🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 98 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - 3 🌻
410. సంకల్ప స్వరూపుడు:-
మానవుని స్థితిలోనున్న మానసిక చైతన్యముగల భగవంతుడు తన మనస్సునకు ప్రభువు.
భౌతిక, సూక్ష్మ లోకములో భౌతిక సూక్ష్మ చైతన్యమును కలిగి యున్నప్పుడు తన మనస్సునకు బానిసయై యుండెను.
ఇచట కాలము చూచుట (దర్శనము) అనేది మానసిక జ్ఞానముచే, ఈ భూమిక యొక్క అనుభవములు చవిచూడబడును.
ఇతనికి బౌటిక, సూక్ష్మ దేహముల స్పృహయుండదు. కాబట్టి తత్సంబంధ లోకానుభవములను చవిచూడలేడు. కానీ తన స్థూల సూక్ష్మ దేహములను స్పృహలేకయే మానసిక తలమునుండి పరోక్షముగా వినియోగించును.
తన స్థూల కాయమందు స్పృహలేకున్నానూ, అనేక భౌతిక లక్షణముల ద్వారా దానిని వినియోగించుచు సామాన్య మానవుని వలె వ్యవహరించును.
అట్లే అనంత ప్రాణముయొక్క వివిధ లక్షణముల ద్వారా, స్పృహలేకుండగానే సూక్ష్మశరీరమును వినియోగింతురు, ఆ విధముగా అతిచురుకుదనముతో కార్యములందు పాల్గొనుచుందురు.
స్థూల సూక్ష్మ శరీరముల స్పృహలేక పోయిననూ, అవి రెండూ స్పృహలేకయే ఉపయోగపడుచుండును.
ఇతడు పూర్తిగా మనస్సు యందే స్పృహగలవాడై దర్శనేంద్రియ జ్ఞానముచే మామాసిక ప్రపంచానుభవములను పొందుచుండును.
ఇతడు మానసిక ప్రపంచమందుండుతచేత, ఏ విధమైన శక్తులను ప్రయోగించలేడు.
సూక్ష్మ భూమికలందు ఎరుకగలవారి మనస్సులను తనిఖీ చేయును. వాటిని తన అధికారమందుంచును, లేక వాటికి మార్గదర్శి యగును..
తాను మహిమాలను ప్రదర్శింపలేకున్నను తన మనోసంకల్పము ప్రకారము, తన వాంచల ప్రకారము సూక్ష్మ భూమికల చైతన్యము గలవారిచే మహిమలను చేయించగల సమర్ధుడగును.
భౌతిక, సూక్ష్మ దేహములయందు చైతన్యముగల వారి అందరి మనస్సులయోక్క తలంపులను, వాంచలను, చిత్త వికారములను సృష్టించును. వాటిని తన అధికారములో నుంచును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Nov 2020
No comments:
Post a Comment