🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 143 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 17 🌻
128. ఒకసారి నారదుడు దక్షుడితో, “నువ్వు ప్రజాపతివై ఉండి ఎవరికీ కూడా మోక్షం లభించకుండా మోక్షమార్గాన్ని నిరోధిస్తూ దుష్టమైన కామాన్ని ప్రొత్సహిస్తున్నావు. వాళ్ళను కామ మార్గంలో పెడుతున్నావు. నువ్వు ఎంత అధమం చేస్తున్నావో తెలుస్తున్నదా నీకు?” అని అడిగాడు.
129. దక్షుడు ఆయనతో, “అలా ఏమీకాదు! తీక్షణమయిన విషయ సుఖదుఃఖాలను అనుభవించిన తరువాత గాని, ముముక్షుత్వం మనుష్యులకు రాకుండును గాక! అందుచేత గురువు బోధచేసిన తరువాత కూడా, తీవ్రమయిన సంసారక్లేశం అనుభవించిన తదుపరియే, గురువు చేసిన ఆ బోధ వారికి అంతరంగంలోనే ఒక వివేకాన్ని కలిగిస్తుంది. ‘దీనిని వదిలిపెట్టు, నిస్సంగానికి వెళ్ళిపో’ అని చెప్పగానే వాళ్ళు నివృత్తిమార్గాన్ని అనుసరించ కుందురు గాక!
130. బోధ చేసిన తరువాత కూడా వాళ్ళు ఈ సంసారంలోపడి దుఃఖాన్ని, సుఖాలను బాగా తీవ్రంగా అనుభవించిన తరువాతనే గురువాక్యం వారికి అవగతమగును గాక! ఇప్పుడే నువ్వు సులభంగా చెప్పావు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక ఎప్పుడూ అలా జరగదు” అన్నాడు.
131. అంతేగాక, “ఇప్పటిదాక నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ప్రమాదంగా ఉంది. కనుక నీకొక నిలకడ లేకుండా ఉండునుగాక! ఎప్పుడూ త్రిలోకసంచారిగా ఉంటావు నువ్వు” అనికూడా అన్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Oct 2020
No comments:
Post a Comment