🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 33 / Sri Devi Mahatyam - Durga Saptasati - 33 🌹
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 9
🌻. నిశుంభ వధ - 3 🌻
29. అప్పుడు నిశుంభుడు తెలివినొంది, (మూర్ఛ తేటి) వింటిని గైకొని దేవిని (చండికను), కాళిని, సింహాన్ని బాణాలతో కొట్టాడు.
30. దితిపుత్రుడైన ఆ రాక్షసేశ్వరుడు పదివేల చేతులు కల్పించి (పదివేల) చక్రాయుధాలతో చండికను కప్పివేసాడు.
31. దుస్సహదుఃఖాలను తొలగించే దుర్గాభగవతి అంతట కుపితయై ఆ చక్రాలను బాణాలను తన బాణాలతో ఛేదించింది.
32. అంతట నిశుంభుడు రాక్షససేనా పరివేష్టుడై, వేగంగా గదను గైకొని చండికను వధించడానికి (ఆమె మీదికి) ఉరికాడు.
33. అతడలా వేగంగా వస్తుండగా, చండిక అతని గదను తన పదునైన ఖడ్గంతో త్రుంచివేసింది. అతడు అంతట శూలాన్ని తీసుకున్నాడు.
34. దేవతలను పీడించే నిశుంభుడు శూలహస్తుడై వస్తుండగా, చండిక వేగంతో ఒక శూలాన్ని ప్రయోగించగా అది అతని హృదయంలో గ్రుచ్చుకొంది.
35. శూలంతో భేదింపబడిన అతని హృదయం నుండి మహాబల శౌర్యసంపన్నుడైన మరొక పురుషుడు "నిలువు” అని పలుకుతూ బయగకు వచ్చాడు.
36. దేవి బిగ్గరగా నవ్వుతూ ఆ వెల్వడిన పురుషుని శిరస్సును తన ఖడ్గంతో ఛేదించింది. అతడంతట నేలకూలాడు.
37. సింహం తన ఉగ్ర కోఱలతో కొందరు అసురుల కంఠాలను పొడిచి వారిని భక్షించింది. కాళి, శివదూతి ఇతరులను భక్షించారు.
38. కౌమారీ బల్లెపుపోట్లతో కొందరు మహాసురులు నశించారు. ఇతరులు బ్రహ్మాణి చల్లిన మంత్రంతో, పవిత్రజలం చేత జయింపబడ్డారు.
39. మరికొందరు మాహేశ్వరి త్రిశూలపు పోటుతో కూలారు. కొందరు వారాహి యొక్క ముట్టెపోట్లతే చూర్ణమయ్యారు.
40. వైష్ణవి యొక్క చక్రంతో కొందరు రక్కసులు తెండెతుండెములుగా తెగిపోయారు. మరికొందరు ఐంద్రి చేతి వ్రేళ్లతో ప్రయోగించబడిన వజ్రాయుధం వల్ల కూలారు.
41. కొందరు అసురులు (తామే) మరణించారి. కొందరు యుద్ధభూమి నుండి పారిపోయారు. ఇతరులును కాళిచే, శివదూతి చే, సింహంచే మ్రింగబడ్డారు.
శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “నిశుంభవధ” అనే నవమాధ్యాయము సమాప్తం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 33 🌹
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
CHAPTER 9:
🌻 The Slaying of Nishumbha - 3 🌻
29. Then Nishumbha, regaining consciousness seized his bow and struck with arrows the Devi and Kali and the lion.
30. And the danuja-lord, the son of Diti, putting forth a myriad arms, covered Chandika with myriad discuses.
31. Then Bhagavati Durga, the destroyer of difficulties and afflictions, became angry and split those discuses and those arrows with her own arrows.
32. Thereupon Nishumbha, surrounded by the daitya host, swiftly seizing his club, rushed at Chandika to sly her.
33. As he was just rushing at her, Chandika colve his club with her sharp-edged sword; and her took hold of a dart.
34. As Nishumbha, the afflicter of the devas, was advancing with the dart in hand, Chandika pierced him in the heart with a swiftly hurled dart.
35. From his (Nishumbha's) heart that was pierced by the dart, issued forth another person of great strength and valour, exclaiming (at the Devi) 'Stop.'
36. Then the Devi, laughing aloud, severed the head of him, who issued forth, with her sword. Thereupon he fell to the ground.
37. The lion then devoured those asuras whose necks he had crushed with his fierce teeth, and Kali and Shivaduti devoured others.
38. Some great asuras perished, being pierced through by the spear if Kaumari. Others were repulsed by (sprinkling of ) the water purified by the incantation of Brahmani.
39. Others fell, pierced by a trident wielded by Mahesvari; some were powdered on the ground by the blows from the snout of Varahi.
40. Some danavas were cut to pieces by the discus of Vaisnavi, and others again by the thunderbolt discharged from the palm of Aindri.
41. Some asuras perished (themselves), some fled from the great battle, and others were devoured by Kali, Sivaduti and the lion. Here ends the ninth chapter called 'the Slaying of Nishumbha' of Devi mahatmya in Markandeya- purana during the period of Savarni, the Manu.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
13 Nov 2020
No comments:
Post a Comment