విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 106, 107 / Vishnu Sahasranama Contemplation - 106, 107


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 106, 107 / Vishnu Sahasranama Contemplation - 106, 107 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻106. సత్యః, सत्यः, Satyaḥ🌻

ఓం సత్యాయ నమః | ॐ सत्याय नमः | OM Satyāya namaḥ

అవితథ (అనృతముకాని) రూపము కలవాడు కావున పరమాత్ముడు 'సత్యుడు' అనబడును. ప్రపంచమునందలి తత్త్వములన్నియు ఒకప్పుడు ఉండును - ఒకప్పుడు లేకుండును. కావున అవి అనృతములు (నిజము కానివి). రూపములు కలవి అయిన అగ్ని, జలము, పృథివి; రూపములు లేనివి యగు ఆకాశము, వాయువు అను పంచభూతములు తన్మయ ప్రపంచమును అతనియందే ఆరోపితములు కావున అవి యన్నియు అతడే.

లేదా సత్ అంటే మూర్తి గలవి, త్యత్ అంటే మూర్తిలేనివి కూడ ఆ పరతత్త్వము తానే అయి యున్నాడు. 'సత్‍, త్యత్' లలో ప్రథమ అక్షరములగు 'స', 'త్య' లను కలుపగా 'సత్యః' అగును.

లేదా సత్సు సాధుః సత్యః అని వ్యుత్పత్తిన సత్‍, య అను విభాగములచే సజ్జనుల విషయమున సాధు (సముచిత) స్వభావుడు కావున సత్యుడు. ఇచట 'య' అనునది వారి విషయమున సాధుస్వభావుడు అను నర్థమున ఏర్పడిన ప్రత్యయమని తెలియ దగినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 106 🌹

📚. Prasad Bharadwaj

🌻106. Satyaḥ🌻

OM Satyāya namaḥ

As He is of the form which is not untrue He is Satyaḥ. Or because He is with and without form He is Satyaḥ. Or because He is good to the good people, He is called Satyaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥

వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥

Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 107 / Vishnu Sahasranama Contemplation - 107 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻107. సమాత్మా, समात्मा, Samātmā🌻

ఓం సమాత్మనే నమః | ॐ समात्मने नमः | OM Samātmane namaḥ

సమః ఆత్మా యస్య సః రాగద్వేషాది దోష రహితము అగు ఆత్మ ఎవనికి కలదో అట్టివాడు. లేదా సమః చ అసౌ ఆత్మాచ అన్ని భూతములందును నిండి ఉన్న ఒకే ఒక ఆత్మ స్వరూపుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 107 🌹

📚. Prasad Bharadwaj

🌻107. Samātmā🌻

OM Samātmane namaḥ

Samaḥ ātmā yasya saḥ He whose ātmā is sama or equanimous, unspoiled by attachment, aversion etc., is Samātmā. Or Samaḥ ca asau ātmāca One who is the sama ātmā the single ātmā in all beings is Samaātmā.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥

వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥

Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹




13 Nov 2020

No comments:

Post a Comment