25-JANUARY-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 619 / Bhagavad-Gita - 619🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 248, 249 / Vishnu Sahasranama Contemplation - 248, 249🌹
3) 🌹 Daily Wisdom - 38🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 172🌹
5) 🌹. వివేక చూడామణి - 02 / Viveka Chudamani - 02 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 12🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 120 / Sri Lalitha Sahasra Namaavali - 120 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 189 / Sri Lalita Chaitanya Vijnanam - 189🌹
9) *🌹. బంధాలు వదిలితేనే స్వేచ్ఛ 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 532 / Bhagavad-Gita - 532🌹 
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 9 / Bhagavad-Gita - 9🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 619 / Bhagavad-Gita - 619 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 36 🌴*

36. సుఖం త్విదానీం త్రివిధం శ్రుణు మే భరతర్షభ |
అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||

🌷. తాత్పర్యం : 
భరతవంశీయులలో శ్రేష్టుడా! ఇక సుఖము నందలి మూడురకములను గూర్చి నా నుండి ఆలకింపుము. వాని ద్వారా బద్ధజీవుడు సుఖము ననుభవించుట, మరికొన్నిమార్లు సర్వదుఃఖముల అంతమును చేరుట జరుగుచుండును.

🌷. భాష్యము :
బద్ధజీవుడు భౌతికసుఖమును పదే పదే అనుభవింప యత్నించుచుండును. ఆ విధముగా అతడు రసరహిత పిప్పినే మరల మరల ఆస్వాదించుచుండును. కాని కొన్నిమార్లు అతడు మహాత్ముల సాంగత్యఫలముచే అట్టి భౌతిక భోగానుభావమనెడు బంధనము నుండి ముక్తుడగుచుండును.   

అనగా ఏదియోనొక ఇంద్రియ భోగము నందు సదా నియుక్తుడై యుండెడి బద్ధజీవుడు తాను కేవలము చేసిన దానినే తిరిగి తిరిగి చేయుచున్నానని సత్సాంగత్యము ద్వారా అవగతము చేసికొనినపుడు నిజమగు కృష్ణభక్తి రసభావన అతని యందు జాగృతము కాగలదు. ఈ విధముగా అతడు కొన్నిమార్లు చర్వితచరణము వంటి నామమాత్ర సుఖము నుండి విముక్తుడగు చుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 619 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 36 🌴*

36. sukhaṁ tv idānīṁ tri-vidhaṁ
śṛṇu me bharatarṣabha
abhyāsād ramate yatra
duḥkhāntaṁ ca nigacchati

🌷 Translation : 
O best of the Bhāratas, now please hear from Me about the three kinds of happiness by which the conditioned soul enjoys, and by which he sometimes comes to the end of all distress.

🌹 Purport :
A conditioned soul tries to enjoy material happiness again and again. Thus he chews the chewed. But sometimes, in the course of such enjoyment, he becomes relieved from material entanglement by association with a great soul. 

In other words, a conditioned soul is always engaged in some type of sense gratification, but when he understands by good association that it is only a repetition of the same thing, and he is awakened to his real Kṛṣṇa consciousness, he is sometimes relieved from such repetitive so-called happiness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 248, 249 / Vishnu Sahasranama Contemplation - 248, 249 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻248. అప్రమేయాఽఽత్మా, अप्रमेयाऽऽत्मा, Aprameyā’’tmā🌻*

*ఓం అప్రమేయాత్మనే నమః | ॐ अप्रमेयात्मने नमः | OM Aprameyātmane namaḥ*

అప్రమేయాఽఽత్మా, अप्रमेयाऽऽत्मा, Aprameyā’’tmā

అప్రమేయః ఆత్మా యస్య ప్రత్యక్షాదిప్రమాణములకు గోచరమగు ఆత్మ స్వరూపము ఎవనికి లేదో అట్టివాడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తరభాగము ::
ఆ. వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద, దాసదుఃఖనాశ! వాసుదేవ!
     యవ్యయాప్రమేయ! యనిశంబుఁ గావింతు, మిందిరేశ! నీకు వందనములు (749)

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 248🌹*
📚. Prasad Bharadwaj 

*🌻248. Aprameyā’’tmā🌻*

*OM Aprameyātmane namaḥ*

Aprameyaḥ ātmā yasya / अप्रमेयः आत्मा यस्य He whose nature is not the subject of being determined by the cannons of reasoning.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 70
Kr̥ṣṇā kr̥ṣṇāprameyātmanprapannabhayabhañjana,
Vayaṃ tvāṃ śraṇaṃ yāmo bhavabhītāḥ pr̥thanghiyaḥ. (25)

:: श्रीमद्भागवते दशमस्कन्धे उत्तरार्धे सप्ततितमोऽध्यायः ::
कृष्णा कृष्णाप्रमेयात्मन्प्रपन्नभयभञ्जन ।
वयं त्वां श्रणं यामो भवभीताः पृथन्घियः ॥ २५ ॥

O Kṛṣṇa! Kṛṣṇa, O immeasurable Soul, destroyer of fear for those surrendered to You! Despite our separatist attitude, we have come to You for shelter out of fear of material existence.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥
Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 249 / Vishnu Sahasranama Contemplation - 249🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻249. విశిష్టః, विशिष्टः, Viśiṣṭaḥ🌻*

*ఓం విశిష్టాయ నమః | ॐ विशिष्टाय नमः | OM Viśiṣṭāya namaḥ*

విశిష్టః, विशिष्टः, Viśiṣṭaḥ

విశిష్యతే సర్వం అతిశేతే విశేషించును; సర్వమును మించియుండును.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
సీ.భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని తలపోసి కొందఱు ధర్మ మనియుఁజర్చించి కొందఱు సదసదీశ్వరుఁడని సరవిఁ గొందఱు శక్తి సహితుఁడనియుఁజింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ డాత్మతంత్రుఁడు పరుం డధికుఁడనియుఁదొడరి యూహింతురు తుది నద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుఁడ నీవు;తే.తలఁప నొక్కింత వస్తుభేదంబు గలదె, కంకణాదులు పసిఁడి యొక్కటియ కాదె?కడలు పెక్కైన వార్ధి యొక్కటియ కాదె? భేద మంచును నిను వికల్పింప వలదు. (386)

నీవు పరబ్రహ్మవని కొందరు భావిస్తారు. నీవు ధర్మమని కొందరు తలుస్తారు. నీవు ప్రకృతి పురుషులకంటె పరుడవని కొందరంటారు. నీవు శక్తిస్వరూపుడవని కొందరు ధ్యానిస్తారు. విష్ణువుగా శాశ్వతుడుగా, స్వతంత్రుడుగా పరమ పురుషుడుగా ఉత్తముడుగా కొందరు నిన్ను ఊహిస్తారు. 

అన్నింటినీ మించి సాటిలేని వాడవు నీవు. సదసత్తులకు పవిత్రమైన నిలయం నీవు. ఆలోచించి చూస్తే కంకణం మొదలైన బంగారు నగలూ, బంగారమూ వాస్తవముగా ఒకటే కదా! అనంతమైన అలలూ సముద్రమూ ఒకటే కదా! అందువల్ల పైకి భేదం కనిపిస్తున్నా నీకు ఈ సృష్టికీ వాస్తవంగా భేదం లేనే లేదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 249🌹*
📚. Prasad Bharadwaj 

*🌻249. Viśiṣṭaḥ🌻*

*OM Viśiṣṭāya namaḥ*

Viśiṣyate sarvaṃ atiśete / विशिष्यते सर्वं अतिशेते One who excels everything.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥
Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 38 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. Life is a Continuity 🌻*

There is a continuity, which is life, of which we are a part, and we are not just X, Y, Z or A, B, C sitting here; it is not like that. If we open our eyes to fact, we will be surprised that we have been living a foolhardy life up to this time, and now the time has come when we have to be serious. 

Our time is short, and there is so much to learn, and a lot to achieve. Obstacles are too many, and we have no time to wool-gather, sleep or while away our time as if there is eternity before us. We cannot take things lightly. Life is precious. 

We cannot take it as a joke. Every moment of time is as gold because every moment is nothing but a little loss of this span of our life. Every bell that rings tells us that we have lost one hour. It is not a happy thing. Tenacious has to be our effort at gaining insight into that which we seek.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. వివేక చూడామణి - 2 / VIVEKA CHUDAMANI - 2 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 2. మానవ జన్మ - 2 🌻

8. అందువలన మానవుడు జన్మ రాహిత్య స్థితికై కృషి చేయవలెను. జ్ఞానియై మనిషి భౌతిక వస్తు సముదాయము వలన పొందే లౌకిక సుఖాలకై ప్రాకులాడకుండా తన మనస్సును సత్యమువైపు మరల్చవలెను.

9. వ్యక్తి జ్ఞానేంద్రియాలపై అదుపును పొంది భౌతిక వస్తు సుఖాలకు అతీతుడై యోగారూఢ స్థితిని పొందినపుడు పుట్టుక, చావు; మంచి, చెడు అను స్థితులను అధిగమించి విచక్షణతో కూడిన జీవితాన్ని పొందగలడు.

10. జ్ఞాని అయిన విద్యావంతుడు ఆత్మను పొందే మార్గమును ఎన్నుకొని మంచి, చెడులకు అతీతుడై భౌతిక బంధనాలైన పుట్టుక, చావుల నుండి విముక్తిని పొందుటకై సాధన చేయవలెను.

11. యజ్ఞ, యాగాల వలన మనస్సు స్వచ్ఛమవుతుంది. కాని సత్యాన్ని తెలుసుకొనలేము. కేవలము నిత్యానిత్య వివేకము ద్వారానే పరమాత్మను పొందగలము. కర్మలు 10 లక్షలు చేసినను సత్యాన్ని గ్రహించలేము.

12. తాడును చూసి పామని భ్రమించి భయభీతులు చెందువాడు మనస్సులో తగినట్లు విచారణ చేసిన అది పాము కాదు తాడని గ్రహించగలడు.

13. సత్యాసత్య జ్ఞానాన్ని పొందిన జ్ఞానులతో సంభాషణ ద్వారా మాత్రమే సత్యము అవగతమగును. ఇతరత్రా నదీ జలాలలో స్నానాలు, దేవతలకు పూజలు, సమర్పణలు మరియు ప్రాణాయామము ద్వారా ప్రాణ శక్తిని అదుపుచేసినను సత్యము అవగతము కాదు.

14. శాస్త్ర పరిజ్ఞానముతో సత్యాసత్య వివేకము పొంది, శాస్త్ర చర్చలలో ప్రశ్నించుట, వాదనలలో ప్రావీణ్యం పొందిన వాడే విజయాన్ని పొందగలడు. సమయము, ప్రదేశము మరియు ఇతరత్రా ఏవైన, కేవలము అందుకు సహాయకారులు మాత్రమే.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹VIVEKA CHUDAMANI - 2🌹 
✍️ Swami Madhavananda
📚 Prasad Bharadwaj 

8. Therefore the man of learning should strive his best for Liberation, having renouncedhis desire for pleasures from external objects, duly approaching a good and generous preceptor, and fixing his mind on the truth inculcated by him. 

9. Having attained the Yogarudha state, one should recover oneself, immersed in the seaof birth and death by means of devotion to right discrimination. 

10. Let the wise and erudite man, having commenced the practice of the realisation ofthe Atman give up all works and try to cut loose the bonds of birth and death. 

11. Work leads to purification of the mind, not to perception of the Reality. Therealisation of Truth is brought about by discrimination and not in the least by ten million of acts.
 
12. By adequate reasoning the conviction of the reality about the rope is gained, whichputs an end to the great fear and misery caused by the snake worked up in the deluded mind.
 
13. The conviction of the Truth is seen to proceed from reasoning upon the salutarycounsel of the wise, and not by bathing in the sacred waters, nor by gifts, nor by a hundred Pranayamas (control of the vital force).
 
14. Success depends essentially on a qualified aspirant; time, place and other suchmeans are but auxiliaries in this regard.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 12 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 4. అశ్వవిద్య - 4 🌻*

పర్జన్య శక్తి ఇట్లే భూమి జలములను ఆకాశమునకు గొనిపోవుట, ఆకాశజలములను భూమికి
కొనువచ్చుట చేయుచున్నది. 

ఈ రహస్యములను తెలుపు యజ్ఞమునే జ్యోతిప్టోమము అందురు. అగ్నికి వాయువునకు గల ఋతు నిర్మాణాత్మక శక్తి ఇందు చమత్కరింపబడినవి.
బ్రాహ్మీకరణములైన యజ్ఞములలో ఈ అశ్వవిద్యను అశ్వమేధ మందురు. 

మేధ్యమైన అశ్వము ఈ సంవత్సర విద్యయే. జ్యోతిర్మార్గమున జీవి శ్వాస గమనాగమనములను, జీవన్మరణములను, కర్మ ఫలములను తెలుసుకొనుటకు సర్వజ్ఞమగు స్వస్వరూప జ్ఞానమునకు ఈ విద్య దారితీయును. సమస్తములకు మూల కారణమైన ఆత్మ తత్వము లేక సూర్య తత్వము ఒక అశ్వము శిరస్సుగా రూపింబడినది. 

ఉషస్సు అశ్వమునకు శిరస్సని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పు చున్నది. ఈ ఉషస్సు ప్రతి దినము ప్రారంభము నందు, ప్రతి సంవత్సర ప్రారంభము నందుకూడ దర్శన మిచ్చును. సంవత్సర ఉషస్సు అశ్వనీ నక్షత్రమున ఆరంభమగును. 

అదియే దేవతల సూర్యోదయము. ఇది
మానవులకు సంవత్సరమున కొకమారు వచ్చును. అప్పుడు వసంత ఉష్ణ కిరణ ధారలచే సూర్యుడు భూమిని తడుపును. అట్టి సూర్యుని ఉచ్ఛస్తుడందురు. అతడే అశ్వని శిరస్సు గల దేవత. ఈ రహస్యమే తరువాత హయగ్రీవ విద్యగా తంత్రశాస్త్రమున నెలకొనినది. 

హయగ్రీవుడు సర్వవిద్యలకును ఆధారము. జ్ఞానానంద మయమగు వెలుగు. నిర్మలమైన స్ఫటికాకృతి కలవాడు. ఇతడు వాగ్గేవతలలో ఒకడుగా దర్శింపబడినాడు. గుఱ్ఱపు సకిలింపులో గల హల్లులను, అచ్చులను, ఒక క్రమముగ నేర్పరచినచో హయగ్రీవ మంత్రమగును. వాని నుచ్చరించుటలో మానవుని నాడీమండలము లోని సప్తాశ్వములు ప్రచోదనము చేయబడి సర్వవిద్యల రహస్య ద్వారములు తెరచుకొనును.

దానికి మూలిక బ్రహ్మీ అను వృక్షపర్ణము. ఈ విధముగ లోకసాక్షి యగు సూర్యునకు ప్రతిబింబమగు అంతస్సాక్షి అగు సూర్యుని ఉషస్సుగా భావించి ఉపాసించుటయే హయగ్రీవ విద్య.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. బంధాలు వదిలితేనే స్వేచ్ఛ 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*

మార్మికమైన జీవితంలో నిజాలతో నింపలేని ఖాళీలు మీకు చాలా కనిపిస్తాయి. మీలోని భావాలే వాటికి ప్రత్యామ్నాయాలు. అందువల్ల ఆ ఖాళీలను మీరు మీ భావాలతో నింపి, జీవితం మీకు పూర్తిగా అర్థమైనట్లు తృప్తి పడడం ప్రారంభిస్తారు.

ఒకవేళ జంతువులు కూడా మనిషిలాగే ఆలోచిస్తే, గుర్రాల దేవుడు గుర్రంలా, ఏ జంతువు దేవుడు ఆ జంతువులా ఉంటాడే కానీ, కచ్చితంగా మనిషిలా ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే, గుర్రాల పట్ల మనిషి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి, వాటికి మనిషి దయ్యంలాగే కనిపిస్తాడు. అందువల్ల, దేవుడి విషయంలో మనిషి భావాలు మనిషికి ఉన్నట్లే జంతువు భావాలు జంతువులకుంటాయి.

‘‘అండర్‌స్టాండ్’’ అనే పదానికి ఉన్న అసలైన అర్థం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? దాని అసలైన అర్థం ‘‘మీకింద నిలబడి ఉండేది’’అని. ఇది మీకు వింతగానే ఉంటుంది. ఎందుకంటే, దాని అసలైన అర్థం ఎప్పుడో దానికి దూరమై కాలగర్భంలో కలిసిపోయింది.

మీ చేతి కింద, మీ పాదాల కింద, మీ అధికారం కింద- ఇలా ఏదైనా మీ కింద ఉండేలా చేసుకున్న వాటన్నింటికీ మీరే గురువు. అందుకే అందరూ అదే మార్గంలో జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే వారు మాకు అన్నీ తెలుసు, తెలియనిది ఏదీ లేదు’ అనగలరు. కానీ, అది అసంభవం. ఎందుకంటే, మీరు ఎన్ని చెప్పినా, ఏమి చేసినా, జీవితం ఎప్పుడూ మార్మికంగానే ఉంటుంది.

అలౌకిక ఆవలి తీరం అన్నిచోట్ల ఉంది. అందుకే అది మన చుట్టూ కూడా ఉంది. అదే దేవుడు. మనం అందులోకి చొచ్చుకుపోవాలి. అది ఎప్పుడూ మన లోపలా ఉంటుంది. బయటా ఉంటుంది. అందువల్ల సహజంగానే మనం దాని గురించి పూర్తిగా మర్చిపోతాం. ఎందుకంటే, అలౌకిక ఆవలి తీరాలలోకి చూడాలంటే చాలా అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది.

అది అగాధంలోకి చూడడం లాంటిది. అందుకే దానిని చూడాలంటే మీరు చాలా భయంతో వణికిపోతారు. ఆ పని చేసేందుకు ఎవరూ సాహసించరు. ఎందుకంటే, అసలైన వాస్తవాన్ని ఎవరూ భరించలేరు. అది ఎప్పుడూ మహా శూన్యంతో కూడుకున్న అగాధంలా, ఎలాంటి హద్దులులేని సువిశాల ఆకాశంలా ఉంటుంది. అందుకే దానినుంచి తప్పించుకునే మార్గాలను మనం వెతుకుతూనే ఉంటాం.

అందుకే బుద్ధుడు ‘దురంగము’’ అంటాడు. అంటే ‘అలౌకిక ఆవలి తీరాలకు అందుబాటులో ఉండు’ అని అర్థం. ఎప్పుడూ సరిహద్దులకే పరిమితమై పోకుండా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళండి. ఒకవేళ మీకు సరిహద్దులు అవసరమైతే పెట్టుకోండి. కానీ, వాటిని అధిగమించి బయటపడాలని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎప్పుడూ ఎలాంటి నిర్బంధాలను సృష్టించుకోకండి. 

మతాలు, నమ్మకాలు, అనుబంధాలు- ఇలా మనం అనేక రకాల నిర్బంధాలను సృష్టించుకుంటాం. అవి అందరికీ చాలా సౌకర్యంగానే ఉంటాయి. ఎందుకంటే, అక్కడ ఎలాంటి ఈదురుగాలులు వీచవు. అందుకే అందరికీ అక్కడ ఏదో రక్షణ- అది నిజమైన రక్షణ కానప్పటికీ- ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే, మిమ్మల్ని అలౌకిక తీరాలలోకి ఈడ్చుకెళ్ళేది మృత్యువే. అది రాకముందే మీరు అక్కడికి చేరుకోండి.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 9 / Bhagavad-Gita - 9 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 9 🌴

9. అన్యే చ బహవ: శూరా 
మదర్థే త్యక్తజీవితా: |
నానాశస్త్రప్రహరణా: 
సర్వే యుద్ధవిశారదా: ||

🌷. తాత్పర్యం : 
నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలువిధములైన ఆయుధములను దాల్చినవారు మరియు యుద్ధనిపుణతను కలిగినవారును అయియున్నారు. 

🌻 . భాష్యము: 
జయద్రదుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధనుని కొరకు జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులై యున్నారు. వేరుమాటలలో పాపియైన దుర్యోధనుని పక్షము వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరును మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయింపబడినది. కాని దుర్యోధనుడు మాత్రము పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగియుండెను.

🌹 BhagavadGita As it is - 9 🌹 
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga - 9 🌴

9. anye ca bahavaḥ śūrā
mad-arthe tyakta-jīvitāḥ
nānā-śastra-praharaṇāḥ
sarve yuddha-viśāradāḥ

🌷 Translation : 
There are many other heroes who are prepared to lay down their lives for my sake. All of them are well equipped with different kinds of weapons, and all are experienced in military science.

🌷 Purport : 
As far as the others are concerned – like Jayadratha, Kṛtavarmā and Śalya – all are determined to lay down their lives for Duryodhana’s sake. In other words, it is already concluded that all of them would die in the Battle of Kurukṣetra for joining the party of the sinful Duryodhana. Duryodhana was, of course, confident of his victory on account of the above-mentioned combined strength of his friends.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 189 / Sri Lalitha Chaitanya Vijnanam - 189 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |*
*దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖*

*🌻 189. 'దుర్గమా' 🌻*

దాట శక్యము కానిది శ్రీమాత అని భావము.

దుర్గమనగా కోట. కోటను దుర్గము అనుటలో, ఛేదింపలేనిది, భేదింపలేనిది, దాటిపోలేనిది అని అర్థములు తెలియును. గమము అనగా సాగుట. దుర్గమము అనగా సాగిపోవుటకు వీలులేనిది. శ్రీమాత సంకల్పము లేనిచో (అనుగ్రహము లేనిచో) సృష్టి యందు ఏ జీవియూ సాగిపోలేదు. అవరోధము లేర్పడును. 

జీవితమున అపరాధము లేర్పడుటకు కారణము దుర్గ అనుగ్రహము లేకపోపుటయే. ఇట్టివారికి అడుగడుగునా చిక్కులు పడుచుండును. ప్రతి చిన్న విషయమునందునూ అవరోధము, అంతరాయము లుండును. ఎప్పటికప్పుడు బంధములే కలుగుచుండును. కారణము దుర్గమత్వమే. “దుర్గాం దేవీం శరణు మహం ప్రపద్యే” అని ప్రార్థించుటయే పరిష్కారము. 

జీవిత గమనమున దుర్గమత్వము సహింపరాని వేదనను కలిగించును. అట్టివారికి దుర్గారాధనమే శరణ్యము. దానికే దుర్గా సప్తశతి. అదియే దుర్గా సప్తశ్లోకి, శ్రీమాతను భక్తి ప్రపత్తులతో ఆరాధించువారికి దుర్గము విషయములు కూడ సుగమము కాగలవు. కేవలము సుగమ మగుటయే కాదు, పయనము శోభాయమానమై, కీర్తివంతము కూడ యగును. 

శ్రీమాత దుర్గముడు అను రాక్షసుని వధించెను. అనగా గమనమున దాటరాని అవరోధములు ఏర్పరచు రాక్షస ప్రజ్ఞ ఒకటి ఉన్నది. ఆ ప్రజ్ఞను హరించుటకు దుర్గారాధనమే ఉపాయమని అర్థము. దుర్గాసూక్తము, దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకి, లలితా సహస్ర నామ మందలి ఈ ఏబదియవ (50) శ్లోకము దుర్లభత్వమును, దుర్గమత్వమును నివారించగలవు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 189 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Durgamā दुर्गमा (189)🌻*

She is not easily accessible. She can be approached only by tough sādhana or practice. Sādhana means meditating on Her Self-illuminating form. She has three forms viz. gross or physical form that is worshipped by performing external rituals.  

Second is Her ‘kāmakalā’ form which is subtle and Her kuṇḍalinī form which is considered to be Her subtlest form. She is not accessible by performing only external rituals. She can be accessed through tough sādhana by meditating on Her other two forms.  

Her worship should commence with rituals, gradually transforming into meditating Her subtlest form. When such a transformation happens in a devotee, She becomes a-durgama, meaning She is easily accessible. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment