✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 04 🌻
345.అగాధమైన సత్యమునకై స్పృహకల్గి తహతహ చెందుటయే ఆధ్యాత్మికము.
346. పునర్జన్మ ప్రక్రియలో అసంఖ్యాక జన్మములనంతరము, ఆ జన్మలద్వారా భిన్నసంస్కారములు క్రమక్రమముగా వదులై (బిగువు సడలి) నప్పుడే అంతర్ముఖ క్రమము (జ్ఞానమార్గము) సాధ్యమగును.
347. ఆత్మయొక్క చైతన్యము.ఇంక ఇంద్రియాత్మకమగు భౌతిక ప్రపంచము నుండి విముఖత జెంది అంతర్ముఖియై సూక్ష్మ-మానసిక గోళముల ద్వారా ఆధ్యాత్మిక అభివ్రుద్దిని కోరుచున్నది.
348. చైతన్యము సప్తవివిధ దశలలో విస్తరిల్లి పూర్ణచైతన్యమాయెను. అట్లే-- ఆ విస్తరిల్లిన పూర్ణచైతన్యము సప్తవివిధ స్థితులలో అంతర్ముఖ మాయెను.
349. ఇంద్రియ సంబంధమైన జీవితమును, ఆత్మ సంబంధజీవితమునకు మరల్చుటయే వైరాగ్యము.
350. సంస్కార భారమునుండి విముక్తి పొందుటకు సర్వ విధముల పడెడు యాతనలో, చైతన్యము అంతర్ముఖ మగుటకు ఇదియే ప్రథమ సోపానము.
351. బాహ్యకార్యకలాపమందు నిమగ్నుడై పనులు ముగిసిన తరువాత ఆపనులనుండి,తనవైపునకు ధ్యానమును మరలించుట వంటిది అంతర్ముఖ క్రమము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Oct 2020
No comments:
Post a Comment