శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 88 / Sri Gajanan Maharaj Life History - 88

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 88 / Sri Gajanan Maharaj Life History - 88 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 18వ అధ్యాయము - 2 🌻

శ్రీమహారాజు నవ్వి... ఈమెకు పిల్లలు పుట్టేగతిలేదు. ప్రపంచంలో మగవాళ్ళంతా ఆమెకు తండ్రివంటి వారు, కాబట్టి ఆమె వివాహం విషయం మర్చిపోవడం మంచిది అన్నారు. శ్రీమహారాజునుండి ఇలా వినడంతో శివరాం బాధపడ్డాడు. వాళ్ళు ముండగాం తిరిగి వచ్చారు. కాని భవిష్యత్తు తెలుసుకున్న భాయిజా మాత్రం అమిత ఆనందం పొందింది. మరియు ఈషేగాం దర్శించడంతో ఆమె శ్రీమహారాజు యొక్క దృఢమయిన భక్తురాలయింది. 

ముండరాంకే చెందిన పుండలీకునితో, భాయిజా క్రమంగా షేగాం వెళ్ళడం మొదలు పెట్టింది. ఈవిధంగా షేగాం వెళ్ళడంలో ఆమె వైవాహిక జీవితం బాగుపడుతుందేమో అనితలచి తల్లితండ్రులు దీనికి ఏవిధమయిన అభ్యంతరం చెయ్యలేదు. కానీ ఈవిధంగా పుండలీకునితో షేగాం ఆమె వెళ్ళడం మిగిలిన వాళ్ళ మనసులో శంక ప్రారంభమయింది. మరియు భాయిజా పుండలీకులు ఈవిధంగా షేగాం వెళ్ళేనెపంతో వారి శరీరక వాంఛలు తీర్చుకుంటున్నారని పుకార్లు ప్రారంభించారు. ఇంకా పుండలీకుడు మరాఠా జాతికి చెందినవాడు, భాయిజా మాల జాతికి చెందింది కావున వాళ్ళు అభ్యంతరం తెలుపుతూ, వీళ్ళ ఈసంబంధం తెంచడానికి గొడవ గోల మొదలు పెట్టారు. 

కానీ వీళ్ళ ఇద్దరి హృదయాలు స్వఛ్ఛమయినవి. యవ్వనంలో ఉన్న యువతీ యువకులు శరీరిక ఆకర్షణవల్లనే దగ్గరికి చేరతారని భులాయి, భాయిజాని తరచు పుండలీకుని దగ్గరకు వెళ్ళడానికి ఆడిపోసింది. అంతేకాక తమకులంలో ఎవరయినా సరిపడే వ్యక్తితో ఆమెకు వివాహం చెయ్యవలసిందిగా శివరాంకు ఆమె సలహాఇచ్చింది. తరువాత ఆమె భయిజాను శ్రీగజానన్ మహారాజు దగ్గరకు తీసుకు వెళ్ళి, ఈ పుండలికునితో సంబంధానికి కారణం అడగాలని ఆలోచించింది. 

యోగులు అన్ని విషయాలు ఎరిగి ఉంటారని, శ్రీగజానన్ మహారాజు ఎప్పటికీ చెడువాసన వెయ్యని గంధం చెక్కలాంటి వారని ఆమె నమ్మకం. భులాబాయి, శివరాం, భాయిజా మరియు పుండలీకులు కలిసి, షేగాం వెళ్ళి శ్రీమహారాజుకు నమస్కరించారు. పుండలీకుని చూస్తూ.... పుండలీకా భాయిజా క్రితం జన్మలో నీసోదరి, కాబట్టి ప్రజలు హేళన చేసినా సరే ఆమెకు నీ ఆత్మీయతను ఇవ్వడం మానకు. మీరిద్దరూ కలిసి ఆ మహాశక్తి వంతుడయిన భగవంతుడుని ఆరాధించండి. భులాయి నువ్వు కూడా నీ కూతురు చేస్తున్న పనికి అభ్యంతరం చెప్పడంకానీ ధూషించడం కానీ చెయ్య కూడదు. ఈమె పుండలీకుని సోదరి, అంతేకాక భాయిజాకు భర్తను పొందేప్రాప్తి లేదు. 

పండరపూరు లోని జానాబాయిలా ఈమె జీవితాంతం కుమారిగానే ఉంటుంది. జానాబాయికి నామదేవ్ గురువుగా దొరికారు, భాయిజా నాకు వశమయింది. కాబట్టి నాజానాబాయిని ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు అని శ్రీమహారాజు అన్నారు. ఈ మాటలు విన్న శివరాం ఆత్మీయతాభావంతో ఉప్పొంగి ఏమీ మాటలాడలేక పోయాడు. తరువాత వాళ్ళు భాయిజాతో ముండగాం వచ్చారు. అప్పటినుండి ఆమెను పుండలీకునితో షేగాం వెళ్ళడానికి ఎప్పడూకూడా అభ్యంతరం చెయ్యలేదు. 

శ్రీమహారాజు ఎప్పుడూ తన భక్తులను ఎలా కాపాడుతూ ఉంటారనే కధ ఇప్పుడు నేను చెపుతాను. డా. భవ్ కావర్ అనే అతను ఖాంగాంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పూర్తిఅధికారిగా ఉండేవాడు. ఇతనికి భయానకమైన తెగగడ్డ ఒకటి వేసింది. దీనివైద్యం కోసం బుల్ దానా, అకోలా మరియు అమరావతి నుండి ప్రాముఖ్యతగల వైద్యులను తీసుకు వచ్చారు. 

మందులతో, శస్త్ర చికిత్సతో చేసిన అన్ని ప్రయత్నాలు, భవోకు ఉపశమనం కలిగించడంలో విఫలమయ్యాయి. భరించలేని నొప్పివల్ల మంచంలోనే అసహనంగా పడిఉన్నాడు. భవ్ యొక్క ఈవ్యాధికి అతని అన్న చాలా చింతితుడు అయ్యాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 88 🌹

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 18 - part 2 🌻

Shri Gajanan Maharaj smiled and said, She is not destined to get any children. All men in the world are like a father to her. It is better to forget about her marriage.” Shivram was sorry to hear this from Shri Gajanan Maharaj , but Baija was extremely happy to know her future and with this visit to Shegaon, became a firm devotee of Shri Gajanan Maharaj . 

Baija started going to Shegaon regularly with Pundalik of Mundgaon. Parents did not object to it as they thought that these trips to Shegaon may help revive her married life. 

But her going to Shegaon with Pundalik created doubt in the minds of people, and they even started spreading rumors that, in the guise of Shegaon trips, Pundalika and Baija were satisfying their lust for each other. They further objected to it saying that Pundalika was a Maratha and Baija belonged to the Mali community, and thus a great hue and cry was raise to break their association. 

But both of them were pure at heart. Bhulabai rebuked Baija for her frequently going to Pundalika, saying that young men and female came together only with physical attraction. She even advised Shivram arrange her remarriage to a suitable boy of their community. 

Then she thought of taking Baija to Shri Gajanan Maharaj to find out the reason for her association with Pundalika. She believed that saints know everything and Shri Gajanan Maharaj was like sandalwood which can never emit bad smell. Bhulabai, Shivram, Baija and Pundalik all went together to Shegaon and prostrated before Shri Gajanan Maharaj . 

Looking to Pundalika, Shri Gajanan Maharaj said, Pundalika, Baija was your sister in the previous life, and so don't deny her affection, even if it becomes a matter of public criticism. Both of you together worship the Almighty God. Bhulabai, you also should not obstruct or blame your daughter for what she is doing. She is Pundalik’s sister. 

Moreover, Baija is not destined to get a husband. She will remain a maid throughout her life, just like Janabai of Pandharpur. Janabai got Namdeo as Guru and Baija has surrendered to me. So nobody should trouble my Janabai. Hearing these words, Shivram got overwhelmed with emotion and could not speak anything.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2020

No comments:

Post a Comment