భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 99


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 99  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 1 🌻

వంశము: దధీచి-సువర్చల(తండ్రి-తల్లి), చ్యవనమహర్షి-సుకన్య(తాత-నానమ్మ)

భార్య(లు): పద్మ

కుమారులు/కుమార్తెలు:

కాలము:

భౌగోళిక ప్రాంతములు:

నదులు: గోదావరి, పుష్పభద్ర

బోధనలు/గ్రంధాలు: బ్రహ్మోపనిషత్తు

🌻. జ్ఞానం:

1. దేవతలు అమరులు అంటారు కదా! మరి చనిపోవటమేమిటి! అని సందేహం. అమరత్వం అంటే, వారు ఆ లోకలనుంచీ తాము వెళ్ళిపోవచ్చు, లేదా లోకంలో ఉండగానే లోకమంతా క్షయమైపోవచ్చు.

2. ఈ లోకాలన్నీకూడా కర్మఫలాలను ఇచ్చే లోకానే! వాళ్ళ అమరత్వం ఎంతవరకంటే మనతో పోలిస్తే అమరలు వాళ్ళు. అంటే! ఏదీ శాస్వతం కాదు. శాస్వతమైన వస్తువేదీ లేనేలేదు. మనం మర్త్యులం. వాళ్ళు అమర్త్యులు. మనతో పోలిస్తే వాళ్ళు అమరులు. మరి లోకాలు ఉన్నాయి. వాటికి ప్రళయం వచ్చినప్పుడు ఏమైపోతున్నాయవి! పుణ్యహీనత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పతనం తప్పదు.

3. దేవతలకు ఎందుకు నాశనం కలిగిందంటే, వాళ్ళు ఏ పుణ్యంచేత దేవలోకంలో సుఖపడుతున్నారో ఆ పుణ్యం నశించింది. పుణ్యనాశనం వల్ల వాళ్ళు పతనం చెందటమే వాళ్ళనాశనంగా మనం అర్థం చేసుకోవచ్చు.

4. దధీచిమహర్షి యొక్క ఎముకలు తీసుకుని అతడి చావుకు కారణమైన దేవతలయొక్క పుణ్యం క్షీణించటం జరిగింది. దానికితోడు, మళ్ళీ పుణ్యం సంపాదించుకోవటానికి శక్తిలేని వాళ్ళలాగా అవమని శపించింది పిప్పలాదుడి తల్లి. కాబట్టి వాళ్ళు శిక్ష పొందక ఏమవుతారు?

5. శాపగ్రస్తులైన దేవతలు భూలోకంలో పుడుతున్నారుకదా! శాపగ్రస్తులైన మనుష్యులలాగా, శిక్షార్హులై ఆ లోకంనుంచి క్రింద పడిపోయేటటువంటి లక్షణమున్న దేవతలు అమరులు అనడంలో అర్థమేమిటి? ఆ మాట సాపేక్షంగా అన్నదే తప్ప శుద్ధ సత్యం కాదు. పక్షులతో మనిషిని పోలిస్తే, మనం చిరంజీవులం. మనకు మార్కండేయుడికి ఎంత తేదాఉన్నదో; కుమ్మరి పురుగుకు మనకు అంత తేడా ఉంటుంది. అంతే! ఎవరు సర్వాధికులు అంటే ఎవరూలేరు. ఒకరికంటే ఒకరికే ఎక్కువ తక్కువలు.

6. మన నూరేళ్ళజీవితంలో, ఆ క్షుద్రమైన కీటకాలు కొన్నివేల జన్మలెత్తుతాయి. ఒకటి లెక రెండు సంవత్సరాలలో వెయ్యి జన్మలెత్తుతాయి ఆ పురుగులు. బ్రహ్మ కూడా అంతే! ఏ జీవుడికైన ఒక లోకం, ఒక్స్ శరీరం, వాని పూర్వపుణ్యాన్నిబట్టి తరతమభేదాలతో ఉంటాయి. కానీ కేవలంగా ఏవీలేవు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

01 Sep 2020

No comments:

Post a Comment