🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 143 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సప్తర్షి మండలము - కాలగణనము 🌻
ధ్రువము చుట్టును నక్షత్ర మండలము మొలత్రాడుగా భూమధ్యరేఖ వెంట తిరిగివచ్చుటకు ఇరువదియారువేల (26,000) సంవత్సరములు పట్టును.
సప్తర్షులు నక్షత్ర మండలమున కెదురుగా ఒకమారు తిరిగి వచ్చినట్లు కనిపించుటకు ఇరువదియారు వందల (2,600) సంవత్సరములు పట్టును.
ఇందు శతాబ్దుల , సహస్రాబ్దుల కొలతలు కొలుచుటకు వీలగును కనుక యుగములలో జరిగిన కథలను కొలుచుట కిదియే ఆధారము.
ఉదాహరణకు : " ఆసన్ మఖాసు , మునయః యుధిష్ఠిరే, శాసతి పృథివీం " అని వరాహమిహిరా చార్యులు చెప్పిరి. మఖా నక్షత్రమున సప్తర్షులుండగా యుధిష్ఠిరుడు భూమిని పాలించెనని యర్థము. దీనిని బట్టి "షట్ ద్విక పంచద్వియుతః , శకకాలస్తస్య రాజ్ఞస్య " అని వరాహమిహిరుడు యుధిష్ఠిరుని కాలమును సాధించెను. శకకాలమైన శాలివాహన శకమునకు 2526 సంవత్సరములకు పూర్వము యుధిష్ఠిరుడు పరిపాలించెనని సాధించెను.
దీనిని బట్టి కలియుగమునందు ఇప్పటి కెన్ని సంవత్సరములు గడచినవో తెలియును. ధర్మరాజు పరిపాలన అంతమగుటతో కలియుగ మారంభించెను. ఈ గణనము నాధారముగా గొనియే ఇప్పటి పంచాంగ కర్తలు కలియుగ సంవత్సరములను నిర్ణయించుచున్నారు.
ఈ విధముగా ధ్రువుని , వానిననుసరించు సప్తర్షులను ఆధారముగా గొని , యే యుగమందలి కథల కాల నిర్ణయమునైనను చేయవచ్చును.
పురాణమందలి కథల కాలమిట్లే నిర్ణయింపబడెను.
భూమిపై పరిభ్రమణము ననుభవించు వారి కందరికిని పునర్జన్మ లుండును. ధ్రువుడు పరిభ్రమింపడు కనుక అతనికి పునర్జన్మ ముండదు.
...... ✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻
ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
01 Sep 2020
No comments:
Post a Comment