2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 244, 245 / Vishnu Sahasranama Contemplation - 244, 245🌹
3) 🌹 Daily Wisdom - 36🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 170🌹
5) 🌹. వివేక చూడామణి / Viveka Chudamani - 00 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 10🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 109 / Sri Lalitha Sahasra Namaavali - 109 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 187 / Sri Lalita Chaitanya Vijnanam - 187🌹
9) 🌹. స్వేచ్ఛతోనే నైపుణ్యం 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 530 / Bhagavad-Gita - 530🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 7 / Bhagavad-Gita - 7🌹
12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 131🌹
13) 🌹. శివ మహా పురాణము - 331🌹
14) 🌹 Light On The Path - 84🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 216🌹
16) 🌹 Seeds Of Consciousness - 280 🌹
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 155🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 11 / Lalitha Sahasra Namavali - 11🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 11 / Sri Vishnu Sahasranama - 11🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 617 / Bhagavad-Gita - 617 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 34 🌴*
34. యయా తు ధర్మకామార్థాన్ ధృత్వా ధారయతే(ర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి: సా పార్థ రాజసీ ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! కాని ఏ నిశ్చయముచే మనుజుడు ధర్మము, అర్థము, కామములందలి ఫలముల యెడ ఆసక్తిని వహించునో అట్టి నిశ్చయము రజోగుణప్రధానమైనట్టిది.
🌷. భాష్యము :
ఇంద్రియప్రీతి నొక్కదానినే కోరికగా కలిగి, ధర్మకార్యములు మరియు అర్థకార్యముల ఫలములను వాంచించు మనుజుడు తన మనస్సును, ప్రాణమును, ఇంద్రియములను తద్రీతిగనే నియుక్తము చేయుచు రజోగుణప్రధానుడు అనబడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 617 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 34 🌴*
34. yayā tu dharma-kāmārthān
dhṛtyā dhārayate ’rjuna
prasaṅgena phalākāṅkṣī
dhṛtiḥ sā pārtha rājasī
🌷 Translation :
But that determination by which one holds fast to fruitive results in religion, economic development and sense gratification is of the nature of passion, O Arjuna.
🌹 Purport :
Any person who is always desirous of fruitive results in religious or economic activities, whose only desire is sense gratification, and whose mind, life and senses are thus engaged is in the mode of passion.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 244, 245 / Vishnu Sahasranama Contemplation - 244, 245 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻244. జహ్నుః, जह्नुः, Jahnuḥ🌻*
*ఓం జహ్నవే నమః | ॐ जह्नवे नमः | OM Jahnave namaḥ*
అపహ్నుతే సంహార సమయే జనాన్ - అపనయతి ప్రళయసమయమునందు జనులను తొలగించును లేదా ప్రహిణోతి జహాతి తత్త్వజ్ఞులు కాని వారిని తనమహతత్త్వమును ఎరుగనివారిని వదలును లేదా ప్రహిణోతి నయతి భక్తాన్ పరం పదమ్ తన భక్తులను పరమ పదమున చేర్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 244🌹*
📚. Prasad Bharadwaj
*🌻244. Jahnuḥ🌻*
*OM Jahnave namaḥ*
Apahnute saṃhāra samaye janān - apanayati / अपह्नुते संहार समये जनान् - अपनयति At the time of destruction, He makes men disappear. Or Aviduṣaḥ jahāti / अविदुषः जहाति He leads those away from Himself, who are devoid of intelligence and devotion. Or Prahiṇoti nayati bhaktān paraṃ padam / प्रहिणोति नयति भक्तान् परं पदम् He leads his devout to eternal abode.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 245 / Vishnu Sahasranama Contemplation - 245 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻245. నారాయణః, नारायणः, Nārāyaṇaḥ🌻*
*ఓం నారాయణాయ నమః | ॐ नारायणाय नमः | OM Nārāyaṇāya namaḥ*
నరః అనగా ఆత్మ. దానినుండి జనించిన ఆకాశాది కార్యములు నారములు అనగా నరుని నుండి జనించినవి. తన నుండియే జనించిన ఈ నారములు తనకు 'అయనము' లేదా ఆశ్రయము అగుచున్నవి కావున నారాః ఆయనం యస్య నారములు ఎవనికి ఆయనమో అట్టివాడు నారాయణుడు. అనువ్యుత్పత్తిచే విష్ణువు 'నారాయణః' అనబడుచున్నాడు.
యచ్చ కించి జ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా అంతర్బహిశ్చ త తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః (నారాయణోపనిషత్ 13.12) ఏ ఈ కొంచెము జగత్తు కనబడుచున్నదో వినబడుచున్నదో దానిని అంతటిని లోపలను వెలుపలను కూడా వ్యాపించి నారాయణుడు ఉన్నాడు.
:: శ్రీ మహాభారతే వనపర్వణిఏకోననవత్యాధికశతతమోఽధ్యాయః ::
దేవ ఉవాచ
అపాం నారా ఇతి పురా సంజ్ఞాకర్మ కృతం మయా ।
తేన నారాయణోఽప్యుక్తో మమ తత్ త్వయనం సదా ॥ 3 ॥
పూర్వకాలమునందు నేనే జలములకు 'నారా' అని నామమొసంగితిని. అట్టి 'నారా' అనగా జలము నా 'అయనము' అనగా వాసస్థానమైయున్నందున నేను నారాయణుడిగా విఖ్యాతినొందితిని.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 245🌹*
📚. Prasad Bharadwaj
*🌻245. Nārāyaṇaḥ🌻*
*OM Nārāyaṇāya namaḥ*
Naraḥ means Ātma or The Soul. The Elements like water that originated from It are called Nāras i.e., the Ones that emanated from Naraḥ. Nārāḥ āyanaṃ yasya The One who has such Nāras, which originated from Himself, as His Āyana or retreat is Nārāyaṇa.
Yacca kiṃci jjaga tsarvaṃ dr̥śyate śrūyate’pi vā aṃtarbahiśca ta tatsarvaṃ vyāpya nārāyaṇaḥ sthitaḥ (Nārāyaṇopaniṣat 13.12) (even) The little portion of universe that is visible and audible has Nārāyaṇa all pervading within and without.
Śrī Mahābhārata - Book III, Chapter 189
Deva uvāca
Apāṃ nārā iti purā saṃjñākarma kr̥taṃ mayā,
Tena nārāyaṇo’pyukto mama tat tvayanaṃ sadā. 3.
In the ancient times, it is Me who named waters 'Nārā.' Since I have such waters as my Āyana or retreat, I came to become widely known as Nārāyaṇa.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 36 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 5. We are Nationals of a Psychic World 🌻*
We are nationals of a psychic world, more properly than the way in which we belong to the physical world of social beings. Our psychic apparatus is a complicated structure, because it has connections with almost everything in the world. It is like a main switchboard.
We are not so much detached from things as we appear to be. There is a subterranean relationship between our inner contents and the whole cosmos outside. The moment we begin to enter the realm of yoga practice, we also start operating upon our cosmic relationships. This is something important to remember.
At present we believe that we are isolated individuals with no connection whatsoever with others. But meditation is adventure, which opens up a new vista before us and surprises us with our relationships which were not apparent in our waking work-a-day life.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 170 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 100 🌻*
*చివరి బాగము.*
ఈ సాధనకు తోడ్పడేటువంటి సాంఖ్య విచారణ అంతా నువ్వు తెలుసుకోవాలి. పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, దేహత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, గుణత్రయ విచారణ, ఋణత్రయ విచారణ, తాపత్రయ విచారణ ఈ రకంగా మలత్రయ విచారణ ఇలా రకరకాల విచారణలు అన్నీ కూడాను వివేక చూడామణిలో, బ్రహ్మవిద్యలో చక్కగా బోధించబడ్డాయి.
ఇది ప్రతి ఒక్కరూ బాగా పరిశీలించవలసినటువంటి అంశం. అలా పరిశీలించి మీరు వాటిని నిజజీవితంలో వినియోగించుకోవాలి. ఈ ఇంద్రియాలను ఉపయోగించి తింటున్నా, తినకపోతున్నా, కూర్చొన్నా, నిలబడినా, ఆలోచించినా ఏ రకమైన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా, ఆయా ఇంద్రియ స్థానములు అన్నీ కూడా, తత్ ఇంద్రియాధిష్ఠాన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత వ్యవహరిస్తున్నాయని,
ఇట్టి ఇంద్రియములకు కానీ, తనకు కానీ, ఎట్టి కర్తృత్వ భోక్తృతాభిమానములు లేవని, కేవలము కారణ స్వరూపమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలే బాధ్యులుకానీ, తాను అబాధ్యుడను అని తనను తాను బుద్ధి కంటే వేరైన వాడినని, బుద్ధి సాక్షి అని, ప్రత్యగాత్మనని చైతన్యమునని శుద్ధాహమని వేరు పరుచుకోవాలి.
ఇలా సాక్షి భావనను ఆశ్రయించి ఎవరైతే ప్రతి రోజూ ఈ నిర్మలాంతఃకరణమున కొరకై సాధన చేస్తారో, వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యగాత్మ సాక్షాత్కారాన్ని, తదుపరి ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులనేటటువంటి బ్రహ్మాత్మైక్యభావాన్ని పొందడానికి అధికారులు అవుతున్నారు.
కాబట్టి, ఆచరణ శీలురు కానటువంటి ‘శుష్క వేదాంత తమో భాస్కరం’ అనేటటువంటి గ్రంథాన్ని సద్గురు మళయాళ యతీంద్రులు రచించారు. ఎవరైతే మెట్ట వేదాంతం చెబుతుంటారో, అంటే ఆచరణ శీలురు కానటువంటి శాస్త్ర వాదులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే అనేక సంవత్సరాల నుంచి ఏదైనా గానీ మీరు చెప్పారనుకోండి ఇదంతా తెలిసిందేనండీ, ఇదంతా మేము విన్నదేనండీ, ఇదంతా గ్రహించిందేనండీ అంటారు.
తెలుసుకున్నావు, విన్నావు, గ్రహించావు, అర్థం చేసుకున్నావు... మరేం సాధించావు? అంటే, ఇంకా ఏమీ సాధించలేదండీ అంటారు. మరి ఏం సాధించకపోతే ఇంతకాలం నుంచి విని శ్రవణం చేయడం ద్వారా ఏమి నువ్వు పొందావు మరి? నాకు అంతా కూడా తెలిసిందేనండి. సిద్ధాంతం అంతా తెలిసిందేనండి.
ఏమి చేయాలో తెలియదండి! సిద్ధాంతం అంతా తెలిసినాక, ఏమి చేయాలో తెలియకపోవడం అంటే ఏమిటి? శ్రవణ కాలంలో సరిగ్గా శ్రవణం చేయలేదని అర్థం. కాబట్టి శ్రద్ధతో చేసే దానినే శ్రవణము అన్నారు. పైగా శ్రవణకాలమందే ఏ సాధన చేయాలనేటటువంటి నిర్ణయానికి రాకపోవడం మరొక దోషం.
చిత్తవిక్షేపం బలంగా ఉందన్నమాట. కాబట్టి, ఆ విక్షేపదోషాన్ని ప్రతి ఒక్కరూ తొలగించుకోవాలి. మల, విక్షేప, ఆవరణ దోషాలనేటటువంటి దోషత్రయాన్ని బాగా పరిశీలించాలి. అలా పరిశీలించి తమను తాము ఉద్ధరించుకోవడానికి, తన్ను తాను ఉద్ధిరించుకోవడానికి, “ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానామవసాధయేత్” ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి.
తనను తెలుసుకోవాలి. తాను ఏదై ఉన్నాడో, సర్వకాల సర్వ అవస్థలయందు మార్పుచెందక, పరిణామ రహితముగా ఏ స్థితి యందు, తానైనటువంటి ఆత్మస్థితి యందు తానున్నాడో అట్టి ఆత్మను తెలుసుకొనుటకు మిగిలినవన్నీ సహాయకారులే. - విద్యా సాగర్ గారు
సమాప్తం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. వివేక చూడామణి - 1 / Viveka Chudamani - 1 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శంకరాచార్యులవారి పరిచయము 🌻
శ్రీ శంకరాచార్యులవారు వివేకచూడామణి అనే అత్యంత ప్రాచుర్యము పొందిన ఆధ్యాత్మిక గ్రంధ రాజము, అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదిస్తూ 580 సంస్కృత శ్లోకాలతో వ్రాయగా దానిని స్వామి మాధవానందుల వారు ఆంగ్లములోకి అనువాదము చేసియున్నారు. దానిని పరిశీలించి అందులోని అద్వైత తత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందే విధానమును తెలుగు భాషలోకి నా యొక్క స్వేచ్ఛానువాదము ద్వారా తెలియజేయు నా ప్రయత్నము సాహసమే అవుతుంది. అయినను వ్రాయాలనిపించి నాదైన సులభ శైలిలో వ్రాసినాను. నా యొక్క ఇతర పుస్తకములవలె దీనిని కూడా ఆదరిస్తారని తలచెదను.
వివేకచూడామణి అనగా సత్యాసత్యములను, మంచి చెడులను విడదీసి తెలుసుకొనుటలో ఈ గ్రంధము మణిశిఖ వంటిదని అర్థము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 10 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 4. అశ్వవిద్య - 2 🌻*
అశ్వవిద్య యనగా ప్రస్తుతము జీవించు సాధన. గతించిన విషయముల యందు రాబోవు విషయముల యందు మనసును విహరింపనీయక ప్రస్తుతమునందు నియమించుట వలన సాధకుడు ప్రాణవంతుడుగను, తేజోవంతుడుగను, అప్రమత్తుడుగను జీవించ గలడు.
ప్రస్తుతము లేక వర్తమానము నిర్దేశించుచున్న కర్తవ్యములందు మేల్కాంచియున్న జీవుడు సన్నివేశములయందు అప్రమత్తుడై యుండుట వలన ఏకాగ్ర మనస్కుడై తత్సన్నివేశముల నుండి పూర్ణానుభూతిని పొందును. ఈ సాధనయందు సిద్ధి పొందిన వారు జీవిత సన్నివేశముల యందు రసానుభూతి పొందుట కరులగుదురు.
నిత్యమూ ప్రస్తుతము నందే నియమింపబడిన మనస్సు రస స్వరూపుడైన భగవంతుని ఆస్వాదింపగల స్థితి యందుండును. గతమునందు, భవిష్యత్తునందు తగుల్కొని మనస్సు ప్రస్తుతమును మరచుటచే అనుభూతి కరవగుచుండును.
భోజనానుభూతిగాని, కర్మానుభూతిగాని, విశ్రాంతి అనుభూతిగాని దక్కనీయక రాబోవు లేక అయిపోయిన విషయముల యందు రమించు మనస్సు శవము వంటిదని ఋషులు పేర్కొనిరి.
ప్రస్తుతమున ఏకాగ్రతతో కర్తవ్యమున కేంద్రీకృతమైన మనస్సులకు మాత్రమే ఆనందానుభూతి సులభము. ఇట్లు అశ్వమునందు స్థిరపడిన మనస్సు ప్రతిచిన్న విషయమునందు కూడ పూర్ణముగ రమింపగలదు. ఇది ప్రాథమికమైన విద్య. ఇది ఆధారముగ సర్వవిద్యలను గ్రహింపవచ్చును.
అశ్వముఖుడుగ భగవంతుని చిత్రీకరించుట కిదీయే సంకేతార్థము. 'ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే అని వేదవాక్యము. అనగా సర్వ విద్యలకు ఆధారము అశ్వము తలగా గల దేవత యని అర్థము. ఈ విద్య నేర్పి, ఇతర విద్యలు నేర్పుట వేద సంప్రదాయము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. స్వేచ్ఛతోనే నైపుణ్యం 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
అందువల్ల వారికి సహజంగానే జీవితం విసుగనిపిస్తుంది. నా దగ్గరకు వచ్చిన వారిలో చాలామంది ‘‘జీవితం విసుగనిపిస్తోంది’’ అన్నవారే. ఎందుకంటే, వారు ఎక్కడో ఇరుక్కుపోయి చాలా విసిగిపోయారు. చేసేదేముంది? ‘‘మంత్ర జపం’’చేస్తే మళ్ళీ జీవమొస్తుందని వారనుకుంటారు. కానీ, అది అంత సులభం కాదు. అందువల్ల వారు తమ జీవన సరళిని పూర్తిగా మార్చుకోక తప్పదు.
రేపు మీరేం చెయ్యాలో ముందుగా ఊహించకండి. ఏదీ ఆశించకుండా అన్నింటికీ సిద్ధంగా ఉండండి. అప్పుడే మీరు ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవిస్తున్నట్లు లెక్క.
మీ మనసులో ఎప్పుడూ ఎవరి పట్లా స్వాధీనతాభావాన్ని చేరనివ్వకండి. దాని వల్ల మీ ప్రేమ కుంగి, కృశించి, నలిగి నాశనమవుతుంది. అప్పుడు మీరు ఏమాత్రం ప్రేమించలేరు.
పనిచెయ్యండి. అది అవసరమే. కానీ, ఆ పనే మీ జీవితంగా మారనివ్వకండి. ఆట మీ జీవిత కేంద్రమవాలి. అలాగే మీ జీవితం ఆ ఆటలా సాగాలి. సరదాగా ఆడుతూ, పాడుతూ పని చెయ్యాలి. కార్యాలయంలో, కర్మాగారంలో- ఇలా ఎక్కడ ఎంత పనిచేసినా, అక్కడ ఆటపాటలకు అవకాశముండాలి. అంతేకానీ, ఎంతో విలువైన మీ జీవితాన్ని కేవలం రోజూ చేసే పని స్థాయికి దిగజార్చకండి. ఎందుకంటే, ఆటే జీవిత పరమావధి.
ఆట అంటే, దానికోసమే అన్నట్లుగా ఏదో ఒకటి చెయ్యడం. అలా దాని కోసమే అన్నట్లుగా అనేక విషయాలను ఆస్వాదిస్తూ ఆనందించినప్పుడు మీరు మరింత సజీవంగా ఉంటారు. అయితే అక్కడ మీ జీవితం ప్రమాదం కోరల్లో, అపాయం అంచుల్లో ఉంటుంది. అయినా జీవితం ఎప్పుడూ అలాగే ఉండాలి.
ప్రతి క్షణం చాలా ఆకర్షణీయంగా కనిపించే అపాయం జీవితంలో ఒక అత్యుత్తమమైన భాగం. మీకు తెలియకపోవచ్చు... మీ ఉఛ్వాస నిస్వాసలలో కూడా ప్రమాదముంది. ఊపిరి వదిలిన తరువాత కచ్చితంగా అది మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో ఎవరికి తెలుసు? అందుకు ఎలాంటి హామీ లేదు కదా!
మతాన్ని కూడా భద్రత కోసం ఉపయోగించుకునే మనుషులున్నారు. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు కూడా వారు దేవుణ్ణి ‘‘సర్వోన్నత రక్షకుడు’’అంటూ సంబోధిస్తారు. కేవలం భయం కారణంగా వారు దేవుడి గురించి ఆలోచిస్తారు.
అలాగే దేవుడి దృష్టిలో మంచివారుగా కనిపించేందుకు, ‘‘చిత్రగుప్తుడి చిట్టాలో’’ మంచి వ్యక్తిగా నమోదయ్యేందుకు అనేకరకాల ప్రార్థనలు చేస్తారు. అందుకే వారు ‘‘ఒకవేళ దేవుడనేవాడే ఉంటే, నేను రోజూ గుడికి వెళ్తున్నట్లు, ప్రార్థనలు, జపాలు చేస్తున్నట్లు వాడికి తెలుస్తుంది. అది నిజమో, అబద్ధమో తేల్చేందుకు నేనున్నాను’’ అంటారు.
- ఇంకాఉంది....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 530 / Bhagavad-Gita - 530
1 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 13 🌴*
13. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీ: సర్వా: సోమో భూత్వా రసాత్మక: ||
🌷. తాత్పర్యం :
నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్ష్యయందు నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వఓషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని శక్తి చేతనే సకలగ్రహములు అంతరిక్షమున నిలిచియున్నవని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. బ్రహ్మసంహిత యందు చర్చింపబడినట్లు అతడు ప్రతి కణమునందును, ప్రతి గ్రహమునందును, ప్రతి జీవియందును ప్రవేశించును.
ఆ భగవానుని సంపూర్ణాంశయైన పరమాత్మయే గ్రహములందు, విశ్వమునందు, జీవుని యందు, కణమునందు కూడా ప్రవేశించునని దాని యందు తెలుపబడినది. అనగా అతడు ప్రవేశము చేతనే సర్వము తగిన రీతి వ్యక్తమగుచున్నది. ఆత్మ యున్నంతవరకు మనుజుడు నీటిపై తేలగలిగినను, ఆత్మ దేహము నుండి వేరైనంతనే మరణించి నీటియందు మునిగిపోవును.
నీటి యందు క్రుళ్ళిన తరువాత దేహము గడ్డిపోచవలె నీటిపై తేలుననుట సత్యమేయైనను మరణించినంతనే మాత్రము దేహము నీటిలో మునిగిపోవును. అదేవిధముగా గ్రహములన్నియును అంతరిక్షమున తేలుటకు శ్రీకృష్ణ భగవానుని దివ్యశక్తి వాటి యందు ప్రవేశించియుండుటయే కారణము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 530 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 15 - Purushothama Yoga - 13 🌴*
13. gām āviśya ca bhūtāni
dhārayāmy aham ojasā
puṣṇāmi cauṣadhīḥ sarvāḥ
somo bhūtvā rasātmakaḥ
🌷 Translation :
I enter into each planet, and by My energy they stay in orbit. I become the moon and thereby supply the juice of life to all vegetables.
🌹 Purport :
It is understood that all the planets are floating in the air only by the energy of the Lord. The Lord enters into every atom, every planet and every living being. That is discussed in the Brahma-saṁhitā. It is said there that one plenary portion of the Supreme Personality of Godhead, Paramātmā, enters into the planets, the universe, the living entity, and even into the atom.
So due to His entrance, everything is appropriately manifested. When the spirit soul is there, a living man can float on the water, but when the living spark is out of the body and the body is dead, the body sinks. Of course when it is decomposed it floats just like straw and other things, but as soon as the man is dead, he at once sinks in the water. Similarly, all these planets are floating in space, and this is due to the entrance of the supreme energy of the Supreme Personality of Godhead.
His energy is sustaining each planet, just like a handful of dust. If someone holds a handful of dust, there is no possibility of the dust’s falling, but if one throws it in the air it will fall down. Similarly, these planets, which are floating in the air, are actually held in the fist of the universal form of the Supreme Lord.
By His strength and energy, all moving and nonmoving things stay in their place. It is said in the Vedic hymns that because of the Supreme Personality of Godhead the sun is shining and the planets are steadily moving. Were it not for Him, all the planets would scatter, like dust in air, and perish. Similarly, it is due to the Supreme Personality of Godhead that the moon nourishes all vegetables.
Due to the moon’s influence, the vegetables become delicious. Without the moonshine, the vegetables can neither grow nor taste succulent. Human society is working, living comfortably and enjoying food due to the supply from the Supreme Lord.
Otherwise, mankind could not survive. The word rasātmakaḥ is very significant. Everything becomes palatable by the agency of the Supreme Lord through the influence of the moon.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 7 / Bhagavad-Gita - 7 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 7 🌴
7. అస్మాకం తు విశిష్టా
యే తాన్నిభోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||
🌷 తత్పర్యం :
కాని ఓ బ్రాహ్మణోత్తమా! నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 BhagavadGita As it is - 7 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 7 🌴
7. asmākaṁ tu viśiṣṭā ye
tān nibodha dvijottama
nāyakā mama sainyasya
saṁjñārthaṁ tān bravīmi te
🌷 Translation :
But for your information, O best of the brāhmaṇas, let me tell you about the captains who are especially qualified to lead my military force.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 187 / Sri Lalitha Chaitanya Vijnanam - 187 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |*
*దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖*
*🌻 187. 'నిరత్యయా' 🌻*
అతిక్రమించని తత్త్వము కలది శ్రీదేవి అని అర్థము.
అతిక్రమణ వలననే అపాయము కలుగును. తనకవసరమగు విషయమును గ్రహించుటకాక, అన్ని విషయములయందు వ్రేలు ఉంచుట, అసంబంధిత విషయములలో జొరబడుట, తమ కర్తవ్యములను విస్మరించుట, ఇతరులకు ఇబ్బంది కలిగించుటవలన, దోషము సంక్రమించును. జీవిత మంతయూ కర్తవ్య నిర్వహణమునకే అని తెలిసి, దానిని నిర్వర్తించుకొనుట కొఱకే భావము, భాష, చేత అని తెలియవలెను.
అపుడు మూడు లోకములయందును, అతిక్రమణము లేక జీవించుట వీలగును. వ్యర్థభావము, భాషణములు, వ్యర్థమగు చేష్టలకు దారితీయును. కర్తవ్య కర్మ నిర్వర్తించుట, ఇతర సమయములలో మౌనమాచరించుట భక్తుల కర్తవ్యమై యున్నది. మౌనమనగా మూతి ముడుచుకొని యుండుట కాదు. మననము వలన ఏర్పడునది మౌనము. వారే మునులు.
నిత్యమూ మననముండుచూ తన వంతు కర్తవ్యమును ఆచరించువాడు కృతకృత్యు డగును. మననము ప్రధానము. కర్తవ్యమునకు పూర్వము, అనంతరమూ, మననమే సాగించినచో క్రమముగా అతిక్రమణము లేని స్వభావము ఏర్పడును. మననమందున్న ముని బుద్ధిలోకమున ఉండును. కావున కర్తవ్యాకర్తవ్యములు కూడ సులభముగా గ్రహించును. మననమట్లు నిరతిక్రమణస్థితి యందుంచగలదు.
అట్టి మననము లేనివాడు మనో లోకము నందుండుటచే కర్తవ్యము విషయమున పొరబడును. కేవలము మనస్సుతో నిర్ణయించువాడు తన స్వభావమునకు లోబడి యుండును కనుక, విచక్షతయందు స్పష్టత యుండదు. ఇట్టివారు తమ శక్తిపై ఆధారపడిన వారు. మనోబలముకన్న దైవబలము గొప్పది.
దైవస్మరణము వలన దైవబలము బుద్ధిని ప్రచోదనము గావింపగ, బుద్ధిబలము తోడైన మనస్సు సరియగు నిర్ణయములు చేయగలడు. అవతారమూర్తియగు పరశురాముడు, మహత్తర శక్తి సంపన్నులైన దుర్వాస, విశ్వామిత్రులు, వారినుండి అతిక్రమణము తొంగి చూచినపుడెల్ల మరుక్షణము తపస్సు కేగుటకు కారణమిదియే. మననము వలనే నిరతిక్రమణ సాధ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 187 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Niratyayā निरत्यया (187)🌻*
She does not transgress Her limits. It has already been seen that She functions as per the law of karma-s, the law of the Lord. Law of karma is enacted by Her, and She does not transgress Her own laws. She sets an example for others to follow.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -131 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 16
*🍀. 14. నిరహంకారము - జ్ఞానము అజ్ఞానము చేత ఆవరింపబడి యుండునని, అందుచేత జీవులు భ్రమను చెందుచున్నారని, పరమాత్మ తటస్థుడు, సాక్షీభూతుడని ముందు శ్లోకమున తెలుపబడినది. జ్ఞానము కలుగుచున్న కొలది ప్రతి ఒక్కనికి తన స్వరూప స్వభావములు స్పష్టమగు చుండును. క్రమముగ 'తాను' అను అహంకార పురుషుడు నశించి పరతత్వమే ఉన్నదని తెలియును. 'నేను' అను అంతర్యామి తత్త్వము 'నేను' అను అహంకార పురుషుని ద్వారా ప్రకాశించును. నిజముగ జ్ఞానము కలిగినవాడు తానున్నానను భ్రమను చెందడు. దైవమే తానుగ నున్నాడని తెలిసియుండును. నిజముగ దైవమే యున్నాడని తెలిసియుండును. ఇట్లు తెలిసినవారే సద్గురువులు. నిరహంకారులు. పూర్ణ జ్ఞానులు. 🍀*
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః |
తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ || 16
జ్ఞానముచేత అజ్ఞానము నాశన మొనర్పబడినపుడు ఆజ్ఞానము ఆదిత్యునివలె పరతత్వమును ప్రకాశింపజేయును. జ్ఞానము అజ్ఞానము చేత ఆవరింపబడి యుండునని, అందుచేత జీవులు భ్రమను చెందుచున్నారని, పరమాత్మ తటస్థుడు, సాక్షీభూతుడని ముందు శ్లోకమున తెలుపబడినది. ఈ శ్లోకమున జ్ఞానమగు వెలుగు కలుగుచున్నకొలది. అజ్ఞానమగు చీకటి తొలగుచు నుండునని తెలుపబడినది.
జ్ఞానము సూర్యోదయము వంటిది. సూర్యుడు ఉదయించు చున్నకొలది చీకటి తొలగి పోవుచు నుండును. అట్లే జ్ఞానము కలుగుచున్నకొలది చిత్తభ్రమలు, భ్రాంతులు నశించు చుండును. దైవమును గూర్చిన సదవగాహన జ్ఞానముచే తెలియబడినట్లు, అజ్ఞానమున తెలియబడదు.
జ్ఞానము కలుగుచున్న కొలది ప్రతి ఒక్కనికి తన స్వరూప స్వభావములు స్పష్టమగు చుండును. క్రమముగ 'తాను' అను అహంకార పురుషుడు నశించి పరతత్వమే ఉన్నదని తెలియును. 'ఆదిత్యవత్' అను శ్లోకమును వాడుటలో ఒక సూక్ష్మమున్నది. ఆదిత్యుడు సవిత్రు మండలమునకు, సూర్య మండలమునకు వెలుగును ప్రసాదించు వాడు. అట్టి ఆదిత్యుడు కూడ స్వయం ప్రకాశకుడు కాదు. అతని నుండి వెలుగునది పరతత్వమే.
'నేను' అను అంతర్యామి తత్త్వము 'నేను' అను అహంకార పురుషుని ద్వారా ప్రకాశించును. విద్యుద్దీపము ఎంత ప్రకాశించు చున్నను, ఆ ప్రకాశమునకు మూలము కనబడని విద్యుత్తే కదా! ప్రకాశించు దీపమే గోచరించును గాని, విద్యుత్తు గోచరించదు. అట్లే కనబడుచున్న వెలుగునకు కనబడని వెలుగాధారము. నిజముగ జ్ఞానము కలిగినవాడు తానున్నానను భ్రమను చెందడు. దైవమే తానుగ నున్నాడని తెలిసియుండును. నిజముగ దైవమే యున్నాడని తెలిసియుండును.
ముందు అధ్యాయములలో దైవము “నేను సూర్యున కుపదేశించితిని. సూర్యుడు మనువున కుపదేశించెను. మనువు ఇక్ష్వాకున కుపదేశించెను” అని యొక రహస్యము తెలిపినాడు. అనగా 'నేను' అను అంతర్యామియగు వాసుదేవుడు, నే నను అహంకార పురుషుడగు సంకర్షణుని యందు ప్రకాశించును.
అటుపైన ఆ నేనే బుద్ధియగు ప్రద్యుమ్నుని నుండి, చిత్తమగు అనిరుద్ధుని నుండి కూడ ప్రకాశించుచున్నది. ఇంద్రియములు (చిత్తము), మనసు, బుద్ధి, అహంకారము వీటినుండి ప్రకాశించునది ఒకే వెలుగు. అది తన యందు పరిసరముల యందు వ్యాపించి యుండును. ఇట్లు తెలిసినవానికి తాను, యితరులు అను బేధముండదు.
అంతయు పరతత్వమే నిండి యుండునని పరమానంద భరితుడై యుండును. ఇట్లు తెలిసినవారే ఆదిత్యుని వలె పరబ్రహ్మ స్వరూపమునకు వాహికలై యుందురు. వారే సద్గురువులు. నిరహంకారులు. పూర్ణ జ్ఞానులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 331 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
83. అధ్యాయము - 38
*🌻. క్షువదధీచుల వివాదము - 3 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
వత్సా! శుక్రుడు తన వంశములోని వాడు, మహర్షియగు దధీచికి ఇట్లు ఉపదేశించి, శంకర ప్రభుని స్మరిస్తూ తన స్థానమునకు వెళ్ళెను(35). దధీచి మహాముని ఆయన చెప్పిన ఆ మాటలను విని, మహాప్రీతితో శివుని స్మరిస్తూ , తపస్సు కొరకు వనమునకు వెళ్ళెను(36)
ఆయన వనమునకు వెళ్ళి ఆ మహామృత్యుంజయ మంత్రమును యథావిధిగా జపిస్తూ శివుని ప్రీతితో స్మరిస్తూ తపస్సును చేసెను (37).
ఆయన ఆ మంత్రమును చిరకాలము జపించి తపస్సును చేసి శంకరుని ఆరాధించెను. ఆయన మహామృత్యుంజయ మంత్రమును జపించుటచే శివుడు సంతసించెను(38) ఓ మహర్షీ! అపుడు భక్తవత్సలుడగు శంభుడు ఆ జపముచే ప్రసన్నమైన మనస్సు గలవాడై ప్రీతితో అతని ఎదుట ఆవిర్భవించెను(39) ఆ మహర్షి తన ప్రభుడగు ఆ శంభుని చూచి సంతోషించి ప్రణమిల్లి దోసిలి యొగ్గి భక్తితో స్తుతించెను(40)
వత్సా! నారదమునీ! అపుడు శివుడు ప్రసన్నమైన మనస్సుగలవాడై చ్యవనుని కుమారుడగు దధీచితో వరమును కోరుకొమ్మనెను(41). భక్త శిఖామణి యగు దధీచుడు ఆ శంభుని మాటను విని దోసిలి యొగ్గి నమస్కరించి భక్తవత్సలుడగు శంకరునితో నిట్లనెను(42).
దధీచుడు పలికెను -
దేవదేవా! మహాదేవా! వజ్రమువలె దృఢమగు ఎముకలను కలిగియుండుట, ఎవ్వరైననూ నన్ను సంహరింపలేక పోవుట, సర్వకాలములయందు దైన్యము లేకుండుట అను మూడు వరములను నాకు ఇమ్ము (43).
బ్రహ్మ ఇట్లు పలికెను -
పరమేశ్వరుడు ఆతని మాటను విని ప్రసన్నుడై దధీచుని కొరకు 'తథాస్తు' అని పలికి ఆ మూడు వరములను ఇచ్చెను (44). వేద మార్గమునందు స్థిరమైన నిష్ఠగల ఆ మహాముని శివుని నుండి ఆ మూడు వరములను పొంది ఆనందించిన వాడై వెంటనే క్షువుడు ఉన్న స్థలమునకు వెళ్లెను (45).
ఆతడు శివుని నుండి అవధ్యత్వము, వజ్రాస్థిత్వము, అదైన్యము అను మూడు వరములను పొంది ఆ మహారాజును అరికాలితో శిరస్సుపై తన్నెను (46). అపుడు క్షువమహారాజు విష్ణువు తనకు ఇచ్చిన ఆదరముచే గర్వితుడై గొప్ప క్రోధమును పొంది దధీచుని వక్షస్థ్సలమునందు వజ్రముతో కొట్టెను (47).
పరమేశ్వరుని ప్రభావముచే ఆ వజ్రము మహాత్ముడగు దధీచుని నశింప జేయలేక పోయెను. బ్రహ్మపుత్రుడగు క్షువుడు అచ్చెరువందెను (48).
వజ్రమునకు అతిశయించిన ప్రభావము గలదు. కాని దధీచి మహర్షి అవధ్యుడుగ, అదీనుడుగ నిలిచియుండుటను గాంచి బ్రహ్మపుత్రుడగు క్షువుడు మనస్సులో విస్మయమును పొందెను (49). మృత్యుంజయ జపము చేయు దధీచునిచే పరాజితుడైన ఆ క్షువుడు వెంటనే అడవికి పోయి, పాపములను పోగొట్టువాడు, ఇంద్రుని సోదరుడు, భక్తులను రక్షించువాడు అగు విష్ణువును ఆరాధించెను (50).
గరుడధ్వజుడగు మధుసూదనుడు ఆతని పూజచే సంతసించి ఆతనికి తన దివ్య దర్శనము నొసంగెను (51). గరుడధ్వజుడగు జనార్దన దేవుని దివ్యదర్శనమును పొందిన క్షువుడు ప్రణమిల్లి ప్రీతికరములగు వాక్కులతో స్తుతించెను (52). దేవతలచే, ఇంద్రాదులచే స్తుతింపబడు వాడు, అజేయుడు, సర్వరక్షకుడు అగు జనార్దన దేవుని ఈ తీరున పూజించి, ఆయనను దర్శించి, భక్తితో శిరసువంచి నమస్కరించి ఆతడు ఇట్లు విన్నవించుకొనెను (53).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 84 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 13th RULE
*🌻 13. Desire power ardently. - 2 🌻*
336. When a man first sees what life in the causal body is really like he also realizes how very useful he could be at that level, how many lines there are along which his activity could pour itself out, and he may well be disposed to ask: “Is it not better that I should do this new and splendid work which I see opening before me?”
I have myself made a practice of seeking the advice or wish of the Master whenever what seemed to be grand opportunities opened up, and yet there was a possibility that it might be even better still to renounce them. I would say: “Master, what do you wish me to do?” Often His reply would be: “It is a matter for you to decide.”
Then one can only use one’s own best judgment. No rule can be laid down in such cases. I should still be disposed to try the higher; but it must be remembered that we are cautioned again and again:
“Do not let desire for your own development stand in the way of any useful work that you can do. Your development will come in due course.” I have always followed that plan, and I think-that it is the safest attitude.
337. Through the work done in that spirit of self-forgetful-ness we gain the power which shall make us appear as nothing in the eyes of men. Let us, if necessary, welcome humiliation because it all helps to put the personality out of sight and that is what is most needed.
When opportunities come, we must take them, but always we should think: “It is not my work; it is the Master’s work.” It does not matter which of those who follow the Master has the privilege of doing any particular piece Of work for Him. Our business is to watch that we may lose no opportunity of doing any part of His work.
338. We should understand that there is nothing small or great in His work, but that anything, however small, done and offered to Him is as important in His sight as that which is a far greater achievement in the world’s eyes. We are a little apt to want to do what we think is the greater work.
That is because we do not see that all parts of the\work are equally necessary. Realize for a moment how He must look down upon the whole from His stupendous elevation of wider power and knowledge. All these pieces of work will look very tiny, but all fit into their places.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 216 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. జైమినిమహర్షి - 1 🌻*
బోధనలు/గ్రంధాలు: జైమినిభారతం, జైమినిసూత్రాలు, శ్రౌతసూత్రము, స్మృతిమీమాంస, జైమినీయబ్రాహ్మణము, జైమినీయసంహిత, జైమినీయ గృహ్యసూత్రాలు
జ్ఞానం:
01. మహాభారతయుద్ధంనాటికి, అంటే నేటికి అయిదువేల సంవత్సరాలకు పూర్వం కృష్ణద్వైపాయనుడు అని చెప్పబడే వ్యాసమహర్షి దాదాపు 120-125 సంవత్సరాల వయసు కలిగి; అనేకమంది శిష్యులతో, తపస్సుచేసుకుంటూ హిమవత్పర్వతాలలో ఉన్నారు. అందులో నలుగురు శిష్యులు ప్రధానమైనవారు. ఆనాటికి ఆయన రెండుపనులు పెట్టుకున్నారు. నాటికి అడవిలాగా పెరిగిపోయిన వేదవాజ్ఞ్మయం
02. అంతా అధ్యయనం చేయాలంటే ఎవరికీ సాధ్యం కావటం లేదు. ఆ పని చేయటానికి ఎవరు యోగ్యులు, ఆ వాజ్ఞ్మయాన్ని ఎట్లా రక్షించాలి అనే విషయాంలో అనేక సందేహాలు మనుష్యులకు బాధిస్తున్నాయి. కాబట్టి వేదాలన్నిటినీకూడా నాలుగు విభాగాలు చేసి, ఆ నలుగురు శిష్యులతో, “ఈ శాఖలను మీరు ప్రవర్తింపచేయండి” అని చెప్పి సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చాడు.
03. ఆర్యచరిత్రలో అయిదువేల సంవత్సరాలకాలం ఏమంత పెద్దకాలంకాదు. లక్షలాది సంవత్సరముల చరిత్ర ఉన్నదని చెప్పుకుని, దానిని విశ్వసించవలసిన కారణాలు అనేకంగా ఉన్నాయి ఆర్యచరిత్రలో. ఆ చరిత్ర మతా ఏమయిపోయింది అంటే చెప్పలేక పోవచ్చు కాని, లక్షసంవత్సరాల చరిత్ర ఆర్యసంస్కృతికి ఉన్నదని చెప్పటానికి అవకాశం ఉంది. అంతటి సుధీర్ఘమైన కాలంలో, అయిదువేల సంవత్సరములు అంత పూర్వచరిత్రేకాదు. కాని గత 5 వేల సంవత్సరాలలో నేటి ఈ పరిస్థితి ఏర్పడింది.
04. వేదంలో నూటికి తొంభై శాఖలు పోయాయి. మిగతా 10 శాఖలూ మిగిలాయోలేదో అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అది సంకీర్ణంగా ఉంది. మనుష్యులకు వైదికవాజ్ఞ్మయంపై శ్రద్ధ, భక్తి, ఆసక్తి తగ్గిపోవటంవలన, ప్రామాణ్యత పోయింది. బౌద్ధం పుట్టింది, జైనం పుట్టింది. అవికూడా ఆర్యసంస్కృతిలోని మూలసూత్రాలను ఆధారం చేసుకుని పుట్టాయి.
05. అయితే, ఈ విషయంలో దానికి సంబంధం లేకుండా; వేదాన్ని ఒప్పుకోనివాడు నాస్తికుడని, ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకున్నప్పటికీకూడా ఒక వేదాన్ని ప్రమాణంగా తీసుకోకపోతే అతడు నాస్తికుడేననీ మన సంప్రదాయంగా ఏర్పడింది. ఆర్యచరిత్ర అక్కడే ఒక పెద్దమలుపు తిరిగింది జైమినిమహర్షిచేత.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 280 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻129. Use name, form and design only for worldly activities, otherwise just hold on to the knowledge 'I am' without body awareness - beyond name, form or design.🌻*
Although you maybe abiding in the 'I am', physically you are still lodged in the body, something you cannot do away with. You have a name, form and design assigned to you by the world. Well, since the world itself has given you all these, you may as well use these for all the worldly activities.
Bear in mind always, at all times and unwaveringly that you are none of these; they are only available to you. Activities may go on, but you must keep holding on to the knowledge 'I am' without the body awareness.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 155 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని తొమ్మిదవ పాత్ర - జీవన్ముక్తుడు - 2 🌻*
609. జీవన్ముక్తుడు తురీయఅవస్థలో అనంత సచ్చిదానందమును అనుభవించు చుండును. అతని చైతన్యము కొంతసేపు "నేను భగవంతుడను" అను స్థితి యందును, మరొకప్పుడు దానితోపాటు ముల్లోకములతోనూ కూడి యుండును. కాని సృష్టిలో కర్తవ్యము లేనివాడై సచ్చిదానంద స్థితిని అన్యులకై వినియోగించడు.
610. జీవన్ముక్తుడు తన జీవితాంమందు మాత్రము ఒకనిని తనవలె పరిపూర్ణుని చేయును.
611. ఆత్మ స్వీయ చైతన్యమును పొందిన తరువాత అనుభవించు అవస్థలు మూడింటిలో జీవన్ముక్తి రెండవది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 11 / Sri Lalita Sahasranamavali - Meaning - 11 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 11. నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ |*
*మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ‖ 11 ‖ 🍀*
27) నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ -
తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది.
28) మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా -
చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 11 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 11. nija-sallāpa-mādhurya-vinirbhartsita-kacchapī |*
*mandasmita-prabhāpūra-majjatkāmeśa-mānasā || 11 || 🌻*
27 ) Nija Sallabha Madhurya Vinirbhardista Kacchabhi -
She who has voice sweeter than the notes produced by Sarawathi Devis Veena(This is called Kachabhi)
28 ) Mandasmitha prabha poora majjat Kamesha manasa -
She who has lovely smile which is like the river in which the mind of cupid plays
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 11 / Sri Vishnu Sahasra Namavali - 11 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*మేషరాశి - కృత్తిక నక్షత్ర 3వ పాద శ్లోకం*
*🍀 11. అజ స్సర్వేశ్వర సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః|*
*వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః|| 11 🍀*
🍀 95) అజః -
పుట్టుక లేనివాడు, జననమరణాలకు అతీతుడు, ఎల్లప్పుడూ వుండువాడు.
🍀 96) సర్వేశ్వరః -
అన్నింటికీ, అందరికీ ప్రభువు.
🍀 97) సిద్ధః -
అన్ని సిద్ధులు కలిగియున్నవాడు, అన్ని సిద్ధులను ప్రసాదించువాడు.
🍀 98) సిద్ధిః -
సకల సాధన, సమస్త కర్మఫలములు తానై యున్నవాడు.
🍀 99) సర్వాదిః -
సర్వమునకు మూలకారణము, ప్రప్రథముడు.
🍀 100) అచ్యుతః -
తరుగులేని మహాశక్తి సంపన్నుడు, జన్మ, పరిణామ, వార్ధక్యము లేనివాడు.
🍀 101) వృషాకపిః -
అధర్మములో మునిగిపోతున్న భూమిని ఉద్ధరించినవాడు (శ్రీవరాహమూర్తి).
🍀 102) అమేయాత్మా -
ఊహించుటకు వీలులేని పరమాత్మ స్వరూపుడు.
🍀 103) సర్వయోగ వినిసృతః -
బంధములకు అతీతుడు, యోగముతో అర్ధమగువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 11 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka For Kruthika 3rd Padam*
*🌻 11. ajaḥ sarveśvaraḥ siddhaḥ siddhiḥ sarvādiracyutaḥ |*
*vṛṣākapirameyātmā sarvayōgaviniḥsṛtaḥ || 11 || 🌻*
🌻 95) Aja –
The Lord Who Does Not Have Birth
🌻 96) Sarveshwara –
The Lord of All
🌻 97) Siddha –
The Lord Who is Always Everywhere
🌻 98) Siddhi –
The Lord Who is the Desirable Effect of Everything
🌻 99) Sarvadi –
The Lord Who is the Primary Reason for Everything
🌻 100) Achyuta –
The Lord Who Does Not Slip
🌻 101) Vrishakapi –
The Lord Who is the Personification of Dharma and Varaha
🌻 102) Ameyatma –
The Lord Whose Stature Cannot be Measured
🌻 103) Sarva Yogavinih Srita –
The Lord Who is Known by All Yogas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranam/
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA
www.facebook.com/groups/yogavasishta/
Join and Share వివేక చూడామణి viveka chudamani
www.facebook.com/groups/vivekachudamani/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment