ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 88, 89 / Sri Lalitha Chaitanya Vijnanam - 88, 89 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా |
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ‖ 36 ‖
🌻 88. 'మూలమంత్రాత్మికా'🌻
మూలమంత్ర స్వరూపిణి శ్రీ లలితాదేవి అని అర్థము.
భారతీయ వాజ్మయమున, సంప్రదాయమున మాత్రమే మంత్రవిద్య మిగిలియున్నది. మంత్రము సర్వకామప్రదమే కాక ఆత్మ సాక్షాత్కారము కూడ కలిగించును. జీవునికి మంత్రము సర్వసిద్ధి ప్రదము. మంత్రములకు మూలము శబ్దము. దీనిని వాక్కుగ వేదములు వర్ణించినవి. వాక్కుకు మూలము అమ్మయే. సర్వమంత్రములకు ఆమెయే మూలము. ఆమెయే ఆత్మ. ఆమె మంత్రాత్మిక. 'మూలమంత్రాత్మిక' అనగా మంత్రాత్మల మూలమని అర్థము.
మరియు మూలమంత్ర మనగ పంచదశీ మంత్రము కూడను. పంచదశీ మంత్రమునకు ఆమెయే ఆత్మ గనుక ఆమె మూలమంత్రాత్మిక. పంచదశీ మంత్రమును మూలమంత్ర మనుటలో విశేషమేమన అది చతుర్విధ పురుషార్థములకు మూలకారణము. పంచదశీ మంత్రమును మననము చేయుట వలన జీవునికి ధర్మార్థ కామ మోక్షములు తప్పక ఫలించ గలవని హయగ్రీవుని వాగ్దానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 88 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mūlamantrātmikā मूलमन्त्रात्मिका (88) 🌻
Mūla means root. Mūlamantra means root of the mantra. Mantra here means Pañcadaśī. She is the root of the Pañcadaśī mantra, which is the root of all other mantra-s. In fact, Her kāmakalā is the root of Pañcadaśī mantra, which is discussed in nāma 322.
The Pañcadaśī mantra is superimposed on Her physical form.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 89 / Sri Lalitha Chaitanya Vijnanam - 89 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా |
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ‖ 36 ‖
🌻 89. 'మూలకూటత్రయ కళేబరా'🌻
మూలమంత్రము యొక్క కూటత్రయమే స్థూల రూపముగా
గలది శ్రీదేవి యని అర్థము.
కూటత్రయము వరుసగా ప్రజ్ఞ, శక్తి, పదార్థము. ప్రజ్ఞ ప్రధాన
బిందువుగ శక్తి పదార్థముల త్రిభుజాకార మేర్పడును. పదార్ధము ఈ మూడు బిందువులు మూడు కేంద్రములుగ భూ, భువ, సువర్లోకము లేర్పడుచున్నవి. సమస్త సృష్టి ఈ మూడు బిందువుల సమ్మిశ్రమమే, అణువునందు కూడ ఈ మూడును గోచరించును (న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్).
ఈ మూడు బిందువులు, మూడు గుణములుగా ఎరుగవలెను. శ్రీదేవి శరీరము త్రిగుణాత్మక సృష్టి.
త్రయస్త్రం శత్సహస్రాణి, త్రయస్త్రం శతృతానిచ |
త్రయస్త్రిం శచ్చ దేవానాం, సృష్టి స్సంక్షేప లక్షణా ||
సమస్తము త్రికూటముతోనే నిర్మింపబడినది. మూడు నుండి ముప్పది మూడు కోట్ల దేవత లేర్పడిరి. త్రిమూర్తులు, త్రిశక్తులు కూడ నివియే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 89 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mūlakuṭatraya-kalebarā मूलकुटत्रय-कलेबरा (89) 🌻
Traya means three. The three kūṭa-s of Pañcadaśī mantra is mentioned here. Kāmakalā is the root of Pañcadaśī mantra. Therefore, it implies that both Her physical and subtle forms represent kāmakalā. Out of the three subtle forms, the first subtle form is Pañcadaśī mantra that we have discussed from nāma 85 to 88. The second subtle form (subtler form), kāmakalā form is discussed here.
In a nutshell, kāmakalā is the union of haṃsa and sohaṁ (haṃsa mantra – referring to the universal and the individual Spirit.) having three bindu-s and a triangle. This is the actual physical diagram of Lalitāmbikā. The bīja involved is īṃ ईं. This bīja is extremely powerful and will surely cascade down prosperity if one knows how to use this bīja in ṣodaśī mantra. However this is to be learnt from one’s Guru.
With this nāma, the description of Her subtle and subtler forms end. We now proceed to discuss Her subtlest form viz. kuṇḍalinī from nāma 90 to 111.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Nov 2020
No comments:
Post a Comment