భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 218


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 218 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జైమినిమహర్షి - 3 🌻


13. తరువాత జైమిని చరిత్రలో ‘జైమినిభారతం’ కూడా ఉన్నది. మహాభారతం తరువాతకాలంలోనూ, ఇప్పటికీకూడా మహాభారతంపై విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు మనకు కొత్తకాదు. భారతంలో చాలా ప్రశ్నలు ఇప్పతికీకూడా జతిలంగానే కనబడతాయి.

14. అయితే మూలగ్రంథానికి వెళ్ళి పరిశీలించి, నిర్మలమయిన ముద్ధితో సందేహనివారణకోసం చేసే ప్రయత్నం పహలిస్తుంది. ద్వేషంతోకాని, దానిమీద అగౌరవంతోకాని విమర్శించటానికి వెళితే దానికి సమాధానం సులభంగా దోర్కదు. సద్విమర్శకుడికి గొరికే సమాధానం కువిమర్శకుడికి లభించదు.

15. అందరికీ కూడా వేదమే ప్రమాణం. ఈ కలియుగం ప్రారంభమయింది. వైదికకర్మలేమో విస్తారంగా ఇదివరకే ఉన్నాయి. వాటిపై అనేక అభిప్రాయాలు మనుష్యుల్లో ఉండటంచేతనే వాటిని వ్యాసుడు విభాగం చేసి చెప్పాడు. వాటిలో బ్రాహ్మణులు, తాత్తిరీయము మొదలైన వుభాగాలు మనకు ఉన్నయి. దాంట్లో ప్రతీకాండ వెనుక ఒక బ్రాహ్మణము ఉంటుంది. ఇవన్నీ ఇదివరకే ఉన్నాయి. ఉన్నవి ఉన్నట్లే ద్రంథస్థం చేసి పెట్టారు. అయితే వేదాల ఉద్దేశ్యం ఇది కాదు. వేదంమీద నిర్ణయంచేసే అధికారం వ్యాసుడికే లేనప్పుడు, తరువాతివాడు నిర్ణయం ఎలా చేస్తాడు అనే ప్రశ్న ఒకటి పుట్టింది. అలా చేసి ఉంటే, “రెండు మార్గాలున్నాయి.

16. ఈశ్వరుడి యొక్క ఆరాధనతో నిమిత్తంలేకుండా ఉండే కర్మమార్గమిది; ఈశ్వరారాధన(ఈశ్వరుడిగా భావన చేసేటటువంటి మార్గం) ఇది” అని వ్యాసుడు రెండు మార్గములు చెప్పి ఉంటే; ఈశ్వరుడులేడని ఘంటాపథంగా చెప్పవలసిన ఆవశ్యకత ఉండేదికాదు. కాని ఆయన అలా చేయలేదు. ఉన్నాడనే భావనతో ఈశ్వరుడి యొక్క ప్రతిష్ఠ చేసాడాయన.

17. కృష్ణమతం అంతా కూడా ఈశ్వరారాధనే! ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడని, కర్మస్వరూపుడని, రెండుగా ఈశ్వరస్వరూపం వ్యాసుడివల్ల నిర్ణయించబడింది. ఈశ్వరుడికి కృష్ణావతారమే నిదర్శనం. కృష్ణావతారకాలంలో గోపికలు మొదలైన వాళ్ళందరికీకూడా భక్తే ప్రధానం. మనస్సు, బుద్ధి, చిత్తము అంతాకూడా ఈశ్వరుడియొక్క పాదార్పణంచేసి ఆయనను భక్తితో ఆరాధన చేస్తే చాలు.

18. మధురభక్తి అని ఒకశాఖ ఏర్పడింది ఆ తరువాత. భక్తితో ఆత్మార్పణం చేసుకుంటే చాలు, కర్మతో నిమిత్తంలేదని చెప్పి వేదవ్యాసుడే ఆ మాటచెప్పితే, వేదంయొక్క ఉద్దేశ్యం ఏమిటి? మరి ఇప్పుడు ‘ఈశ్వరుడులేడు’ అని జైమిని చెప్పాడు అనుకున్నప్పుడు, న్యాయంగా వ్యాసమహర్షికి(అది ఇతడు చెప్పిన దానికి విరుద్ధంగా ఉండటంచేత) కోపమొచ్చింది.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


25 Jan 2021

No comments:

Post a Comment