25-JANUARY-2021 EVENING

12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 133🌹  
13) 🌹. శివ మహా పురాణము - 333🌹 
14) 🌹 Light On The Path - 86🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 218🌹 
16) 🌹 Seeds Of Consciousness - 282 🌹   
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 157🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 13 / Lalitha Sahasra Namavali - 13🌹 
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 13 / Sri Vishnu Sahasranama - 13🌹
🌹. సంకల్ప సూక్తము 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -133 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 18

*🍀. 16. సమదర్శనము - అన్నిటి యందును సమదర్శనము చేయువారే జ్ఞానులు. అన్నిటి యందు ఉన్నది ఒక్కటియే. ఉన్నదాని చుట్టును ప్రకృతి తన గుణముల చేత, పంచభూతముల చేత వివిధములగు అల్లికలు చేయుచు నుండును. ఈ అల్లికలలో వైవిధ్యమున్నది. అన్నిటియందు వసించి యున్నటువంటి తత్వమునే దర్శించుచు, స్వభావము ప్రకృతి యొక్క విలాసముగ దర్శించువారు నిజమగు జ్ఞానులు. స్వభావములను చూచువారు మాయను బడక తప్పదు. ఉన్నదానిని చూచు వారిని ప్రకృతి బంధింపదు. సమదృష్టి యనగ వైవిధ్యమునకు మూలము ఒక్కటే యని తెలియుట. అంతియే కాని స్వభావముల యందు సమానత్వము నాపాదించుట కాదు. సృష్టి యందు ఏడు లోకములు, ఏడు రకముల చైతన్యముతో కూడిన జీవులున్నారు. ఇవి యన్నియు చైతన్యావస్థలు. దానికాధారముగ నున్న పురుషుడు మాత్రము అన్నిటి యందు ఒకే స్థితి గొని యున్నాడు. పురుషుని దర్శించుట సమ దర్శనము కలవారికే వీలగును. 🍀*

విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః || 18

విద్య, వినయ సంపన్నులైన బ్రాహ్మణుల యందు, గోవుల యందు, ఏనుగు నందును, కుక్క యందును, కుక్క మాంసము తిను చండాలుని యందును సమదర్శనము చేయువారే జ్ఞానులు. అన్నిటి యందు ఉన్నది ఒక్కటియే. ఉన్నది సత్యము అని ముందు తెలిపితిమి. 

ఉన్నదాని చుట్టును ప్రకృతి తన గుణముల చేత, పంచభూతముల చేత వివిధములగు అల్లికలు చేయుచు నుండును. ఈ అల్లికలలో వైవిధ్యమున్నది. విద్య, వినయము సంపదగా గలిగిన బ్రాహ్మణులకు మూలముగ ఏది యున్నదో అదియే చండాలుని యందు, కుక్క యందు, ఏనుగు నందు దర్శించుట సమదర్శనము. సామాన్యముగ మనసు, బుద్ధి ఆధారముగ జీవించు మానవులు యితరుల స్వభావమునే దర్శింతురుగాని, స్వభావమునకు మూలమున నున్న తత్త్వమును దర్శింపలేరు. 

అన్నిటియందు వసించి యున్నటువంటి తత్వమునే దర్శించుచు, స్వభావము ప్రకృతి యొక్క విలాసముగ దర్శించువారు నిజమగు జ్ఞానులు, సన్న్యాసులు. మంచి స్వభావము కలవారు, చెడ్డ స్వభావము కల వారు, ప్రాణము కలవి, ప్రాణము లేనివి అన్నిటి యందు ఉన్న దొక్కటే. త్రిగుణముల కలయికలు వేరగుటచేత అవి వేరు వేరు స్వభావములతో గోచరించును. స్వభావములను చూచువారు మాయను బడక తప్పదు. ఉన్నదానిని చూచు వారిని ప్రకృతి బంధింపదు.

ఉన్నది చూచుట జ్ఞానము, సమదర్శనము. అట్లు చూచు వారే పండితులు. అనగా తెలిసినవారు. ఇతరములను చూచువారు శ్రీకృష్ణుని దృష్టిలో పండితులు కారు. అట్టివారు కేవలము చదివిన వారే కాని తెలిసినవారు కారని మాస్టర్ ఇ.కె. తెలుపుచునుండిరి.

అధికులని, అధములని భేదములు సృష్టిలో నుండుట ప్రకృతి అమరిక. తదతీతమైన సత్యమున యివి ఏవియును లేవు. ప్రపంచమున ప్రవర్తించినపుడు పేడ-బెల్లము కలుపు కొనుట, గుఱ్ఱమును-గాడిదను సమానమని భావించుట, గంగి గోవును-దున్నపోతును సమానముగ భావించుట, సంస్కారులు - కుసంస్కారులు సమానమేనని భావించుట అజ్ఞానము. అది సమదృష్టి కాదు. 

సమదృష్టి యనగ వైవిధ్యమునకు మూలము ఒక్కటే యని తెలియుట. అంతియే కాని స్వభావముల యందు సమానత్వము నాపాదించుట కాదు. స్వభావపరముగ ఆరోహణ, అవరోహణ క్రమములున్నవి. మూలమున కవి వర్తింపవు. 

సంఘమున బాధ్యత గలవారు, బాధ్యత లేనివారు యిరువురు సమానమా? స్వభావపరముగ వారు సమానము కాదు. కాని వారియందు మూలముగ నున్నది ఒక్కటియే. ఇట్లేకత్వమును గమనించుచు, వైవిధ్యమును మన్నించుచు సాగవలెను.  

ఏకత్వము స్థిరపడినపుడు అన్నింటి యందును ప్రేమ యుండును. అంత మాత్రము చేత వైవిధ్యమును మరువరాదు. శిశుపాలుడు, అర్జునుడు తత్త్వమున ఒకటియే. స్వభావమున చాల వ్యత్యాసమున్నది. అర్జునుని శ్రీకృష్ణుడు ప్రేమతో రక్షించెను. శిశుపాలుని ప్రేమతోనే శిక్షించెను. 

ఉండుటను సత్య మందురు. ప్రకృతి స్వభావమును చైతన్యమందురు. చైతన్యమునకే స్థితి భేదము. ఉండుటకు స్థితి భేదము లేదు. చైతన్యమునకు నిద్రావస్థ, స్వప్నావస్థ, మానసికావస్థ, బుద్ధి యిత్యాది అవస్థలు. ఎక్కువ చైతన్యము, తక్కువ చైతన్యము గల జీవులుందురు. దీనిని బట్టే స్థావరములు, జంగమములు, ప్రాణము లేని, ప్రాణము ఉన్న జీవులు, భూమి జీవులు, దేవతలు. 

దేవతలలో కూడ, పితృదేవతలు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఏర్పడి యున్నారు. సృష్టి యందు ఏడు లోకములు, ఏడు రకముల చైతన్యముతో కూడిన జీవులున్నారు. ఇవి యన్నియు చైతన్యావస్థలు. అజ్ఞానుల నుండి, జ్ఞానుల వరకు అనేక అవస్థలలో మానవులున్నారు. ఇది యంతయు ప్రకృతి విలాసము.

దానికాధారముగ నున్న పురుషుడు మాత్రము అన్నిటి యందు ఒకే స్థితి గొని యున్నాడు. పురుషుని దర్శించుట సమ దర్శనము కలవారికే వీలగును. వారు ప్రకృతి విలాసమున అంతర్గతుడై స్థితి చెందిన దైవమును కూడ చూతురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 333 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
84. అధ్యాయము - 39

*🌻. విష్ణుదధీచి యుద్ధము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు విష్ణుభగవానుడు క్షువునకు హితమును చేయగోరి బ్రాహ్మణ వేషముతో దధీచుని అశ్రమమునకు వెళ్లెను (1). క్షువుని కార్యము కొరకై మారు వేషములో నున్నవాడు, జగద్గురువు అగు విష్ణువు శివభక్తులలో శ్రేష్ఠుడు, మహర్షియగు దధీచునితో నిట్లనెను (2).

విష్ణువు ఇట్లు పలికెను -

ఓయీ దధీచా! మహర్షీ! నీవు శివారాధకులలో అగ్ర గణ్యుడవు, నాశము లేనివాడవు. నీ నుండి ఒక వరమును కోరెదను. నీవు దానిని ఈయ దగుదువు (3).

బ్రహ్మ ఇట్లు పలికెను -

క్షువుని కార్యమును చేయగోరిన దేవదేవుడు విష్ణువుచే యాచింపబడిన శివ భక్తశ్రేష్ఠుడగు దధీచి వెంటనే విష్ణువుతో నిట్లనెను (4).

దధీచుడు ఇట్లు పలికెను -

హే బ్రాహ్మణా! నీ కోరిక నాకు తెలిసినది. నీవు క్షవుని కార్యము కొరకు బ్రాహ్మణ రూపములో వచ్చిన మాయావియగు విష్ణు భగవానుడవు (5). హే జనార్దనా! దేవదేవా! రుద్రుని అనుగ్రహముచే నాకు ఎల్ల వేళలా భూత భవిష్యద్వర్తమానములనే మూడు కాలముల సంగతులు తెలియచుండును (6). నీవు పాపహరుడవగు విష్ణువు అని నాకు తెలియును. ఓయీ గొప్ప వ్రతము గలవాడా! బ్రాహ్మణ వేషమును వీడుము. దుష్టబుద్ధియగు క్షువమహారాజు నిన్ను ఆరాధించినాడు (7). హే హరీ! భగవాన్‌! నీ భక్తవాత్సల్యమును నేను ఎరుంగుదును. నీవు మారు వేషమును వీడి సహజరూపమును స్వీకరించి శంకరుని స్మరింపుము (8).

శివుని అర్చించుటయందు అభిరుచి గలవానికి ఎవనికైననూ భయము ఉన్నచో నీవు నాతో సత్యప్రతిజ్ఞను చేసి నిశ్చితముగా చెప్పవలెను (9). నేను అసత్యమును ఎట్టి సందర్భములోనైననూ పలుకను. శివుని స్మరించుటయందు లగ్నమైన బుద్ధిగల నేను ఈ జగత్తులో దేవతలకు గాని, రాక్షసులకు గాని, ఇతరులకు గాని ఎవ్వరికీ భయపడను (10).

విష్ణువు ఇట్లు పలికెను -

దధీచా! గొప్ప వ్రతము గలవాడా! నీకు సర్వత్ర భయము తొలగి పోయినది. నీవు శివుని పూజించుట యందు నిష్ఠగలవాడవు. అందువలననే సర్వజ్ఞుడవైనావు (11). నీకు నమస్కారము. నా ఆజ్ఞచే నీవు 'భయపడుచున్నాను' అని ఒక్కసారి నీ శత్రువు అగు క్షువమహారాజు ఎదుట చెప్పవలెను (12).
బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు యొక్కఆ వాక్యమును విని కూడ భయమును పొందనివాడై శివభక్తాగ్రగణ్యుడగు దధీచ మహాముని నవ్వి ఇట్లు పలికెను (13).

దధీచుడు ఇట్లు పలికెను -

పినాకధారి, దేవ దేవుడు అగు శంభుని ప్రభావము వలనే నేను ఏకాలమునందైననూ, ఏదేశమునందైననూ, ఏ వస్తువు వలన అయిననూ లేశ##మైననూ భయపడను (14).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మహర్షి యొక్క ఈ మాటను విని విష్ణువు కోపించి, ఆ మహర్షిని దహించు కోరికతో చక్రమునెత్తి నిలబడెను (15). ఈశ్వరుని మహిమచే మిక్కిలి భయంకరమగు ఆ చక్రము ఆ బ్రాహ్మణుని యందు వ్యర్థమయ్యెను. క్షువ మహారాజు సన్నిధిలో కూడ అటులనే జరిగినది కదా !(16). మొక్క వోయిన చక్రము గల ఆ విష్ణువును చూచి దధీచుడు, సదసద్రూపమగు జగత్తు ఆవిర్భవించుటకు కారణభూతుడైన ఆ విష్ణువు ఎదుట చిరునవ్వుతో నిట్లనెను (17).

దధీచుడిట్లు పలికెను -

హే భగవాన్‌! నీవు పూర్వము ప్రయత్నమును చేసి అతి భయంకరమగు ఈ చక్రమును పొంది యుంటివి. ఇది లోకములో సుదర్శన మనియు, విష్ణు చక్రమనియు ప్రఖ్యాతిని గాంచినది (18). శివుడు అనుగ్రహించిన ఆ శుభచక్రము నన్ను సంహరింప నిచ్చగించుకున్నది. భగవానుడవగు నీవు కోపించి (19) బ్రహ్మాస్త్రము మొదలగు అస్త్రములతో, బాణములతో నన్ను సంహరించు యుత్నము చేయవచ్చును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 86 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 13th RULE
*🌻 13. Desire power ardently. - 4 🌻*

342. A man who works without any regard to his own interests and is always willing to remain in the background is inevitably misunderstood by the world. 

People understand and admire a man of strong will, who sets out to make a name for himself, to make an impression, and pushes his way to the front. Such a man has succeeded, from their point of view; he has shown the world that he is a strong man. The occultist may be in reality much more forceful, but he would not show his power in that way. 

He seeks generally to efface himself. He realizes that one of the greatest qualifications is to know when to get out of the way, to know when to let the divine power do its work without spoiling and hindering it by putting himself in the way of it. It seems so simple, and yet the fact that there are hundreds of workers who cannot do it shows that it is really a great difficulty.

343. The man of the world is apt to regard the occultist as a person of no particular will-power, as one who is always ready to give way. So he is, as regards the minor details of life. 

He lets others have their way in things which do not matter, and is even willing to be managed up to a certain point; but when it comes to a question of principle, he takes a firm stand. He cares nothing about what people say. People who talk and speculate about others are wrong in nine cases out of ten, so what does it matter what they happen to think about us? As Tennyson says, “Let them rave.” 

Of course, I do not mean that we should utterly ignore all worldly conventions. In the early days some of our members felt that it was right to appear different from other people in the matter of wearing evening dress, and so on. We need not outrage the customs of society in this way. Moreover, it seems to me that if we wish to recommend our beliefs we must avoid offending the world unnecessarily.

 It is not good policy to set ourselves violently against other people’s ideas. When there comes a point in which no principle is involved we must give way, merely because there is no sense in flying in the face of the usages of the world.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 218 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జైమినిమహర్షి - 3 🌻*

13. తరువాత జైమిని చరిత్రలో ‘జైమినిభారతం’ కూడా ఉన్నది. మహాభారతం తరువాతకాలంలోనూ, ఇప్పటికీకూడా మహాభారతంపై విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు మనకు కొత్తకాదు. భారతంలో చాలా ప్రశ్నలు ఇప్పతికీకూడా జతిలంగానే కనబడతాయి. 

14. అయితే మూలగ్రంథానికి వెళ్ళి పరిశీలించి, నిర్మలమయిన ముద్ధితో సందేహనివారణకోసం చేసే ప్రయత్నం పహలిస్తుంది. ద్వేషంతోకాని, దానిమీద అగౌరవంతోకాని విమర్శించటానికి వెళితే దానికి సమాధానం సులభంగా దోర్కదు. సద్విమర్శకుడికి గొరికే సమాధానం కువిమర్శకుడికి లభించదు.

15. అందరికీ కూడా వేదమే ప్రమాణం. ఈ కలియుగం ప్రారంభమయింది. వైదికకర్మలేమో విస్తారంగా ఇదివరకే ఉన్నాయి. వాటిపై అనేక అభిప్రాయాలు మనుష్యుల్లో ఉండటంచేతనే వాటిని వ్యాసుడు విభాగం చేసి చెప్పాడు. వాటిలో బ్రాహ్మణులు, తాత్తిరీయము మొదలైన వుభాగాలు మనకు ఉన్నయి. దాంట్లో ప్రతీకాండ వెనుక ఒక బ్రాహ్మణము ఉంటుంది. ఇవన్నీ ఇదివరకే ఉన్నాయి. ఉన్నవి ఉన్నట్లే ద్రంథస్థం చేసి పెట్టారు. అయితే వేదాల ఉద్దేశ్యం ఇది కాదు. వేదంమీద నిర్ణయంచేసే అధికారం వ్యాసుడికే లేనప్పుడు, తరువాతివాడు నిర్ణయం ఎలా చేస్తాడు అనే ప్రశ్న ఒకటి పుట్టింది. అలా చేసి ఉంటే, “రెండు మార్గాలున్నాయి. 

16. ఈశ్వరుడి యొక్క ఆరాధనతో నిమిత్తంలేకుండా ఉండే కర్మమార్గమిది; ఈశ్వరారాధన(ఈశ్వరుడిగా భావన చేసేటటువంటి మార్గం) ఇది” అని వ్యాసుడు రెండు మార్గములు చెప్పి ఉంటే; ఈశ్వరుడులేడని ఘంటాపథంగా చెప్పవలసిన ఆవశ్యకత ఉండేదికాదు. కాని ఆయన అలా చేయలేదు. ఉన్నాడనే భావనతో ఈశ్వరుడి యొక్క ప్రతిష్ఠ చేసాడాయన.

17. కృష్ణమతం అంతా కూడా ఈశ్వరారాధనే! ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడని, కర్మస్వరూపుడని, రెండుగా ఈశ్వరస్వరూపం వ్యాసుడివల్ల నిర్ణయించబడింది. ఈశ్వరుడికి కృష్ణావతారమే నిదర్శనం. కృష్ణావతారకాలంలో గోపికలు మొదలైన వాళ్ళందరికీకూడా భక్తే ప్రధానం. మనస్సు, బుద్ధి, చిత్తము అంతాకూడా ఈశ్వరుడియొక్క పాదార్పణంచేసి ఆయనను భక్తితో ఆరాధన చేస్తే చాలు. 

18. మధురభక్తి అని ఒకశాఖ ఏర్పడింది ఆ తరువాత. భక్తితో ఆత్మార్పణం చేసుకుంటే చాలు, కర్మతో నిమిత్తంలేదని చెప్పి వేదవ్యాసుడే ఆ మాటచెప్పితే, వేదంయొక్క ఉద్దేశ్యం ఏమిటి? మరి ఇప్పుడు ‘ఈశ్వరుడులేడు’ అని జైమిని చెప్పాడు అనుకున్నప్పుడు, న్యాయంగా వ్యాసమహర్షికి(అది ఇతడు చెప్పిన దానికి విరుద్ధంగా ఉండటంచేత) కోపమొచ్చింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 282 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 131. This conviction can be strengthened by meditation and meditation means when the knowledge 'I am' remains in that knowledge. 🌻*

How did the conviction that 'I am the body' or 'I am so-and-so' come? It was because you were reminded of these again and again by the people around you. 

This is the convention, the tradition, part of the conditioning, and you believe 'I am born as a body in this world'. What the Guru is saying is quite contradictory to the conviction you have developed through your conditioning. 

When the conditioning started you were raw and these beliefs have sunk deep into you, so in order to shake them off meditation is required. And what is this meditation? It is that once the knowledge 'I am' has been understood, it remains in itself and does not budge from there.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 157 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 2 🌻*

615. మానవుడు నిత్యజీవితంలో సుషుప్తిఅవస్థకు పోవునప్పుడు నిర్వాణస్థితి ఏర్పడుతున్నది. ప్రతి దినము మేల్కొనిన తరువాత ఏర్పడు వ్యక్తిగత జీవితము వలన ఆత్మ ప్రతిష్టాపనమ ఏర్పడుచున్నది.

616. మూడు రకముల 'ఫనా'-'బకా'లు. 
(a) సృష్టిలో నుండు సమస్త జీవరాశులలో జరుగుచుండు ఫనా-బకా. 
(b) ఆధ్యాత్మిక మార్గములో ఒకటవ భూమిక నుండి ఆరవ భూమిక వరకు చైతన్యమునకు విముక్తిని కలిగించు సంస్కారములననుసరించి యుండును. 
(c) విజ్ఞాన భూమికలో సత్యస్థితిలో జరుగు ఫనా- బకా.

617. ప్రతి భూమికయు దాని ఫనా-బకాలను కలిగియే యుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 13 / Sri Lalita Sahasranamavali - Meaning - 13 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా |*
*రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా ‖ 13 ‖ 🍀*

31) కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా - 
బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.

32) రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా - 
రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 13 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 13. kanakāṅgada-keyūra-kamanīya-bhujānvitā |*
*ratnagraiveya-cintāka-lola-muktā-phalānvitā || 13 ||🌻*

31) Kankangadha Keyura Kamaniya Bujanvidha -   
She who wears golden Armlets

32) Rathna graiveya chinthaka lola muktha phalanvitha -   
She who wears necklace with moving pearls and dollar inlaid with gems

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 13 / Sri Vishnu Sahasra Namavali - 13 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మేషరాశి - రోహిణి నక్షత్ర 1వ పాద శ్లోకం*

*🍀 13. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిశ్రవాః|*
*అమృత శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః|| 13 🍀*

🍀 114) రుద్రః - 
అన్నింటినీ తనలో లయము/విలీనము చేయువాడు. 

🍀 115) బహుశిరాః - 
అనేక శిరములు గలవాడు, అనంతుడు.

🍀 116) బభ్రుః - 
అన్నింటికీ ఆధారమైనవాడు, అన్నింటినీ భరించువాడు. 

🍀 117) విశ్వయోనిః - 
విశ్వ ఆవిర్భావానికి కారణమైనవాడు. 

🍀 118) శుచిశ్రవాః - 
తన నామాలను విన్నంత మాత్రమునే జీవులను పవిత్రులను చేయువాడు.

🍀 119) అమృతః - 
తనివి తీరని అమృతమూర్తి, అమరుడు.

🍀 120) శాశ్వత స్థాణుః - 
ఎల్లప్పుడూ సత్యమై, నిత్యమై, నిరంతరంగా వెలుగొందువాడు. 

🍀 121 ) వరారోహః - 
శ్రేష్టమగు, పరమోత్కృష్ట స్థానమున వసించువాడు. 

🍀 122) మహాతపాః - 
మహత్తరమైన జ్ఞానము గలవాడు, ప్రసాదించువాడు. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 13 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Rohini 1st Pada*

*🌻 13. rudrō bahuśirā babhrurviśvayōniḥ śuciśravāḥ |*
*amṛtaḥ śāśvataḥ sthāṇurvarārōhō mahātapāḥ || 13 || 🌻*

🌻 114) Rudra – 
The Lord Who Drives Away Sadness and the Reasons for it

🌻 115) Bahushira – 
The Lord Who has Many Heads

🌻 116) Babhru –
 The Lord Who Carries the Worlds

🌻 117) Vishwayoni –
 The Source of the Universe

🌻 118) Suchishrava – 
The Lord Who has Beautiful, Sacred Names

🌻 119) Amrita – 
The Lord Who is Immortal

🌻 120) Shashwata Sthanu – 
The Lord Who is Permanent and Unmovable

🌻 121) Vararoha – 
The Most Glorious Destination

🌻 122) Mahatapa –
 The Lord Who is Extremely Knowledgeable

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంకల్ప సూక్తమ్ 🌹*
*🌻. మనస్సుకు సత్సంకల్పము కలిగేలా చేసే సూక్తము 🌻*
📚. ప్రసాద్ భరద్వాజ 

మనకు ఏదైనా పని నెరవేరాలంటే దానికి దృఢమైన సంకల్పము ఉండాలి. అన్య మనస్కంగా పని మొదలు పెడితే పని నెరవేరదు. ఆ సంకల్పము కూడా సత్సంకల్పమై యుండాలి. అలా సంకల్పం కలగాలన్న కోరికతో పఠించేదే యీ సూక్తము. ఇది శుక్ల యజుర్వేద వాజసనేయ సంహిత లోనిది. 6 మంత్రాలు కలది. యిలాటిదే మహన్యాసంలో 36 మంత్రాలు కలిగినది ఉన్నది. 

దీనిని ప్రతి రోజూ నిద్రకు ముందు, లేచిన తర్వాత కూడా చదువుకోవచ్చు. 

ఓం! యజ్జాగ్రతో దూరముదైతి దైవం
           తదు సుప్తస్య తథైవేతి |
దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం
          తన్మే మనః శివ సంకల్పమస్తు || 1

జ్యోతి స్వరూపమైన ఆత్మ జాగ్రదావస్థలో బయటకు వెళ్లి, నిద్రావస్థలో అంతర్ముఖమౌతుంది. అనంత దూరాలకు వెళ్లేదీ, యావత్ప్రపంచానికి ప్రకాశమైనది, అద్వితీయమైన ఆ ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక. 

యేన కర్మాణ్యపసో మనీషిణో
          యఙ్ఞే కృణ్వన్తి విదథేషు ధీరాః |
యదపూర్వం యక్షమన్తిః ప్రజానాం
         తన్మే మనః శివ సంకల్పమస్తు || 2
 
మేధావులు యఙ్ఞ కర్మలలో ఆపస్సు వంటి కర్మలను ఎందుకు చేస్తారో, బుద్ధి మంతుల ప్రార్థన లో ప్రాధాన్యమైనదేదో, ఆరాధనీయమైనదేదో ఏదైతే ప్రాణులలో నెలకొని ఉన్నదో అటువంటి ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.

యత్ ప్రఙ్ఞానముత చేతో ధృతిశ్చ
      యజ్జ్యోతి నరన్తనరమృతం ప్రజాసు|
యస్మాన్న ఋతే కించ న కర్మ క్రియతే
     తన్మే మనః శివ సంకల్పమస్తు || 3

      ఏ ఆత్మైతే ప్రఙ్ఞానం, ఙ్ఞాపక శక్తి, మనో స్థైర్యములకు ప్రాప్తి స్థానమో, ఏ ఆత్మైతే ప్రాణులలో నశించని జ్యోతి స్వరూపంగా ఉంటున్నదో, ఏ ఆత్మైతే లేకుంటే ఏ పనీ చేయజాలమో అట్టి ఆత్మ నా మనసును సత్సంకల్పం కలిగేలా ప్రేరేపించు గాక. 

యేనేదం భూతం భువనం
       భవిష్యత్ పరిగృహియమమృతేన సర్వమ్|
యేన యఙ్ఞస్తాయతే సప్త హోతా
    తన్మే మనః శివ సంకల్పమస్తు|| 4

    ఏ ఆత్మైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటినీ గ్రహించుచున్నదో, ఏ ఆత్మైతే హోమం చేస్తున్న ఏడుగురికీ దానిని గురించి వివరిస్తుందో ఆ ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పం కలిగే లాగా ప్రేరేపించు గాక. 

యస్మిన్ ఋచః సామ యజూగ్ంషి
     యస్మిన్ ప్రతిష్ఠితా రథనాభావివారాః|
యస్మింశ్చిత్తగ్ం సర్వమత ప్రజానాం
     తన్మే మనః శివ సంకల్పమస్తు|| 5
 
         రథ చక్రంలో ఆకులు ఎలాగైతే అమరి ఉంటాయో అలాగే ఋక్, యజుస్, సామ వేదాలు దేనిలో నెలకొని ఉన్నవో, పడుగు పేకలా జనుల మనస్సులు అన్నీ దేనిలో నెలకొని ఉన్నవో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పాన్ని కలిగేలా ప్రేరేపించు గాక. 

సుషారథిరస్వానివ యన్మనుష్యాన్
        నేనీయతే౽భిశుభిర్వాజిన ఇవ |
హృత్ప్రతిష్ఠం యదజిరం ఇవిష్టం
       తన్మే మనః శివ సంకల్పమస్తు || 6
           ఓం శాంతిః శాంతిః శాంతిః

నేర్పరియైన సారథి అశ్వాలను క్రమశిక్షణతో ఉంచినట్లు, మానవులు గుర్రాలను పగ్గాలతో ముందుకు నడిపినట్లు, హృదయస్థానంలో ప్రతిష్ఠితమైన ఏ ఆత్మైతే మానవులను నియంత్రిస్తుంటుందో, నిత్య యౌవనంగా ఉంటుందో, అన్నిటికన్న వేగవంతమైన దో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక. 

           ఓం శాంతిః శాంతిః శాంతిః|
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment