శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 187 / Sri Lalitha Chaitanya Vijnanam - 187



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 187 / Sri Lalitha Chaitanya Vijnanam - 187 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖

🌻 187. 'నిరత్యయా' 🌻

అతిక్రమించని తత్త్వము కలది శ్రీదేవి అని అర్థము.

అతిక్రమణ వలననే అపాయము కలుగును. తనకవసరమగు విషయమును గ్రహించుటకాక, అన్ని విషయములయందు వ్రేలు ఉంచుట, అసంబంధిత విషయములలో జొరబడుట, తమ కర్తవ్యములను విస్మరించుట, ఇతరులకు ఇబ్బంది కలిగించుటవలన, దోషము సంక్రమించును. జీవిత మంతయూ కర్తవ్య నిర్వహణమునకే అని తెలిసి, దానిని నిర్వర్తించుకొనుట కొఱకే భావము, భాష, చేత అని తెలియవలెను.

అపుడు మూడు లోకములయందును, అతిక్రమణము లేక జీవించుట వీలగును. వ్యర్థభావము, భాషణములు, వ్యర్థమగు చేష్టలకు దారితీయును. కర్తవ్య కర్మ నిర్వర్తించుట, ఇతర సమయములలో మౌనమాచరించుట భక్తుల కర్తవ్యమై యున్నది. మౌనమనగా మూతి ముడుచుకొని యుండుట కాదు. మననము వలన ఏర్పడునది మౌనము. వారే మునులు.

నిత్యమూ మననముండుచూ తన వంతు కర్తవ్యమును ఆచరించువాడు కృతకృత్యు డగును. మననము ప్రధానము. కర్తవ్యమునకు పూర్వము, అనంతరమూ, మననమే సాగించినచో క్రమముగా అతిక్రమణము లేని స్వభావము ఏర్పడును. మననమందున్న ముని బుద్ధిలోకమున ఉండును. కావున కర్తవ్యాకర్తవ్యములు కూడ సులభముగా గ్రహించును. మననమట్లు నిరతిక్రమణస్థితి యందుంచగలదు.

అట్టి మననము లేనివాడు మనో లోకము నందుండుటచే కర్తవ్యము విషయమున పొరబడును. కేవలము మనస్సుతో నిర్ణయించువాడు తన స్వభావమునకు లోబడి యుండును కనుక, విచక్షతయందు స్పష్టత యుండదు. ఇట్టివారు తమ శక్తిపై ఆధారపడిన వారు. మనోబలముకన్న దైవబలము గొప్పది.

దైవస్మరణము వలన దైవబలము బుద్ధిని ప్రచోదనము గావింపగ, బుద్ధిబలము తోడైన మనస్సు సరియగు నిర్ణయములు చేయగలడు. అవతారమూర్తియగు పరశురాముడు, మహత్తర శక్తి సంపన్నులైన దుర్వాస, విశ్వామిత్రులు, వారినుండి అతిక్రమణము తొంగి చూచినపుడెల్ల మరుక్షణము తపస్సు కేగుటకు కారణమిదియే. మననము వలనే నిరతిక్రమణ సాధ్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 187 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Niratyayā निरत्यया (187)🌻

She does not transgress Her limits. It has already been seen that She functions as per the law of karma-s, the law of the Lord. Law of karma is enacted by Her, and She does not transgress Her own laws. She sets an example for others to follow.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


23 Jan 2021

No comments:

Post a Comment