🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 106 / Sri Gajanan Maharaj Life History - 106 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 20వ అధ్యాయము - 1 🌻
శ్రీగణేశాయనమః ! ఓ రుక్మిణీవరా మీకు జై. చంద్రభాగ నదీతీరాన్న నివసించే భగవంతుడా ఈదాసగణును దయచేసి ఆశీర్వదించండి. మీరు రాజాధిరాజు. ప్రతీదీ మీచేతులలోనే ఉంది. మరినన్ను ఎందుకు విస్మరిస్తున్నారు ?
మీయొక్క కృపచేతనే పాపాలు చింతలు నాశనం చేసి నామనసును మీగుణగానం చేసేవిధంగా ఉల్లాస పరచండి. అలా చెయ్యకపోతే, అనవసరమయిన అపనిందమీకు వస్తుంది. గొప్పవాళ్ళు అటువంటి అపనిందను రానీయకూడదు. కాబట్టి ఓశ్యామసుందరా, ఓరుక్మిణీపతీ, ఓదయామయా పాండురంగా నాకోరిక నెరవేర్చండి.
శ్రీగజానన్ మహారాజు నిర్యాణం తరువాత, కొంత ధూళితప్ప షేగాంలో మరి ఏమీ మిగల లేదని ప్రజలు అనడం ప్రారంభించారు. నీళ్ళు లేకుండా సముద్రం, పూలమొక్కలు పువ్వు లేకపోతే వాటి ప్రత్యేకత కోల్పోతాయి. కాబట్టి షేగాం దర్శించడంలో ఫలితంలేదు. ఎందుకంటే భగవంతుడులేని గుడిలో పువ్వులు అర్పించడం అర్ధంలేని పని. ఇలా చాలామంది అన్నారు, కానీ ఇది సరికాదు.
అగోచరమైన శ్రీమహారాజు జీవాత్మ ఇప్పటికీ షేగాంలో ఉంది. ఇంద్రియాణి నది ఒడ్డున చాలాకాలం క్రితం శ్రీధ్యానేశ్వర్ మహారాజు సమాధి తీసుకున్నా, అనేకమంది తన భక్తులను ఆస్థలంలో కలిసేవారు. అలానే శ్రీగజానన్ మహారాజు, ఎవరయితే తను షేగాంలో ఉన్నానని నమ్ముతారో వారికి దర్శనం ఇస్తారు. ఇది ఇకముందు చెప్పబోయే సంఘటనతో నిజమని తెలుస్తుంది:
శ్రీగణపత్ కొటాడే అనే శ్రీమహారాజు యొక్క గొప్పభక్తుడు ఉన్నాడు. అతను రాయలీకంపనీ యొక్క షేగాం శాఖకి ఏజంటు. సాయంత్రంపూట శ్రీమహారాజు సమాధికి వెళ్ళి, అక్కడకూర్చుని కొద్దిసేపు ధ్యానంచెయ్యడం అతని దినచర్య . ఒకసారి అలా కూర్చున్నప్పుడు, విజయదశమి రోజున శ్రీమహారాజుకు అభిషేకం చేయించి కొంతమంది బ్రాహ్మణులకు భోజనం తినిపించాలని కోరుకున్నాడు. ఆ ప్రకారం అన్ని ఏర్పాట్లుచేసి, సరిపడా ధాన్యం ఇతర వంటసామాగ్రి మఠానికి పంపించాడు.
అతని భార్య దీనికి ఇష్టపడక ఓ స్వామీ ఏమిటి మీరు చేస్తున్నది ? ఇది ధనం వృధా చెయ్యడమే. రేపు విజయదశమి కోసం మీరు పిల్లలకు కొత్తబట్టలు కొని ఉండవలసింది. ఈవిధంగా అభిషేకాలమీదా, బ్రాహ్మణుల కొరకు డబ్బు ఖర్చుపెట్టడం మంచిదికాదు. మనకు మనపిల్లలు తినేందుకు ఉన్నారు, అంతేకాక నాదగ్గర ఒక్క గ్రాముబరువు ఉన్న ఆభరణంకూడా పెట్టుకుందుకులేదు. ఇది సంసారికి శోభిస్తుందా ? మీరు కుటుంబంకోసం, మన భవిష్యత్తుకోసం కొంత ధనం జమ చేసి ఉండాలి అని అంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 106 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 20 - part 1 🌻
Shri Ganeshayanmah! O Rukminivara Jai to you. O God, residing on the bank of Chandrabhaga, please blesses this Dasganu. You are the king of kings. Everything is in your hands. Then why are you ignoring me?
Let your kind grace destroy all my sins and worries, and make the mind cheerful to sing in your praise. If it is not done, unnecessary blame will come to you. Greatmen should avoid such blame. Therefore, O Shyamsundara, O Lord of Rukmini, O generous Panduranga, fulfill my desire.
After the Nirvan of Shri Gajanan Maharaj, people started saying that there was nothing left at Shegaon, except some dust. A sea without water and a flower tree without flowers lose their importance. So some people thought it to be useless to visit Shegaon as it is meaningless to offer flowers at the temple without God in it.
So said many people, but they were wrong. The invisible divine life flame of Shri Gajanan Maharaj is still there at Shegaon. Though Shri Dayaneshwar Maharaj attained Samadhi long ago on the bank of Indrayani, he did meet many of his devotees at that place. Similarly, Shri Gajanan Maharaj gives Darshan to those, who believe in his existence at Shegaon. The following incident will prove it.
There was one Shri Ganpat Kothade, a great devotee of Shri Gajanan Maharaj . He was an agent of the Shegaon branch of the Rayali Company. It was his daily routine to go to the Samadhi of Shri Gajanan Maharaj in the evening, and sit there in meditation for some time.
Once, while sitting there, a desire formed in his mind to perform Abhisheka to Shri Gajanan Maharaj and feed some Brahmins on Vijay Dashami Day (Dashera Day). Accordingly, he made all arrangements and sent sufficient ration and grocery to the Math.
His wife did not like it and said, O Sir, why are you doing this? It is a waste of money. Tomorrow being Vijay Dashami day, you should, in fact, purchase some new clothes for our children. All this spending on Abhisheka and Brahmins is not good. We have got our own children to feed, and I don't have a gram of ornament to wear. Does it befit a family man? You are supposed to save some money for the family and our future also.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Nov 2020
No comments:
Post a Comment