శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 189 / Sri Lalitha Chaitanya Vijnanam - 189


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 189 / Sri Lalitha Chaitanya Vijnanam - 189 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖



🌻 189. 'దుర్గమా' 🌻

దాట శక్యము కానిది శ్రీమాత అని భావము.

దుర్గమనగా కోట. కోటను దుర్గము అనుటలో, ఛేదింపలేనిది, భేదింపలేనిది, దాటిపోలేనిది అని అర్థములు తెలియును. గమము అనగా సాగుట. దుర్గమము అనగా సాగిపోవుటకు వీలులేనిది. శ్రీమాత సంకల్పము లేనిచో (అనుగ్రహము లేనిచో) సృష్టి యందు ఏ జీవియూ సాగిపోలేదు. అవరోధము లేర్పడును.

జీవితమున అపరాధము లేర్పడుటకు కారణము దుర్గ అనుగ్రహము లేకపోపుటయే. ఇట్టివారికి అడుగడుగునా చిక్కులు పడుచుండును. ప్రతి చిన్న విషయమునందునూ అవరోధము, అంతరాయము లుండును. ఎప్పటికప్పుడు బంధములే కలుగుచుండును. కారణము దుర్గమత్వమే. “దుర్గాం దేవీం శరణు మహం ప్రపద్యే” అని ప్రార్థించుటయే పరిష్కారము.

జీవిత గమనమున దుర్గమత్వము సహింపరాని వేదనను కలిగించును. అట్టివారికి దుర్గారాధనమే శరణ్యము. దానికే దుర్గా సప్తశతి. అదియే దుర్గా సప్తశ్లోకి, శ్రీమాతను భక్తి ప్రపత్తులతో ఆరాధించువారికి దుర్గము విషయములు కూడ సుగమము కాగలవు. కేవలము సుగమ మగుటయే కాదు, పయనము శోభాయమానమై, కీర్తివంతము కూడ యగును.

శ్రీమాత దుర్గముడు అను రాక్షసుని వధించెను. అనగా గమనమున దాటరాని అవరోధములు ఏర్పరచు రాక్షస ప్రజ్ఞ ఒకటి ఉన్నది. ఆ ప్రజ్ఞను హరించుటకు దుర్గారాధనమే ఉపాయమని అర్థము. దుర్గాసూక్తము, దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకి, లలితా సహస్ర నామ మందలి ఈ ఏబదియవ (50) శ్లోకము దుర్లభత్వమును, దుర్గమత్వమును నివారించగలవు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 189 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Durgamā दुर्गमा (189)🌻

She is not easily accessible. She can be approached only by tough sādhana or practice. Sādhana means meditating on Her Self-illuminating form. She has three forms viz. gross or physical form that is worshipped by performing external rituals.

Second is Her ‘kāmakalā’ form which is subtle and Her kuṇḍalinī form which is considered to be Her subtlest form. She is not accessible by performing only external rituals. She can be accessed through tough sādhana by meditating on Her other two forms.

Her worship should commence with rituals, gradually transforming into meditating Her subtlest form. When such a transformation happens in a devotee, She becomes a-durgama, meaning She is easily accessible.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Jan 2021

No comments:

Post a Comment