెను. శకకాలమైన శాలివాహన శకమునకు 2526 సంవత్సరములకు పూర్వము యుధిష్ఠిరుడు పరిపాలించెనని సాధించెను.  

దీనిని బట్టి కలియుగమునందు ఇప్పటి కెన్ని సంవత్సరములు గడచినవో తెలియును. ధర్మరాజు పరిపాలన అంతమగుటతో కలియుగ మారంభించెను. ఈ గణనము నాధారముగా గొనియే ఇప్పటి పంచాంగ కర్తలు కలియుగ సంవత్సరములను నిర్ణయించుచున్నారు.  

ఈ విధముగా ధ్రువుని , వాని‌ననుసరించు సప్తర్షులను ఆధారముగా గొని , యే యుగమందలి కథల కాల నిర్ణయమునైనను చేయవచ్చును.  

పురాణమందలి కథల కాలమిట్లే నిర్ణయింపబడెను.

భూమిపై పరిభ్రమణము ననుభవించు వారి కందరికిని పునర్జన్మ లుండును. ధ్రువుడు పరిభ్రమింపడు కనుక అతనికి పునర్జన్మ ముండదు.
...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.* 🌻
*ధ్రువోపాఖ్యానము*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 164 🌹*
*🌴 The Buddhic Plane - 6 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Calling down the Light 🌻*

This, we want to accomplish through spiritual practice such as the daily singing of Gayatri. The true essence of Gayatri is the alignment with the Buddhic plane. 

We ask for a stimulation of the Buddhic plane in us so that the light can descend and rule over our thinking. 

“Tat Savitur Varenyam” – may the light embrace us. We meditate upon the source of all light, “Bhargo Devasya Dhimahi”, so that the light of the soul can descend:

 “Dhiyo Yonah Prachodayat”. And in the Great Invocation, we say, “From the Point of Light within the Mind of God - Let Light stream forth into the minds of men - Let Light descend on Earth.”

We can visualize how the light radiates from the head center, from the jewel in the lotus, and penetrates us from the Ajna center: “OM MANI PADME HUM”. 

Buddha gave it so. Hum is like OM a sound of invocation. The light should penetrate us to that extent that our personality is freed of all egotism and we recognize the soul in everything. 

We should contemplate upon this daily when we fill our system with the energy of the soul.

All those who continually stand in the light of the soul on the Buddhic plane are called Buddhas or Masters of Wisdom. 

Especially during the Vaisakh full moon, the full moon of the Buddha, we can open ourselves to receive the energies of the Buddhic plane.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Mithila / seminar notes – Master E. Krishnamacharya: Occult Anatomy / Full Moon Meditations.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 80 / Sri Lalita Sahasranamavali - Meaning - 80 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్లోకం 153*

*పరంజ్యోతి: పరంధామ పరమాణు: పరాత్పరా*
*పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదినీ* 

806. పరంజ్యోతి: : 
దివ్యమైన వెలుగు 

807. పరంధామ : 
శాశ్వతమైన స్థానము కలిగినది 

808. పరమాణు: : 
అత్యంత సూక్ష్మమైనది 

809. పరాత్పరా : 
సమస్తలోకములకు పైన ఉండునది 

810. పాశహస్తా : 
పాశమును హస్తమున ధరించినది 

811. పాశహంత్రీ : 
జీవులను సంసార బంధము నుంది విడిపించునది 

812. పరమంత్ర విభేదినీ : 
శత్రువుల మంత్రప్రయోగములను పటాపంచలు చేయునది  

*🌻. శ్లోకం 154*

*మూర్తామూర్తా నిత్యతృప్తా ముని మానస హంసికా*
*సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ*  

813. మూర్తామూర్తా : 
రూపం కలది, రూపం లేనిది రెందూ తానే ఐనది 

814. నిత్యతృప్తా : 
ఎల్లప్పుదు తృప్తితో ఉండునది 

815. మునిమానసహంసికా : 
మునుల మనస్సులనెడి సరస్సులందు విహరించెడి హంసరూపిణి 

816. సత్యవ్రతా : 
సత్యమే వ్రతముగా కలిగినది 

817. సత్యరూపా : 
సత్యమే రూపముగా కలిగినది 

818. సర్వాంతర్యామినీ : 
సృష్టీ అంతటా వ్యాపించినది 

819. సతీ : 
దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి ఐన సతీదేవి  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 80 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 80 🌻*

806 ) Paramjyothi -   
She who is the ultimate light

807 ) Param dhama -   
She who is the ultimate resting place

808 ) Paramanu -   
She who is the ultimate atom

809 ) Parath para -   
She who is better than the best

810 ) Pasa Hastha -   
She who has rope in her hand

811 ) Pasa Hanthri -   
She who cuts off attachment

812 ) Para manthra Vibhedini -   
She who destroys the effect of spells cast

813 ) Moortha -   
She who has a form

814 ) Amoortha -   
She who does not have a form

815 ) Anithya thriptha -   
She who gets happy with prayers using temporary things

816 ) Muni manasa hamsika -   
She who is the swan in the mind ( lake like) of sages

817 ) Satya vritha -  
 She who has resolved to speak only truth

818 ) Sathya roopa -   
She who is the real form

819 ) Sarvantharyamini -   
She who is within everything

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 83 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
 తృతీయాధ్యాయము - సూత్రము - 50 

*🌻 50. స తరతి స తరతి స లోకాంస్తారయతి ॥ - 2 🌻*

2) నిర్మమో నిరహంకారః సశాంతి మధిగచ్చతి ॥ - (2:71) భగవద్గీత

మోహం, అహంకారం నిరసిస్తే మిగిలెది శాంతి. ఈ శాంతి యుతమైన బుద్ధి ఆత్మ వశవర్తియై వర్తించాలి. ఎన్ని సళ్ళు సముద్రంలోకి చేరుతున్నట్లు కనిపించినా, సముద్ర మట్టం పెరగదు. కారణం ఆ సీళ్ళన్నీ ఆ సముద్రంలోనుండి వచ్చినవే. విషయాలు, వాంఛలు పొందాలనే భోక్త, నేనె చేస్తున్నాననే కర్త, అంతా మనోభావాలే, ప్రతిబింబాలే. యధార్థంగా ఆత్మయందు ఇవి లేవ. వీటిచే ఆత్మ స్థితిలో ఎల్బీ చలనాలు లేవు.

3) నచ సన్వసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి 11 - (8:4) భగవద్గీత 

కర్మ సన్యాసం, కర్మ ఫలత్యాగం అనే రెండు విధాలైన కర్మాచరణ ఆత్మ భావంలో స్థితమైన అంతఃకరణ పొంది స్థితిని సిద్ధి అని తెలిసి, ఆత్మ నిష్టయందున్న ప్రీతిచేత అధిగమించాలి.

4) జ్ఞానం లబ్ద్వా, పరామ్‌ శాంతి మచిరేణాధిగచ్చతి 1 - (4:99) భగవద్గీత

స్వరూప జ్ఞానం వలన ప్రశాంతత, లేక పరాంశాంతి అనే స్థితిని పొందు తాదు. ఇరువది నాల్లు తత్త్వాలందు వ్యవహరించక, ఇరువది ఐదవది అయిన స్థితిలో కూటస్థమై ఆత్మ స్టితమగుటచెత పొందిన పరమమైన శాంతిని సాధించాలి. ఇంద్రియ గతమైనది అంతా పూర్తిగా శమిస్తుంది. 

5) యోగయుక్తో మునిర్బహ్మ నచిరెణాధిగచ్చతి 11 - (5:6) భగవద్గీత

తనయందు తానె రమిస్తూ, మనో మౌనంను పాటించె సాధకుడు బ్రహ్మంతో, లేక పరమాత్మతో అనుసంధానం చేయగలడు. పంచ భూతాలతో కూడిన ప్రకృతి భావాలను నిరసిన్తాడు. సన్యసిన్తాడు.

6) సయోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో ౨_ధిగచ్చతి ॥
- (5:24) భగవద్గీత

ఇట్టి యోగి పరమాత్మ యందలి ప్రేమచేత తనను తాను అధ్యయనం చేసి తెలుసుకున్న జ్ఞానం చెత విరాట్‌ స్వరూపమైన బ్రహ్మమందు జరుగుతున్న సంకల్ప, వికల్ప, శూన్య స్థితులను తెలుసుకుంటాడు. తనయందలి అనాహత నాదం, విశ్వమందలి ఓంకార నాదం ఒక్కటెనని తెలుస్తుంది. ఇట్ట నాదాంతాన్ని లక్ష్యంచి, బ్రహ్మీ భూతుడవుతాడు.

7) _ శాంతిం నిర్వాణపరమాం మత్సంస్దా మధిగచ్చతి 11 - (6:15) భగవద్గీత

ఇట్ట పేమానురాగాలు పరమాత్మ యెడల ఏర్పడి విడదీయరాని స్థితి కూడా ఏర్పడి పరం అనునది స్పష్టమై దానియందే శరీర ప్రాణ, మనో వ్యాపకం లయమై తాను సర్వవ్యాపిని అనే స్థిరత్వాన్ని పొంది మరణ భయం వీడి శాంతిని పొందుతాడు.

8) గుణేభ్యశ్చ పరం వేత్తి మధ్యావం సోలి ధిగచ్చతి 11 - (14:19) భగవద్గీత 

సర్వ కారణమూ ఈశ్వరుడే అని భావించే స్థితిలో సమస్త ప్రపంచమూ గుణ నిర్మితమై ఉన్నది. పరమాత్మ గుణ రహితుడదని, అట్టి పరమాత్మ యందెే తనకు కలిగిన కారణ రహిత ప్రేమవల్ల సృష్టి కార్యమంతా గుణ విశేషమే గాని, స్వయంగా తాను, అనగా బ్రహ్మం కర్త కాదని ఉపశమించిన స్థితిలో తన యందలి నిస్సంకల్ప స్థితిలోకి ప్రవెశించి ఊరక ఉంటాడు, నిష్టాయుదవుతాదు.

9) _ నైష్మర్యసిద్ధిం పరమాం సన్వ్యాసె నాధిగచ్చతి ॥
- (18:49) భగవద్గీత

సంకల్పాన్ని సన్యసించడం ద్వారా నైష్కర్య్య సిద్ధి అనె పరాభక్తి స్థితిని పొందుతాడు. అనగా క్షరమైన ప్రకృతి భావం తోచదు. అక్షరమైన ఆత్మ భావం పురుషోత్తముదైన పరమాత్మయందు సంయమించబడుతుంది. ఇది బంధరాహిత్యం, పైగా మోక్ష సన్యాస స్థితి కూడా.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 52 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj

*🌻 Everyone needs a Guru. One’s life is incomplete without a Guru. When noble souls take refuge with a Sadguru, and walk the noble path, they will attain higher worlds. 🌻*

We discussed that the little children – Sri Krishna and Sudhama – were shivering in the dark coldness of what looked like the night of doomsday.  

They were terrified. Somehow the night passed. At dawn, Sage Sandeepani who had set out in search of the two children found them shivering in the cold. He was overcome with compassion. 

He drew them close to him and lovingly wiped their bodies dry with his shawl. Isn’t it amazing! The Guru is like a mother, like a father. He commended the boys’ bravery.  

He said that outstanding disciples like them sacrifice themselves completely in the service of the Guru. He said that one must be blessed to be able to serve the Guru. He was very pleased with them. 

He blessed them generously with fulfillment of all their desires and said “All the Vedas and other scriptures you learn here will continue to grant you auspiciousness in all the other worlds you go to”. He held their hands and took them back home. 

Thus, the little children, Sri Krishna and Sudhama immersed themselves completely in the service of the Guru without worrying about their mortal bodies, as a result of which they got blessed immensely by their Guru.  

Once, when the Guru asked Sri Krishna for Guru Dakshina in the form of bringing his dead son back, Sri Krishna, along with his brother Balarama went to Lord Yama and got the Guru’s son back. This is a wonderful story.  

By accomplishing such impossible feats, he greatly pleased his Guru. By the Guru’s grace, Sri Krishna achieved everlasting fame. Only one who has the Guru’s grace can find lasting peace. 

Therefore, everyone needs a Guru. One’s life is incomplete without a Guru. When noble souls take refuge with a Sadguru, and walk the noble path, they will attain higher worlds.   

Thus Lord Shiva, after explaining that the Guru has all the attributes of the Trinity and is none other than the Trinity, goes on to say that the Guru is the Parabrahman who’s beyond all attributes.   

Sloka: “Durlabham trishu lokeshu” 

Lord Shiva says, “Parvati, I will tell you the secret that no one in all the three worlds knows”. Lord Shiva is saying that Guru is Parabrahma. We’ll see what he says next.  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 49 / The Siva-Gita - 49 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ఏడవ అధ్యాయము
*🌻. విశ్వరూప సందర్శన యోగము - 3 🌻*

ఇత్యుక్త్వా - ప్రదదౌత స్మై - దివ్యం చక్షుర్మహేశ్వరః,
అథాద ర్శయదే తస్మై - వక్త్రం పాతాల సన్నిభమ్ 13
విద్యుత్కోటి ప్రతీకాశ - మతిభీ మంభయావహమ్,
తద్ద్రుష్ట్వైవ భయాద్రామో - జానుభ్యా మవనీం గతః 14
ప్రణమ్య దండ వద్భూమౌ - తుష్టావ చ పునః పునః
అథోత్ధాయ మహావీరో - యావదేవ ప్రపశ్యతి 15
వక్త్రం పురభిదస్తావ - దంతర్బ్రహ్మాండ కోటయః
చటకా ఇవ లక్ష్యన్తే - జ్వాలామాలా సమాకులాః 16
మేరుమందర వింధ్యాధ్యా - గిరియ స్సప్తసాగరాః,
దృశ్యంతే చంద్ర సూర్యాద్యాః - పంచభూతాని తే సురాః 17
అరణ్యాని మహానాగా: - భువనాని చతుర్దశ
ప్రతిబ్రహ్మండ మేవంతు - దృష్ట్యా దాశరథాత్మజః 18
సురాసురాణాం సంగ్రామాం - స్తత్ర పూర్వా పరానపి
విష్నోర్ధ శావ తారాంశ్చ - తత్కర్త వ్యాన్య ఫై ద్విజాః 19
పరాభ వాంశ్చ దేవానాం - పురదాహం మహేశితు:
ఉత్పద్యమానా నుత్పన్నాం - త్సర్వాన పి వినశ్యతః 20
దృష్ట్యా రామో భయావిష్ట - ప్రణనామ ముహుర్ముహు:
ఉత్పన్నత త్వ్వజ్ఞానోపి - బభూవ రఘునందనః 21
అథో పనిషదాం సార్ధై - రార్ధై స్తుష్టావ శంకరమ్

సూతుడు పలుకుచున్నాడు:- 
ఇట్లు ఆదేశించిన వాడై శ్రీరామునకు దివ్యనేత్రమును అనుగ్రహించెను. తదుపరి రామునకు పాతాల లోకముతో సమానమైన తన నోటిని తెరచి చూపించెను. 

కోటి మెరుపులతో సద్రుశమగు, అతీవ భయంకరమైన ఆ నోరును చూడగానే శ్రీరాముడు భయముతో తన మోకాళ్లను నేలపై పెట్టి కూలబడెను. నేలపై సాగిల పడి (సాష్టాంగ) నమస్కారం బొనర్చి పరమ శివుని గురించి మాటిమాటికి స్తుతించెను.

 తరువాత నా మహావీరుడు లేచి త్రిపురాంతకుడైన ఈద్శ్వరుని నోరుతెరచి చూచినంతలోనే కోట్లకొలది బ్రహ్మాండ మండలములు అగ్నిజగ్నిజ్వాలలలో తపించుచున్న సెగలవలె అగుపడెను. ఇంకను ఆ నోటిలో మేరు మందర, వింధ్యాది పర్వతములు, సప్తసముద్రములు, దేవతలు, అరణ్యములు, ఆదిశేషుడు, చతుర్దశభువనములు, ప్రతిబ్రహ్మండములోను, దేవదానవ సంగ్రామము, వాటి పూర్వాపరాలు, 

 శ్రీవిష్ణువు యొక్క దశావతాతములు, వాటికర్తవ్య కార్యక్రమములు, దేవతల యొక్క పరాభవములును, ఈశ్వరుని యొక్క త్రిపుర సంహారము, పుట్టబోయేవాటిని, పుట్టినవాటిని, పుట్టుచున్నవాటిని, వీతిన్నన్నింటిని వినాశమును చూచి శ్రీరాముడు తత్త్వజ్ఞాని అయినప్పటికీ భయాన్వితుడై ముమ్మాటికి ప్రణమిల్లెను.  

తరువాత ఉపనిషత్తులకు సారభూతములైన అర్ధముతో శంకరుని గురించి స్తుతించెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 49 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 07 :
*🌻 Vishwaroopa Sandarshana Yoga - 3 🌻*

Suta said: 

In this way spoke lord Shiva and blessed Rama with divine eyes. Thereafter lord Shiva showed
Rama by opened his mouth which was as wide as Patala loka. Blazing with billions of lightning strikes
seeing such a dreadful scene Sri Rama trembling with fear collapsed on the ground on his knees. 

He prostrated on the ground and numerous times he prayed to Lord Shiva. Then that mighty armed hero
Rama gaining some strength again looked at the cosmic form of the Eswara the destroyer of the three
cities. He sighted billions of universes as like as the groundnuts being roasted in blazing fires. 

He saw inside the mouth Meru, Mandara Vindhya etc. giant mountains, seven great oceans, Sun, moon and
planets, five elements, all deities, all dense forests. He also witnessed the mighty serpent AdiSesha, fourteen worlds, in every universe he witnessed Devasura Sangrama (battles of gods and demons), their cause and effects. 

He also witnessed Lord Vishnu's ten primary incarnations and their roles, duties and work. He witnessed God's valor, the event of destruction of the three cities by Shiva. 

He saw all the creatures who are yet to be born, which were born in past and which were being born. He further saw the destruction of all these creation. Seeing that horrifying scene, Sri Rama despite being a wise man, trembled with fear and saluted Lord Shiva again and again. Then Rama sang the essence of all Upanishads as a hymn in praise of Lord Shiva.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 40 / Sri Gajanan Maharaj Life History - 40 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 8వ అధ్యాయము - 5 🌻*

శ్రీమహారాజు అక్కడ ఉండడంతో ఆతోట ఒక పుణ్యస్థలం అయింది. రాజు ఉన్నప్రదేశమే రాజధాని అయినట్టుగా అయింది. శ్రీమహారాజు అవసరాలు తీర్చడానికి భాస్కరు మరియు తుకారాం అక్కడే ఉన్నారు. 

కృష్ణాజి స్వయంగా, శ్రీమహారాజు భోజనం వగైరా విషయాలు చూస్తూ, శ్రీమహారాజు భుజించిన తరువాతనే తను తినేవాడు. ఆతోటలో ఉంటూ ఉండగా, ముందునుండి శ్రీమహారాజు గూర్చి విన్న 15/20 మంది ఆస్తికులు అక్కడికి వచ్చారు. పవిత్రమయిన గంగాజలంతో, తీర్ధయాత్రలలో వీళ్ళు రామేశ్వరం వెళుతున్నట్టు కృష్ణాజికి చెప్పారు. 

తాము శ్రీబ్రహ్మగిరి మహారాజు శిష్యులమని, ఆయనకూడా తమతో ఉన్నారని, ఆయనతో గంగోత్రి, జమునోత్రి, హింగళాజ్ , గిరినార్, డాకోరు వంటి అనేక పుణ్యక్షేత్రాలు నడకన దర్శించామని అంటారు. ఇంకా మాబ్రహ్మగిరి భగవత్ స్వరూపుడని, బహుశ మీ పూర్వజన్మ పుణ్యఫలంవల్ల మీదగ్గరకు వచ్చారని అంటారు. 

కావున మాకు షిరా, పూరీలు భుజింపచెయ్యి, మరియు పొగత్రాగేందుకు కొద్దిగా గంజాయి ఇవ్వు, మేము 3 రోజులు ఇక్కడ ఉంటాము, 4వ రోజున వెళ్ళిపోతాము, ఆపిచ్చి వాడికి ఆతిధ్యం ఇచ్చేబదులు మాకు సేవచేసే ఈ అవకాశాన్ని తీసుకుందుకు సంకోచించకు, లేకపోతే ఆవును వెళ్ళగొట్టి గాడిదను మేపినట్టు అవుతుంది. 

మేము అన్నీత్యజించిన పూర్తి వేదాలు తెలిసిన ఆస్తికులం, నీకు ఇష్టంఉంటే మా ప్రవచనాలువిను అని అన్నారు. ఈరోజుకు రొట్టె / శెనగపిండి కూరతినండి రేపు మీకు షిరా, పూరీలు తినిపిస్తాను, శివుడు స్వయానా శ్రీగజానన్ మహారాజు రూపంలో అక్కడ కూర్చుని ఉన్నారు కావున మీకు కావలసినంత గంజాయ త్రాగడానికి దొరుకుతుంది అని కృష్ణాజి అన్నాడు. 

మధ్యహ్నసమయంలో నూతిదగ్గర ఆఆస్తికులు రొట్టెలు శెనగపిండి కూర తిన్నారు. సాయంత్రం వారంతా శ్రీగజానన్ మహారాజు ముందు ఆ పందిరి క్రింద కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళ ముఖ్యుడు శ్రీబ్రహ్మగిరి గీతాధ్యయనం మొదలు పెట్టాడు. ఆస్తికులు మరి కొంతమంది ఊరిప్రజలు బ్రహ్మగిరి ప్రవచనం వింటున్నారు. ఇతను నైనంచిందంతి అన్న మొదటి శ్లోకంమీద ప్రవచించటం మొదలు పెట్టాడు. 

బ్రహ్మచారి ఒత్తి కపటయోగి, మరియు ఏవిధమయిన దైవిక జ్ఞానం లేనివాడు. కావున అక్కడ వింటున్న ప్రజలు, సహజంగా అతని ప్రవచనంతో సంతృప్తి పొందక ఈయన మాటలతో గారడి చేస్తున్నాడు అని అంటారు. అతని ప్రవచనం పూర్తిఅయిన తరువాత వారంతా శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వెళ్ళారు. 

అక్కడ మేము వేదాంతం విన్నాము కాని ఇక్కడ శ్రీమహారాజు రూపంలో నిజమయిన వేదాంతిని చూస్తున్నాం. అక్కడ చరిత్ర విన్నాం, ఇక్కడ చరిత్రకారుడిని చూస్తున్నాం అని అన్నారు. గంజాయి పొగ పీల్చుతున్న ఆస్తికులకు ఈమాటలు చికాకు కలిగించాయి. 

శ్రీమహారాజు ఒక మంచంమీద కూర్చుని ఉండగా, భాస్కరు ఆయనకు గంజాయి గొట్టం పొగ పీల్చడానికి ఇస్తూ ఉన్నాడు. ఒక నిప్పుతునక దానినుండి ఆమంచంమీద పడి, నెమ్మదిగా పొగరావడం మొదలయి, మరికొద్ది సేపటిలో మంచం మొత్తం మంటలతో నిండింది. భాస్కరు అది చూసి, ఆమంచం టేకుతోచేసింది, నీళ్ళుపోస్తే తప్ప మంటలు ఆపలేము అని శ్రీమహారాజును మంచం దిగిరమ్మని అన్నాడు. 

ఆ తరువాత మంటలు ఆపడానికి నీళ్ళు తేకండి. ఓబ్రహ్మచారి మాహారాజు వచ్చి ఈమంచంమీద నాతోకూర్చో. గీత ఆర్ధంతోసహా తెలిసినవాడవు నువ్వ, ఇప్పుడు దానిని పరీక్షించే సమయంవచ్చింది. మంటలు బ్రహ్మను మండించవని నిరూపించు. ఒక గంటసేపు నీవు నైనంచిందంతి పై ప్రవచనం ఇచ్చావు, కనుక నువ్వు ఈమండుతున్న మంచంమీద నాతో కూర్చోడానికి భయపడకూడదు, భాస్కర వెళ్ళి అతనిని మర్యాదతో నాతో ఇక్కడ కూర్చునేందుకు తీసుకురా అని శ్రీమహారాజు అన్నారు. 

మంచి దృఢమయిన శరీరంకల భాస్కరు, శ్రీమహారాజు యొక్క ఈఆదేశంతో శ్రీమహారాజు దగ్గరకు తీసుకు వెళ్ళడానికి బ్రహ్మగిరి చెయ్యపట్టుకున్నాడు. మంచం పూర్తిగా మంటలతో నిండి, అన్ని వైపులనుండి మంటలు పెద్దఎత్తున పైకి ఎగసి వస్తున్నాయి, కాని శ్రీమహారాజు ఒక్కింత ఇటు అటు కదలకుండా దృఢంగా దానిమీద కూర్చుని ఉన్నారు. కయాదు కుమారుడయిన శ్రీప్రహ్లాదుని ఈవిధంగా మంటలమధ్య నిలబెట్టినట్టు శ్రీవ్యాసుడు భాగవతంలో వ్రాసారు, 

అదేవిధమైన దృశ్యం శ్రీగజానన్ మహారాజు, కృష్ణాజిపాటిల్ తోటలో చూపించారు. శ్రీమహారాజు దగ్గరకు తీసుకు రావడానికి భాస్కరు, బ్రహ్మగిరి చెయ్యి పట్టుకున్నాడు. దయచేసి నన్ను ఆ మండుతున్న మంచం దగ్గరకు తీసుకుపోకు, శ్రీగజానన్ మహారాజు గొప్పతనం, అధికారం నేను గుర్తించలేదు అని అంగీకరిస్తున్నాను అని అతను, భాస్కరును ప్రాధేయపడ్డాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 40 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 8 - part 5 🌻*

The Garden became a holy place due to the presence of Shri Gajanan Maharaj there. This is so because a place of the king's stay becomes the capital of the Kingdom. 

Bhaskar and Tukaram Kokatya stayed with Shri Gajanan Maharaj to render Him necessary service. Krishnaji used to attend personally to Shri Gajanan Maharaj ’s food and ate only after Maharaj had taken His meals. 

While Maharaj lived thus in Krishnaji’s garden, some 15 to 20 ascetics, who had heard about Shri Gajanan Maharaj, arrived there. They told Krishnaji Patil that they were on a pilgrimage and were on their way to Rameshwar with the holy water from the Ganga with them. 

They also said that they were the disciples of Shri Brahmagiri Maharaj, who was also with them, and with him they had visited, on foot, several holy places like Gangotri, Jamnotri, Hinglal and Girnar Dakur. 

They further said, Our Brahmagiri, who enslaved God Himself, has come to you probably due to the good deeds of your past life. So feed us ‘Shira Puri’ and give us some Ganja to smoke. 

We shall stay here for three days and leave on the fourth day. Do not hesitate to take this opportunity to serve us instead of this mad man whom you are feeding here. It is like kicking a cow and feeding a donkey. 

We are ascetics who know all the Vedas and have renounced everything. If you would like, come and listen to our discourse. Krishnaji said, I will entertain you with Shira Puri tomorrow. 

For today, please take these breads and besan. You will get a lot of Ganja to smoke as Shri Shiva Himself is sitting here in the form of Shri Gajanan Maharaj. In the noon time the ascetics took their meals of bread and besan near the well. 

In the evening they sat under the shade before Shri Gajanan Maharaj and their mahant, Shri Brahmagiri, started reading the Bhagwad Geeta. The ascetics and some people from town were listening to the discourse of Brahmagiri, who started to preach on the first stanza of Nainam Chindanti. 

The Bramhachari was a pure hypocrite with no personal spiritual attainment. The people, therefore, were naturally not impressed by his talk and said that he was only playing with words. 

When his discourse was over, all the people went to Shri Gajanan Maharaj for His Darshan. They said, We heard the philosophy over there, but see here in Shri Gajanan Maharaj the reality itself. There we heard the history and here is the Man himself. 

The ascetics who were smoking Ganja were irritated by these remarks. Shri Gajanan Maharaj , at that time, was sitting on a cot and Bhaskar was giving him a Ganja pipe to smoke. A spark from the pipe fell on the cot and slowly smoke started coming out of it; in a little while, the entire cot was in flames. 

Looking at the sight, Bhaskar requested Shri Gajanan Maharaj to leave the cot, saying that the cot was of teak wood and won't extinguish without water. Thereupon Shri Gajanan Maharaj said, Don't bring water to extinguish the fire. 

O Brahmachari Maharaj! Come and sit with me on this cot! You know the entire Geeta with its meaning; now the time has come to put your knowledge of Geeta to test. Prove that the element of fire does not burn a true Brahmin. 

You have just imparted a discourse on Nainam Chindanti for an hour, so you should not be afraid of sitting with me on this burning cot. Bhaskar, go and bring him with due respect to sit with me here.” Bhaskar was a well-built strong man and at the orders of Shri Gajanan Maharaj caught hold of Brahmagiri's hand to bring him to Shri Gajanan Maharaj . 

The entire cot was on fire and the flames were leaping up from all around it; however, Shri Gajanan Maharaj did not move a bit and was sitting firm on it. Shri Vyas has written in the Bhagwat that Shri Pralhad, son of Kayadhu, was made to stand in fire and in a way the same scene was relived by Shri Gajanan Maharaj in the garden of Krishnaji Patil. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 31 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 3 🌻*

117. ఇంతకు పూర్వము ఎట్టి అనుభవములేని ఆత్మ, తొలిసారిగా అనుభవమును పొందెను. కానీ సంస్కారములు లేని, స్పృహ లేని అనంత పరమాత్మయొక్క (A) స్థితితో తాదాత్మ్యతను చెందుటలో పూర్తిగా వ్యతిరేక అనుభవమునే పొందెను. 

118. ఈ వ్యతిరేక అనుభవము వలన అనంతాత్మయొక్క శాశ్వత అఖండ నిశ్చల స్థితిలో మార్పు సంభవించెను. 

119. ప్రథమ సంస్కారము, ప్రథమ చైతన్యము, ప్రథమ అనుభవము ఓకే నిష్పత్తి లో నుండెను

120. ఆత్మ, సంస్కారములందే స్పృహ కలిగియున్నచో, విధిగా యీ సంస్కారములను అనుభవించవలసినదే. 

121. ఆత్మయొక్క చైతన్యము, సంస్కార అనుభవమును పొందుటకే రూపములను తీసుకొనుచున్నవి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 91 / Soundarya Lahari - 91 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

91 వ శ్లోకము

*🌴. ధనము, భూములు అభివృద్ధి చెందుటకు 🌴*

శ్లో: 91. పదన్యాస క్రీడా పరిచయ మివారబ్ధు మనసః స్ఖలన్త స్తే ఖేలం భవన కలహంసా న జహతి అత స్తేషాం శిక్షాం సుభగమణి మఞ్జీర రణిత చ్ఛలాదాచక్షాణం చరణ కమలం చారుచరితే ll
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! మనోహరమయిన చరిత్ర కలిగిన ఓ తల్లీ ! నీవు నడుచునప్పుడు నీ పాదముల మనోహరములయిన లయను నేర్చుకొనవలెనని నీ పెంపుడు హంసలు తొట్రుపాటు విడువకున్నవి. నీ పాద పద్మముల యొక్క అందెల శబ్దములు వాటికి పాఠము చెప్పుచున్నట్లుగా ఉన్నది. కదా !

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 2000 సార్లు ప్రతి రోజు 25 రోజులు జపం చేస్తూ, మీరు అత్యుత్తమమని భావించినది నివేదించినచో ధనము, భూములు అభివృద్ధి చెందును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹Soundarya Lahari - 91 🌹*
📚 Prasad Bharadwaj 

SLOKA - 91

*🌴 Getting of Land and Getting Riches 🌴*

91. Pada-nyasa-kreeda- parichayam iv'arabdhu- manasah Skhalanthas the khelam bhavana-kala-hamsa na jahati; Atas tesham siksham subhaga-mani-manjira-ranitha- Chchalad achakshanam charana-kamalam charu-charite.
 
🌻 Translation : 
She who has a holy life,the swans in your house, follow you without break,as if to learn, your gait which is like a celestial play. So thine lotus like feet,taking recourse to the musical sound, produced by gems in your anklets,appears to teach them what they want.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :  
If one chants this verse 2000 times a day for 25 days, offering anything that is considered as best by your goodself as prasadam, it is believed that one will get opportunities to acquire land and accumulate wealth. 
 
🌻 BENEFICIAL RESULTS: 
Buying of lands, obtaining riches, contact with great men and scholars. 
 
🌻 Literal Results: 
Ideal for dancers. Patronage and mass support. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 391 / Bhagavad-Gita - 391 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 40 🌴

40. నాన్తోస్తి మయ దివ్యానాం విభూతీనాం పరన్తప | 
ఏష తూద్దేశత: ప్రోక్తా విభూతేర్విస్తరో మయా || 
🌷. తాత్పర్యం : 
ఓ శత్రుంజయుడా! నా దివ్య విభూతులకు అంతమనునది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. 

🌷. భాష్యము : 
వేదవాజ్మయమున తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విభూతులు మరియు శక్తులు వివిధరీతుల అవగతమైనను వాస్తవమునకు అట్టి విభూతులకు పరిమితిలేదు. కనుకనే సమస్త విభూతులు మరియు శక్తులు ఎన్నడును వివరింపబడలేవు. 

అనగా అర్జునుని జిజ్ఞాసను సంతృప్తిపరచుట కొరకు శ్రీకృష్ణభగవానుడు కేవలము కొన్ని ఉదాహరణములను మాత్రమే వివరించియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 391 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 40 🌴

40. nānto ’sti mama divyānāṁ
vibhūtīnāṁ paran-tapa
eṣa tūddeśataḥ prokto
vibhūter vistaro mayā

🌷 Translation : 
O mighty conqueror of enemies, there is no end to My divine manifestations. What I have spoken to you is but a mere indication of My infinite opulences.

🌹 Purport :
As stated in the Vedic literature, although the opulences and energies of the Supreme are understood in various ways, there is no limit to such opulences; therefore not all the opulences and energies can be explained. Simply a few examples are being described to Arjuna to pacify his inquisitiveness.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 212 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
47. అధ్యాయము - 2

*🌻. కామప్రాదుర్భావము - 1 🌻*

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య నైమిషారణ్య వాసినః | పప్రచ్ఛ చ మునిశ్రేష్ఠః కథాం పాపప్రణాశినీమ్‌ || 1

సూతుడిట్లు పలికెను -

ఓ నైమిషారణ్య నివాసులారా! బ్రహ్మ యొక్క ఈ మాటలను విని మునిశ్రేష్ఠుడగు నారదుడు పాపములను పోగొట్టే కథను గురించి ప్రశ్నించెను (1).

నారద ఉవాచ |

విధే విధే మాహాభాగ కథాం శంభోశ్శుభావహామ్‌ | శృణ్వన్‌ భవన్ముఖాంభోజాన్న తృప్తోsస్మి మహాప్రభో || 2

అతః కథయ తత్సరం శివస్య చరితం శుభమ్‌ | సతీకీర్త్యన్వితం దివ్యం శ్రోతుమిచ్ఛామి విశ్వకృత్‌ || 3

సతీ హి కథముత్పన్నా దక్షదారేషు శోభనా | కథం హ రో మనశ్చక్రే దారాహరణ కర్మణి || 4

కథం వా దక్ష కోపేన త్యక్త దేహా సతీ పురా | హిమవత్తనయా జాతా భూయో వాకాశమాగతా || 5

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! మహాత్మా!మహాప్రభో! నీ ముఖపద్మము నుండి మంగళకరమగు శుంభుగాథను ఎంత విన్ననూ, నాకు, తృప్తి కలుగుటలేదు (2). 

ఓ సృష్టికర్తా! నీవు శివుని శుభచరితమును సంపూర్ణముగా చెప్పుము. సతీ దేవి యొక్క యశస్సుతో గూడిన ఆ దివ్యగాథను నేను వినగోరుచున్నాను (3). 

మంగళ స్వరూపురాలగు సతి దక్షపత్నియందు ఎట్లు జన్మించెను? శివుడు వివాహమాడవలెనని తలంచుటకు కారణమేమి? (4) 

సతీదేవి పూర్వము దక్షుని యందు కోపముతో దేహమును వీడి, హిమవంతుని కుమార్తెయై జన్మించిన వృత్తాంతమెట్టిది? ఆమె తిరిగి శివుని భర్తగా పొందిన వృత్తాంతమెట్టిది? (5).

పార్వత్యాశ్చ తపోsత్యుగ్రం వివాహశ్చ కథం త్వభూత్‌ | కథ మర్ధ శరీరస్థా బభూవ స్మరనాశినః || 6

ఏతత్సర్వం సమాచక్ష్వ విస్తరేణ మహామతే | నాన్యోస్తి సంశయచ్ఛేత్తా త్వత్సమో న భవిష్యతి || 7

పార్వతి యొక్క అత్యుగ్రమగు తపస్సు, వివాహము ఎట్లు సంపన్నమైనవి? మన్మథుని భస్మము చేసిన శివునకు ఆమె అర్థాంగి ఎట్లు కాగలిగెను? (6). 

ఓ మహాబుద్ధిశాలీ! ఈ సర్వమును విస్తరముగా చెప్పుము. నీతో సమానముగా సంశయములను పోగొట్టగలవాడు లేడు, ఉండబోడు (7).

బ్రహ్మో వాచ |

శృణు త్వం చ మునే సర్వం సతీ శివయశశ్శుభమ్‌ | పావనం పరమం దివ్యం గహ్యాద్గుహతమం పరమ్‌ || 8

ఏతచ్ఛంభుః పురోవాచ భక్త వర్యాయ విష్ణవే | పృష్టస్తేన మహాభక్త్యా పరోపకృతయే మునే || 9

తతస్సోsపి మయా పృష్టో విష్ణుశ్శై వవర స్సుధీః | ప్రీత్యా మహ్యం సమాచఖ్యౌ విస్తరాన్ము నిసత్తమ || 10

అహం తత్కథయిష్యామి కథామేతాం పురాతనీమ్‌ | శివాశివయశోయుక్తాం సర్వకామఫలప్రదామ్‌ || 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శుభకరము, పవిత్రము జేయునది, గొప్పది, దివ్యము, రహస్యములలో కెల్లా రహస్యమునగు సతీశివుల కీర్తిని నీవు పూర్ణముగా వినుము (8). 

ఓ మహర్షీ! శివభక్తులలో శ్రేష్ఠుడగు విష్ణువు లోకోపకారము కొరకై గొప్ప భక్తితో పూర్వము ఇటులనే ప్రశ్నించగా శంభుడు చెప్పియున్నాడు (9). 

శివభక్తులలో శ్రేష్ఠుడు, జ్ఞానియగు విష్ణువును నేను ప్రశ్నించగా, ఆయన ప్రీతితో నాకు విస్తరముగా చెప్పెను. ఓ మహర్షీ! (10) 

శివశివులకీర్తితో గూడినది, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునదియగు ఈ పురాతన గాథను నేను చెప్పగలను (11).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 88 🌹*
Chapter 27
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 Miracles 🌻*

Creation exists in a state of ignorance, and any happening created by ignorance is an  
addition to the ignorance. 

In the state of ignorance, man finds a beautiful moon and glorious stars, a radiant sun, flowing rivers, great mountains, delicate flowers with lovely fragrances, and so forth, and man says that they are beautiful, majestic. Man is attracted toward beauty and he feels happy when he sees beauty, so intellectually and aesthetically he calls nature beautiful.  

But, man is also attracted to the supernatural and he is even more attracted to it when he finds someone doing some extraordinary things. 

These extraordinary happenings are producing a so-called holy ash out of air, producing miraculous healings of the afflicted, forcing trains to stop, or the ability to live on air, and so forth. Man always thinks that  
those miracle workers have some extraordinary powers given by God. 

Other men even go to the extent of accepting these miracle-workers as God, and at that moment man forgets that creation is in ignorance and such feats are nothing but additions to his state of ignorance.  

These miracle-workers are tantrics, known as sorcerers or magicians, who develop  
their ability by drawing upon the subtle energy through some incantation, ritual, or exercise. There are tantrics in India who can reduce their own human body and transform themselves into an ant. 

There are others who can discard their own bodies and enter into dead bodies of human beings or animals, and thereby make the dead bodies alive! But this is all a show, whether it is at a carnival in India, or on television in America. 

These happenings are all in the ignorance that prevails the gross world. This is not a spiritual achievement, it is a regression. This is not spiritual power; it is tantric power and it reflects the condition of ignorance.  

When anyone experiences the subtle planes, he obtains spiritual powers. 

But this is not an ordinary man, he is a yogi or mast. The great yogi of the fourth subtle plane, known as Kuber, can actually give life to the dead, but without transforming or discarding his own body. 

Kuber is someone who has become a great yogi, but no one can be around this man, because whatever Kuber gazes upon turns to dust; therefore, no other human being can live around him. If Kuber raises the dead it is by his own spiritual power, but though the power is genuinely spiritual, it is of the subtle state of ignorance.  

Kuber does not attract masses. If the occult power of a tantric is used to attract masses or  
for some show, it is truly nothing but an addition to the grossest state of ignorance.  

Avatar Meher Baba has stated, "One who knows everything, displaces nothing." All  
these miracles which we find in the world today, and which attract the masses, are simply  
more of illusion and the masses gain nothing.

Then what is a real miracle? It is when someone makes one blind to illusion and gives sight to see God! This is a true miracle, and such a miracle is worth witnessing. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 83🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 3 🌻*

పిమ్మట ''సారఙ్గాయ నమః అని అనుచు విఘ్నకారములగు భూతములను పారద్రోలవలెను. [పిమ్మట ''ఓం హాం వాస్త్వదిపతయే బ్రహ్మణ నమః'' అను మంత్రము నుచ్చరించుచు బ్రహ్మ యొక్క స్థానమున పుష్పము లుంచవలెను]. పిదప ఆసనముపై కూర్చుండి భూతశుద్ధి చేయవలెను.

''ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం గన్దతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''

అను ఐదు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు గంధతన్మాత్రస్వరూప మగు భూమండలమును, వజ్రచిహ్నితము, సూవర్ణమయము, చతురస్రము (నలుపలకలు గలది) పీఠమును, ఇంద్రాదిదేవతలను తన పాదముల మధ్య నున్నట్లు చూచుచు వాటి భావన చేయవలెను. 

ఈ విధముగ శుద్ధ మగు గంధతన్మాత్రను రసతన్మాత్రయందు లీనము చేసి ఉపాసకుడు అదే క్రమమున రసతన్మాత్రను రూపతన్మాత్రయందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

జానునాభిమధ్యగతం శ్వేతం వై పద్మలాఞ్ఛితమ్‌ |

శుక్లచన్ద్రం చార్ధచన్ద్రం ధ్యాయేద్వరుణదైవతమ్‌.

చతుర్భిశ్చ తదుద్ఘాతైః శుద్ధం తద్రసమాత్రకమ్‌ | సంహరేద్రసతన్మాత్రం రూపమాత్రే చ సంహరేత్‌. 24

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః''.

అను నాలుగు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు మోకాళ్లు మొదలు నాభివరకును ఉన్న శరీరభాగమును శ్వేతకములచే చిహ్నిత మైనదానినిగాను, శుక్లవర్ణ మైనదానినిగాను, అర్ధచంద్రాకారము కలదానినిగాను చూడవలెను. 

ఈ జలీయ భాగమునకు వరుణుడు దేవత యని భావన చేయవలెను. పై నాలుగు ఉద్ఘాతవాక్యములను ఉచ్చరించుటచే రసతన్మాత్రము శుద్ధ మగును. ఈ రసతన్మాత్రను రూపత్మాత్రయుందు లీనము చేయవలెను.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఇతి త్రిభిస్తదుద్ఘాతైస్త్రీకోణం వహ్నిమణ్డలమ్‌ | నాభికణ్ఠమధ్యగతం రక్తం స్వస్తికలాఞ్ఛి

తమ్‌. 25

ధ్యాత్వా7నలాధిదైవం తచ్ఛుద్ధం స్పర్శే లయం నయేత్‌ |

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హఃఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''

అను మూడు మూడు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు నాభి మొదలు కంఠమువరకును ఉన్న భాగమునందు త్రికోణాకారాగ్ని మండలమును భావింపవలెను. దాని రంగు ఎరుపు. 

అది స్వస్తికాకారముచే చిహ్నితమైనది. దిన అధిదేవత అగ్ని. ఈ విధముగా శుద్ధము చేయబడిన రూపతన్మాత్రను స్పర్శతన్మాత్రయందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

కణ్ఠనాసామధ్యగతం వృత్తం వై వాయుమణ్డలమ్‌ |

ద్విరుద్ధౌర్తధూమ్రవర్ణం ధ్యాయేచ్ఛుద్ధేన్దులాఞ్ఛితమ్‌ |

స్పర్శమాత్రం శబ్దమాత్రే సంహరేద్ధ్యానయోగతః. 27

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఏకోద్ఘాతేన చాకాశం శుద్ధస్ఫటికసన్నిభమ్‌ | నాసాపుటశిఖాన్తఃస్థ మాకాశముపసంహరేత్‌. 28

పిమ్మట - ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్ధతన్మాత్రం సంహరామి నమః.''

అను రెండు ఉద్ఘాతవాక్యములు నుచ్చరించుచు కంఠము మొదలు నాసికామధ్య వరకును ఉన్న భాగమునందు గోలాకారవాయు మండలమును భావన చేయవలెను. దాని రంగు ధూమము వలె నుండును. అది నిష్కలంకచంద్రునిచే చిహ్నిత మైనది. స్పర్శతన్మాత్రమును ధ్యానముచే శబతన్మాత్రయందు లీనము చేయవలెను. 

పిమ్మట ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహారామి నమః'' అను ఒక ఉద్ఘాతవాక్యము నుచ్చరించుచు శుద్ధ స్ఫటికముతో సమానమైన ఆకాశమును, వాసికనుండు శిఖవరకును ఉన్న శరీరభాగముపై భావన చేయవలెను. ఆ శుద్థాకాశము (అహాంకారమునందు) ఉపసంహరింపవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 99 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. పిప్పలాద మహర్షి - 1 🌻*

వంశము: దధీచి-సువర్చల(తండ్రి-తల్లి), చ్యవనమహర్షి-సుకన్య(తాత-నానమ్మ)
భార్య(లు): పద్మ
కుమారులు/కుమార్తెలు:
కాలము:
భౌగోళిక ప్రాంతములు: 
నదులు: గోదావరి, పుష్పభద్ర
బోధనలు/గ్రంధాలు: బ్రహ్మోపనిషత్తు

*🌻. జ్ఞానం:*
1. దేవతలు అమరులు అంటారు కదా! మరి చనిపోవటమేమిటి! అని సందేహం. అమరత్వం అంటే, వారు ఆ లోకలనుంచీ తాము వెళ్ళిపోవచ్చు, లేదా లోకంలో ఉండగానే లోకమంతా క్షయమైపోవచ్చు.

*2. ఈ లోకాలన్నీకూడా కర్మఫలాలను ఇచ్చే లోకానే! వాళ్ళ అమరత్వం ఎంతవరకంటే మనతో పోలిస్తే అమరలు వాళ్ళు. అంటే! ఏదీ శాస్వతం కాదు. శాస్వతమైన వస్తువేదీ లేనేలేదు. మనం మర్త్యులం. వాళ్ళు అమర్త్యులు. మనతో పోలిస్తే వాళ్ళు అమరులు. మరి లోకాలు ఉన్నాయి. వాటికి ప్రళయం వచ్చినప్పుడు ఏమైపోతున్నాయవి! పుణ్యహీనత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పతనం తప్పదు.*

3. దేవతలకు ఎందుకు నాశనం కలిగిందంటే, వాళ్ళు ఏ పుణ్యంచేత దేవలోకంలో సుఖపడుతున్నారో ఆ పుణ్యం నశించింది. పుణ్యనాశనం వల్ల వాళ్ళు పతనం చెందటమే వాళ్ళనాశనంగా మనం అర్థం చేసుకోవచ్చు.

4. దధీచిమహర్షి యొక్క ఎముకలు తీసుకుని అతడి చావుకు కారణమైన దేవతలయొక్క పుణ్యం క్షీణించటం జరిగింది. దానికితోడు, మళ్ళీ పుణ్యం సంపాదించుకోవటానికి శక్తిలేని వాళ్ళలాగా అవమని శపించింది పిప్పలాదుడి తల్లి. కాబట్టి వాళ్ళు శిక్ష పొందక ఏమవుతారు? 

5. శాపగ్రస్తులైన దేవతలు భూలోకంలో పుడుతున్నారుకదా! శాపగ్రస్తులైన మనుష్యులలాగా, శిక్షార్హులై ఆ లోకంనుంచి క్రింద పడిపోయేటటువంటి లక్షణమున్న దేవతలు అమరులు అనడంలో అర్థమేమిటి? ఆ మాట సాపేక్షంగా అన్నదే తప్ప శుద్ధ సత్యం కాదు. పక్షులతో మనిషిని పోలిస్తే, మనం చిరంజీవులం. మనకు మార్కండేయుడికి ఎంత తేదాఉన్నదో; కుమ్మరి పురుగుకు మనకు అంత తేడా ఉంటుంది. అంతే! ఎవరు సర్వాధికులు అంటే ఎవరూలేరు. ఒకరికంటే ఒకరికే ఎక్కువ తక్కువలు. 

6. మన నూరేళ్ళజీవితంలో, ఆ క్షుద్రమైన కీటకాలు కొన్నివేల జన్మలెత్తుతాయి. ఒకటి లెక రెండు సంవత్సరాలలో వెయ్యి జన్మలెత్తుతాయి ఆ పురుగులు. బ్రహ్మ కూడా అంతే! ఏ జీవుడికైన ఒక లోకం, ఒక్స్ శరీరం, వాని పూర్వపుణ్యాన్నిబట్టి తరతమభేదాలతో ఉంటాయి. కానీ కేవలంగా ఏవీలేవు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 29 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

STANZA VI
🌻 The Final Battle - 6 🌻

59. Yet another wave of Light, now with even greater force, hit right at the root of the darkness’ foundations, exposing the human situation in all its horror. Many had been blinded by the Bright Light and could no longer discern the false brilliance of earthly treasures. 

The material world, with its innumerable perishable trinkets, no longer held any attraction. Losing sight of earthly things, the Eye opened up to the Heavenly Realm — thebboundless space of Imperishable Beauty, brimming with countless treasures, each with its own special charm. And all of them belonged to man. 

Thus perished another cell of 
the Matter-Gorgon, being transformed into the marvellous Light of Illumination. The beast had finally lost her last number and dissolved into the Fires of the Soul of Born- again Man... 

Thus the beast ultimately perished, but only after giving birth to the New Man who, casting off his human skin, would ascend as a shining Spirit and stand beside the Sons of God. 

60. The Gods had witnessed everything that was taking place in the world. With their ability to behold multiple images simultaneously, they succeeded in perceiving everything that was occurring in all the layers of the Earth, starting from her bowels right up to the innumerable spheres which stretch into the Infinite Ocean of Eternity. 

Humanity was uniting under the Banner of Light. It was resonating with the Fires of the Heart. 

But among them, the servants of darkness were darting to and for more furiously than ever, hunting for those who had maintained their spiteful stoniness of heart... But those who had arisen from the ashes were already ascending the radiant Stairs to the Stars. 

Above them shone more powerful Spirits, taking on the appearance of a single solar luminary. And their number was increasing constantly... 

The Gods had never known doubt and believed firmly in Humanity. It was with new confidence that they now began to turn the High Wheel of Eternity.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామములు - 1 / Vishnu Sahasra Namavali - 1 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ప్రారంభము 🌻

*పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు, భూమియే పాదములుగా గలవాడు, సూర్యచంద్రములు నేత్రములైన వాడు, దిక్కులే చెవులైన వాడు, త్రిభువనములు శరీరముగా గలవాడు, శేషశాయి, విశ్వరూపుడు, శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి, నీలమేఘ వర్ణుడు అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు, ముకుందుడు, పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది.*

*"హరిః ఓం" అంటూ వేయి నామాల జపం మొదలవుతుంది.*

*విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |*
*భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ‖ 1 ‖*

1) విశ్వం - 
మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.

2) విష్ణు: - 
విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.

3) వషట్కార: - 
వేద స్వరూపుడు.

4) భూత భవ్య భవత్ ప్రభు: - 
భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.

5) భూత కృద్ - 
భూతములను సృష్టించిన వాడు.

6) భూత భృత్ - 
జీవులందరిని పోషించు వాడు.

7) భావ: - 
సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.

8) భూతాత్మా - 
సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.

9) భూత భావన: - 
జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Vishnu Sahasra Namavali - 1 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

The legend would have it that at the end of the epic Mahabharata war, Bhishmacharya was awaiting the sacred hour to depart from his physical body unto the lotus feet of the Lord. Yudhishtira, the eldest of the Pandavas, was desperately looking for the answers to matters relating to Dharma and Karma. Lord Sri Krishna, who understood Yudhistira’s uneasy mind, guided him to Bhishma to learn insight in to this precious knowledge. It is relevant to mention that Bhishma was acknowledged to be one of the twelve most knowledgeable people. The other eleven being Brahma , Narada , Siva , Subramanya , Kapila , Manu , Prahlada , Janaka , Bali, Suka and Yama .
 
🌻 Why were these 1008 names of Lord Vishnu chosen? 🌻

Does the Lord get absolutely defined by these one thousand names? The Vedas affirm that God is neither accessible to words nor to mind. It is said that you cannot comprehend the Paramatma with the human mind alone, even if you spend all your life trying! Given this infinite nature of the Paramatma, who is not governed or constrained by any of the physical laws as we know them, the choice of a thousand names of Vishnu by Bhishma should be recognized as a representation of some of his better known qualities that are repeatedly described in our great epics.

*viśvaṁ viṣṇurvaṣaṭkārō bhūtabhavyabhavatprabhuḥ |*
*bhūtakṛdbhūtabhṛdbhāvō bhūtātmā bhūtabhāvanaḥ || 1 ||*

1) Vishvam –
The Lord Who is the Universe Itself

2) Vishnu – 
The Lord Who Pervades Everywhere

3) Vashatkara – 
The Lord Who is Invoked for Oblations

4) Bhootabhavya- bhavat-prabhuh – 
The Lord of Past, Present and Future

5) Bhoota-krit – 
The Creator of All Creatures

6) Bhoota-bhrit –
The Lord Who Nourishes All Creatures

7) Bhava – 
The Absolute Existence

8) Bhootatma – 
The Lord Who is the Soul of Every Being in the Universe

9) Bhootabhavana – 
The Lord Who Nurtures Every Being in the Universe

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 20 🌹*
 ✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
🌟. *5. పీనియల్ గ్రంథి* 🌟
💠. *ప్రైమోర్డియల్ సెల్ కమ్యూనికేషన్ మార్గం* 💠

*పీనియల్ గ్రంథి*
పీనియల్ గ్రంథి మన మెదడులోని రెండు అర్థగోళాల మధ్య ఉన్న చిన్న ఎండోక్రైన్ గ్రంథి. దీని సైజు 5.8 మిల్లీ మీటర్స్ ఉండి పైన్ కోన్ ఆకారంలో ఉండే అతి చిన్న గ్రంథి. పీనియల్ గ్రంథి *"సెరటోనిన్"* *"మెలటోనిన్"* అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. 

అందువలన *"నిద్ర - మెలుకువ చక్రం"* అని కూడా అంటారు. దీనిని ఆత్మ యొక్క స్థానం అని చెబుతారు. *"సోల్ స్టార్( పూర్ణాత్మ )"* నుండి ఎప్పటికప్పుడు జ్ఞానం అనే లోతైన జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. మన యొక్క హైయ్యర్ సెల్ఫ్ (పూర్ణాత్మ) యొక్క జ్ఞానాన్నీ మరి భౌతిక జీవిత జ్ఞానాన్నీ పొందడానికి గేట్ వే లాంటిది.

💫. ఈ గ్రంధి వివిధ డైమెన్షన్ ల యొక్క చేతనా జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అందువలన విభజన యొక్క భ్రమలు (చీకటి శక్తులు ఏర్పరిచిన చీకటి పొరలు అనే మాయ భ్రమలు) దాటి చూడగలుగుతుంది.

పీనియల్ గ్రంథి లోపల *"మాస్టర్ క్రిస్టల్ సెల్ (MCC)"* లేదా *"సెంట్రల్ సెల్"* అనే ఈధర్ నిర్మాణం ఉంటుంది.

💫. ఈ MCC సోల్ స్టార్ యొక్క QI (ఇంటెలిజెన్స్) అని చెప్పవచ్చు. MCC లోనే ఆత్మ యొక్క ఈథర్ బ్లూప్రింట్, పరిపూర్ణ దైవత్వం, అవగాహన ఉంటుంది. MCC యొక్క ప్రతి ధ్వని ద్వారా ఆది కణాలు అయిన ప్రైమోర్డియల్ సెల్ ని కనెక్ట్ చేసుకుని DNA ని యాక్టివేట్ చేస్తుంది.

💫. *ప్రైమోర్డియల్ సెల్*:- ప్రైమోర్డియల్ కణాలు వ్యక్తి యొక్క మొదటి ఎనిమిది కణాలు తల్లి అండం నుండి, తండ్రి శుక్రకణం నుండి తెచ్చుకున్న మొదటి 8 కణాల కలయికనే *"ప్రైమోర్డియల్ కణం"* అన్నారు. వీటినే మొదటి బీజకణాలు అంటారు. దీనితో *"జైగోట్"* తయారవుతుంది.

ప్రైమోర్డియల్ కణాలు మనలో మూలాధార, స్వాధిష్ఠాన చక్రాల మధ్య స్థితం అయి ఉంటాయి. ఇది ఎనిమిది కోణాలతో గొప్ప జ్యామిత్రిక స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. ఇది స్ఫటికాకార మ్యాట్రిక్స్ తోనూ, (ఆరిక్ ఫీల్డ్) తోను, హాలోగ్రాఫిక్ ఫీల్డ్ శక్తి తోను, మన యొక్క టైంలైన్ తోను కనెక్ట్ అయి జీవితమంతా ఈ విధంగా జీవనం సాగిస్తుంటుంది.

💫. ప్రైమోర్డియల్ సెల్ యూనివర్స్ యొక్క పవిత్ర జ్యామిత్రిక స్థితి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ లో యూనివర్సల్ ట్రూత్ (విశ్వోద్భవ రహస్యాలు) ఎన్నో లైఫ్ టైమ్స్ యొక్క (తాను భూమిమీద పొందిన) భౌతిక అనుభవాల సారం అంతా దాగి ఉంది.
ఈ పవిత్ర జ్యామిత్రికతలోనే మనం భౌతిక జీవితంలో నేర్చుకోవలసిన ద్వంద్వత్వపు లిమిటేషన్స్, నమ్మకాలు, సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు మొదలైనవాటి అన్నింటి ద్వారా సూక్ష్మ నైపుణ్యాలను, భాష లేదా రూపంలో ఈ జ్యామిత్రిక గ్రిడ్ లలో పొందుపరచబడ్డాయి.

💫. మన యొక్క సామూహిక అభివృద్ధి కొరకు సృష్టిలో ఉన్న సమస్త సమాచార జ్ఞానం.. *"అనంత మేధస్సు"* ద్వారా భౌతిక ఉప అణువుల వరకు అందజేయబడే సిస్టమే ఈ జ్యామిత్రిక సిస్టమ్.

మన యొక్క ప్రైమోర్డియల్ సెల్ 8-కణాలతో పవిత్ర జ్యామిత్రిక స్ట్రక్చర్ కలిగి *"కాస్మిక్ ఎగ్"* (హిరణ్య గర్భం) ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ ఆకారాన్ని *"మెటాట్రానిక్ క్యూబ్"* అని పిలుస్తారు.

🌟. *ప్రైమోర్డియల్ సెల్ యొక్క ఉపయోగం* :
ఇంటెలిజెంట్ స్టోర్ హౌస్ ఆఫ్ QI(Quantum Intelligence)(శక్తి, ప్రాణం,ఆరాశక్తి) భౌతిక శరీరానికి జ్ఞానాన్ని అందించి దాని ద్వారా పనిచేసేలా చేస్తుంది.

పీనియల్ గ్రంథి ప్రైమోర్డియల్ సెల్ యొక్క అనుసంధానం జరిగితే వీటి యొక్క జ్ఞానవిస్తరణ ద్వారా DNA స్ట్రక్చర్ విస్తరణ జరుగుతుంది.

💫. పీనియల్ గ్రంథి.. విశ్వశక్తిని గ్రహించి తన నుండి ఒక *"వేవ్ పాత్"* ని ఏర్పరచుకుంటుంది. అది సెంట్రల్ ఛానెల్ అయిన సుషుమ్ననాడి ద్వారా హృదయ చక్రాన్ని ఓపెన్ చేస్తూ నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రం తో కనెక్ట్ అవుతూ స్వాధిష్టాన, మూలాధార చక్రం మధ్య ఉన్న ఈ ప్రైమోర్డియల్ సెల్ తో కనెక్ట్ అవుతుంది. 

ఎప్పుడైతే ఈ మార్గం ఏర్పడుతుందో DNA లోని హైయర్ స్టేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ మార్గం ఎప్పుడైతే ఏర్పడుతుందో బ్రెయిన్ కి అందే.. *"తీటా", "గామా"* బ్రెయిన్ వేవ్స్ ద్వారా DNA యాక్టివేషన్ కి మార్గం తెరుచుకుంటుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 164 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 11. The ‘I am’ appears spontaneously on your True state, it is wordless and can be used to go beyond. 🌻*

This sense of being came onto you without your willing; it came on its own and when it came there was no question of any words being there.  

Though wordless, yet if you keenly observe, this feeling ‘I am’ can be caught hold of and then it can serve as a means for going beyond towards your True state.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 42 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 6 🌻*

ఆత్మ పెద్ద అగ్ని స్వరూపం అనుకోండి. సూర్యుడువంటి అగ్నిస్వరూపం అనుకోండి. అందులో నుంచి వెడలుతున్నటువంటి విస్పులింగములు (నిప్పురవ్వలు) ఏవైతే వున్నాయో అలాంటివి ఈ మహిమలు, విభూతులు. 

ఈ విభూతులన్నీ ఈశ్వర విభూతులనమాట. అవి ఈశ్వర స్థితి కలిగేముందు ఇలాంటి విభూతులు సూక్ష్మంలో నువ్వు ప్రవేశించావు అనేటటువంటి నిర్ణయం తెలియడం కోసం మాత్రమే ఉపయోగపడేటటువంటివి. వీటివల్ల ఏమీ ప్రయోజనం లేదు. యధాతధమైనటువంటి ఈశ్వరత్వం ఎటువంటిదంటే సహజ సూర్య ప్రకాశంవంటిది. 

దానియందు ఏ రకమైన మహిమలు, ఏ రకమైన విభూతులు వుండవు. ఎంతగా అయితే సమస్త సృష్టికి ఆధారభూతమై సర్వసాక్షి స్వరూపమై, కర్మ సాక్షి స్వరూపమై సూర్యుడు ప్రకాశిస్తూ వున్నాడో ఆ రకం గా ఆత్మ హృదయ స్థానంలో సహజంగా స్వచ్ఛంగా వున్నది స్వరూప జ్ఞానంతో. 

దానికి ఏరకమైనటువంటి చిన్న చిన్న - అంటే అర్ధం ఏమిటంటే - ఒక పైసా రెండు పైసలలాంటివనమాట ఇవన్న. కోట్లరూపాయల ఆస్థితో పోలిస్తే ఒకపైసా రెండుపైసలు అందుట్లో భాగమా కాదా అంటే, ఆ ఒకపైసా రెండు పైసలు కూడా అందుట్లో భాగమే. కాని కోటి రూపాయలతో పోలిస్తే ఈ ఒకపైసా రెండుపైసలు దేనికి ప్రయోజనం? ప్రయోజనం లేదు. 

కోహినూరు వజ్రానికి మన పెట్టుకునేటటువంటి రంగు రాళ్ళకీ - అదీ రాయే ఇదీ రాయే కదండీ అంటే. రాయే ఎవరుకాదన్నారు? కాని అనంతవిశ్వంతో పోలిస్తే ఇవన్నీ ఎందుకూ కొరగానటువంటివి. అంతేనా కాదా? భూమండలం మొత్తాన్నీ, నవగ్రహాలు మొత్తాన్నీ మనం రంగురాళ్ళు పెట్టుకుని ఏమార్చగలుగుతామా? ఆలోచించిచూడండి. 

మానవుడుకి భ్రాంతి ఎంత దూరం వచ్చేసిందయ్యా అంటే ఏమండీ మీకు కుజగ్రహ దోషం వుంది కాబట్టి మీరీ పచ్చ రంగు రాయి పెట్టుకోండి, ఆ దోషం పోతుంది, అంటే ఆనందపడిపోతాడు అంతే. ఓ పచ్చరాయి పెట్టుకుని నాకు కుజగ్రహ దోషం పోయింది అంటాడు.

         ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నిస్తే పోతుంది గానీ - ఎందుకనీ - దైవానుగ్రహం వున్న గ్రహములేమి చేయును? అందరూ ఈశ్వరుడి మీద ఆధారపడి వున్నారు. సమస్త సృష్టీ ఈశ్వరాధారంగా వుంది. అంతేతప్ప ఎవరికివారు వ్యక్తిగతంగా ఎవరూ ఏమీ చేయలేరు. 

మరి అట్టి ఈశ్వరానుగ్రహం కోసం నువ్వు తపమో, జపమో, ఆచరణో, విధానమో, ధ్యానమో, మరొక సాధనా క్రమమో ఆశ్రయించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని పొంది, నీ మనో బుద్ధులని అధిగమించి, నీ హృదయస్థానంలో నిలబడేటటువంటి ప్రయత్నాన్ని చేయాలేగానీ నీవు గ్రుడ్డివాడు ఏనుగును పట్టుకుని మెత్తగా వుంది, కుచ్చు వలే వుంది, స్తంభము వలే వుంది, కొండవలే వుంది అనేటటువంటి తాత్కాలికమైనటువంటి అనుమాన ప్రమాణములతో పొగ వస్తుంది కాబట్టి నిప్పు వుందని, ఇలాంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో ఈ ఆత్మని నిర్ణయించడానికి వీలు కాదు.

 కాబట్టి తర్కము మూలమున ఆత్మను తెలిసికొనలేము. తర్కము బుద్ధిగతమైనటువంటిది. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 19. గీతోపనిషత్ - తుదిమెట్టు : సత్వగుణము నిత్య సత్యముగ నుండుట, అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండు వాడే త్రిగుణములు దాటిన వాడగును. అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము. ఇతరులకు అందని ద్రాక్ష పండే! 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 45 📚*

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ || 45

మానవ జీవితము త్రిగుణములతో అల్లబడి నిర్వర్తింప బడుచున్నది. కొంత తవు రజోగుణము పని చేయుచుండగ విజృంభించి పనిచేయుట యుండును. 

అటుపైన తమోగుణ మావరించి కాళ్ళు బారజాపుకొని యుండుట, అనారోగ్యము పొందుట, విశ్రాంతిని కోరుట యుండును. చేయుట, చేయకపోవుట అను రెండు స్తంభముల మధ్య తిరుగాడుచూ జీవుడు క్షణ కాలము, రెండు గుణములను తనయందిముడ్చుకొను సత్వగుణమును అతి స్వల్పముగ రుచిగొనును. 

సత్వగుణ రుచి నిజమైన ఆనందమును కలిగించి అట్టి ఆనందము కొరకై అన్వేషించుట జరుగు చుండును. ఈ అన్వేషణముననే కాలము వ్యయమగు చుండును. రజస్సు, తమస్సు అనే గుణములు మనస్సున ద్వంద్వములున్నంత కాలము జీవుని యిటు నటు లాగుచుండును. సత్వగుణము ద్వంద్వముల కతీతమైనది. అందు రజస్సు - తమస్సు యిమిడి అదృశ్యమగును. 

జీవితము ద్వంద్వముల క్రీయని గుర్తించిన జీవుడు, అవి కాలానుగుణముగ వచ్చిపోవు చుండునని తెలుసుకొన్నాడు. ప్రజ్ఞ మనస్సు యందు గాక, బుద్ధి యందు స్థిరపడును. 

అప్పుడు సత్వగుణము నిత్య సత్యముగ నుండును. అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండును. అట్టి వాడే త్రిగుణములు దాటిన వాడగును. అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము. ఇతరులకు అందని ద్రాక్ష పండే!

''నిస్త్రగుణ్యో భవ అర్జునా'' అని కృష్ణు సుతిమెత్తగ అర్జునుని హెచ్చరించుటకు కారణమిదియే. నిత్య సత్యమే పరిపూర్ణ జీవనానుభూతికి ప్రాతిపదిక.

వేదములు కూడ త్రిగుణాత్మకములైన విషయములనే తెలుపుచున్నవి కాని, తదతీతమైన స్థితికి లేదనియు, యోగవిద్య ఒక్కియే పరిష్కారమనియు భగవానుడు స్పష్టముగా తెలిపియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment