భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 157


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 157 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 2 🌻


615. మానవుడు నిత్యజీవితంలో సుషుప్తిఅవస్థకు పోవునప్పుడు నిర్వాణస్థితి ఏర్పడుతున్నది. ప్రతి దినము మేల్కొనిన తరువాత ఏర్పడు వ్యక్తిగత జీవితము వలన ఆత్మ ప్రతిష్టాపనమ ఏర్పడుచున్నది.

616. మూడు రకముల 'ఫనా'-'బకా'లు.

(a) సృష్టిలో నుండు సమస్త జీవరాశులలో జరుగుచుండు ఫనా-బకా.

(b) ఆధ్యాత్మిక మార్గములో ఒకటవ భూమిక నుండి ఆరవ భూమిక వరకు చైతన్యమునకు విముక్తిని కలిగించు సంస్కారములననుసరించి యుండును.

(c) విజ్ఞాన భూమికలో సత్యస్థితిలో జరుగు ఫనా- బకా.


617. ప్రతి భూమికయు దాని ఫనా-బకాలను కలిగియే యుండును.


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


25 Jan 2021

No comments:

Post a Comment