భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 216


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 216 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జైమినిమహర్షి - 1 🌻


బోధనలు/గ్రంధాలు: జైమినిభారతం, జైమినిసూత్రాలు, శ్రౌతసూత్రము, స్మృతిమీమాంస, జైమినీయబ్రాహ్మణము, జైమినీయసంహిత, జైమినీయ గృహ్యసూత్రాలు

జ్ఞానం:

01. మహాభారతయుద్ధంనాటికి, అంటే నేటికి అయిదువేల సంవత్సరాలకు పూర్వం కృష్ణద్వైపాయనుడు అని చెప్పబడే వ్యాసమహర్షి దాదాపు 120-125 సంవత్సరాల వయసు కలిగి; అనేకమంది శిష్యులతో, తపస్సుచేసుకుంటూ హిమవత్పర్వతాలలో ఉన్నారు. అందులో నలుగురు శిష్యులు ప్రధానమైనవారు. ఆనాటికి ఆయన రెండుపనులు పెట్టుకున్నారు. నాటికి అడవిలాగా పెరిగిపోయిన వేదవాజ్ఞ్మయం

02. అంతా అధ్యయనం చేయాలంటే ఎవరికీ సాధ్యం కావటం లేదు. ఆ పని చేయటానికి ఎవరు యోగ్యులు, ఆ వాజ్ఞ్మయాన్ని ఎట్లా రక్షించాలి అనే విషయాంలో అనేక సందేహాలు మనుష్యులకు బాధిస్తున్నాయి. కాబట్టి వేదాలన్నిటినీకూడా నాలుగు విభాగాలు చేసి, ఆ నలుగురు శిష్యులతో, “ఈ శాఖలను మీరు ప్రవర్తింపచేయండి” అని చెప్పి సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చాడు.

03. ఆర్యచరిత్రలో అయిదువేల సంవత్సరాలకాలం ఏమంత పెద్దకాలంకాదు. లక్షలాది సంవత్సరముల చరిత్ర ఉన్నదని చెప్పుకుని, దానిని విశ్వసించవలసిన కారణాలు అనేకంగా ఉన్నాయి ఆర్యచరిత్రలో. ఆ చరిత్ర మతా ఏమయిపోయింది అంటే చెప్పలేక పోవచ్చు కాని, లక్షసంవత్సరాల చరిత్ర ఆర్యసంస్కృతికి ఉన్నదని చెప్పటానికి అవకాశం ఉంది. అంతటి సుధీర్ఘమైన కాలంలో, అయిదువేల సంవత్సరములు అంత పూర్వచరిత్రేకాదు. కాని గత 5 వేల సంవత్సరాలలో నేటి ఈ పరిస్థితి ఏర్పడింది.

04. వేదంలో నూటికి తొంభై శాఖలు పోయాయి. మిగతా 10 శాఖలూ మిగిలాయోలేదో అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అది సంకీర్ణంగా ఉంది. మనుష్యులకు వైదికవాజ్ఞ్మయంపై శ్రద్ధ, భక్తి, ఆసక్తి తగ్గిపోవటంవలన, ప్రామాణ్యత పోయింది. బౌద్ధం పుట్టింది, జైనం పుట్టింది. అవికూడా ఆర్యసంస్కృతిలోని మూలసూత్రాలను ఆధారం చేసుకుని పుట్టాయి.

05. అయితే, ఈ విషయంలో దానికి సంబంధం లేకుండా; వేదాన్ని ఒప్పుకోనివాడు నాస్తికుడని, ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకున్నప్పటికీకూడా ఒక వేదాన్ని ప్రమాణంగా తీసుకోకపోతే అతడు నాస్తికుడేననీ మన సంప్రదాయంగా ఏర్పడింది. ఆర్యచరిత్ర అక్కడే ఒక పెద్దమలుపు తిరిగింది జైమినిమహర్షిచేత.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


23 Jan 2021

No comments:

Post a Comment