🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 30 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 52, 53 / Sri Lalitha Chaitanya Vijnanam - 52, 53 🌹**సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*21. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత*
*శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ*
*🌻 52. 'శివకామేశ్వరాంకస్థా' 🌻*
మంగళకరుడైన కామేశ్వరుని తొడపై నధిష్ఠించియున్నది దేవి అని ఈ నామమునకు అర్థము. ఇచ్చట శివ శబ్దము, కామేశ్వర శబ్దము తెలియవలసిన అంశములు. శివుడనగ మంగళ స్వరూపుడు. సర్వశుభములను చేకూర్చువాడు. అతని అస్థిత్వమే శుభకరము, మంగళకరము. సర్వమునకు అతడు ఈశ్వరుడు. కామమునకు కూడ ఈశ్వరుడు. అందుచేతనే కామేశ్వరుడైనాడు.
కామము, శివము ఈశ్వర విభూతులే. శ్రీదేవి ఈశ్వరుని హృదయమే. ఆమె ఆతని సంకల్పమే. అట్టి సంకల్పము నుండి జ్ఞానము, ప్రజ్ఞానము, విజ్ఞానము, సంజ్ఞానము, అజ్ఞానము వెలువడుచున్నవి. అతని నుండి శ్రీదేవి వెలువడుట యనగ అతడు సృష్టిని అనుమతించినాడని అర్థము.
అట్లనుమతించుటయే సంకల్పము వ్యక్తమగుట. అట్లు వ్యక్తమైన సంకల్పము క్రమశః సృష్టిని వెలువరించును. అతడొకడే. అతడే జగత్ సృష్టిని చేయగోరెను. అదియే శివకామము. దాని రూపమే శివకామిని యగు శ్రీదేవి.
కామము లేనిదే సృష్టిలేదు. జ్ఞానము ప్రజ్ఞానమగుట కామము కారణముగనే. ప్రజ్ఞానము నుండియే మతి, స్మృతి, సంకల్పము, బుద్ధి, మేధ, ప్రాణము ఇత్యాదివి వెలువడును. అందుచేత సమస్త సృష్టి కామమునకు శ్రీదేవి అధిదేవత అని తెలియవలెను. ఆమె శివుని నుండి వ్యక్తమై సృష్టికామమును నిర్వర్తించుచున్నది.
జ్యోతిషమున మానవ దేహమందలి తొడ భాగమును కామమునకు ప్రతిరూపముగ వర్ణింతురు. దేహలావణ్యము, మార్దవ లక్షణము ఊరువులు తెలుపును. ఇవి బలిష్ఠముగ నున్నవారు జీవితమున కామము బలిష్టమై యున్నవారుగ నుందురు.
కామేశ్వరుని తొడపై ఆసీనురాలై యున్న శ్రీదేవి బలిష్ఠము, పటుత్వము అయిన సృష్టి సంకల్పముతో ఆసీనురాలై యున్నదని అర్థము. కామేశ్వరుని ఒడిలో ఇట్లు ఒయ్యారముగ కూర్చుండిన శ్రీదేవిని ధ్యానించువారికి సర్వశుభములు కలుగును. అశుభములు కలుగవు. కామము ధర్మముతో ముడిపడిన, సర్వము శుభంకరమే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 52 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 52. Śiva-kāmeśvarāṅkasthā शिव-कामेश्वराङ्कस्था (52) 🌻*
Her seating posture begins from this nāma. She sits on the left thigh of Śiva. This is the form of saguṇa Brahman. Śiva is prakāśa form and self illuminating and Śaktī is His vimarśa form.
It is good to meditate upon this posture of Them. Why She is sitting on his left thigh? Heart is on the left side and She is said to be Śiva’s heart (could also mean love).
Kāma means handsome, desire, god of love Manmatha. Kāma also means knowledge. Śiva means auspicious. Īśvara means the supreme ruler. Knowledge is said to be the form of Śiva. Perception of heart and mind is the knowledge. Here all the qualities of the saguṇa Brahman are covered.
This is saguṇa Brahman because it talks about forms and qualities. Nirguṇa Brahman does not have form and attributes. When māyā or illusion is still associated with Brahman it is called saguṇa Brahman.
This saguṇa Brahman is called Śaktī or prakāśa vimarśa mahā māyā svarūpinī. Why kāmā is mentioned here? This kāmā does not mean Manmatha, the god of love. It means the supreme, not the desire with which this word is associated.
The desire of the Brahman to create the universe is executed through Śaktī, the auspicious form of the Supreme ruler Śiva. This nāma actually talks about static and kinetic form of energies in unison. This also could mean the creation of the universe.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 53 / Sri Lalitha Chaitanya Vijnanam - 53 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*21. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత*
*శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ*
*🌻 53. 'శివా' 🌻*
శివుని వెలుగురూపమే శివా'. శివుడు నిరాకారుడు. అతడాకారము ధరించినచో శివా యగును. శివుడు గుణాతీతుడు. అతడు గుణములను ధరించినచో శివా యగును.
వ్యక్తమైనచో శివా. అవ్యక్తముగ నున్నచో శివ. నిజమునకు పంచాక్షరీ మంత్రము నుపాసించు వారు శ్రీదేవినే ఆరాధించు చున్నారు. దేవుని రూపమును, గుణము లను, శక్తిని, బలమును, జ్ఞానమును, తెలివిని ఆరాధన చేయుట యనగ శ్రీదేవి నారాధించుటయే. వీటన్నిటికిని అతీతము అయిన తత్త్వము శివతత్త్వము.
వాని నుండియే ఈ సమస్తమును వ్యక్తమవగ, అతడు వానియందు నిండియుండును. అనగ ధరించును. ధరించగనే శివా యగును. అవి తనయందిమిడి యున్నప్పుడు శివుడై యుండును. శ్రీదేవి ఆరాధనమే శివుని సగుణారాధన. అందుచేతనే ఆరాధన
మంతయు శివా ఆరాధనమే. శివకు, శివాకు భేదము లేదు. శివుడెట్లో దేవియును అట్లే. దేవి యెట్లో శివుడును అట్లేయని లింగ పురాణము తెలుపుచున్నది.
సృష్టికావలి దైవమే శివుడు. సృష్టియందలి దైవమే శివా. శివ (శివా) అనగా సమస్తము తన వశమున నున్న స్థితి. సమస్తము శివ వశమే. అనగా శ్రీదేవి వశమే అని కూడ అర్థము. శివ (శివా) అనగా మేలును కలిగించు వాడు. అనగా శ్రీదేవి జీవులకు మేలు కలిగించుచుండును.
శివ (శివా) అనగా సమస్తము విశ్రాంతి చెందు స్థితి. సృష్టి సమస్తమును శ్రీదేవియందు విశ్రాంతి చెందుచున్నది. ఆమె అతని యందు విశ్రాంతి చెందుచున్నది. శివ (శివా) అనగా సాధుత్వమని గూడ అర్థము. శ్రీదేవి సహజముగ సాధుస్వరూపిణి. శివ (శివా) యనగా మంగళకర గుణములు అని అర్థము. శ్రీదేవి గుణములన్నియు మంగళకరములే. ఆమె నారాధించు వారికి అట్టి గుణములు ప్రసాదించగలదు.
శివ (శివా) యనగా శమింప జేయువాడు (చేయునది) అని అర్థము. శమము, శాంతి శ్రీదేవి ప్రసాదించు పరమోత్కృష్టమైన సంపద. శివ (శివా) అనగా శుభ ప్రారంభము అని కూడ అర్థము. సర్వశుభములకు శివా- శివులే ప్రారంభకులు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 53 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Śiva शिवा (53) 🌻*
There is no difference between Śiva and Śaktī; hence she is called as Śiva. Śiva also means auspiciousness. She is the embodiment of auspiciousness. She is the icchā form of Śiva. There are three types of śakti-s – icchā (desire), jñāna (knowledge) and kriyā (action).
Since Śiva is the Brahman and as such He does not have any desires. But His icchā form is reflected in the form Lalitai. Here desire means desire to self-realization. “Yatā Shivā –tatā Devi; Yatā Devi- tatā Shivā” is the saying. Wherever Śiva is, there will be Śaktī and wherever Śaktī is, there will be Śiva.
That is why it is said there is no difference between Śiva and Śaktī. Elsewhere it is said that Pārvatī and Parameśvara cannot be separated from each other. This is compared to a word, which cannot be separated from its meaning.
They are considered as father and mother of the universe. Scriptures say that there is no difference between Umā (Śaktī) and Śankarā (Śiva). Śankarī is the consort of Śiva and is known as Śiva - Śankarī.
She is the māyā Śaktī that is connected to one’s consciousness. How does she look like? She is knowledgeable, self-illuminating (remember our discussions on self-illuminating Brahman), without qualities, the cause of destruction of saṃsārā (desires and related issues) and the bliss. She is Śiva, the supreme Devi, the ocean of mercy and compassion. Men of intellect get everything out of Her.
There are two important points mentioned here. One is that, Lalitai is in no way different from Śiva. Both Śiva and Śaktī are in a single form only. Only out of ignorance, we worship them as two separate individuals. Secondly, assuming that we continue to worship Her individual form that has been described in the above verses, still we get all auspicious things. This aspect is discussed in subsequent nāma-s also.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment